Manchuria
-
గోబీ మంచూరియాపై నిషేధం?
యశవంతపుర: గోబీ రైస్, గోబీ మంచూరియాను కొందరు ఇష్టంగా తింటారు. ఇందులో పిల్లలు ఎక్కువగా ఉంటారు. అయితే విషపూరితంగాను, క్యాన్సర్ అంశాలు ఎక్కువగా ఉన్న బొంబయి మిఠాయి, గోబి మంచూరియాని నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేధిక ఆధారంగా కాటన్ క్యాండి, గోబిల విక్రయాలను నిలుపుదల చేయాలని భావిస్తోంది. గోబి బాగా రంగుతో కనిపించడానికి, రుచి వచ్చేందుకు కృత్రిమ రంగులు, రసాయనాలు కలుపుతున్నారని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఆరోగ్యశాఖ సర్కారుకు తెలిపింది. దీని ఆధారంగా ఈ నెల 11 ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. -
'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట!
గోబీ మంచూరియాని ఇష్టపడిని వాళ్లు ఉండరు. దాన్ని చూస్తేనే నోటిలో నీళ్లు ఊరిపోతాయి. అలాంటి గోబీ మంచూరియాని భారత్‌లోని ఆ నగరం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదండోయ్ అక్కడ స్టాల్స్‌లో దీన్ని ఎక్కడైన అమ్మితే అధికారులు వాటిపై దాడులు కూడా నిర్వహిస్తారట. ఎందుకని ఇంతలా గోబీ మంచూరియాపై యుద్ధం చేస్తున్నారో వింటే కచ్చితంగా మనం కూడా బుద్ది తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామేమో!. ఏంటీ ఇలా అంటున్నారేంటీ అనుకోకండి. వింత రుచుల మాయలో అందులో ఏం వాడుతున్నారు? ఎలాంటివి తినేస్తున్నాం అనేవి మర్చిపోతున్నాం. జిహ్వ చాపల్యంతో కోరి కష్టాలు తెచ్చుకునే నేటి జనరేషన్‌కు ఇదొక కనువిప్పు అనే చెప్పాలి. ఎందుకిలా చెబుతున్నానంటే.. గోబీ మంచూరియా రుచే వేరబ్బా!. తింటే వదలరు అనేంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో ఇష్టమైన వంటకం ఇది. అయితే దీన్ని కార్న్‌ప్లోర్ పిండిలో ముచి వేయించి ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, పంచదార, టొమోటా సాస్‌తో కాస్త గ్రేవీ లేదా డ్రైగా చేసి ఇస్తారు. ఇలా స్పెషల్‌గా చేసే వంటకం కావడంతోనే నిషేధం విధించింది భారత్‌లోని గోవా నగరం. అందులో వినియోగించే పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే దాని రుచికి ఫిదా అయ్యి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. దీంతో గోవా మపుసా మున్సిపల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెసిపీ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. ఎక్కడైన ఫుడ్ స్టాల్స్‌లో ఈ డిష్ ఉంటే వెంటనే వాటిపై దాడులు నిర్వహించడం వంటివి చేసేలా అధికారులుకు ఆదేశాలను జారీ చేసింది కూడా. కేవలం మున్సిపల్ పౌర సంస్థే కాదు. గోవాలోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) గోబీ మంచూరియా అమ్మే స్టాళ్లను తీసేయాలని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాదు ఆ డిష్ అమ్మకాలు అరికట్టేలా ఎప్డీఏ స్టాల్స్‌పై పలు దాడులు కూడా నిర్వహించింది. దీంతో ఆ వంటకం గోవా వీధుల్లోని స్టాల్స్‌లో ఎక్కడ కనిపించదనే చెప్పొచ్చు. నిజానికి ఈ గోబీరియా మంచూరియా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. ముంబైకి చెందిన చైనీస్ పాక శాస్త్ర నిపుణుడు నెల్సన్ వాంగ్ ఈ వంటకాన్ని కనిపెట్టాడు. 1970లలో క్రిక్ట్ క్లబ్ ఆప్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తున్నప్పుడూ చికెన్ మంచూరియాను తయారు చేశాడు. అతను చికెన్ నగ్గెట్‌లను స్పైసీ కార్న్‌ఫ్లోర్ పిండిలో వేయించి పొడిగా లేదా సోయా సాస్, వెనిగర్, పంచదార లేదా టోమాట సాస్‌లో గ్రేవీ రూపంలో సర్వ్ చేసేవాడు. ఇక శాకాహార ప్రియులకు ఆ లోటును భర్తీ చేసేలా దాని స్థానంలో గోబీ మంచూరియాని తీసుకొచ్చాడు. అలాంటి గోబీ మంచూరియాని ప్రజల ఆరోగ్యం కోసం గోవా నగరం నిషేధించడం విశేషం. ఇలా ప్రతీ నగరంలోని అధికారులు భావిస్తే ప్రజలు అనారోగ్యం బారినపడటం తగ్గుముఖం పడుతుంది కదూ!. (చదవండి: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి?) -
అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!
అరటికాయ మంచూరియాకు కావలసినవి: అరటికాయలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక తొక్క తీసి, గుజ్జులా చేసుకోవాలి) మైదాపిండి – 4 టేబుల్ స్పూన్లు కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ కారం – 1 టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి) పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి) కొత్తిమీర తురుము, కరివేపాకు – కొద్ది కొద్దిగా (అభిరుచిని బట్టి) ఉల్లికాడ ముక్కలు – కొద్దిగా టొమాటో సాస్ – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు చిల్లీసాస్ – 2 టీ స్పూన్లు సోయా సాస్ – 1 టీ స్పూన్ (పెంచుకోవచ్చు) నూనె – సరిపడా ఉప్పు – తగినంత తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటికాయ గుజ్జు, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం – వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని.. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, సోయాసాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని.. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా!
నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీకి కావలసినవి: ►గుడ్లు – 6, బ్రెడ్ పౌడర్ – అర కప్పు ►అల్లం తురుము – అర టీ స్పూన్ ►వెల్లుల్లి – 6 రెబ్బలు (తురుములా చేసుకోవాలి) ►పచ్చిమిర్చి –6 (మూడిటితో పేస్ట్‌లా చేసుకుని, మిగిలినవి చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి) ►కొత్తిమీర – 2 టీ స్పూన్లు, కరివేపాకు – అభిరుచిని బట్టి ►ఉల్లిపాయల ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు ►గరం మసాలా – 4 టీ స్పూన్లు ►ధనియాల పొడి – కొద్దిగా ►కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – సరిపడా ►టమాటా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►పెరుగు: 2 కప్పులు, రెడ్ చిల్లీ సాస్ – కొద్దిగా ►జీలకర్ర పొడి – 2 లేదా 3 టీ స్పూన్లు ►నూనె – 3 గరిటెలు, ఉల్లికాడల ముక్కలు – గార్నిష్‌కి సరిపడా ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ విధానం: ►ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టుకుని, పచ్చసొన లేకుండా తెల్లటి గుడ్డు భాగాన్ని మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►ఈ ముక్కల్లో సన్నగా తరిగిన పావు టీ స్పూన్ అల్లం తురుము, సగం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల గరం మసాలాతో పాటు బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ►అందులో మిగిలిన 2 గుడ్లు పగలగొట్టి తెల్లసొనను మాత్రమే ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ►తర్వాత ఈ మిశ్రమాన్ని కుకర్‌లో స్టీమ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►అనంతరం కళాయిలో 3 గరిటెల నూనె వేసుకుని.. వేడికాగానే టమాటా ముక్కలు, మిగిలిన అల్లం తురుము, మిగిలిన వెల్లుల్లి తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దోరగా వేయించాలి. ►రెడ్ చిల్లీ సాస్, పెరుగు, జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ►అనంతరం ఎగ్ ముక్కల్ని వేసుకుని.. పెరుగు– సాస్ మిశ్రమం ముక్కలకు పట్టే విధంగా గరిటెతో తిప్పుతూ కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి! చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు! -
పొట్ట అడుగు
పొట్ట అడుగుతుందా! బిర్యానీ చేసిపెట్టమని.. ఆమ్లెట్ వేసిపెట్టమని.. మంచూరియా కావాలని.. చిల్లీ కర్రీని టేస్ట్ చేస్తానని!! అడగదు పాపం. ఆకలో రామచంద్రా అంటుంది కానీ.. అది కావాలి రామచంద్రా.. ఇది కావాలి రామచంద్రా.. అని రాగాలు తీయదు. కానీ పుట్టగొడుగులు వేరు. వాటితో ఒక్కసారి ఏదైనా చేసి పెట్టామా? పొట్ట మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటుంది. అవురావురుమంటూనే ఉంటుంది. మష్రూమ్ మంచూరియా కావలసినవి: మష్రూమ్స్ – 250 గ్రా; ఉడికించిన బంగాళాదుంపలు – 2 పెద్దవి; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్; మైదా – 2 టేబుల్ స్పూన్స్; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్; నూనె – టీప్ ఫ్రైకి సరిపడ. గ్రేవీ కోసం: ఉల్లి తరుగు – 4 టేబుల్ స్పూన్స్; తెల్ల ఉల్లికాడల తరుగు – 2 టీ స్పూన్స్; గ్రీన్ ఉల్లికాడల తరుగు – 4 టీ స్పూన్స్; పచ్చిమిర్చి తరుగు – 3 టీ స్పూన్స్; వెల్లుల్లి తరుగు – 6 టీ స్పూన్స్; అల్లం తరుగు – 6 టీ స్పూన్స్; ఉప్పు – తగినంత; సోయా సాస్ – 6 టీ స్పూన్స్; చిల్లీసాస్ – 2 టీ స్పూన్స్; వెనిగర్ – 6 టీ స్పూన్స్; పంచదార – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 3 టీ స్పూన్స్; నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ∙మష్రూమ్స్‌ను కడిగి కాడలను తుంచి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో తరిగిన మష్రూమ్, ఉడికించిన బంగాళా దుంపలను కలపాలి ∙ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ముద్దగా చేసుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్‌లో కూరి పక్కన పెట్టుకోవాలి ∙మరొక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి నీరు పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక, స్టఫ్ చేసిన మష్రూమ్స్‌ను పిండి మిశ్రమంలో ముంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ మరో కడాయిలో నూనె వేడయ్యాక తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి ∙ఇప్పడు వరుసగా ఉల్లి, పచ్చిమిర్చి, తెల్ల ఉల్లికాడల తరుగు, ఉప్పు, కారం, సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుతూ ఉండాలి ∙చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న స్టఫ్డ్ మష్రూమ్స్‌ను వేసి గ్రేవీ పట్టేలా మరికొంతసేపు వేగనివ్వాలి ∙స్టౌ ఆఫ్ చేసి గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. మష్రూమ్ ఛీజ్ ఆమ్లెట్ కావలసినవి: కోడిగుడ్లు – 4; మష్రూమ్స్ – 100 గ్రా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 4 రెబ్బలు; తరిగిన ఛీజ్ – 2 టేబుల్ స్పూన్స్; కొత్తిమీర తరుగు – కొంచెం; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ∙స్టౌ పైన పాన్ పెట్టి వేడయ్యాక 1 స్పూన్ నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్స్ వేసి 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర కలిపి పక్కనపెట్టుకోవాలి . ఒక గిన్నెలో గుడ్లు కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి ∙పాన్‌లో నూనె వేసి వేడయ్యాక బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని కొంచెం మందంగా ఆమ్లెట్‌లా వేసుకోవాలి ∙ముందుగా తయారు చేసుకున్న మహ్రూమ్స్ మిశ్రమాన్ని కూడా వేసి రెండు వైపులా ఆఫ్ బాయిల్ అయ్యేలా చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. మష్రూమ్ బిర్యాని కావలసినవి: మష్రూమ్స్ – 900 గ్రా; బాస్మతి బియ్యం – 4 కప్పులు; ఉల్లిపాయలు – 2; పచ్చిమిరపకాయలు – 4; టమోటాలు – 3; క్యారెట్ – 2 టేబుల్ స్పూన్స్; అల్లం తరుగు – 3 టీ స్పూన్స్; వెల్లులి – 3 రెబ్బలు; నెయ్యి/నూనె – 1/2 కప్పు; నిమ్మకాయ – 1; లవంగాలు – 7; దాల్చినచెక్క – అంగుళం ముక్క; యాలకులు – 3; ధనియాల పొడి – 3 టీ స్పూన్స్; సోయా సాస్ – 2 టీ స్పూన్స్; కారం – 1 1/1 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; నీళ్లు – 7 కప్పులు; పుదీనా – కొంచెం. తయారి: ∙బాస్మతి బియ్యాన్ని కడిగి సరిపడ నీరు పోసి గంట సేపు నానబెట్టి నీరు వాడ్చి పెట్టుకోవాలి ∙స్టౌ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 5 నిమిషాలు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙మష్రూమ్స్‌ను పెద్ద ముక్కలుగా తరుగిపెట్టుకోవాలి ∙అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేలా సిమ్‌లో వేగనివ్వాలి ∙సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత మష్రూమ్స్ ముక్కలు కూడా వేసి పది నిమిషాలు వేయించుకోవాలి ∙ఇప్పుడు వరుసగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ∙ముక్కలన్నీ వేగిన తర్వాత 7 కప్పుల నీరు పోసి మరుగుతున్నప్పుడు బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి సిమ్‌లో 2 లేదా 3 విజిల్స్ రానివ్వాలి ∙ప్రెషర్ పోయిన తర్వాత పుదీనా గార్నిష్ చేసుకోవాలి. చిల్లీ మష్రూమ్ కర్రీ కావలసినవి: మష్రూమ్స్ పెద్ద సైజువి – 10; నల్ల మిరియాల పొడి – 1/4 టీ స్పూన్; మైదా – 4 టేబుల్ స్పూన్స్; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్; రెడ్ కాప్సికమ్ – 1/2 కప్పు; గ్రీన్ కాప్సికమ్ – 1/2 కప్పు; ఎల్లో కాప్సికమ్ – 1/2 కప్పు; ఉల్లిపాయ – 1 (ఆప్షనల్); పచ్చిమిర్చి తరుగు – 4 టీ స్పూన్స్; అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్; టమోటా సాస్ – 3 టీ స్పూన్స్; సోయా సాస్ – 1 టీ స్పూన్; వెనిగర్ – 1 టీ స్పూన్; కారం – 1/2 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; కొత్తిమీర – గార్నిష్ కోసం; నూనె – వేయించడానికి సరిపడ. తయారి: ∙మష్రూమ్స్ కాడలను కట్ చేసి తుడిచి పెట్టుకోవాలి ∙బౌల్లో మైదా పిండి ఉప్పు, మిరియాల పొడి వేసి నీరు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక మష్రూమ్స్‌ను పిండిలో ముంచి బజ్జీల్లా బంగారు రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙మరో బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అర కప్పు నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి ∙మరొక బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి రెడ్, గ్రీన్, ఎల్లో కాప్సికమ్ ముక్కలు వేయించాలి ∙5 నిమిషాలు వేయించి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి మూత పెట్టి సిమ్‌లో నిమిషం మగ్గనివ్వాలి ∙ఇప్పుడు టమోటా సాస్, సోయా సాస్, వెనిగర్, సరిపడ ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్‌ను వేసి మరో రెండు నిమిషాలు వేసి వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకుంటే వేడి వేడి చిల్లీ మష్రూమ్స్ కర్రీ రెడీ. రైస్‌లోకి, చపాతీలో కూడా బాగుంటుంది. పుట్టగొడుగులతో దీర్ఘాయుష్షు! పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివని అప్పుడప్పుడూ తినడం మేలన్నది మనందరికీ తెలుసుగానీ.. కారణాలేమిటో చూద్దాం. పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా ఇలా చెప్తున్నారు. మిగిలిన పోషకాలను పక్కకు పెట్టి కేవలం పుట్టగొడుగుల్లో ఉండే రెండు యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా మన ఆయుష్షు పెరిగే అవకాశముందన్నది సారాంశం. ఎర్గోథియోనైన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడుగులో ఉంటాయి. శరీరం మనం తిన్న ఆహారాన్ని ఇంధనంగా మార్చుకునే క్రమంలో ఒక రకమైన ఆక్సిజన్ కణాలు పుడుతూంటాయి. ఫ్రీ రాడికల్స్ అని పిలిచే ఈ కణాలు శరీరం మొత్తం తిరుగుతూ ఒక ఎలక్ట్రాన్‌ను ఆకర్షించుకుని స్థిరపడేందుకు ప్రయత్నిస్తూంటాయి. ఈ క్రమంలో ఇవి మన కణాలు, ప్రొటీన్లు.. డీఎన్ఏకు నష్టం కలిగిస్తూంటాయి. యాంటీ ఆక్సిడెంటు పుష్కలంగా లభిస్తే ఫ్రీరాడికల్స్‌తో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. వయసుతోపాటు వచ్చే సమస్యలను తగ్గించుకుని దీర్ఘాయుష్షు పొందవచ్చునని శాస్త్రవేత్త రాబర్ట్ బీల్మన్ తెలిపారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకునే ఫ్రాన్స్, ఇటలీల్లో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండింటికీ మధ్య సంబంధం ఏమిటన్నది కూడా పరిశీలించాలని తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు. -
మిస్సవుతారు... మీ ఇష్టం మరి!
పాప్‌కార్న్... భలే ఉంటుంది. కరకర... ఆలూ... ఎలా వండినా... ఊ.. లలలా! ఆవకాయ... కారం, కమనీయం. మంచూరియా... ఓ మారియా! ఓ మారియా! పరాఠా... పొరల పొరలుగా.. హాట్ హాట్‌గా.. సూప్... స్మూత్ అండ్ స్వీట్. వీటన్నిటినీ... క్యాలీఫ్లవర్‌తో చేస్తే? క్యాలీఫ్లవర్తోనా!! అవును కాలీఫ్లవర్తోనే. బాగుంటాయ్ చేసుకోండి. బాబోయ్ వద్దు అంటారా? మిస్సవుతారు.. మీ ఇష్టం మరి. గోబీ మంచూరియా కావలసినవి: క్యాలీఫ్లవర్ - 1, మైదా పిండి - కప్పు, కార్న్ ఫ్లోర్ - కప్పు, పచ్చి మిర్చి - 6, అల్లం తురుము - టీ స్పూను, వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఉల్లి తరుగు - కప్పు, ఉడికించిన బఠాణీ - కప్పు, సోయా సాస్ - టీ స్పూను, అజినమోటో - అర టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లికాడల తరుగు - పావు కప్పు తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉడికించాలి. మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా చేయాలి. పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్ తరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన బఠాణీ, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసి పకోడీల పిండిలా కలపాలి (నీళ్లు పోయకూడదు) బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ మిశమ్రన్ని చిన్న చిన్న మంచూరియాలుగా వేసి దోరగా వేయించి కిచెన్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి కాడల తరుగు వేసి వేయించాలి. తయారయిన మంచూరియాలను వేసి అన్నీ కలిసేలా కలుపుతుండాలి. చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, తగినన్ని నీళ్లు వేసి పల్చగా పిండి కలిపి, బాణలిలోని మంచూరియాల మీద వేసి కలపాలి. సోయాసాస్, అజినమోటో వేసి మరోమారు కలిపి రెండు నిమిషాలలో దింపేసి, టొమాటో సాస్‌తో సర్వ్‌చేయాలి. ఆలూ గోబీ కావలసినవి: నూనె - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, అల్లం తురుము - టీ స్పూను, ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి), పసుపు - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, జీలకర్ర పొడి - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (1), కొత్తిమీర తరుగు - టీ స్పూను, తయారీ: బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము వేసి వేయించాలి. ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలపాలి. పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు వేసి క లిపి, సుమారు ఆరేడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతుండాలి. క్యాలీఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి. క్యాలీఫ్లవర్ చరిత్ర ఈ పూలు క్రీ.పూ.6 వ శతాబ్దానికి చెందినవి. ఈ పదం కాలిస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కాలిస్ అంటే క్యాబేజీ అని అర్థం. ఈ పువ్వు భారతదేశంలోకి1822లో ఆంగ్లేయుల ద్వారా ప్రవేశించింది. క్యాలీఫ్లవర్‌ను ఉడికించుకోవచ్చు, వేయించుకోవచ్చు, ఆవిరి మీద ఉడికించనూ వచ్చు. పచ్చిగానూ తినచ్చు. పాప్‌కార్న్ క్యాలీఫ్లవర్ కావలసినవి: పంచదార - 4 టీ స్పూన్లు, పప్పు - టీ స్పూను, కారం - టీ స్పూను, పసుపు - టీ స్పూను, ఉల్లి పొడి - అర టీ స్పూను, వెల్లుల్లి పొడి - అర టీ స్పూను, క్యాలీఫ్లవర్ - చిన్న పువ్వు, కుకింగ్ స్ప్రే - తగినంత (ఇందులో పదార్థాలు సూపర్ మార్కెట్లలో కాని బేకరీలలో కాని దొరుకుతాయి) తయారీ: ముందుగా అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర వేడి చేసుకోవాలి. బేకింగ్ షీట్ మీద అల్యూమినియం ఫాయిల్ వేయాలి. ఒక పాత్రలో పంచదార, ఉప్పు, కారం, పసుపు, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి. క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. బేకింగ్ షీట్ మీద క్యాలీ ఫ్లవర్ తరుగు పల్చగా పరవాలి. కుకింగ్ స్ప్రేను అన్నిటి మీద తేలికగా స్ప్రే చేయాలి. కలిపి ఉంచుకున్న మసాలాను వీటి మీద చల్లాలి. సుమారు 30 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి వేడివేడిగా అందించాలి. క్యాలీఫ్లవర్ పాప్‌కార్న్ సిద్ధమయినట్లే. క్యాలీఫ్లవర్ పరాఠా కావలసినవి: క్యాలీఫ్లవర్ - చిన్నది-1, పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, గోధుమపిండి - 3 కప్పులు. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి తీసేయాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మెత్తగా ఉడికించాలి. పెద్ద పాత్రలో గోధుమపిండి, ఉడికించిన క్యాలీఫ్లవర్, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి చపాతీలా కలపాలి (అవసరమనుకుంటేనే నీళ్లు జత చేయాలి). పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పరాఠాలా జాగ్రత్తగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చాలి. కుర్మాతో కాని, పెరుగుతో కాని తింటే రుచిగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు - మూడు కప్పులు, ఆవాలు - ఒకటిన్నర టీ స్పూన్లు, మెంతులు - అర టేబుల్ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, కారం - 100 గ్రా., నువ్వుపప్పు నూనె - పావు కేజీ, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రేకలు - 10. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి. ఉప్పు జత చేసిన నీళ్లు గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగును సుమారు పది నిమిషాలు ఉంచాక, నీళ్లను వడకట్టాలి. తడి పూర్తిగా పోయేవరకు క్యాలీఫ్లవర్‌ను నీడలో ఆరబెట్టాలి. బాణలిలో నూనె పోసి కాగాక, క్యాలీఫ్లవర్ తరుగు వేసి సన్న మంట మీద సుమారు ఐదు నిమిషాలు వేయించి, నూనె తీసి పక్కన ఉంచాలి. (నూనెలోనే ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి) బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి, చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఆవాలను ఎండ బెట్టి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. పెద్ద పాత్రలో క్యాలీఫ్లవర్ ముక్కలు, పక్కన ఉంచిన నూనె వేసి కలపాలి. ఆవ పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, పసుపు, మెత్తగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. నిమ్మరసం వేసి మరోమారు కలపాలి. తడి లేని జాడీలో నిల్వ చేసుకోవాలి. ఫ్రిజ్లోఉంచితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. విడిగా ఉంచితే 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో, కమ్మటినెయ్యితో క్యాలీఫ్లవర్ ఆవకాయ అందిస్తే రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ క్యాలీఫ్లవర్ సూప్ కావలసినవి: రౌండ్ బ్రెడ్ - 1 స్లైసులు, వెన్న-2 టేబుల్ స్పూన్లు (కరిగించాలి) సూప్ కోసం: ఉల్లితరుగు - కప్పు, క్యాలీఫ్లవర్ తరుగు - కప్పు, వెల్లుల్లి రేకలు - 2 (సన్నగా తరగాలి), బటర్ లేదా ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి - టేబుల్ స్పూను, ఉడికించిన కూరగాయల నీళ్లు (వెజిటబుల్ స్టాక్) - 2 కప్పులు, పాలు - కప్పు (చిక్కటివి), కుంకుమ పువ్వు - చిటికెడు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - 2 టీ స్పూన్లు. తయారీ: బ్రెడ్ బౌల్, బ్రెడ్ పై భాగంలో గుండ్రంగా కట్ చేసి బౌల్ మాదిరి చేసుకోవాలి. కరిగించిన బటర్‌ను బ్రెడ్ లోపలి భాగమంతా పూతలా పూయాలి. అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసి, బ్రెడ్ బౌల్స్‌ను సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి. సూప్ తయారీ: పాన్‌లో బటర్ లేదా ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి వెల్లుల్లి రేకలు వేసి కొద్ది సేపు వేయించాలి. ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు జత చేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. మైదా పిండి వేసి బాగా కలపాలి. వెజిటబుల్ స్టాక్ జత చేసి బాగా కలపాలి. పాలలో కలిపిన కుంకుమ పువ్వు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, మరిగాక సన్నని మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచితే సూప్ బాగా చిక్కబడుతుంది. సూప్‌ను బ్రెడ్ బౌల్స్‌లో వేసి వేడివేడిగా అందించాలి. (బ్రెడ్ బౌల్స్ అవసరం లేదనుకుంటే, మామూలు పాత్రలో సూప్ సర్వ్ చేసుకోవచ్చు)