అరటికాయ మంచూరియాకు కావలసినవి:
అరటికాయలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక తొక్క తీసి, గుజ్జులా చేసుకోవాలి)
మైదాపిండి – 4 టేబుల్ స్పూన్లు
కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు
అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి)
పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి)
కొత్తిమీర తురుము, కరివేపాకు – కొద్ది కొద్దిగా (అభిరుచిని బట్టి)
ఉల్లికాడ ముక్కలు – కొద్దిగా
టొమాటో సాస్ – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు
చిల్లీసాస్ – 2 టీ స్పూన్లు
సోయా సాస్ – 1 టీ స్పూన్ (పెంచుకోవచ్చు)
నూనె – సరిపడా
ఉప్పు – తగినంత
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటికాయ గుజ్జు, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం – వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని.. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, సోయాసాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుని.. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి.
(చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!)
Comments
Please login to add a commentAdd a comment