Banana
-
ఇదేం విడ్డూరం..సింగిల్ అరటిపండు అంత ఖరీదా..?
మన దేశంలో వీధి విక్రేతల్లో కొందరూ చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అత్యాశతో చేస్తారో లేక విదేశీయలును చూడగానే అమాంతం ధర పెంచి చెబుతారో తెలియదు. ఒక్కసారిగా నిశితంగా ఆలోచిస్తే వారి ఉద్దేశ్యం సబబే అనిపిస్తంది. మరోకోణంలో చూస్తే భారతీయలంటే చులకన భావం కలుగుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకిదంతా అంటే..ఇక్కడొక వీధి వ్యాపారి ఓ విదేశీయుడికి అమ్మకం ధర చెప్పిన విధానం చూస్తే..షాకవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హ్యూ అనే విదేశీయుడు అటుగా వెళ్తున్న తోపుడు బండిపై అరటిపండ్లను అమ్ముకుంటున్న విక్రేతని పలకరిస్తాడు. అతని నుంచి అరటిపండ్లను కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో ధర అడుగుతాడు. అయితే ఆ వ్యాపారి కళ్లు చెదిరే రేంజ్లో ధర చెబుతాడు. ఏకంగా ఒక్క అరటిపండే ధరే రూ. 100 పలుకుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు.అయితే ఆ విదేశీయుడు హ్యూ. సరిగ్గా విన్నానా..? లేదా అని అయోమయానికి గురై మరొక్కసారి అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి అనుమానం తలెత్తకుండా నమ్మేలా చెబుతున్న ఆ తీరుని చూసి కంగుతింటాడు ఆ విదేశీయుడు. సారీ తాను అంత ధర చెల్లించలేను అని చెప్పడమే గాక ఇలా అమ్మితే కచ్చితంగా మీరు నష్టపోతారని అంటాడు. ఆ తర్వాత తన బ్రిటన్ దేశంలోని అరటిపండ్ల ధరతో పోలస్తూ..భారత్‌లోని ఒక అరటిపండు ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చని అంటాడు. బహుశా ఇది విదేశీయుడికి మాత్రమే ఈ అమ్మకం ధర అని ఆ వీడియోలో చెబుతుండటం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బ్రో ఇది ఫారెన్ టాక్స్, చెల్లించి భారత్ ఎకానమీని మార్చేందుకు తమరి వంతుగా సాయం చెయ్యొచ్చు కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Hugh Abroad (@hugh.abroad)(చదవండి: మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! ఏకంగా 145 కిలోలు నుంచి..) -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరటి నార.. అందాల చీర
ఈ చీరలను నూలు, పట్టు దారాలతో నేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. వీటిని కేవలం అరటి నారతో నేశారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఔత్సాహిక యువత అరటి నార (బనానా ఫైబర్)తో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. చీర నుంచి చేతిసంచి వరకు దాదాపు 45 రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ ప్రయత్నానికి ఏడాదిన్నర క్రితం బీజం వేయగా.. వాణిజ్యపరంగాను లాభాల పంట పండించనుంది.సాక్షి, అమరావతి: ‘బిడ్డలకు జన్మనిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోతుంది’ అనే పొడుపు కథ విన్నారా. అరటి చెట్టును ఉద్దేశించి ఈ పొడుపు కథ వాడుకలోకి వచ్చింది. అరటి చెట్టు గెలవేసి.. గెలలోని కాయలు పక్వానికి రాగానే గెలను కోసేస్తారు. మరుక్షణమే అరటి చెట్టును నరికేస్తారు. అలా నరికిపడేసిన అరటి చెట్లు తోటల్లో గుట్టలుగా పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు రైతులు పడే ఇబ్బందులు వర్ణానాతీతం. దీనికి శాస్త్రవేత్తలు గతంలోనే చక్కటి పరిష్కారం కనుక్కున్నారు. అరటి చెట్ల కాండం నుంచి నార తీసే సాంకేతికతను అభివృద్ధి చేయడంతోపాటు యంత్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు.అరటి నార తయారీతో రైతులకు ఆదాయంఅరటి నారకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. దీంతో ఔత్సాహికులు రైతుల వద్దకు వెళ్లి కొట్టి పడేసిన అరటి బొంత (కాండం)లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క బొంతకు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆ బొంతలను ఎండబెట్టి యంత్రాల సాయంతో నార తీస్తున్నారు. ఈ నారతో పర్యావరణ హితమైన వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన పెంచి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎసాŠస్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నార ఉత్పత్తుల తయారీపై ఔత్సాహిక యువత, మహిళలు, రైతులకు శిక్షణ ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. కాగా.. కడప నగరానికి చెందిన ముసా ఫైబర్ స్టార్టప్ సంస్థ వివిధ ప్రాంతాల్లో యువత, మహిళలకు అరటి నార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తోంది. తాజాగా ఈ సంస్థ అనంతపురం జిల్లా కురుగుంటలో రెండు నెలలపాటు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది.అద్భుతమైన ఉత్పత్తుల తయారీఅరటి నారతో అద్బుతమైన ఉత్పత్తులను అందించే నైపుణ్యం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇప్పటికే ఔత్సాహిక, అంకుర సంస్థలు అరటి నార నుంచి తీసిన దారాలతో చీరల్ని నేయించి అమ్మకాలకు పెడుతున్నాయి. అరటి నార దారాలతో ప్యాంట్లు, షర్ట్లు తదితర దుస్తులను రూపొందిస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు అందమైన చేతి సంచులు, బుట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం అరటి నారతో రూపొందిస్తున్నారు. చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్స్, పేపర్, పూల బుట్టలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పరుపులో వాడే పీచుకు బదులు అరటి నారతో తయారు చేస్తున్న క్వాయర్ మరింత నాణ్యతతో ఉన్నట్టు గుర్తించారు.మా కృషి ఫలిస్తోందిరాష్ట్రంలో అరటి సాగుచేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అరటి బొంతల నుంచి తీసే ఫైబర్‌తో ఉత్పత్తులు తయారు చేయడంపై ఉతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణతో అవగాహన పెంచుకున్నాం. ఐదుగురు సభ్యులతో ముసా ఫైబర్ స్టార్టప్ నెలకొల్పాం. కడప, అనంతపురం, కృష్ణా, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో అరటి నారతో ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాం. రైతుల నుంచి అరటి బొంతలు సేకరించి నారతీసి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. మిగిలిన వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తున్నాం. ర్చి రైతులకు ఇస్తున్నాం. అరటి బొంత నీరు నుంచి క్రిమిసంహారక మందులు, సౌందర్య సాధనాలు తయారు చేసే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. – పుల్లగుర శ్రీనివాసులు, ముసా ఫైబర్ స్టార్టప్, కడపఉపాధిగా మలుచుకుంటాంఅరటి ఉప ఉత్పత్తుల తయారీపై తీసుకున్న శిక్షణ మాకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపాధిగా మలుచుకుంటాం. అరటి నార తీయడం మొదలు ఉత్పత్తుల తయారీ వరకు అనేక విధాలుగా జీవనోపాధి దొరుకుతుంది. – విద్య, కురుగుంట, అనంతపురం జిల్లాఅరటితో ఎన్నో ప్రయోజనాలుకొట్టిపడేసే అరటి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుటీర పరిశ్రమగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. శిక్షణ తీసుకోవడంతో మేం స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నాం. – శ్రీలక్ష్మి, కురుగుంట,అనంతపురం జిల్లా -
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్‌పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్‌ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్‌ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్‌లాండ్‌లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. -
ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!
‘అవసరం’ నుంచి మాత్రమే కాదు ‘నష్టం’ నుంచి కూడా ‘ఐడియా’ పుడుతుంది. విషయంలోకి వస్తే... ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మలావీలో కరోంగ జిల్లాకు చెందిన శ్రీమతి ఎమిలీ చిన్నపాటి రైతు. అరటి సాగు చేసే ఎమిలీలాంటి ఎంతోమంది రైతులకు ఒక సమస్య ఏర్పడింది.విపరీతమైన వేడి వల్ల అరటిపండ్లు చాలా త్వరగా పండుతున్నాయి. పాడవుతున్నాయి. దీనివల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ‘వెరీ ఫాస్ట్ అండ్ గో టు వేస్ట్’ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ‘బనానా వైన్’ ఐడియా పుట్టింది.ఇక ఆట్టే ఆలస్యంలోకి చేయకుండా ఎమిలీ బృందం రంగంలోకి దిగింది.‘అరటి వైన్ తయారు చేయడం ఎలా?’ అనేదానికి సంబంధించి వారు చిన్నపాటి శాస్త్రవేత్తలు అయ్యారు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు. మెచెంజర్ అనే గ్రామంలో నాలుగు గదుల ఇంట్లో వైన్ తయారీ ప్రక్రియ మొదలు పెట్టారు. బాగా మగ్గిన అరటిపండ్లు, చక్కెర, ఎండుద్రాక్ష, నిమ్మకాయలు, నీళ్లు... మొదలైనవి ముడిసరుకుగా బనానా వైన్ తయారీ మొదలైంది. అయితే ఇదేమీ ఆషామాషీ ప్రక్రియ కాదు.ఎమిలి మాటల్లో చెప్పాలంటే ‘టైమింగ్ అనేది చాలా ముఖ్యం’ ఎలాంటి అరటిపండ్లను ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, టైమ్ ఎంత తీసుకోవాలి....ప్రతి దశలోనూ ఆచితూచి అత్యంత జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. ఇది ‘గుడ్ క్వాలిటీ వైన్’గా పేరు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘స్మూత్ అండ్ లైట్ వైన్’గా పేరు తెచ్చుకున్న ఈ అరటి మద్యానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.‘మలావీ నలుమూలలా అరటి మద్యానికి మంచి డిమాండ్ ఉంది’ అంటున్నాడు కమ్యూనిటీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెన్నిసన్ గోండ్వే. ‘బనానా వైన్ ఐడియా మా జీవితాలను మార్చేసింది. మాలో కొందరు ఇళ్లు కట్టుకున్నారు. కొందరు పశువులు కొన్నారు. ఇప్పుడు మేము మంచి భోజనం తినగలుగుతున్నాం’ అంటుంది ఎలీన. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
అరటి.. ధర అదిరింది!
మధురమైన రుచులతో సామాన్యులకు అందుబాటులో ఉండే అరటి పండు ధర అమాంతం పెరిగింది. సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే బెదిరిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ధరలు లేక తోటల్లో గెలలు చెట్లకే మగ్గిపోయిన పరిస్థితి. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో భారీగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి లేని సమయంలో డిమాండ్ పెరగడంతో మరికొందరు రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. పండ్ల కొనుగోలుదారులు మాత్రం అరటి అంటే చాలు అమ్మో అనే పరిస్థితికి వచ్చారు. కొల్లూరు: మారిన వాతావరణ పరిస్థితిలో అరటి దిగుబడి అంతగా లేదు. పెనుగాలులు, ఎండలు, ప్రస్తుతం వాతావరణంలో వేడి తీవ్రంగా ఉండటంతో అరటి దిగుబడి మందగించింది. జిల్లాలో సుమారు 2,379 మంది రైతులు 3,710 ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారు. కర్పూర, చక్రకేళి, కూర అరటి రకాలు ఇందులో ఉన్నాయి.ఎకరాకు 800 వరకు అరటి మొక్కలు సాగు చేస్తే 10 నెలల వ్యవధిలో పంట చేతికి అందుతుంది. ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి అవసరం. పంట చేతికందిన అనంతరం స్థానిక మార్కెట్లలో అమ్మకాలు జరపడంతోపాటు తోటల్లోనే వ్యాపారులకు గెలలు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణంలో 5 శాతం కంటే తక్కువ తోటల్లో మాత్రమే గెలలు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొరత ఏర్పడి ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు శ్రావణమాసంలో అధికంగా పూజలు, శుభకార్యాలు ఉండటంతో పండ్లకు డిమాండ్ పెరిగింది. వేసవిలో గెలలు కొనే వారే లేకపోవడంతో సాధారణ, మొదటి రకం గెలలు రూ. 20 నుంచి రూ. 30కు సైతం విక్రయించిన రైతులు నష్టాలపాలయ్యారు. ప్రస్తుతం కర్పూర అరటి మొదటి రకం రూ. 1,200, సాధారణ రకం రూ. 800 వరకు పలుకుతున్నాయి. చక్రకేళి రకం గెలకు రూ. 450 వరకు ధర లభిస్తోంది. కూర అరటి గెల రూ. 300కు అమ్ముడవుతోంది. పండ్లు డజను రూ. 80 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు.గెల రూ. 400 పలికినా లాభమే.. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న అరటి పంటకు ప్రస్తుతం పలుకుతున్న ధరలు ఇలాగే ఎప్పుడూ ఉండవు. కనీసం గెలకు రూ. 400 వరకు పలికినా లాభాలు వస్తాయి. రెండేళ్ల పంట కాలంలో రెండు పర్యాయాలు కాపునకు వచ్చే గెలలు అధికంగా దిగుబడి వచ్చే నవంబర్ నుంచి రేట్లు పడిపోకుండా ఉంటే మాకు మేలు చేకూరుతుంది. – ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, రైతు, కిష్కిందపాలెం, కొల్లూరు మండలం -
పూల మొక్కలకి ఈ ఎరువు ఇవ్వండి : ఇక పువ్వులే పువ్వులు!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణంగా మారింది. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే పెద్దగా పూయవు. సరికదా ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. View this post on Instagram A post shared by Life’s Good Kitchen (@lifesgood_kitchen)ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు. లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది. -
అరటి కాండంతో చాట్..! ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఇటీవల అరటి పండుతో బజ్జీల గురించి విన్నాం. తాజగా అరటి కాండం లేదా అరటి డొప్ప చేసిన చాట్ రెసిపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ అరటి కాండం లేదా అరటి డొప్పలను కార్తీక మాసం పూజల్లో ఉపయోగిస్తుంటారు. అయ్యప్ప భక్తులు కూడా పూజల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అరటి డొప్పతో స్నాక్స్ వంటకమా..? అని ఆశ్యర్యంగా అనిపిస్తోంది కదా..! ఎలా చేశారంటే..అరటి కాండం లేదా డొప్ప భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానికి దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మసాలా వేసి, చిటికెడు ఉప్పుని జోడిస్తారు. దీన్ని స్పూసీ గ్రీన్ చట్నీ, పుల్లని సాస్, స్పైసీ ఆలు భుజియాతో అలంకరిస్తాడు. చివరిగా నిమకాయ రసంతో సర్వ్ చేస్తాడు. అంతే అరటి కాండం చాట్ రెడీ. దీన్ని అరటి ఆకులోనే అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ చాట్‌ని బెంగళూరులో ఎక్కువగా వినియోగిస్తారట. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తాము అరటి కాండంలను పచ్చిగా తింటామని, ఇవి కిడ్నీలో రాళ్లు, ప్రేగు సమస్యలను నివారిస్తుందని చెప్పగా, మరొకరు ఇది చాలా టేస్టీగా ఉంటుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చెయ్యండి. View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate) (చదవండి: సచిన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు దిగ్గజ క్రికెటర్లు ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!) -
అరటిపండ్లతో బజ్జీ ఎప్పుడైనా ట్రై చేశారు?
అరటికాయ బజ్జీల గురించి విని ఉన్నాం. కానీ అరటి పండుతో కూడా బజ్జీలు వేసుకోవచ్చట. ఇదేంటి పండుతో బజ్జీనా..!అనుకోకండి. చక్కగా బజ్జీలు చేసి తినేయొచ్చట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అరటి గెలను కోసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు. వారు గెలతో సహా ఆయిల్లో వేయించారు. ఆ తర్వాత ఆ గెలను ఆయిల్ నుంచి తీసేసి చక్కగా పళ్లు, గెలను వేరు చేశారు. ఆ తర్వాత ఒక్కో అరటి పండును వొలిచి చక్కగా ఓ పాలిథిన్ పేపర్పే పెట్టి మెదిపి దాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న పిండి బేటర్‌లో ముంచి చక్కగా బజ్జీలు మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అరటి పండ్ల బజ్జీ రెడీ..!.అబ్బా ఇలా కూడా అరటిపండ్లతో బజ్జీలు చేసుకోవచ్చా అని అనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Crispyfoodstation (@crispyfoodstation) (చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి
మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్‌దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. -
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..ఇలా చేయండి..– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.– ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి.. -
డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్ వేయండి
మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ వేధించే వ్యాధి హైబీపీ. ముఖ్యంగా నిద్రలేమి ఒత్తిడి ఈ హైబీపీ బారిన పడేస్తున్నాయి. బీపీని సకాలంలో గుర్తించి నియంత్రణలో ఉంచుకోకుంటే అది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాంటి బీపీని నేచురల్ ప్రోబయాటిక్ ఆహారంతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు అవేంటో చూద్దామా..!జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్నందుకే పెరుగును నేచురల్ప్రోబయాటిక్ ఆహారం అంటారు. అరటిలో పొటాషియమ్ లవణాలుంటాయి. ఇటు అరటి, అటు పెరుగు... ఈ రెండూ రక్తపోట (హైబీపీ)ని సమర్థంగా అదుపు చేస్తాయని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లో తేలడం మాత్రమే కాదు... ఆ సంగతి ‘హైపర్‌టెన్షన్’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైంది. హైబీపీ రాకముందే నివారించాలంటే... అందుకు అరటి, పెరుగు, తియ్యటి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. వాటితోపాటు ఇంకా పూర్తిగా పులవకుండా... అందుకు సంసిద్ధంగా ఉన్న అట్ల పిండితో వేసే అట్లు, ఇడ్లీ వంటివి తీసుకుంటే కూడా హైబీపీ నేచురల్‌గానే నివారించవచ్చని వైద్య పరిశోధకులు, న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. (చదవండి: మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!) -
పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా
పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇటీవల కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్, ఇథలిన్ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా రైతులను, విక్రయదారులను ఇలాంటి రసాయనాలు వినియోగించొద్దని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి కూడా. అయితే పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. అది కూడ సహసిద్ధమైన రీతిలో మాగబెట్టవేరు. అదెలోగా ఓ బామ్మ చేసి చూపించింది. ఎలాగంటే..ఓ బామ్మ అరటి పండ్లను పూర్వకాలంలో ఎలా ముగ్గబెట్టేవారో చేసి చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి దాంట్లో ఈ అరటి గెలను ఉంచింది. తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి దాన్ని కూడా అరటిపండ్ల గెల ఉన్న చోట పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి ఉంచింది. ఆ తర్వాత పైన మరిన్ని ఎండిన కొబ్బరి ఆకులను మట్టిని కూడా వేసి అలా రెండు రోజులు వదిలేసింది. ఆ తర్వాత రోజు చూస్తే చక్కగా మంచి సువాసనతో ముగ్గిపోయి ఉన్నాయి అరటి పండ్లు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు ముగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్ అంటూ ఆ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Eswari S (@countryfoodcooking)(చదవండి: మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!
అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న. ఈ మిల్క్ షేక్నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ‘‘ఠండా..ఠండాగా కావాలి’’ అంటూ ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్ షేక్ లేదా బనానా మిల్క్ స్మూతీ. రెండు బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి, జ్యూస్ చేయాలి. దీనికి ఓ రెండు ఐస్‌ముక్కలు, కాస్తంత హార్లిక్స్.. డ్రైఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది. అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు పాల ద్వారా 150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి సరిపోతాయి. బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది. పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్‌తో బరువు పెరగాలనుకుంటే, బనానా మిల్క్ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్‌లను యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్. పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరు దూరంగా ఉండాలి? ♦ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ♦ సైనసైటిస్‌తో బాధపడేవారు పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ♦ పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు. -
అరటి ఆకులతో హల్వా ట్రై చేశారా?
హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి హల్వాని సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా వివిధ పండ్లతో, కూరగాయాలతో చేయటం చూశాం. ఎన్నో రకాల మేళవింపులతో కూడిన హల్వాలను రుచి చూశాం. అయితే ఇలా ఆకులతో చేసే హల్వాని మాత్రం చూసి ఉండరు. అందులోనూ అరటి ఆకులతో చేయడం గురించి విన్నారు. ఎలా చేస్తారంటే..అత్యంత ప్రజాధరణ పొందిన స్వీట్సలో హల్వా ఒకటి. దాని రుచే అదిరిపోతుంది. అలాంటి హల్వాని ఆకులతో చేయడం ఏంట్రాబాబు అనుకుంటున్నారా..!. అందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది. అందులో ఓక వ్యక్తి ఈ వైరైటీ హల్వాని చేసి చూపించాడు. అతను అరటి ఆకులను చక్కగా శుభ్రం చేసి మద్యలోని కాండాన్ని తొలగించాడు. ఆ తర్వాత ఆకులన్నింటిని చక్కగా చదును చేసి రోల్ చేశాడు. ఇక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. వాటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్‌లా. ఆ తర్వా స్టవ్‌పై కడాయి పెట్టి నెయ్యి వేసి, అందులో ఈ జ్యూస్‌ని వేసి పచ్చి వాసన పోయి దగ్గర పడేలా మరిగించాడు. ఆ తర్వాత పంచాదర కలిపి మరింత దగ్గర పడేలా చేశాడు. ఈలోగా కార్న్‌ఫ్లోర్‌ని చక్కగా నీటిలో కలిపి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో కలపాడు. ఇకి హల్వాల దగ్గర పడుతుందనంగా డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాడు. చివరిగా ఆ హల్వాని టేస్ట్ చేసి వ్యక్తి పైకి బాగుందని అన్నా..అతని ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాలేదన్నట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు బాస్ ఏంటి చెత్త ప్రయోగాలు..బాగుందంటూ హవభావాలు వేరేలా ఉన్నయేంటీ అని చివాట్లు పెడుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Great Indian Asmr (@great_indian_asmr) (చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
అరటిలో ఏపీ మేటి
సాక్షి, అమరావతి: ఆంధ్ర అరటికి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. గ్రోత్ ఇంజన్ క్రాప్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అరటి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగులోనే కాదు.. ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతుల్లో కూడా అద్భుత ప్రగతిని సాధించింది. గడిచిన నాలుగేళ్లలో 1.80 లక్షల టన్నులు ఎగుమతి కాగా, ఈ ఏడాది లక్ష టన్నుల్ని ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 50 వేల టన్నులు ఎగుమతి అయ్యాయి. మరోవైపు.. మిడిల్ ఈస్ట్ దేశాలకే ఇప్పటివరకు ఎగుమతయ్యే అరటి ఈసారి మొట్టమొదటిసారిగా రష్యాకు కూడా ఎగుమతి అయ్యింది. ఇకపోతే అరటికి కనీస మద్దతు ధర క్వింటా రూ.800 కాగా, ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950 మధ్య పలుకుతోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు.. విదేశాల్లో డిమాండ్ ఉన్న ఎరువు, కర్పూర, చక్కరకేళి, అమృతపాణి, బుడిద చక్కరకేళి, తేళ్ల చక్కరకేళి, సుగంధాలు, రస్తాలి వంటి రకాలు ఏపీలోనే సాగవుతున్నాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి రకం), టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో 2018–19 నాటికి 1.90 లక్షల ఎకరాల్లో సాగవుతూ 50 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అరటి సాగు ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. టిష్యూ కల్చర్ ప్లాంట్ మెటీరియల్, ఫ్రూట్ కేర్ కార్యకలాపాలు, బిందు సేద్యం వంటి అధునాతన సాంకేతిక పద్ధతుల వలన ఉత్పాదకత హెక్టార్‌కు 60 టన్నులకు పైగా వస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం 2023–24లో 62 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయని అంచనా వేశారు. ఫలించిన సీడీపీ ప్రాజెక్టు.. ఇక రాష్ట్రంలో అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రూ.269.95 కోట్లతో చేపట్టిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ) సత్ఫలితాలిస్తోంది. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్–ప్రొడక్షన్) వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతరం నిర్వహణ–విలువ ఆధారిత (పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూ ఎడిషన్) కోసం రూ.74.75 కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70 కోట్లు ఖర్చుచేస్తున్నారు. నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం (ఐపీఎం), ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తోట బడుల ద్వారా 15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిచ్చారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. పీపీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన యూఏఈ, బెహ్రాన్, ఈజిప్‌్ట, సౌదీ అరేబియా, కతార్, ఇరాన్ వంటి దేశాలకు అరటి ఎగుమతి అవుతోంది. ♦ 2016–17 వరకు అరటి పంట రాష్ట్రం కూడా దాటే పరిస్థితి ఉండేది కాదు. ఆ ఏడాది తొలిసారి 246 టన్నులు ఎగుమతి చేస్తే 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులు ఎగుమతి చేశారు. ♦ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది (2019–20)లోనే రికార్డు స్థాయిలో 35వేల టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేశారు. ♦ ఆ తర్వాత వరుసగా 2020–21లో 48వేల టన్నులు, 2021–22లో 48,200 టన్నులు, 2022–23లో 49,500 టన్నులు ఎగుమతి అయ్యాయి. ♦ ఇక ఈ ఏడాది 75 వేల టన్నులను ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 50 వేల టన్నుల అరటి ఎగుమతైంది. ♦ ఈ సీజన్ ముగిసే నాటికి లక్ష టన్నులు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..!
ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో సలాడ్స్ ముందువరుసలో ఉంటాయి. కానీ సలాడ్స్‌ను తయారు చేసుకోవడమంటేనే బద్ధకమా? అయితే వెంటనే ఈ స్లైస్ డివైస్‌ని తెచ్చుకోండి. ఏ పండునైనా ఒకే ఒక్క నిమిషంలో స్లైసెస్‌గా చేసిపెడుతుంది. ఉడికించిన గుడ్లు, యాపిల్, బనానా వంటి పండ్లనైతే ఒకేసారి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా మధ్యలో ఒక వైపు మందంగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ డివైడర్ స్టాండ్ అమర్చి ఉంటుంది. దాని సాయంతో పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మరోవైపు కూడా అదేమాదిరి మరో షేప్‌లో డివైడర్ ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం.. క్లీన్ చేసుకోవడం రెండూ సులభమే. కిచెన్‌లో చిన్న ప్లేస్‌లో కూడా దీన్ని సర్దొచ్చు. స్థలం పెద్దగా ఆక్రమించదు. దీని ధర 7 డాలర్లు (రూ.580). ఇవి చదవండి: ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ -
పండ్లను ఇనుములా మార్చి సుత్తిగా తయారుచేయొచ్చా!
ఫొటోలో కనిపిస్తున్న అరటిపండు నిజానికి ఒక సుత్తి. అలాగని అరటిపండు ఆకారంలో ఇనుముతో తయారుచేసిన సుత్తి కాదు. నిజమైన అరటిపండుతోనే రూపొందించిన సుత్తి ఇది. ఆశ్చర్యపోతున్నారా? ఈ మధ్యనే జపాన్‌కు చెందిన ‘ఐకెడా’ అనే కంపెనీ ఈ అద్భుతమైన అరటి సుత్తిని ప్రవేశపెట్టింది. సాధారణ వాతావరణంలో అరటిపండు మొత్తగా ఉంటుంది. కానీ మైనస్ డిగ్రీ సెల్సియస్ వాతవరణంలో పూర్తిగా గడ్డకట్టి .. బలమైన రాయి, సుత్తి కంటే గట్టిగా, బలంగా ఉంది. అలా ఫ్రీజ్ చేసిన అరటిపండుతో గోడకు మేకులు కొట్టే వీడియోలు ఇప్పటికే యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. దీని ఆధారంగానే ‘ఐకెడా’ గడ్డకట్టిన అరటిపండును తీసుకొని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మెటల్ ప్రాసెసింగ్ చేసి ఈ అరటిసుత్తిని తయారుచేసింది. ఇదే విధంగా గతంలోనూ పైనాపిల్, బ్రోకలీ వంటివాటికీ మెటల్ ప్రాసెసింగ్ చేశారు. అయితే కొనుగోళ్లలో వాటన్నింటి కంటే ఈ అరటి సుత్తే టాప్‌లో నిలిచి వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇది వివిధ రకాల సైజుల్లో ధర రూ. వెయ్యి నుంచి రూ. ఆరువేల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. (చదవండి: పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?) -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్‌ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్‌ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్‌ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్‌తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
అంతరించిపోయే స్టేజ్‌లో బనానా!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
కాలుష్యం లేదా కొన్ని రకాల చీడపీడల కారణంగా పూర్వం నాటి ప్రముఖ పండ్లు, కూరగాయాలు అంతరించిపోవడం జరిగింది. వాటి విత్తనాలు సైతం కనుమరగవ్వడం. అందుబాటులో ఉన్న మొక్కల సాయంతోనే కొత్త రకాల వంగడాలను సృష్టించడం వంటివి చేశారు శాస్త్రవేత్తలు. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఆ స్టేజ్‌లోకి బనానాలు కూడా వచ్చేశాయి. ఔను!.. మనం ఎంతో ఇష్టంగా తినే అరటిపండ్లు అంతరించే పోయే ప్రమాదంలో ఉన్నాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందువల్ల అరటిపండ్లు అంతరించిపోతున్నాయి? రీజన్ ఏంటి? తదితరాల గురించే ఈ కథనం!. పేదవాడు సైతం కొనుక్కుని ఇష్టంగా తినగలిగే పండు అరటిపండు. అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది. అలాంటి పోషకవిలువలు కలిగిన పండు ప్రస్తుతం కనుమరగయ్యే స్థితిలో ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఇష్టంగా తినే అరటి పండ్లలలో కావెండిష్ అరటిపండ్లు ఒకటి. ఇది వాణిజ్యం పరంగా అధికంగా ఎగుమతయ్యే అరటిపండు కూడా ఇదే. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇది చెట్టు మూలల్లో అటాక్ చేసి నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఇది చెట్టు మొదలులోనే రావడంతో ముందుగా మొక్కను నీటిని గ్రహించనీయకుండా చేస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని పరిస్థితి మొక్కలో ఏర్పడి చివరికి మొక్క చనిపోతుంది. దీంతో ఈ కావెండీష్ రకం అరటిపండ్లు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని "ది ఫేట్ ఆఫ్ ది ఫ్రూట్ దట్ చేంజ్ ది వరల్డ్" అనే పుస్తకంలో రచయిత డాన్ కోపెల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేతలు ఈ అరటిపండ్లకు ఈ ఫంగల్ తెగులుని తట్టుకునే విధంగా వ్యాధి నిరోధకతను పెంచేలా జన్యు మార్పులు చేసే పనిలో ఉన్నారన్నారు. రైతులు కూడా ఈ రకం అరటి సాగుకి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించడం లేదా ఈ పండ్ల సాగును మానేయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ కావెండిష్ రకం పండ్లను 1989లో తైవాన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు విస్తరించింది. అక్కడ నుంచి భారత్, చైనాలోకి ప్రవేశించి, ప్రధాన అరటి ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది. ఆఖరికి ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పండిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యాధి దక్షిణాఫ్రికాలోని అరటి చెట్లలో కూడా కనిపించిందని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రోఫెసర్ జేమ్స డేల్ తెలిపారు. ఈ రకమైన వ్యాధి అరటి చెట్లకు ఒక్కసారి వస్తే వదిలించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇలానే గతంతో గ్రోస్ మిచెల్ అనే రకం అరటిపండుకి టీఆర్ 4 అనే తెగులు వచ్చింది. దీంతో రైతులు మరో రకం అరటిపళ్లను సాగు చేయడంపై దృష్టిసారించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ రకం అరటిపండు క్రమేణ కనుమరుగయ్యింది. దాని స్థానంలోనే ఈ కావెండిష్ రకం అరటిపళ్లు వచ్చాయి. అయితే ఇది గ్రోస్ మిచెల్లా కావెండిష్ రకం అరటిపళ్లు అంతరించడానికి టైం పడుతుందని, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈలోగా ఆ వ్యాధిని నివారించేలా జన్యుపరమైన మార్పులు చేయడం లేదా మొక్కల్లో వ్యాధినిరోధక స్థితిని పెంచి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలిగేలా చేయగలమని కొందరూ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!
అరటికాయ మంచూరియాకు కావలసినవి: అరటికాయలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక తొక్క తీసి, గుజ్జులా చేసుకోవాలి) మైదాపిండి – 4 టేబుల్ స్పూన్లు కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ కారం – 1 టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి) పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి) కొత్తిమీర తురుము, కరివేపాకు – కొద్ది కొద్దిగా (అభిరుచిని బట్టి) ఉల్లికాడ ముక్కలు – కొద్దిగా టొమాటో సాస్ – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు చిల్లీసాస్ – 2 టీ స్పూన్లు సోయా సాస్ – 1 టీ స్పూన్ (పెంచుకోవచ్చు) నూనె – సరిపడా ఉప్పు – తగినంత తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటికాయ గుజ్జు, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం – వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని.. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, సోయాసాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని.. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి!
కావలసినవి: అరటికాయలు – 2 (మీడియం సైజువి, ముందుగా ఉడికించి, తొక్క తీసి, చల్లారాక మధ్యలో గింజల భాగం తొలగించి, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) అటుకులు – అర కప్పు (కొన్ని నీళ్లల్లో నానబెట్టి, పేస్ట్‌లా చేసుకోవాలి), కొత్తిమీర తరుగు – కొద్దిగా జొన్నపిండి – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్ జీడిపప్పులు – 10 (నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి) చాట్ మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి) నూనె – సరిపడా. ఉప్పు – తగినంత తయారీ: ముందుగా అరటికాయ గుజ్జు, అటుకుల పేస్ట్ వేసుకుని దానిలో కారం, చాట్ మసాలా, జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇతర కూరగాయల తురుము వంటివి కలుపుకోవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి ఫింగర్స్లా, పొడవుగా చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే! ) -
వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!
ఎప్పుడు గుడ్డుతో వేసుకునే ఆమ్లెట్ కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. మసాలా వేసి చేసే ఎగ్ ఆమ్లెట్ గురించి తెలిసిందే. అలా కాకుండా అరటిపండుతో అదిరిపోయే రుచితో ఇలా ఆమ్లెట్ వేసుకుని చూడండి. పిల్లలు, పెద్దులు వదిలిపెట్టకుండా తినేస్తారు చూడండి. అయితే దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా!. బనానా ఆమ్లెట్కి కావలసినవి: అరటి పండు – ఒకటి గుడ్లు – రెండు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – టీస్పూను కారం – అరటీస్పూను నూనె – ఆమ్లెట్ వేయించడానికి సరిపడా. తయారీ విధానం: ∙అరటిపండును ముక్కలుగా తరగాలి. మిక్సీజార్‌లో అరటిపండు ముక్కలు, గుడ్ల సొన, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చే యాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే బనానా ఆమ్లెట్ రెడీ. (చదవండి: వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..) -
అరటిపండుతో నిమిషాల్లో స్వీట్ తయారీ.. చేయండిలా
అరటిపండు మైసూర్ పాక్ తయారికి కావల్సినవి: శనగపిండి – కప్పు; నెయ్యి – కప్పు; ఎర్ర అరటి పండ్లు – రెండు; చక్కెర – కప్పు. తయారీ విధానమిలా శనగపిండిని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. అరటిపండ్లు తొక్కతీసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి.వేగిన పిండిలో కొద్దిగా నెయ్యి వేసి పేస్టులా కలిపి దించేయాలి. చక్కెరలో కప్పు నీళ్లుపోసి మరిగించాలి.తీగపాకం వచ్చిన తరువాత శనగపిండి పేస్టు, అరటిపండు ప్యూరిని వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా దగ్గరపడినప్పుడు దించేసి, నెయ్యిరాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కట్ చేస్తే బనానా పాక్ రెడీ. -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్‌కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్‌గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్‌లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?
అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న జంట అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం.. జంట అరటిపళ్ళు పిల్లలు తినకూడదు. పైగా తింటే కవల పిల్లలు పుడతారనే అనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. అసలు నిజానికి తినొచ్చా..తింటే ఏమవుతుంది? దేవుడికి సమర్పించొచ్చా లేదా తదితరాలు గురించి తెలుసుకుందామా! కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టోచ్చా, ముఖ్యంగా పెళ్లి కాని వారు తినోచ్చా అంటే..కవలలు పుడతారని భారతీయుల విశ్వాసమే గానీ శాస్త్రీయంగా మాత్రం ఎక్కడా నిరూపితం కాలేదు. ఇలా ఫిలిప్పీన్స్ వాసులు కూడా మనలానే నమ్ముతారట. వారు కూడా జంట అరటిపళ్లు తినరట. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు మొదటి మూడు నెలల్లోపు తింటే కవలలు పుడతారని మన వాళ్లు గట్టిగా నమ్ముతారు. అలాగే కొందరూ.. కవల పిల్లలు కావాలనే ఉద్దేశంతో జంట అరటిపళ్లు తింటారని చెబుతున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగలేదని నొక్కి చెబుతున్నారు. అదుకు ఆస్కారం లేదంటూ సైన్స్ కొట్టిపారేస్తుంది. అదొక మూఢ నమ్మకమే తప్ప మరేం కాదని తేల్చి చెబుతోంది. దేవతలకు పెట్టొచ్చా అంటే.. దీనికి పండితులు ఏం చెప్పారంటే.. ”అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయ పడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను విష్ణువు రంభకి వరంగా ఇచ్చారు. అందువల్ల అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదంటున్నారు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదట. ఎందుకంటే కవల అరటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..! అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టడం బాగోదు. పైగా తీసుకోవడానికి అవతలి వాళ్లు సంకోచించే అవకాశం ఉంది, మరోవైపు తాంబులాన్ని వద్దనకూడదు అనేది శాస్త్రం. దీంతో అవతలి వ్యక్తి ఈ రెండు సమస్యలతో సందిగ్ధంలో పడి కలత చెందే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించడం మన సంప్రదాయమేగాక ఆనందంగానే వారిని సాగనంపుతాం. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడమే మంచిది. (చదవండి: ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!) -
అరటిపండుతో అదిరిపోయే అందం.. ఈ ప్యాక్‌తో ఇన్ని ఉపయోగాలా?
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? వాటికోసం వేలకువేలకు తగలేసి కాస్మొటిక్స్ వస్తువులు కొంటుంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే దొరికే అరటిపండుతో నిగనిగలాగే స్కిన్‌టోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు తింటే ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందమైన చర్మం కోసం అరటింపడుతో ఇలా ప్యాక్ వేసుకోండి.. ♦ బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ♦ అరటిపండు గుజ్జులో తేనే, పసుపు కలుపుకొని రాసుకుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. ♦ అరటిపండును మెత్తగా చేసుకోని దానిలో వేపాకు పౌడర్‌ను కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది. ♦ మెటిమలు, వాటి తాలూకూ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మీ సమస్యకు చక్కని పరిష్కారం.ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్‌లా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ♦ అరటిపండు గుజ్జులో రెండు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా మారుతుంది. -
పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి..
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన. ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు. ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
అచ్చం మనిషిలానే తింటున్న ఏనుగు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఏనుగులు శాంతంగా ఉంటే ఎంత సరదాగా ఉంటాయో కోపమొస్తే గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మావాటి చెప్పేవి బుద్ధిగా వినడంతో పాటు వాటిని పాటిస్తాయి కూడా. వీటి ప్రవర్తన చూసి మనుషులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. మరీ పిల్ల ఏనుగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఏనుగు అరటి పండు తినే తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బెర్లిన్ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.. ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రం తింటోంది. ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్ పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.. గోధుమ రంగు (సరిగా లేని) అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించారు. -
ఇండోనేషియా పాపువా గినియా దీవులలో 3 కిలోల బరువున్న అరటిపండు
-
Recipe: బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా!
ఎప్పటిలా రొటీన్ కజ్జికాయలు కాకుండా వెరైటీగా ఈసారి బనానా – ఓట్స్‌తో ట్రై చేసి చూడండి. బనానా – ఓట్స్ కజ్జికాయలు కావలసినవి: ►అరటిపండు గుజ్జు – 1 కప్పు ►ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) ►కొబ్బరి కోరు – పావు కప్పు ►పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు ►సోయా పాలు – పావు కప్పు ►నూనె – 4 టేబుల్ స్పూన్లు ►మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ: ►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ►అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించాలి. ►అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. ►చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ►ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ►మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. చదవండి: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారీ ఇలా తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా.. -
అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే..
Vinod Sahadevan- Banana Varieties: పండుగా, కూరగా, మరెన్నో ఉత్పత్తులుగా.. అరటి పంట మన జాతి సంస్కృతిలో అనదిగా విడదీయరాని భాగమైపోయింది. వైవిధ్యభరితమైన అరటి రకాలను అంతరించిపోకుండా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ బృహత్ కార్యాన్ని నెత్తికెత్తుకున్న కేరళకు చెందిన ఓ రైతు స్ఫూర్తికథనం ఇది. విలక్షణమైన అరటి రకాలను సేకరించి సాగు చెయ్యటమంటే కేరళకు చెందిన వినోద్(62)కు మహా ఇష్టం. ఇష్టం అనే కంటే పిచ్చి అంటే బాగా నప్పుతుందేమో. అందుకే ఆయనకు ‘వలచెట్ట’ అని పేరొచ్చింది. వలచెట్ట అంటే మళయాళంలో ‘అరటి అన్న’ అని అర్థం. తిరువనంతపురం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన 4 ఎకరాల తోటలో 500 కంటే ఎక్కువ రకాల అరటి మొక్కల్ని నాటి ప్రాణప్రదంగా సాగు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు అనేక విదేశాల్లో తిరిగి మరీ అరటి రకాలను సేకరించి నాటడం పనిగా పెట్టుకున్నాడు. సుసంపన్నమైన అరటి జీవవైవిధ్యానికి నిలయంగా మారిన తన క్షేత్రాన్ని ‘అరటి గ్రామం’ (వలగ్రామం) అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్త ఇవ్వనన్నాడని... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వినోద్‌కు చిన్నప్పటి నుంచే అరటి రకాలను సేకరించే అలవాటుంది. పదేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవం అతన్ని అరటి జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా మార్చేసింది. ఓ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తను తనకు ఇష్టమైన ఓ అరటి రకం మొక్క ఇవ్వమని అడిగితే అందుకు ఆయన నిరాకరించారు. ఆ సంఘటన వినోద్‌ను తీవ్రంగా బాధపెట్టింది. అరటి రకాల కోసం ఇకపై ఏ విశ్వవిద్యాలయంపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి రకరకాల అరటి పిలకలను సేకరించి తన సొంత పొలంలో పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన పొలంలో 500 కన్నా ఎక్కువ అరటి రకాల మొక్కలున్నాయి. ఆ రకాలలో ఎంతో వైవిధ్యం ఉంది. విశేషమేమిటంటే.. తిరువనంతపురం అనే ఓ అరటి రకం ఉండేది. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, వినోద్ పొలంలో ఉంది. పెయాన్తో.. పండుగా తినడానికి, పచ్చికాయలను కూర వండుకోవడానికి ఉపయోగపడే అరటి రకాలు మనకు తెలుసు. అంతేకాదు.. ఐస్‌క్రీమ్‌లు, షేక్స్‌కు ఉపయోగపడే ప్రత్యేక అరటి పండ్లు ఉన్నాయి. ‘పెయాన్’ రకం అరటి కాయలతో కేరళలో కూర చేస్తారు, తమిళనాడులో దీన్ని ఎక్కువగా పండుగా తింటారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం ఉన్న పండు ఇది. చక్క, వాయల్వజా, కుల్లరకని, బారాబెన్లో, చిరపుంచి, పంథరాజ్, ఎఫ్హెచ్ఐఏ3, సబా మొదలైన పేర్లతోనూ దీన్ని పిలుస్తుంటారు. తక్కువ నీరు, ఎరువులతో పెరగటం దీని ప్రత్యేకత. అత్యధికంగా అమ్ముడయ్యే రకం అయినప్పటికీ రైతులకు ఈ రకం అరటి పిలకలు దొరక్క సాగు తగ్గిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మన అరటి వీరుడు వినోద్ దగ్గర ఉన్నాయి! అల్సర్‌ని తగ్గించిన అరటి! మైసూరులో నవంబర్‌లో జరిగిన కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో వినోద్ తన తోటలో పండిన కనీసం 30 రకాల అరటి పండ్లను ప్రదర్శనకు పెట్టారు. మీకు బాగా ఇష్టమైన అరటి రకం ఏది అని ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘అన్నీ ఇష్టమే. ఒక్కో రకం రుచి, వాసన, సైజు వేరుగా ఉంటాయంతే’ అన్నారు. అదిసరే గానీ.. ప్రత్యేకతలున్న అరటి రకాల గురించి చెప్పండి అనడిగితే.. ‘కన్నామంఫలం’ రకం అరటి పండ్లలో ఔషధ గుణాల గురించిన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆయన తండ్రికి కడుపులో అల్సర్ సమస్య ఉండేది. ఎవరో చెబితే ‘కన్నామంఫలం’ అరటి పండ్లు కొన్ని రోజుల పాటు తింటే అల్సర్ సమస్య తీరిపోయింది. బేబీ ఫుడ్ అరటి రకాలున్నాయి.. పెద్దలకే కాదు శిశువులు, బాలలకు కూడా ‘కన్నామంఫలం’ మంచిదని.. ‘కన్నమంఫలం’ అంటే ‘శిశువుల ఆహారం’ అని అర్థమని వినోద్ వివరించారు. ‘కన్నమంఫలం’తో ΄పాటు కారయన్నన్, పొంకల్లి, కన్నన్పాజ్మ్, అడుక్కన్, కున్నన్.. ఇవన్నీ బేబీ ఫుడ్‌గా పనికొస్తాయన్నారు. ఈ రకాల అరటి పండ్లను ఎండబెట్టి పొడి చేసి చంటి పిల్లలకు తినిపిస్తారు. జీర్ణకోశ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుందన్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రకాన్నయినా సాగు చేయొచ్చు! మన దేశంలో ఎక్కువ రకాల అరటిని కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. వినియోగం కూడా ఎక్కువే. అయినా అరుదైన అరటి పండ్ల రకాల పరిరక్షణపై అధికారులు ఆసక్తి చూపడం లేదన్నది వినోద్ ఫిర్యాదు. అందుకే కేరళలోని అన్ని జిల్లాల్లో తన పొలం మాదిరిగా ’అరటి జీవవైవిధ్య క్షేత్రాలను ఏర్పాటు చేయాలన్నది తన ఆశయమని వినోద్ చెబుతున్నారు. తన దగ్గర ఉన్న అరటి రకాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాటుకోవడానికి అనువైనవేనని వినోద్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తాను సంరక్షిస్తున్న అరటి రకాల పిలకల(సక్కర్స్)ను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. పది పిలకలను రూ. 4,200కు అమ్ముతున్నానని, ఆర్డర్ ఇస్తే కొరియర్లో పంపుతానన్నారు. ఫేస్బుక్లో ‘వలగ్రామం’ గ్రూప్ నిర్విహిస్తున్నారు. వల చెట్టన్ వాట్సప్: 94464 01615. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం -
Coconut Dream: కొబ్బరి తురుము, అరటి పండు గుజ్జుతో కోకోనట్ డ్రీమ్!
కొబ్బరి తురుముతో కోకోనట్ డ్రీమ్ ఇలా తయారు చేసుకోండి. కోకోనట్ డ్రీమ్ తయారీకి కావలసినవి ►పచ్చి కొబ్బరి తురుము – 200 గ్రా ►మంచి నీరు – పావు లీటరు ►పండిన అరటిపండ్లు – 4 ►నిమ్మకాయ – 1. తయారీ: ►కొబ్బరి తురుమును మిక్సీలో వేసి నీటిని పోస్తూ బ్లెండ్ చేయాలి. ►బ్లెండ్ చేసే కొద్దీ కొబ్బరిలోని క్రీమ్ పైకి తేలుతుంది. ►ఈ పాలను మరొక పాత్రలోకి వంపి, పైకి తేలిన క్రీమ్ తిరిగి కొబ్బరి పాలలో కలిసి పోయే వరకు పక్కన ఉంచాలి. వడపోయవద్దు. ►కొబ్బరి కోరు పూర్తిగా మెదగకుండా కొంత ఉండిపోయినప్పటికీ అలాగే తాగడం ఆరోగ్యకరం. ►అరటి పండు గుజ్జును మెత్తగా బ్లెండ్ చేసి అందులో నిమ్మరసం కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో పోసి సమంగా కలిసే వరకు బాగా కలపాలి. ఇవి కూడా ట్రై చేయండి: Palak Dosa: గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి -
అరటికి అందలం..ఇయర్ ఆఫ్ బనానాగా ప్రకటన
తాడేపల్లిగూడెం: మూడేళ్ల నుంచి ఉద్యాన పంటల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఈ ఏడాదిని (2022–23) అరటి సంవత్సరం (ఇయర్ ఆఫ్ బనానా)గా ప్రకటించింది. ఈ మేరకు కరపత్రాలు, అధికారిక లోగోను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు కార్యరూపం ఇస్తూ విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోన్న ఉద్యాన వర్సిటీ ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల బలోపేతంలో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానకీరాం వినూత్న ఆలోచనలతో 2020 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో పంటను ఎంచుకొని పంటల నామ సంవత్సరాన్ని ప్రకటిస్తున్నారు. 2022–23ని ఇయర్ ఆఫ్ బనానాగా ప్రకటించారు. ఎంపిక చేసిన పంటకు సంబంధించి ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన, రాష్ట్ర ప్రభుత్వ శాఖల, జాతీయ సంస్థల సమన్వయంతో, దేశంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో అత్యంత ప్రాధాన్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైతులు, ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సంయుక్త కృషితో చేసిన కార్యక్రమాలు సామాన్య ప్రజలకు కూడా ఎంతో అవగాహన కలుగుతోంది. 2020–21ని అంబాజీపేట పరిశోధనస్థానం ద్వారా ఇయర్ ఆఫ్ కోకోనట్‌గా ప్రకటించారు. 2021–22ని పెట్లూరు నిమ్మ పరిశోధన స్థానం ద్వారా నిమ్మ, నారింజ, బత్తాయిల కోసం ఇయర్ ఆఫ్ సిట్రస్‌గా ప్రకటించారు. దేశంలో విశ్వవిద్యాలయాలకు ఈ పద్ధతి నమూనాగా మారింది. పరిశోధనల్లో వర్సిటీ మేటి మహారాష్ట్ర, గుజరాత్లో పండించే గ్రాండ్‌నెస్ (పెద్దపచ్చఅరటి)కు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇక్కడ పండించే కర్పూర, చక్కెరకేళీ, తెల్ల చక్కెరకేళీ, మార్టమస్, ఎర్ర చక్కెరకేళీ రకాలు దేశవాళీ రకాలుగా ప్రాచుర్యం పొందాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అరటి పరిశోధన స్థానం విడుదల చేసిన కొవ్వూరు బొంత, గోదావరి బొంత అరటి వంటి కూర రకాలు కూడా ఉన్నాయి. టిష్యూ కల్చర్, బిందుసేద్య పద్ధతుల ద్వారా అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అరటి విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. మూడు, నాలుగేళ్లుగా అరటి రైతులు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా గ్రాండ్‌నెస్ అరటి రకాన్ని సాగు చేస్తున్నారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో పనిచేస్తోన్న ఉద్యాన పరిశోధన స్థానం (కొవ్వూరు) కృషి ఫలితంగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. విత్తన, పిలక ఎంపిక, టిçష్యూకల్చర్ అరటి, సాగు, బిందు సేద్య విధానం, గెలల యాజమాన్యం, ఎరువులు, తెగుళ్ల యాజమాన్యం, కోత ముందు తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తలు వివరిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అరటిసాగు పెరగడం వల్ల కొత్త రకాలు, ఆయా ప్రాంతాలకు అనువైన సేద్య పద్ధతులను అందుబాటులోకి తెస్తున్నారు. 2019లో ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కొత్తగా 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేసింది. -
నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు ఇష్టమా? డోపమైన్ అనే హార్మోన్‌ను విడుదల చేసి..
Health Tips In Telugu: ఒక్కోసారి కారణమేమీ లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. విలువైన వస్తువులేవో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు వేస్తుంటుంది.ఆ తర్వాత కాసేపటికి ఇష్టమైన వారెవరో కనిపిస్తేనో, ఏదైనా మంచి వార్తలు వింటేనో, ఏమయినా మంచి ఆహారం తింటేనో మూడ్ సరి అయిపోతుంది. ఇది మనసు చేసే మాయాజాలం. ఇదంతా జరగడానికి మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ విడుదలలో తేడాలు రావడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అలా కారణం మాత్రమే చెప్పి ఊరుకోకుండా మంచి మూడ్‌లోకి తీసుకొచ్చే కొన్ని ఆహార పానీయాల గురించి కూడా చెప్పారు. వీటిని కేవలం మూడ్ బాగోలేనప్పుడే కాదు, రోజువారీ తీసుకుంటే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు కదా.. ఇంతకూ అలాంటి ఆహార పానీయాలేమిటా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వెళ్దాం... వీటితోబాటు ఆకుకూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ కూడా డోపమైన్ బూస్టర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు వీటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే సరి. నట్స్ నట్స్‌లో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అమైనో యాసిడ్‌కు డోపమైన్ విడుదలను పెంచే సామర్థ్యం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం... నట్స్‌లో టైరోసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ టైరోసిన్ విచ్ఛిన్నమైతే.. డోపమైన్‌గా తయారవుతుంది. వేరుశెనగలు, బాదం, గుమ్మడి గింజలు, నువ్వులలో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. కాఫీ సాధారణంగా చాలామందికి మూడ్ బాగోలేనప్పుడు లేదా తలనొప్పిగా అనిపించినప్పుడు మంచి ఫిల్టర్ కాఫీ తాగుతుంటారు. దాంతో శాడ్ మూడ్ కాస్తా తిరిగి హ్యాపీ మూడ్‌గా మారిపోతుంటుంది. ఒక పరిశోధన ప్రకారం రోజూ సుమారు బిలియన్ మందికి పైగా కాఫీ తాగుతుంటారు. రోజూ కాఫీ తాగేవారికి డిప్రెషన్ కూడా కాస్త దూరంలోనే ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది కాబట్టి నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటున్నవారు దానిని కొనసాగించడం మంచిది. ఈసారెప్పుడైనా మూడ్ బాగోలేప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూస్తే సరి. కొబ్బరి పచ్చి కొబ్బరిలో మీడియం లెవెల్లో ట్రై గ్లిజరైడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, మెదడుకు చైతన్యాన్ని ఇస్తాయి. కొబ్బరి పాలు, కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. అందుకే కొబ్బరికి మూడ్ ఫుడ్ అనే పేరుంది. బెర్రీలు... సాధారణంగా పండ్లు, కూరగాయలు బాగా తీసుకునేవారి మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాటిలోనూ ప్రత్యేకించి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల బెర్రీలు తీసుకునే వారికి కుంగుబాటు, ఆందోళన ఆమడదూరంలో ఉంటాయి. బ్లూ బెర్రీలు అంటే నేరేడు పండ్ల వంటివి తీసుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది. అవకాడో ఒకప్పుడు ఇది కాస్తంత ఖరీదైన ఆహారాల జాబితాలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పండులో ఉండే మెత్తటి గుజ్జు అనేక రకాల పోషకాలకు నిలయం. దీనిలోని కొలీన్కు నాడీ వ్యవస్థను నియంత్రించడంతోపాటు మూడ్‌ను సంతోషంగా మార్చే లక్షణాలు ఉన్నాయి. ఒక సర్వే మేరకు అవకాడో తినే మహిళలలో ఆందోళన ఉండదట. వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి శరీరంలోని ఒత్తిడి స్థాయులను అదుపు చేస్తుంది. అందువల్ల వీలయినప్పుడలా అవకాడో తింటూ ఉండటం ఎంతో ప్రయోజనకరం. డార్క్ చాక్లెట్స్ ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపే వాటిలో డార్క్ చాక్లెట్స్ ఎప్పుడూ ముందుంటాయి. వీటిలో ఉండే ఉండే ఫినైల్థైలమైన్ అనే రసాయనం డోపమైన్‌ను కొద్ది కొద్దిగా విడుదల చే స్తుంటుంది. అంతే కాదు, డార్క్ చాక్లెట్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎండార్ఫిన్ హార్మోన్, సెరోటోనిన్ అనే మోనోఅమైన్ న్యూరోట్రాన్స్మీటర్ విడుదలవుతాయి. వీటివల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతాయి. అరటిపండు అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ న్యూరో టాన్స్మీటర్ల విడుదలకు ఉపకరిస్తుంది. మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేయడానికి ఈ రసాయనాలు తోడ్పడడంతోపాటు మానసిక స్థితిని నియంత్రణలో ఉంచి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అరటిపండ్లు రక్తంలోని షుగర్ నిల్వలను సైతం నియంత్రించగలవు. అలాగని షుగర్ ఉన్నవారు ఒకేసారి రెండు మూడు అరటిపళ్లు లాగించేయకూడదు. మూడ్ సరిగా లేదనిపిస్తే మాత్రం ఒక అరటిపండు తింటే సరి. డెయిరీ ఉత్పత్తులు ఒత్తిడిలో ఉన్నప్పుడు డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, పాలు, పెరుగు తీసుకుంటే.. శరీరంలో హ్యాపీ లెవల్స్ పెరుగుతాయి. చీజ్‌లో టైరమైన్ ఉంటుంది, ఇది మానవ శరీరంలో డోపమైన్‌గా మారుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పాలు, చీజ్, పెరుగు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, పుల్లట్లు తిన్నా, పులి బొంగరాలు తిన్నా మంచిదే. కాకపోతే అవి సిద్ధంగా ఉండవు కాబట్టి వీలయినప్పుడల్లా తింటూ ఉంటే మంచిది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే -
Health Tips: ఆ పళ్లు తిన్న వెంటనే నీళ్లు తాగారో ఇబ్బందుల్లో పడ్డట్లే!
కొందరు వైద్యులు మంచినీళ్లు బాగా తాగమని చెబుతుంటారు. ఇంకొందరు అంత ఎక్కువగా తాగవద్దని చెబుతారు. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. దీని వెనుక మనలో చాలా మందికి తెలియని కారణం ఉంది. ఇంతకీ మనం ఏయే పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు తాగకుండా ఉండాలో తెలుసా మరి? ►అరటిపండు.. ఆయుర్వేదం ప్రకారం, పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరి అరటిపండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీళ్లు తాగకపోవడానికి ఇదే కారణం. ►పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండే వాటిలో పుచ్చకాయదే ప్రముఖ స్థానం. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగడం ద్వారా సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణంతో బాధపడ వలసి వస్తుంది. ►పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కూడా దారి తీస్తుంది. ►సిట్రస్ జాతి ఫలాలు తిన్న తర్వాత... నారింజ, ఉసిరి, సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ నుండి యాసిడ్ బయటకు వస్తుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మనం నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందుకే సిట్రస్ పండ్లు తిన్న తర్వాత మనం నీరు తాగకూడదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
హై బీపీ.. హెవీ బ్లడ్ ప్రెషర్.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్‌గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా.., తరచుగా తట్టుకోలేనంత కోపం వచ్చినా, శరీరంలో తేడా అనిపించినా.. కొన్ని జాగ్రతలు తీసుకుంటే మంచిది. సోడియం లెవల్ సాధారణంగా ఒక లీటర్ రక్తంలో 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలంట్స్ మధ్య ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారు రోజువారీ సోడియం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలి, ఇది తప్పకుండా పాటించాల్సిన మొదటి జాగ్రత్త. ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఆ మేరకు అంచనా వేసుకోవాలి. వెంటనే ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. కారంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో సోడియం తగ్గడం వల్ల రక్తపోటు నార్మల్కు వస్తుంది. ఎందుకంటే, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతోపాటు ఉబ్బరం ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరం ఉప్పును బయటకు పంపడానికి అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచుగా శరీరంలో రక్తపోటును ప్రేరేపిస్తుంది. దీంతో అరోగ్య సమస్యలు మొదలువుతాయి. అందుకే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అందువల్ల రక్తపోటును తగ్గించే ఏకైక మార్గం ఆహారంలో ఉప్పును తగ్గించడమే. రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే ఆహార పదార్థాలు ఇవి. అరటిపండ్లు ఇవి పొటాషియానికి గొప్ప మూలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేస్తుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అరటిపండ్లను తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. నేరుగా తినవచ్చు లేదా బనానా షేక్, స్మూతీని తయారు చేసుకోని తిన్నా ఫరావాలేదు. మెగ్నీషియం కోసం బియ్యం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం, వోట్స్ లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 500 మిల్లీగ్రామ్ నుంచి 1,000 మిల్లీగ్రామ్ వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాల ఉత్పత్తులు తాజా లేదా ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం తగ్గితే హృదయనాళ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో కాల్షియం పొందేందుకు శరీరం ఇతర వనరుల కోసం వెతకడం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, మజ్జిగ వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని ఉండేలా చూసుకుంటే, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి సోడియం పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. లెవల్స్‌లో తేడా ఉంటే డాక్టర్‌ను కలిసి ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ధ్యానం, యోగా లేదా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Thyroid Cancer: థైరాయిడ్ క్యాన్సర్.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే -
Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి!
బనానా కాఫీ కేక్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! బనానా- కాఫీ కేక్ తయారీకి కావలసినవి: ►అరటిపండ్లు – 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి) ►బ్రౌన్ సుగర్ – 1 కప్పు, ►నూనె – అర కప్పు ►మైదాపిండి – 1 కప్పు ►బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►పాలు – అర కప్పు, చాక్లెట్ చిప్స్ – 1 టేబుల్ స్పూన్ తయారీ: ►ముందుగా అరటిపండు ముక్కలు, నూనె, బ్రౌన్ సుగర్ మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమంలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవలి. ►ఇందులో కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ క్రీమ్‌లా బాగా కలుపుకోవాలి. ►తర్వాత నచ్చిన షేప్‌లో ఉండే బేకింగ్ బౌల్ తీసుకుని.. దానిలోపల నూనె పూయాలి. ►ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకుని.. చాక్లెట్ చిప్స్ జల్లుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ►కాస్త చల్లారిన తర్వాత నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా తయారు చేసుకోండి! -
Kitchen Tips: గుడ్లు, చాక్లెట్లు, ఉల్లి.. ఇంకా వీటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే
Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్‌లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు. అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్‌లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం. టమాటా: టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి. అరటికాయలు: అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు. అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఆవకాడో: ఫ్రూట్స్‌లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్‌లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. పుచ్చకాయ: ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు. వంకాయ: వంకాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే! చాక్లెట్లు: చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది. గుడ్లు: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్‌ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్. బ్రెడ్: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది. బత్తాయి పండ్లు: సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్‌లను ఫ్రిజ్‌లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
Health Tips: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! నిర్లక్ష్యం వద్దు! ఇవి తింటే...
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. అదే విధంగా.. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ►కండరాలు బలహీనంగా మారుతాయి. ►కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. ►అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. ►అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ►సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. పొటాషియం ఎందులో లభిస్తుందంటే(Potassium Rich Foods).. ►కోడిగుడ్లు ►టమాటాలు ►చిలగడ దుంపలు ►విత్తనాలు ►నట్స్ ►అరటి పండ్లు ►యాప్రికాట్స్ ►చేపలు ►తృణ ధాన్యాలు ►పెరుగు ►పాలు ►మాంసం ►తర్బూజా ►క్యారెట్ ►నారింజ ►కివీ ►కొబ్బరినీళ్లు బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే..
అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికం. కాబట్టి మలబద్దకం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాదు అరటిపండులో మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్ బీ6 ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే విటమిన్ సీ కూడా ఎక్కువే! అంతేకాదు.. యాంటి ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, కొంతమందికి అరటిని నేరుగా తినడం ఇష్టం ఉండదు. పాలల్లో చక్కెర వేసుకుని కలపుకొని తినడం లేదంటే స్మూతీలు, షేక్‌లు తయారు చేసుకుని తాగడం చేస్తూ ఉంటారు. ఇక పాలు తాగితే కలిగే ఆరోగ్య లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రొటిన్లు, విటమిన్ బీ, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? వీటితో పాటు ఎముకలు, కండరాల ఆరోగ్యానికి దోహదపడుతూ.. నాడీ వ్యవస్థ పని విధానాన్ని ప్రభావితం చేయగలిగే కాల్షియం కూడా ఉంటుంది. మరి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అరటిని, పాలను కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీటీవీ తన కథనంలో పేర్కొన్న అంశాలు మీకోసం.. డైటీషియన్, సైకాలజిస్ట్ హరీశ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. ‘‘అరటిని పాలతో కలిపి తినమని నేను సిఫార్సు చేయలేను. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అయితే, ఈ రెండింటినీ విడిగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాలు తాగిన 20 నిమిషాల తర్వాత అరటి పండు తినవచ్చు. కానీ బనానా మిల్క్‌షేక్‌లు తరచుగా తాగితే జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు’’ అని పేర్కొన్నారు. మరి ఈ విషయం గురించి న్యూట్రీషనిష్ట్, మాక్రోబయోటిక్ హెల్త్‌కోచ్ శిల్ప అరోరా ఏం చెప్పారంటే.. ‘‘బాడీ బిల్డర్లు అరటిపండు, పాలు కలిపి తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బరువు పెరగాలనుకున్న వాళ్లు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయవచ్చు. తక్షణ శక్తి లభిస్తుంది కూడా! అయితే, అస్తమా వంటి ఎలర్జీలతో బాధ పడేవారు మాత్రం ఈ రెండూ కలిపి తినవద్దు. కఫం పట్టి శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మరి ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఆయుర్వేదం ప్రకారం. ప్రతి ఆహారం తనదైన రుచి(రస) కలిగి ఉంటుంది. అలాగే సదరు ఆహారం తిన్న తర్వాత కలిగే ప్రభావాలు వేర్వేరు(విపాక)గా ఉంటాయి. దాని వల్ల శరీరం వేడి చేయొచ్చు లేదంటే చల్లబడనూ(వీర్య) వచ్చు. కొన్ని విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహారాలు కలిపి తీసుకుంటే జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి వాటిలో అరటి, పాలు కూడా ఉన్నాయట. నిజానికి పండ్లతో పాలు కలపడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయం గురించి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ సూర్య భగవతి మాట్లాడుతూ.. ‘‘అరటి, పాలు కలిపి తినడం మంచిది కాదు. కొంతమందికి ఈ కాంబినేషన్ వాంతులు, విరేచనాలకు దారి తీయవచ్చు. ఆహారం సరిగా జీర్ణంకాదు. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. పైన చెప్పిన విధంగా.. వేర్వేరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటి, పాలు కలిపి తింటే వచ్చే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి రెండూ పోషకాహారాలే.. కాబట్టి విడిగా తింటే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే, ఏ ఆహారమైనా వేర్వేరు వ్యక్తుల శరీర తత్వాలను బట్టి వేర్వేరు ప్రభావాలు చూపుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోట్: ఈ కథనం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
Health Tips: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..
Monsoon Healthy Diet: వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటివి సహజం. మరి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా వర్షపు జల్లులు ఆస్వాదించాలంటే రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలి? ఈ 5 రకాల పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వానా కాలంలోని అసలైన మజాను ఆస్వాదించేందుకు అప్పుడప్పుడూ వేడి వేడి ఛాయ్.. పకోడీలు, బజ్జీలు లాగించినా తరచుగా వీటిని మాత్రం తినడం మరిచిపోవద్దని చెబుతున్నారు. జామూన్ అల్ల నేరేడు పండ్లంటే ఇష్టపడని వారు అరుదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో తోడ్పడుతుంది. ఇందులోని కొలాజెన్ కాంతివంతమైన మెరిసే చర్మానికి కారణమవుతుంది. విటమిన్ బి, సీతో పాటు కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుంది జామూన్. యాపిల్ రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదంటారు.యాపిల్‌లో ఉండే ఆరోగ్య కారకాలు అలాంటివి మరి! ఇందులో విటమిన్ సీ, ఫ్లావనాయిడ్స్ అధికం. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. దానిమ్మ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు మెండు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకున్న వారు దానిమ్మ పండ్లు తింటే సరి. నిజానికి డిటాక్సిఫికేషన్(శరీరంలో విష పదార్థాలు తొలగించడం)లో గ్రీన్ టీ తాగడం కంటే.. దానిమ్మ తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సెలబ్రిటీ న్యూట్రీషనిస్ట్ ల్యూక్ కౌటినో చెబుతున్నారు. అరటిపండు అందరికీ అందుబాటు ధరలో ఉంటే అరటిపండులో విటమిన్ బీ6 ఎక్కువ. ఇది రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. ఇక అరటిపండును నేరుగా తినడం ఇష్టపడని వాళ్లు చక్కగా స్మూతీలు, షేక్స్ చేసుకుని తాగితే బెటర్. చదవండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! పియర్స్(బేరి పండు) పియర్స్‌లో పొటాషియం, విటమిన్ సీ అధికం. దీని తొక్క కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లావనాయిడ్స్ ఎక్కువ. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి! -
పిల్లలు పక్క తడుపుతున్నారా? క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!
Bed Wetting Problem In Children: సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తుంటే అది తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. చల్లటి వాతావరణం, నిద్రపోయే ముందు అధిక ద్రవాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. పిల్లలు 6, 7 సంవత్సరాల వయస్సు దాటుతున్నా కూడా పక్క తడిపే అలవాటు ఉన్నట్లయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటంటే.. కారణాలు! ►పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ►పిల్లాడు ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ►మధుమేహం ఉన్నా కూడా పిల్లలకు మూత్ర నియంత్రణ ఉండదు. ►యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఒత్తిడి లేదా మానసిక సమస్యలున్నా కూడా మూత్ర నియంత్రణ ఉండదు. ►కాబట్టి పై కారణాల్లో ఏదో వైద్యుని సహాయంతో తెలుసుకుని తగిన చికిత్సను అందించాలి. క్రాన్బెర్రీ జ్యూస్ తాగిస్తే! ►ఇవే కాకుండా జీవనశైలిలో మార్పులు, ఆహార ప్రణాళికలో మార్పులను జోడించి, ఇంట్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా దీన్ని నియంత్రించవచ్చు. ►పక్క తడపడం తగ్గించడంలో క్రాన్బెర్రీ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది. తృణధాన్యాల వల్ల ►సహజ సిద్ధమైన ఫైబర్ సమృద్ధిగా ఉండే వాల్నట్స్, కిస్మిస్లు.. పక్క తడిపే పిల్లల సమస్యను నిరోధించడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లల పెరుగుదలకు సహాయపడే ముఖ్య ఖనిజం. ►తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఓట్స్, ఫుడ్రైస్, కార్న్‌ఫ్లేక్స్, గోధుమ పొట్టు వంటి ధాన్యాలు పక్క తడిపే అలవాటును తగ్గిస్తాయి. అరటిపండ్లతో అద్భుతం ►ఈ సమస్యకు అరటిపండ్లు అద్భుతమైన గృహ చిట్కాగా ఉపయోగపడతాయి. ఈ పండు జీర్ణవ్యవస్థకు సహకారాన్ని అందివ్వడమే కాకుండా మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా ఉపయోగపడుతుంది. ►దాల్చిన చెక్క, తేనెలో ఉండే గుణాలు పిల్లల్లో పక్క తడిపే అలవాటును నివారిస్తాయి. ఇవి పీడియాట్రిక్ డయాబెటిస్ సమస్య చికిత్సలో కూడా సహకారాన్ని అందివ్వగలవు. తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇస్తే ►ఈ సమస్యను తగ్గించడంలో తులసిని పూర్వీకుల వైద్యంగా చెప్పారు. కొన్ని తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య తగ్గిపోతుంది. ►మూత్రాశయం నిండినప్పుడు బాత్రూమ్కు వెళ్లాలి అని పిల్లలకి తరచూ చెబుతుండాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు సోమరితనం, మొండితనం వల్ల సరైన సమయానికి బాత్రూమ్కి వెళ్లకుండా లేటు చేస్తుంటారు. ఇవి తినకూడదు ►స్వీట్లు, చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రసాయనాలు, చక్కెరలు పిల్లల్లో రాత్రి సమయంలో కొన్ని జీవక్రియలకు దారితీయొచ్చు. కాబట్టి రాత్రి నిద్రపోయే ►ముందు స్వీట్లు, చాక్లెట్ల జోలికి పిల్లలు వెళ్లకుండా చేయాలి. ►రాత్రి పడుకునేముందు ఎక్కువ మంచినీరు, జ్యూస్‌లు తాగకుండా చేయాలి. ఇలా చేయాలి! ►పడుకునే ముందు పిల్లలను బాత్రూమ్కి వెళ్లమని చెప్పాలి. ►వీలైతే మధ్య రాత్రులలో క్రమం తప్పకుండా పిల్లలను బాత్రూమ్కు తీసుకెళ్లాలి. ఇలా తరచూ చేస్తుంటే పిల్లలు త్వరలోనే ఈ అలవాటును మానేస్తారు. చదవండి: Health Tips: ఇవి తరచుగా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు.. -
Health Tips: రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ రెండు కలిపి తినండి..!
పెరుగు అంటే అదో ప్రో–బయాటిక్ ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఆధునిక వైద్యవిజ్ఞానం ఈ విషయాన్ని నిరూపణ చేయడానికి చాలా ముందునుంచీ... అంటే అనాదిగా పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. తోడేసిన పాలు పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే... మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ప్రోబయాటిక్స్ రక్తపోటు (హైబీపీ)ని అదుపుచేయడానికి సమర్థంగా ఉపయోగపడతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు... ఈ విషయం ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలిందని, ఇదే విషయం ‘హైపర్‌టెన్షన్’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైందని పేర్కొంటున్నారు. అందుకే పులవడానికి సిద్ధంగా ఉన్న పిండితో వేసే అట్లు, ఇడ్లీతో పాటు తాజా పెరుగు, తాజా మజ్జిగ రక్తపోటును సమర్థంగా అదుపు చేస్తాయన్నది వైద్యవర్గాల మాట. అంతేకాదు... చాలామందికి అరటిపండుతో పెరుగన్నం తినడం ఓ అలవాటు. అరటిలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పెరుగన్నం, అరటి కాంబినేషన్ రక్తపోటు అదుపునకు స్వాభావికంగా పనికి వచ్చే ఔషధం లాంటిది అంటున్నారు వైద్యనిపుణులు, న్యూట్రిషన్ నిపుణులు. -
అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి అస్వస్థత
అరటి పండు తినే ఎంత ఆరోగ్యంగా ఉంటామో చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజు ఒక అరటి పండు తిన్నాలని పలువురు ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు. అలాంటి అరటి పండు తిని ఏకంగా 120 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వైశాలి జిల్లాలోని పాతేపూర్ బ్లాక్‌లో శనివారం రోజున.. సత్యనారాయణ స్వామి పూజ చేశారు. అనంతరం, ఆదివారం ఆ పూజకు వాడిన అరటి పండ్లను బ్లాక్‌లో ఉన్న మహతి ధరంచంద్ పంచాయతీ వార్డు-10లో పలువురి ప్రసాదంగా పంచారు. దీంతో అరటి పండు ప్రసాదంగా తిన్న వారందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. కడపు నొప్పి, విరోచనాలతో అనార్యోగానికి గురయ్యారు. దీంతో స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు. పాతేపూర్ బ్లాక్‌కు చేరుకున్న వైద్యులు.. వారికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమితాబ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ప్రసాదంగా పంచిన అరటి పండ్లలో కెమికల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుకే వారందరూ అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. అంతేకాకుండా.. అరటిపండ్లను ఉడకబెట్టడం వల్ల ప్రసాదం కలుషితమైందని వెల్లడించారు. అందుకే బాధితులకు వాంతులు, కడుపునొప్పి వచ్చాయన్నారు. కాగా, బాధితులు వెంటనే కోలుకోవటానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించినట్టు చెప్పారు. అలాగే వారికి అవసరమైన మందులను కూడా సరఫరా చేశామన్నారు. మరోవైపు.. బాధితుల్లో ఐదుగురి ఆరోగ్య పరిస్థితి బాగా క్షిణించడంతో వెంటనే వారిని పాతేపూర్ హెల్త్ సెంటర్‌కు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఔషధాల ఖజానా పుదీనా -
ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు... బనానా రికార్డు!
Banana Bonanza: అరటి పండ్లను ఇలా వరుసగా పేర్చారేమిటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలోని షికాగోకు చెందిన జ్యువెల్ ఓస్కో అనే సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు ఇలా పండ్లను పేర్చడం ద్వారా సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇందులో పెద్ద గొప్పేం ఉంది.. ఎవరైనా ఈ రికార్డు సృష్టించొచ్చు అనుకుంటున్నారా? కానీ ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు మరి.. ఇందుకోసం వాడిన అరటిపండ్లు ఎన్నో తెలిస్తే మీరు అవాక్కవుతారు.. ఎందుకంటే ఏకంగా 31,751 కిలోల అరటిపండ్లను ఇలా వరుసగా పేర్చారు. అంటే ఒక్కో అరటిపండు సుమారు 100 గ్రాముల బరువు ఉంటుందనుకుంటే ఈ రికార్డు కోసం వాడిన అరటిపండ్ల సంఖ్య సుమారు 3 లక్షలన్నమాట! ఇలా అరటిపండ్లను వరుసగా పేర్చడానికి స్టోర్ నిర్వాహకులకు 3 రోజుల సమయం పట్టిందట. ఈ రికార్డుతో బ్రెజిల్లో 2016లో 18,805.83 కిలోల అరటిపండ్లను పేర్చడం ద్వారా నమోదైన గిన్నిస్ రికార్డు తెరమరుగైంది. గిన్నిస్ ప్రతినిధులు ఈ రికార్డును ధ్రువీకరించాక ఆ అరటిపండ్లలో కొన్నింటిని సూపర్ మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులకు నిర్వాహకులు పంచిపెట్టారు. మిగిలిన వాటిని ఉత్తర ఇల్లినాయీ ఆహార బ్యాంకుకు పంపారు. The folks from @GWR have surveyed the display and it's official! We have a new WORLD RECORD! Our roving banana reporter Leslie Harris is LIVE at the @jewelosco in Westmont (@westmontilgov) with the latest fruit-related news!#Westmont #Bananas #LotsofBanans #WorldRecord pic.twitter.com/n5Qobn13YA — 95.9 The River (@959TheRiver) June 8, 2022 (చదవండి: దురదృష్టకరమైన ఘటన... గాయపడిన పక్షిని రక్షించడమే శాపమైంది) -
Summer Drinks: బనానా మిల్క్ షేక్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Summer Drink- Banana Milkshake: వేసవిలో బనానా మిల్క్ షేక్ ఉపశమనాన్ని ఇస్తుంది. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. దీనిలోని ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు దీనిని ట్రై చేస్తే బెటర్. బనానా మిల్క్‌షేక్ తయారీకి కావలసినవి: ►అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి) ►తియ్యటి పెరుగు – అరకప్పు ►చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు ►యాలకుల పొడి: అర టీ స్పూన్. బనానా మిల్క్‌షేక్ తయారీ: ►బ్లెండర్లో అరటిపండు ముక్కలు వేయాలి. ►దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►చివరలో యాలకుల పొడి కూడా వేసి మరోసారి బ్లెండ్చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి సెర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Watermelon Apple Juice: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగుతున్నారా.. అయితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
Recipes: అరటి పండ్లు, కొబ్బరి కోరు.. నోరూరించే స్వీట్ రెడీ!
అరటి పండ్లు, కొబ్బరి కోరు, పంచదార ఇంట్లో ఉంటే చాలు ఇలా సులువుగా బనానా కోకోనట్ బర్ఫీ తయారు చేసుకోవచ్చు. బనానా కోకోనట్ బర్ఫీ తయారీకి కావలసినవి: ►అరటి పండ్లు – 3 (గుజ్జులా చేసుకోవాలి) ►మిల్క్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►పంచదార పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►చిక్కటి పాలు – 1 కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి కోరు – పావు కప్పు, డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి బనానా కోకోనట్ బర్ఫీ తయారీ విధానం: ►ముందుగా పాలు కాచి.. అందులో అరటిపండ్ల గుజ్జు వేసుకోవాలి. ►చిన్న మంట మీద, బాగా ఉడికిన తర్వాత పంచదార పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడుతున్న సమయంలో మిల్క్ పౌడర్, నెయ్యి, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలుపుతూ ముద్దలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►అనంతరం డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి, బాగా చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి! చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా -
ఉత్సాహాన్నిచ్చే పోటాషియం కావాలా? బనానా కివీ స్మూతీ తీస్కో!
కావలసినవి: పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, కివి – ఒకటి, తేనె – మూడు టేబుల్ స్పూన్లు, లేత పాలకూర – కప్పు, ఆవకాడో – అర చెక్క, ఐస్‌క్యూబ్స్ – కప్పు. తయారీ: ⇔ అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి ⇔ పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ⇔ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి. దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి చదవండి👉🏻 అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం ⇔ అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరొసారి గ్రైండ్ చేసి ..గ్లాసులో పోసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ⇔తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకున్నవారికి ఈ స్మూతీ మంచి డ్రింక్ గా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి. ⇔ విటమిన్ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ⇔పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది. ⇔ అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. చదవండి👉🏼 సత్తువ పెంచే సగ్గుబియ్యం -
Summer Drinks: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే!
Summer Drinks- Gulkand Banana Milkshake: గులాబీ రేకులతో తయారు చేసే గుల్ఖండ్ను పాన్‌లో ముఖ్యమైన పదార్థంగా వాడతారు. భోజనం తరువాత ఇది మంచి మౌత్ ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. ఇక గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉండి, మొటిమలు రానివ్వవు. ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే, శరీరానికి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందించి మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఒత్తిడి, నీరసం, అలసటను తగ్గించి మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుతుంది. దీనిలో వాడిన కొబ్బరిపాలు, అరటిపండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీకి కావలసినవి అరటిపండ్లు – పెద్దవి రెండు, గుల్ఖండ్ – మూడు టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – రెండు కప్పులు, రోజ్ ఎసెన్స్ – రెండు టీస్పూన్లు, ఐస్ క్యూబ్‌లు – మిల్క్ షేక్‌కు సరిపడా. గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీ విధానం ►అరటిపండ్లను తొక్కతీసి ముక్కలు చేసి బ్లెండర్లో వేయాలి. ►దీనిలో గుల్ఖండ్, కొబ్బరి పాలు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్‌లు, రోజ్ ఎసెన్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ►ఈ మిల్క్‌షేక్ మరింత తియ్యగా కావాలనుకుంటే పంచదార లేదా ఏదైనా స్వీట్నర్, ఒక స్కూప్ వెనీలా ఐస్‌క్రీమ్ వేసి కలుపుకోవాలి. చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
అకాల వర్షం.. అపార నష్టం
రాయచోటి: జిల్లా పరిధిలో ఆదివారం సాయంత్రం అకాలంగా వచ్చిన వర్షం మామిడి, అరటి, ఇతర పండ్లతోటలకు భారీ నష్టాన్ని చేకూర్చింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన వర్షం అధికంగా కురవడంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుండుపల్లి, పీలేరు, రైల్వేకోడూరు, కేవీపల్లి మండలాల పరిధిలో మామిడి చెట్లు వేర్లతో సహా పెకలింపబడ్డాయి. రాయచోటి, చిన్నమండెం, వీరబల్లి తదితర మండలాల్లో మామిడి కాయలు భారీగా నేలరాలాయి. రైల్వే కోడూరులో 35 హెక్టార్లకు పైగా అరటి తోటలు దెబ్బతినగా, జిల్లా వ్యాప్తంగా 500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. జరిగిన నష్టంపై సోమవారం ఆయా ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికల రూపంలో ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో పిడుగు జిల్లా పరిధిలోని వీరబల్లి మండలం ఈడిగ పల్లెలో, సుండుపల్లి ప్రాంతాల్లో టెంకాయచెట్లపై పిడుగు పడి దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు నేలకూలడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాలంగా కురిసిన వర్షాలకు మామిడి, అరటి తోటల్లో నష్టం అధికం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బరువు పెరుగుతామన్న భయం లేదు.. ఈ స్మూతీ హెల్దీగా, రుచిగా..
మ్యాంగో గ్రీన్ స్మూతి.. ఉదయం ఆల్పాహారంగానూ, సాయంత్రాల్లో స్నాక్స్తోపాటు ఈ స్మూతీ తీసుకుంటే రుచిగా హెల్థీగా ఉంటుంది. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగడం వల్ల బరువు పెరుగుతామన్న భయం లేదు. మామిడిపండులో ఉన్న విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండులోని పొటాషియం, పీచుపదార్థం, పాలకూరలోని ఐరన్, విటమిన్ కే లు చర్మం, జుట్టుకు పోషణ అందిస్తాయి. మ్యాంగో గ్రీన్ స్మూతి తయారీకి కావలసిన పదార్థాలు: చల్లటి మామిడిపండు ముక్కలు – ఒకటిన్నర కప్పులు, అరటి పండు – ఒకటి, లేత పాలకూర – కప్పు, బాదం పాలు – పావు కప్పు. తయారీ: మామిడి ముక్కలు, తొక్కతీసిన అరటిపండు, పాలకూర, బాదం పాలను మిక్సీజార్‌లో వేసి మేత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే ఈ స్మూతీని సర్వ్ చేసేకుంటే చాలారుచిగా ఉంటుంది. చదవండి👉🏾 Best Calcium Rich Foods: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
Summer: పోషకాల స్మూతీ.. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది! ఇంకా
Summer Drinks- Boppayi Banana Smoothie: బొప్పాయి బనానా స్మూతీలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరాటిన్స్, విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో ఫోలేట్, పాంథోనిక్ యాసిడ్, ఖనిజ పోషకాలు పొటాషియం, కాపర్, మెగ్నీషియంలతోపాటు పీచుపదార్థం కూడా ఉంటుంది. ఈ స్మూతి తాగడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందడంతోపాటు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోలన్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. వేసవిలో తాగే స్మూతీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి బనానా స్మూతీ తయారీకి కావలసిన పదార్థాలు: పాలు – రెండు కప్పులు, తొక్కతీసిన బొప్పాయి పండు ముక్కలు – అరకప్పు, బాగా పండిన అరటి పండు – ఒకటి (ముక్కలు తరగాలి), కర్జూరపండ్లు – ఆరు, ఐస్ ముక్కలు – ఆరు, చాక్లెట్ తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ►బొప్పాయి, అరటి పండు ముక్కలను, కప్పు పాలు, ఐస్‌ముక్కలను బ్లెండర్లో వేసి స్మూత్‌గా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ►ముక్కలన్నీ మెదిగాక, కర్జూరం పండ్లలో గింజలు తీసేసి వేయాలి. ►మిగిలిన కప్పు పాలను పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాస్లో పోసి చాక్లెట్ తరుగుతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బొప్పాయి బనానా స్మూతీ రెడీ. చదవండి👉🏾 Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! -
Summer: బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ తాగితే..
Summer Drinks- Poha Banana Shake Recipe: అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం మంచిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటితో తయారు చేసే పోహా బనానా షేక్‌లో ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్ కూడా అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. పోహా బనానా షేక్ తయారీకి కావలసినవి: అటుకులు – పావు కప్పు(శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి), అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి), తియ్యటి పెరుగు – అరకప్పు, చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు. తయారీ: బ్లెండర్లో అరటిపండు ముక్కలు, నానబెట్టిన అటుకులను వేయాలి. దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి సర్వ్ చేసుకోవాలి. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. చదవండి: Healthy Weight Gain Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
అరటి రైతులకు శుభవార్త ! ఆ దేశంతో కుదిరిన ఒప్పందం
భారత్, కెనడా దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ నుంచి అరటి, బేబీ కార్న్‌లను దిగుమతి చేసుకునేందుకు కెనడా అంగీకరించింది. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, కెనడా హైకమిషనర్ కెమరాన్ మెక్‌కేల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత్, కెనడాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో తాజా అరటి పళ్లను తక్షణమే దిగుమతి చేసుకునేందుకు కెనడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సాంకేతిక అంశాల కారణంగా బేబీకార్న్ దిగుమతికి కొంత సమయం కావాలని కెనడా కోరింది. దాదాపు 2022 ఏప్రిల్ చివరి నాటికి భారత్ నుంచి కెనడాకి బేబీకార్న్ ఎగుమతులు ప్రారంభం కావొచ్చు. మన దేశంలో అరటి పంటను భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ , తెలంగాణలో వేలాది ఎకరాల్లో అరటి సాగవుతోంది. తాజాగా అరటి దిగుమతికి కెనడా అంగీకరించడంతో రైతులకు, వ్యాపారులకు కొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. -
అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం
వేరుశనగ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది అనంత. కానీ ఇప్పుడు నాణ్యమైన అరటితోనూ అనంత గుర్తింపు తెచ్చుకుంది. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇప్పటికే గల్ఫ్ లాంటి విదేశాలకు ఎగుమతి అవుతున్న ‘అనంత’ అరటి.. సమీప భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ కానుంది. సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) అనంతపురం జిల్లాను బనానా డెవలప్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాల్లో ఉద్యాన తోటలపై సర్వే నిర్వహించిన ఎన్‌హెచ్‌బీ... కొన్ని ప్రామాణికాల ఆధారంగా 12 జిల్లాల పరిధిలో 7 ఉద్యాన పంటలను గుర్తించింది. అందులో అరటికి సంబంధించి తమిళనాడులోని థేనీ జిల్లాతో పాటు ‘అనంత’కు స్థానం కల్పించడం విశేషం. మిగతా వాటి విషయానికి వస్తే... యాపిల్ క్లస్టర్లుగా షోపియాన్ (జమ్మూకాశ్మీర్), కిన్నౌర్ (హిమాచలప్రదేశ్), మామిడి క్లస్టర్లుగా లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్), మహబూబ్‌నగర్ జిల్లా (తెలంగాణా) ఉన్నాయి. అలాగే ద్రాక్ష క్లస్టర్‌గా నాసిక్ (మహారాష్ట్ర), ఫైనాపిల్ క్లస్టర్‌గా సిఫాహిజలా (త్రిపుర), దానిమ్మ క్లస్టర్లుగా షోలాపూర్ (మహారాష్ట్ర), చిత్రదుర్గ (కర్ణాటక) ఉండగా పసుపు క్లస్టర్‌గా పశ్చిమ జైంతియాహిల్స్ (మేఘాలయ)ను ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ శుక్రవారం నార్పల మండలం కర్ణపుడికి గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. రైతుల సమస్యలు, అనుభవాలు తెలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ తదితరులు ఉన్నారు. అరటి దిగుబడి, లభిస్తున్న ధర, ఎగుమతులు, సాగు పద్ధతులను తెలుసుకున్నారు. నార్పల మండం కర్ణపుడికిలో అరటి తోట పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న అభిలాక్ష్ లిఖీ అరటి రైతులకు మూడింతల ఆదాయం మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు రైతులకు మూడింతల ఆదాయం వచ్చేలా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.270 కోట్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ తెలిపినట్లు ఉద్యానశాఖ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. అందులో ఉత్పత్తి పెంపునకు రూ.116.50 కోట్లు, పంట కోతల తర్వాత యాజమాన్యం, విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం రూ.74.75 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా వసతుల కోసం రూ.78.70 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అరటి తోటలు ఎక్కువగా ఉన్న నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి తదితర ప్రాంతాల్లో నాణ్యమైన దిగుబడులు, మార్కెటింగ్ వ్యవస్థ కల్పించడానికి రైపనింగ్ ఛాంబర్లు, కోల్ట్‌స్టోరేజీలు, ఎగుమతుల పెంపు కోసం ఇతరత్రా మౌలిక సదుపాయం కల్పించే అవకాశం మెండుగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా అరటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. దీంతో భవిష్యత్తులో అరటికి కేరాఫ్‌గా ‘అనంత’ మారుతుందని అంచనా వేస్తున్నారు. క్లస్టర్ ప్రకటనతో ఎన్‌హెచ్‌బీ అధ్యయనం అనంతను అరటి క్లస్టర్‌గా ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ)కి చెందిన ఇరువురు అధికారులు బృందం గతేడాది రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించింది. అరటి తోటల సాగు, రైతుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూమి లక్షణాలు, రైతులు అవలంభిస్తున్న యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్, లభిస్తున్న ధర, నికర ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. -
Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా!
మీకు స్వీట్లంటే ఇష్టమా? హల్వా అంటే మరీ ఇష్టమా? ఎప్పుడూ ఒకేలాంటి హల్వా తిని బోర్ కొడితే.. ఈ కోవా బనానా హల్వాను ట్రై చేయండి. ఎంచక్కా లొట్టసేకుంటూ లాగించేయండి. కోవా బనానా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: కోవా – అర కప్పు అరటిపండ్లు – 3 (తొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి) బాదం గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ పంచదార – అర కప్పు నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ ముక్కలు – కొన్ని తయారీ: ►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడికానివ్వాలి. ►ఇందులో అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. ►తర్వాత పంచదార వేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. ►కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని మొత్తం నెయ్యి పూసిన బౌల్లోకి తీసుకుని చల్లారనిచ్చి, గట్టిపడిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్ ముక్కల్ని హల్వా చేస్తున్నప్పుడు లేదా పూర్తి అయిన తర్వాత జోడించుకోవచ్చు. చదవండి: అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా? -
మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?
ఉదయం లేవగానే బాల్కనీలోని మొక్కల పచ్చదనం చూస్తే భలే హాయిగా ఉంటుంది కదా. మరి అరవిచ్చిన మందారమో, విచ్చీవిచ్చని రోజా పువ్వు మొగ్గలు పలకరిస్తేనో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పువ్వుల్లో రాణి స్థానం గులాబీదే. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ , గ్రీన్, బ్లాక్ రంగుల్లో గులాబీలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గ్లాడియేటర్, సర్పంచ్, డబుల్ డిలైట్ కలర్, హైబ్రీడ్, మార్నింగ్ గ్లోరీ, సన్‌సెట్, కశ్మీర్, కాకినాడ, రేఖ, ముద్ద, తీగజాతి ఇలా పలు రకాల గులాబీలున్నాయి. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు మొగ్గలతో కళకళలాడుతూండే గులాబీ మొక్క మన గార్డెన్లో నాటిన తరువాత మొగ్గలు వేయడం మానేస్తుంది. ఆరోగ్యంగా ఎదగదు. ఒకవేళ మొక్క బాగా విస్తరించినా, పెద్దగా పూలు పూయదు. దీనికి కారణంగా మొక్కకు అవసరమైన పోషకాలు అందకపోవడమే. మరి ఏం చేయాలి. చక్కగా గుత్తులుగా గుత్తులుగా పూలతో మన బాల్కనీలోని గులాబీ మొక్క కళ కళలాడాలంటే ఏం చేయాలి. సేంద్రీయంగా ఎలాంటి ఎరువులివ్వాలి లాంటి వివరాలు తెలుసుకోవడం అవసరం. (Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?) పెరటి తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచే మొక్కలు ఏపుగా ఎదగాలన్నా, పువ్వులు విరగ బూయాలన్నా కిచెన్ కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉపయోగ పడతాయి. వీటితోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఫెర్మింటెడ్ ఫ్రూట్స్, బెల్లంతో కలిపి పులియ బెట్టిన పళ్లు, లేదా తొక్కలు ద్వారా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఫలితాలను గమనిస్తే ఆశ్చర్య పోక తప్పదు. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం మూడు పోషకాలలో చాలా. అవసరం. వీటన్నింటిలోకి రాణి లాంటిది ముఖ్యంగా గులాబీ మొక్కలకు బాగా ఉపయోగపడేది అరటి పళ్ల తొక్కలతో చేసే ఎరువు. ఈ లిక్విడ్‌ను మొక్కలకిచ్చిన వారంరోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. నైట్రోజన్ ఇతర రూపాల్లో లభించినప్పటికీ ముఖ్యమైన పొటాషియం అరటి తొక్కల ఫెర్టిలైజర్ ద్వారా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా మగ్గిన అరటి పళ్ల తొక్కలను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని, గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. దీన్ని రెండు మూడు పొంగులు వచ్చే దాకా మరిగించుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని వడపోసుకుని కుండీకి ఒక కప్పు చొప్పున గులాబీ మొక్క మొదట్లో పోసుకోవాలి. పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా ప్రమాదమేమీలేదు. కానీ మొక్కకిచ్చిన ఫెర్టిలైజర్ బయటికి పోకుండా చూసుకోవాలి. అంటే మనం అందించిన పోషకం మొత్తం వృధాకా కుండా మొక్క కందేలా చూసుకోవాలన్నమాట. వారం రోజుల్లో కొత్త చిగుర్లు, చిగుర్లతోపాటు కొత్తబడ్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మరొక విధానంలో ముక్కలుగా కట్ చేసిన అరటి పళ్ల తొక్కల్ని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత ఆ నీరును మొక్కలకు వాడవచ్చు. ఏ మొక్కకైనా పూత పిందె దశలో ఈ ఫెర్టిలైజర్‌ను అందిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలను మొక్క మొదట్లో పాతిపెట్టినా ఉపయోగమే.సేంద్రీయంగా పండించిన అరటి పళ్ల తొక్కలను ఉపయోగిస్తే మరీ మంచిది. పొటాషియం మొక్కలు కాండాన్ని బలంగా చేయడమే కాదు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుష్పించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. పండ్ల మొక్కల్లో పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది. కాల్షియం, పొటాషియం, మాంగనీసు లాంటివాటికి అద్భుతమైన మూలం అరటి తొక్కలు. ఇవి మొక్కలు ఎక్కువ నత్రజనిని తీసుకోవడానికి, కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడతాయి. -
ఆ సమయంలో బత్తాయి, కమలా బదులు అరటి, బొప్పాయి తింటే...
ఏం తింటున్నాం? దేహానికి అవసరమైన ఆహారాన్ని తింటున్నామా? జంక్‌తో పొట్ట నింపేస్తున్నామా? అనే జాగ్రత్తల వరకు చైతన్యవంతంగానే ఉంటున్నాం. కానీ మనం తిన్న ఆహారాన్ని మన దేహం సక్రమంగా గ్రహిస్తోందా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది. మాల్న్యూట్రిషన్ ఎంత ప్రమాదమో మాల్ అబ్జార్షన్ కూడా అంతే ప్రమాదకరం. మాల్ అబ్జార్షన్ అంటే అపశోషణం. తేలిక పదాల్లో చెప్పాలంటే జీర్ణాశయంలోకి చేరిన ఆహారం అక్కడ సరిగ్గా పచనం కావడం, చిన్నపేగుల్లోకి చేరిన తర్వాత ఆహారంలోని శక్తిని పేగులు పీల్చుకోవడం అనే క్రియలు సక్రమంగా జరగకపోవడం. ఆహారంలోని పోషకాలు దేహానికి అందకుండా వ్యర్థాలతోపాటు విసర్జితం కావడం అన్నమాట. సామాన్య భాషలో తిన్నది ఒంటికి పట్టకపోవడం అంటుంటాం. తినడమే కాదు, తిన్నది ఒంట పట్టిందా లేదా అనేది కూడా ముఖ్యమే. ఈ సమస్య చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అనేక అనుబంధ ఆరోగ్యసమస్యలకు కారణమవుతుంది. మొదటగా విరేచనాల రూపంలో బయటపడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగుతున్నా, తరచుగా ఎదురవుతూ ఉన్నా... దేహం శక్తిహీనం అవుతూ బరువు తగ్గడం మొదలవుతుంది. మాల్ అబ్జార్షన్కు దారి తీసే ప్రత్యక్ష కారణం జీర్ణ ప్రక్రియలో ఎదురయ్యే అంతరాయాలు. అయితే ఇందులో జీర్ణరసాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, పైత్యరసం ఉత్పత్తి తగ్గిపోవడం, ఆమ్లాల ఉత్పత్తి మితిమీరడం, చిన్న పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడం వంటి కారణాలు పరోక్షంగా ఉంటాయి. అన్నీ కలిపి తింటే ఇంతే... ఒక్కో ఆహారాన్ని జీర్ణం చేయడానికి దేహం ఒక్కో రకమైన జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏకకాలంలో పరస్పరం పొంతన లేని జీర్ణరసాల అవసరం ఏర్పడినప్పుడు జీర్ణవ్యవస్థ కొంత అయోమయానికి, సంక్లిష్టతకు లోనవుతుంది. అలాంటప్పుడు కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఇబ్బంది ఎదురవుతుంది. ఇది ప్రధానంగా డిన్నర్లలో భోజనం చేసినప్పుడు వస్తుంటుంది. రకరకాల పదార్థాలతో జీర్ణాశయాన్ని నింపేయడం వల్ల ఏ రకమైన జీర్ణరసం ఉత్పత్తి ఎంత మోతాదులో జరగాలో అనే అయోమయం ఏర్పడుతుంది. కొందరిలో అప్పటికే జీర్ణరసాల ఉత్పత్తి లోపించి ఉండడం వంటి కారణాలతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మరుసటి రోజు విరేచనాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. అలాగే బయట ఆహారం, పరిశుభ్రత లోపించిన ప్రదేశాల్లో వండిన ఆహారం తినాల్సి రావడం వల్ల కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. డయేరియా అనేది నెలలో ఒకటి లేదా రెండు సార్లు అయితే ప్రమాదకరం కాదు. కానీ ఇలా తరచూ జరుగుతుంటే దేహంలో ఇతర అవయవాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. డయేరియా వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ కోలుకునే వరకు మసాసాలు, పాలు మానేసి మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. వంటి పుల్లటి పండ్లకు బదులు అర బత్తాయి, కమలాటి, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. -
ఆ ఆలయంలో మొక్కులు ప్రత్యేకం.. అరటిగెలలు వేలాడదీసి
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): కోరిన కోర్కెలు నెరవేర్చే దైవానికి వస్తు రూపేణ, ధన రూపేణ భక్తులు మొక్కులు చెల్లించటం మామూలే. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలో వెలసిన లక్ష్మీనరసింహస్వామికి భక్తులు మొక్కులు చెల్లించే విధానం కాస్త ప్రత్యేకం. స్వామివారికి ప్రతి ఏటా అరటిగెలల ఉత్సవం నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో అరటిగెలలు వేలాడదీసి మొక్కులు చెల్లించటం ఇక్కడ ఆనవాయితీ. శనివారం జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు గెలలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. సమారు 5 వేలకుపైగా గెలలతో ఆలయ ప్రాంగణం అంతా అరటిమయం అయ్యింది. ఆలయంలో అరటి గెల కట్టిన భక్తులకు రశీదు అందజేస్తారు. రెండు రోజుల తర్వాత తిరిగి ఎవరి గెలను వారికి ఇచ్చేస్తారు. ఆ గెలను ఇంటిల్లిపాదీ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు పానకంగా తయారు చేసి పంపిణీ చేస్తారని స్థానికులు తెలిపారు. -
కుడి చేతిలో గద, ఎడమ చేతిలో ‘అరటిపండు’..
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం. తెల్ల మద్ది చెట్టే శిఖరం. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామిహనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం. స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర. భక్తుల పాలిట కొంగుబంగారం మద్ది హనుమ. మద్ది అంజన్న దర్శనం తోనే జన్మ లగ్నాత్ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక. మంగళవారం, శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం. మూడు యుగాలతో ముడిపడిన స్థలపురాణం. గర్గ సంహిత, శ్రీమద్ రామాయణం, పద్మ పురాణంలో స్థలపురాణ అంశాలు. భక్తుడి దివ్యకధకు రూపం. భక్తవరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగుబంగారం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు తో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీమద్దిఆంజనేయస్వామి వారి ఆలయం. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం (తెల్లమద్ది చెట్టు) తొర్రలో కొలువైఉన్న ఆంజనేయస్వామివారి సన్నిధి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దివ్యాలయం. ఆలయానికి వెళ్లే మార్గం : పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గం లో 48 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 (నాలుగు)కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆలయం తెరుచు వేళలు: ప్రతీ రోజూ ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తిరిగి మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:30 వరకు, ప్రతీ మంగళవారం మాత్రం వేకువజామున 5:00 గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది స్థలపురాణం : ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబందంగా స్థలపురాణం చెప్పబడింది త్రేతాయుగం: రావణుని సైన్యంలోని మద్వా సురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సు చలించి అస్త్రసన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు. ద్వాపరయుగంలో : ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జనుని రధం పైనున్న ’జండా పై కపిరాజు’ (ఆంజనేయస్వామి వారు)ను దర్శించి తన గతజన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు. కలియుగంలో : కలిలో మద్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజూ లాగునే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినవుడు, ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది. తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతీ రోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మద్వమహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్లు మీతో సపర్యలు చేయించుకున్నానా ! అని నేను పాపాత్ముడను, జీవించి ఉండుట అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. వరప్రదానం :– మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మద్వమహర్షి కోరగా మద్వా నీవు అర్జున వృక్షానివై (తెల్లమద్దిచెట్టు)ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను.నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మద్ది ఆంజనేయుడుగా కొలువైవుంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు అన్నది స్థలపురాణం. స్వప్నదర్శనం: అనంతర కాలంలో 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి స్వప్నదర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేసినా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్నవృత్తాంతం. చిన్నగా గర్భాలయం: ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. మద్ది ఒక దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. హనుమద్ దీక్షలు: ప్రతీ సంవత్సరం భక్తులు హనుమద్ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమద్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు.ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు.మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠితమూర్తులను భక్తులు దర్శించవచ్చు. ప్రదక్షిణలు: స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు,వైవాహిక బంధం లో ఇబ్బందులు ఉన్నవారు,ఆర్ధిక ఇబ్బందులు,వ్యాపారం లో నష్టాలు,ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చకస్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం. శనిదోషాలు,గ్రహదోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలు తో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మిక. ఆధ్యాత్మిక వైభవం :– సువర్చలా హనుమ కల్యాణం ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు, పంచామృతాభిషేకం ప్రతీ శనివారం, 108 బంగారు తామలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, 108 వెండి తమలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, ఇంకా నిత్యపూజలు, విశేష పర్వదినాల్లో ప్రత్యేకపూజలు, అష్టోత్తర సేవ జరుగుతాయి. కార్తీకమాసంలో నెలరోజులూ వైభవమే: కార్తిక శుద్ధ పాడ్యమి నుండి కార్తిక అమావాస్య వరకూ కార్తికం లో ప్రతీ మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చూసి తరించవలసిందే వర్ణించ వీలుకాని వైభవం. అలాగే హనుమద్జయంతి 5 రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకూ జరుగుతుండగా, పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతీదీ ప్రత్యేకమే. -
భలే రుచులు.. బనానా రైస్ కేక్, డ్రైఫ్రూట్స్ బన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఇంటి వంటలో ఉండే రుచి, ఆరోగ్యం మరి దేనిలోనూ దొరకదు. ఈ కింది స్పెషల్ రెసిపీలతో మీ కుంటుంబానికి కొత్త రుచులను పరిచయం చేయండి. బనానా రైస్ కేక్ కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు – పావు లీటర్ అరటిపండు గుజ్జు – అర కప్పు అన్నం – 2 కప్పులు పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్ బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుని చల్లారనివ్వాలి. దానిపైన అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడివేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. డ్రైఫ్రూట్స్ బన్స్ కావలసిన పదార్థాలు మైదా పిండి – 500 గ్రా. ఉప్పు – అర టీ స్పూన్ పంచదార – 3 టేబుల్ స్పూన్లు బటర్ – 100 గ్రా. పాలు – 300 గ్రా. గుడ్డు – 1 ఈస్ట్ – 1 టేబుల్ స్పూన్ (పావు కప్పు వేడినీటిలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి) దాల్చిన చెక్కపొడి – కొద్దిగా నూనె – కొద్దిగా తయారీ విధానం ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదారతో పాటు.. ఈస్ట్ జ్యూస్, 50 గ్రాముల బటర్, గుడ్డు, పాలు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా కలిపి చపాతీ ముద్దలా చేసుకుని, కొద్దిగా నూనె పూసి, 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అది పొంగుతుంది. అనంతరం మరో పది నిమిషాలు ముద్దను మరింతగా కలిపి.. కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ అప్పడాల కర్రతో పొడవుగా వెడల్పుగా ఒత్తుకుని దానిపైన మిగిలిన బటర్ రాసి.. 2 టేబుల్ స్పూన్ల పంచదార, దాల్చిన చెక్కపొడి ఒకదాని తర్వాత ఒకటి జల్లి.. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, బాదం ముక్కలు వంటివన్నీ మొత్తం జల్లి ఓ వైపు నుంచి చుట్టుకోవాలి. తర్వాత గుండ్రంగా కట్ చేసుకుని బేకింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. అనంతరం ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి.. బ్రష్‌తో బన్స్కి ఆ మిశ్రమాన్ని పూసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!
కష్టాలు అందరికీ వస్తాయి! ఐతే అవి కొందరిని ఉతికి ఆరేస్తాయి. మరికొందరేమో వాటినే ఉతకడంలో రాటుతేలిపోతారు. ఇటువంటి వాళ్లకి ఓడిపోవడం అస్సలు ఇష్టముండదు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి ఈ రెండో కోవకి చెందినవాడు. కష్టపడే తత్వం, పట్టుదల కలిగిన ఇటువంటి వారిముందు విధి సైతం తలవంచవల్సిందే! తాజాగా చూపుకోల్పోయిన వృద్ధుడి జీవనపోరాటానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తం క్లిప్ చూస్తే అతని అంకిత భావం అవగతమౌతుంది. విధి నిర్థాక్షిణ్యంగా చూపుకోల్పోయేలా చేసినప్పటికీ ప్రతిరోజూ తను చేసే పనిని మాత్రం ఆపకుండా చేసుకుపోతున్నాడండీ! దీనిని చూసిన నెటిజన్లు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. అసలీ వీడియోలో ఏముందంటే.. నాసిక్‌లోని మఖ్మలబాద్ రోడ్డు పక్కనే ఇతని అరటి చిప్స్ దుకాణం ఉంది. మరుగుతున్న నూనెలో అరటి చిప్స్ చకచకా వేసి, బాగా వేగాక వాటిని ఒక పెద్ద గరిటెతో పక్కనే ఉన్న బేసిన్లో వేస్తాడు. తర్వాత హెల్పర్ వాటిని ఉప్పుకారంతో బాగాకలిపి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్‌చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను శాన్స్కర్ స్కేమణి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఓల్డ్మాన్కి మర్యాద ఇవ్వండి. నాసిక్‌లో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వృద్ధుడు తయారు చేసిన చిప్స్ కొనమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా అతనికి తిరిగి చూపును ప్రసాదించడంలో మనమందరం సహాయపడగలం’ అనే కాప్షన్‌ను ఈ పోస్టుకు జోడించాడు. ఈ వీడియో ద్వారా అతని చూపుకోసం విరాళాలు సేకరిస్తున్నాడట కూడా. కాగా ధర్మల్ పవర్ ప్లాంట్‌లోని వేడి, ఆవిరి కారణంగా అతను చూపు కోల్పోయాడని అధికారిక సమాచారం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 12 లక్షల మంది దీనిని వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వ్యక్తి స్థితిని చూసి చలించిపోతున్నారు. అతని హార్డ్ వర్క్‌ను ప్రశంశించకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా చూడండి!! చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. View this post on Instagram A post shared by Sanskar Khemani 🐒 (@sanskarkhemani) -
Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్..
అరటిపండు తిని తొక్కపడేస్తున్నారా? అరటి తొక్కతో మీ చర్మం మెరిసేలా చేయొచ్చని తెలుసా? అవునండి! దీనిలో చర్మానికి మేలు చేసే పోషకాలు, పైటోనూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన నివేదికలో అరటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని, ఇవి సూర్యరశ్మివల్ల దెబ్బతిన్న చర్మానికి, ప్రీరాడికల్స్ నుంచి రక్షించి చికిత్సనందిస్తుందని వెల్లడించింది. పొడి చర్మానికి కూడా ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక అరటితోలుతో ఏ విధంగా చర్మాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందామా.. అరటి తోలుతో మసాజ్ ముఖాన్ని నీటితో శుభ్రపరిచి టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత అరటి తొన లోపలిభాగంతో ముఖచర్మంపై 10 నిముషాలపాటు మర్దన చేయాలి. మరోపది నిముషాలు ఆరనివ్వాలి. చివరిగా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై వాపు, ముడతలు తొలగి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అరటి తోలు ఫేస్ మాస్క్ అరటి తొక్కల్లో రెండు అరటి ముక్కలను కూడా వేసి పేస్టులా అయ్యేంతవరకూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, పెరుగు కలపాలి. అవసరమైతే రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. అరటిలోని బి6,బి12 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అనేక చర్మసమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అరటి తోలు ఫేస్ స్క్రబ్బర్ అరటి తోలును చిన్న ముక్కలుగా కట్‌చేసి, టేబుల్‌స్పూన్ చొప్పున పసుపు, చక్కెర, తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ స్క్రబ్బర్‌ను వారానికి ఒకసారైనా వాడితే చర్మంపై మృతకణాలను తొలగించి చర్మం కాంతులీనేలా చేస్తుంది. అరటి తోలు ప్యాచెస్ అరటి తొక్కను రెండు ముక్కలుగా కట్‌చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిముషాల తర్వాత బయటికి తీసి వీటిని రెండు కళ్ల మీద 15-20 నిముషాలుంచి కడిగేసుకోవాలి. ఈ ప్రక్రియ కంటి కింద నల్లని వలయాలు, ముడతలు రాకుండా నివారిస్తుంది. చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇవి తినండి.. నాజూకుగా..
నాజూకుగా.. సరైన బరువుతో.. ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అయితే, కొందరికి మాత్రం ఇది ఎప్పటికీ నెరవేరని కలలాగే మిగిలిపోతుంది. కానీ.. ఆలోచిస్తే ఆరువేల ఉపాయాలు ఉండనే ఉన్నాయిగా..! పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలతో అధికబరువుకు చెక్‌పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ 7 చక్కని మార్గాల ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. పొటాషియంతో ఎన్నో ప్రయోజనాలు.. పొటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకాహార ఖనిజం. మన శరీరంలోని కీలకమైన జీవక్రియల్లో దీని పాత్ర ఎనలేనిది. చెడు ద్రావణాల నుంచి రక్షణ కల్పించి, కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీవక్రియ సమతౌల్యానికి తోడ్పడుతుంది. గుండె, కిడ్నీలు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసేలా చూస్తుంది. ఈ అనేకానేక ప్రయోజనాలతోపాటు బరువు తగ్గడంలో కూడా పొటాషియం కీలకపాత్ర పోషిస్తుందన్నది నిపుణుల మాట. నూట్రియంట్స్ జర్నల్ ప్రచురించిన టెల్ అవివ్ యూనివర్సిటీ పరిశోధనల నివేదిక ప్రకారం శరీరంలో పొటాషియం స్థాయి పెరగడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) గణనీయంగా తగ్గుతుంది. ఆహారం ద్వారా పొటాషియం తీసుకున్న తర్వాత బీఎమ్‌ఐలో అంతకు మునుపు లేని మార్పులు కనిపించాయని అధ్యనాలు వెల్లడించాయి. కాబట్టి తగినంత పొటాషియం ఉన్న ఆహార పదార్ధాలు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. అవిసె గింజలు అవిసె గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా తినొచ్చు లేదా ఇతర మిశ్రమాలతో కలిపి ద్రావణంగా తీసుకోవచ్చు. బరువు తగ్గడ్డానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అరటి పండు సాధారణంగా ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉండదగ్గ ఫలాల్లో అరటి ఒకటి. అరటి పండులో ఐరన్, పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా ఇతర తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. మీ బరువు తగ్గించేందుకు అరటి సహాయపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అవకాడో పండు అవకాడో పండ్లు మెత్తగా, క్రీమీగా మధురమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిని గుజ్జులా చేసుకుని అనేక రకాలుగా వినియోగిస్తారు. దీనిని వివిధ రకాలైన ఆహార పదార్ధలతో కలిపి తినోచ్చు. చేప పొటాషియం మాత్రమేకాకుండా బ్రెయిన్ హెల్త్‌కు ఎంతో ఉపకరించే ఒమేగా-3 కోవ్వు ఆమ్లాలు కూడా చేపలో అధికంగా ఉంటాయి. చేపలో క్యాలరీలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బరువుతగ్గేందుకు సహాయపడే ఆహారాల్లో చేపలు ఉత్తమమైనవి. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా..? కొబ్బరి తింటే సరి! శనగలు శాఖాహారులు ప్రత్యామ్నాయంగా వినియోగించదగిన ప్రొటీన్ ఫుడ్.. శనగలు. ఒక రాత్రంతా బాగా నానబెట్టిన శనగల్లో ఇతర ఇన్గ్రీడియన్ట్స్ మిక్స్ చేసి రుచి కరమైన హమ్మస్ క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని బ్రెడ్ లేదా చపాతి తో కలిపి తినవచ్చు. మీ ఆహారంలో శనగలు చేర్చి తినడం ద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు. స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప ఆవిరిపై ఉడికించిన చిలగడ దుంపలను కొన్ని రకాల మసాలా దినుసులతో కలిపి తినవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) అధ్యయనం ప్రకారం వంద గ్రాముల స్వీట్ పొటాటోలో 337 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. కిడ్నీ బీన్స్ లేదా రాజ్మా రాజ్మాలో ప్రొటీన్లతోపాటు పొటాషియం కూడా అధిక స్థాయిలో ఉంటుంది. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ప్రతి రోజూ మీ శరీరానికి అవసరమైన 35 శాతం పొటాషియం అందుతుంది. ►ఈ ఆహారపు అలవాట్లతో మీరు కోరుకునే శరీరాకృతిని సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది. చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్ తాగారంటే.. -
అరటి పొడి సూపర్: ప్రధాని మోదీ
బెంగళూరు: కరావళి, మలెనాడులో అరటికాయను పొడి చేసి వైవిధ్య ఉత్పత్తులను తయారుచేయడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆకాశవాణి మన్ కీ బాత్‌లో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడి మహిళలు అరటికాయలు, పువ్వులతో ఎలా ఆదాయం పెంచుకోవచ్చో చాటిచెప్పారని కొనియాడారు. ఈ అరటి పొడితో దోసె, గులాబ్‌జామ్, బ్రెడ్ వంటివి తయారు చేయవచ్చు. కరోనా సమయంలో కొందరు మహిళలు కొత్తగా ఆలోచించి అరటి పొడిని తయారు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఈ బనానా రంగు, రుచి సెపరేట్!
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. వింతలు విడ్డూరాలకు కొదవేలేదు. మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. తాజాగా తియ్యతియ్యని అరటి పళ్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరటిపళ్లు ఏంటీ? గొప్పదనం ఏం ఉంది? మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అరటి పళ్లు సాదాసీదావి కావు. రంగూ రుచిలోనూ చిత్రంగా అనిపించేవే ‘బ్లూ జావా బనానా లేదా నీలం రంగు అరటిపళ్లు’. ఆగ్నేయాసియాల్లో విరివిగా పండే బ్లూ జావా అరటిపళ్లు ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలోని హవాయి, ఫిజీ వంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి. వెనీలా రుచిని కలిగి ఉండే ఈ నీలం అరటి పళ్లను బనానా ఐస్‌క్రీమ్, హవాయి బనానా అని కూడా పిలుస్తారు. మొదట్లో దక్షిణాసియా దేశాల్లోనే వీటిని ఎక్కువగా పండించేవారు. నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్ అని చెప్పవచ్చు. ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే హైబ్రిడ్ నీలం రంగు బనానా. మొదట్లో ఈ అరటిపళ్లు నీలం రంగులో ఉన్నప్పటికీ అవి పక్వానికి వచ్చాక క్రమంగా నీలం రంగు మసక బారుతుంది. సాధారణ అరటి పళ్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉండడమే గాక, ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. పైకి నీలంగా కనిపించే ఈ బనానా లోపల మాత్రం అన్నింటిలాగానే తెల్లగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న చిన్న విత్తనాలు ఉంటాయి. దీనిలో పొటాషియంతో పాటు ఇతర రకాల ఖనిజ పోషకాలు అధికంగా ఉండడం వల్ల మంచి స్నాక్‌గా దీన్నీ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును వంద గ్రాములను తీసుకుంటే దానిలో ఫ్యాట్ 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 22.8 గ్రాములు, 89 కేలరీలు ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ బనానా ఆకులను వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విచిత్ర బ్లూ బనానాను వీలైతే ఒక్కసారైనా టేస్ట్ చేసి చూడండి. l -
నూడుల్స్‌తో సమోసా ట్రై చేశారా?
నూడుల్స్ సమోసా కావలసినవి: మైదా పిండి – పావు కిలో, ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు, వాము – అర టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, ఉల్లికాడ ముక్కలుతె పాటు వాము కూడా వేసుకుని, గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ కూడా వేసుకుని కాసేపు వేయించి, బయటికి తీసి ప్లేటులో పరిచినట్లుగా వేసి... కాస్త ఆరనివ్వాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని, అందలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకుని... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ హల్వా కావలసినవి: పుచ్చకాయ జ్యూస్ – 2 కప్పులు(వడకట్టుకుని రసం మాత్రమే తీసుకోవాలి), పంచదార పొడి – రుచికి సరిపడా, మొక్కజొన్న పొడి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ ముక్కలు – అభిరుచిని బట్టి(నేతిలో వేయించినవి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో పుచ్చకాయ రసంలో పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో ఆ మిశ్రమాన్ని వేసుకుని.. చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. బాగా దగ్గర పడే సమయంలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ.. మరింత దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి.. ఒక బౌల్‌కి అడుగు భాగంలో నెయ్యి లేదా నూనె రాసి.. అందులోకి ఆ మిశ్రమాన్ని మొత్తం తీసుకుని, దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు గార్నిష్ చేసుకుని, 2 గంటల తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బనానా ఎగ్ కేక్ కావలసినవి: అరటిపండ్లు – 2(మీడియం సైజ్‌వి తీసుకుని, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 4, పంచదార, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండుద్రాక్ష, జీడిపప్పు – గార్నిష్‌కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని గుడ్లు, పాలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, వేడి చేసి, అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేయించి పక్కకు తియ్యాలి. ఇప్పుడు ఆ పాన్‌లో అరటిపండ్ల ముక్కలు వేసుకుని చిన్న మంట మీద 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పాలు–గుడ్ల మిశ్రమంలో వేసి గరిటెతో అటు ఇటుగా తిప్పి.. పంచదార, ఏలకుల పొడి వేసుకుని మరో సారి అలానే కలపాలి. ఇప్పుడు పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. గుడ్లు–అరటిపండ్ల మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసుకుని.. నేతిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని, చిన్న మంట మీద మూతపెట్టి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే బనానా ఎగ్ కేక్ రెడీ. -
అరటి కాయ ఉల్లిపాయ వేపుడు
ఇంటిలో అరటి కాయలు ఉంటే చాలు.. వంట చేసేవాళ్లకు పని చాలా సులువు అవుతుంది. కాస్త ఓపిక, మరికాస్త తీరిక ఉండాలే కానీ అరటితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మీరూ ప్రయత్నం చేసి చూడండి.. అరటి కాయ చిప్స్ కేరళ, తమిళనాడు లలో అరటి కాయ చిప్స్ వాడకం ఎక్కువ. వీరు అరటికాయ చిప్స్‌ను కొబ్బరి నూనెలో వేయించి చేస్తారు. తమిళనాడు వారు ఈ చిప్స్‌ను సాంబారులో నంచుకుని తింటారు. అల్పాహారంగా కూడా తింటారు. కావలసినవి: అరటికాయలు – 2; నూనె – అర కేజీ; మసాలా కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: అరటి కాయల పై చెక్కు తీసి, సన్నగా చక్రాల్లాగ నీళ్లలోకి తరుగుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి, పొగలు వచ్చే వరకు కాగనివ్వాలి చక్రాలుగా తరిగిన అరటికాయ ముక్కలను నూనెలో వేసి ఎర్రగా వేయించుచి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి మసాలా కారపు పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ చిప్స్‌ను వేడి వేడి అన్నంలో కూరగా లేదా సాంబారులో అప్పడాల బదులుగా నంచుకుని తినవచ్చు. అరటి కాయ బజ్జీలు కావలసినవి: అరటికాయ – 1; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; వంట సోడా – చిటికెడు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను. తయారీ: అరటి కాయల తొక్కు తీసి, సన్నగా చక్రాల్లా తరిగి, ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, మిరపకారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరీ మేథీ, వంట సోడా వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అరటి కాయ చక్రాలను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండువైపులా దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి చాకుతో బజ్జీలను ఒక వైపు సన్నగా కట్‌చేయాలి మూడు పల్లీలు, ఉల్లి తరుగు స్టఫ్ చేసి, పైన నిమ్మరసం కొద్దిగా వేయాలి వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి. అరటి కాయ ఉల్లిపాయ వేపుడు కావలసినవి: అరటి కాయలు – 3 (పై చెక్కు తీసుకుని నీళ్ళల్లో కాయలను ముక్కలుగా తరుగు కోవాలి); పెద్ద ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి); మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – వేయించటానికి తగినంత; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; వేయించిన పల్లీలు – గుప్పెడు; పుట్నాల పప్పు – గుప్పెడు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4. తయారీ: పల్లీలు, పుట్నాలపప్పు, జీలకర్ర, ఎండు మిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో సుమారుగా 50 గ్రాముల నూనె పోసి, కాగాక, తరిగిన అరటికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి ఓ పదిహేను నిముషాలు ముక్కలు మెత్త పడే వరకు మగ్గనివ్వాలి మధ్యలో ముక్కలను అట్లకాడతో కలుపుతుండాలి చివరలో తగినంత ఉప్పు, కారం, పల్లీల మిశ్రమం పొడి వేసి మరో మూడు నిముషాలు ఉంచి దింపుకుని, వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ వేపుడు అన్నంలోకి రుచిగా ఉంటుంది. అరటి కాయ పచ్చడి కావలసినవి: అరటి కాయలు – 2; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చిమిర్చి – 4 (చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి); కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – ఒక చిన్న కట్ట (సన్నగా తరగాలి). పోపు కోసం: నూనె – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; మినప్పప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; ఇంగువ – కొద్దిగా ; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత. తయారీ: అరటికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేలా తుడవాలి స్టౌ వెలిగించి మంట కొద్దిగా తగ్గించి, అరటికాయలు మెత్తగా అయ్యేవరకు కాల్చి తీసేయాలి చేతులు తడి చేసుకుంటూ అరటి కాయల పై చెక్కు తీసేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించి దింపి చల్లారనివ్వాలి మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేసుకోవాలి కాల్చి, తొక్క తీసిన అరటి కాయలు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ఉల్లి తరుగు, మిగిలిన పోపు, కొత్తిమీర జత చేసి, చేతితో బాగా కలుపుకుని, గిన్నెలోకి తీసుకోవాలి (పచ్చి అరటికాయలనే వాడాలి. కొద్దిగా పండినా పచ్చడి రుచి మారిపోతుంది) అరటి కాయ పెసర పప్పు పొడి కూర కావలసినవి: అరటి కాయలు – 4; పెసరపప్పు – ఒక కప్పు; పసుపు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నూనె – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; మిరపకారం – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు నూనె – తగినంత; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి). తయారీ: ముందుగా అరటి కాయల పై చెక్కు తీసీ, ఉప్పు వేసిన నీళ్లలోకి ముక్కలు తరుగుకోవాలి ఒక గిన్నెలో పెసరపప్పు వేసి, బాగా కడగాలి అరటికాయ ముక్కలు, తగినన్ని నీళ్లు జత చేసి, గిన్నెను స్టౌ మీద ఉంచి ఉడికించి (ఉడికించేటప్పుడు ఉప్పు వేయకూడదు) దింపేయాలి నీటిని వడ కట్టుకుని ముక్కలపై పావు స్పూను పసుపు వేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, వరుసగా ఎండు మిర్చి ముక్కలు , మినపప్పు , జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక, పచ్చి మిర్చి ముక్కలు కూడా పోపులో వేసుకుని రెండు నిముషములు వేయించుకోవాలి ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అరటి కాయ పెసరపప్పు మిశ్రమాన్ని పోపులో వేసుకోవాలి ఉప్పు, మిరప కారం జత చేసి, బాగా కలియబెట్టి, మూత పెట్టాలి మధ్యమధ్యలో అట్లకాడతో కదుపుతూ మరో ఐదు నిముషాలు ఉంచి, దింపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ కూర అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. అరటి కాయ మసాలా కూర కావలసినవి అరటికాయలు – 2; చింతపండు – నిమ్మకాయంత (పావు గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; నూనె – 4 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – చిన్న కట్ట.మసాలా కోసం: ఎండు మిర్చి – 5; ధనియాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; లవంగాలు – 5; (వీటన్నిటినీ కూర చేయటానికి గంట ముందు, పావు గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి). తయారీ: అరటి కాయల పై చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలుగా తరిగి, ఆ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద మెత్తగా ఉడికించి నీళ్ళు వార్చుకోవాలి ఉడికిన ముక్కలపై పావు స్పూను పసుపు వేసుకోవాలి ముందుగా నానబెట్టిన ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలకు తగినంత ఉప్పు, చింతపండు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఉల్లి తరుగును కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి మసాలా ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ ముక్కలను వేసి మూతపెట్టి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి సిద్ధంగా ఉంచుకున్న మసాలా జత చేసి, మరో ఐదు నిముషాలు మసాలా పచ్చివాసన పోయేవరకు ఉంచాలి కొత్తిమీరతో అలంకరించి, కూరను గిన్నెలోకి తీసుకోవాలి చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది (ఈ కూరను వేడివేడిగా తింటేనే బాగుంటుంది. మరీ చల్లారితే కూర గట్టిపడి రుచిగా ఉండదు). అరటి కాయ తీపి కూర కావలసినవి: అరటి కాయలు – 3; పచ్చి మిర్చి – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); అల్లం – చిన్నముక్క; కరివేపాకు–3 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; చింతపండు రసం – ఒక టేబుల్ స్పూను (చిక్కగా ఉండాలి); బెల్లం తరుగు – ఒక టేబుల్ స్పూను ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె – 5 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – పావు టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ∙అరటి కాయలు కడిగి పై చెక్కు తీసి, ముక్కలు చేయాలి ∙ఒక గిన్నెలో అరటికాయ ముక్కలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి, ముక్కలను మెత్తగా ఉడికించాక, నీళ్లను వడకట్టి, ముక్కల పైన పసుపు వేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, వరుసగా ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి పోపును బాగా వేగనివ్వాలి (పచ్చి మిర్చి పోపులో మగ్గితే కూరకి కారం పడుతుంది) ∙ఉడికించిన అరటికాయ ముక్కలు పోపులో వేసి, ఉప్పు, చింతపండు రసం, బెల్లం తరుగు జత చేసి పది నిముషాలపాటు మూత పెట్టి కూరను మగ్గనిచ్చి (మధ్యలో కూరను కదుపుతుండాలి) ఉడికిన తరవాత గిన్నెలోకి తీసుకోవాలి. అరటి కాయ ఉప్మా కూర కావలసినవి: అరటి కాయలు – 3; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేసుకోవాలి); అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – కొద్దిగా; ఇంగువ – తగినంత; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 10. తయారీ: అరటికాయలకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించి దింపేయాలి చల్లారాక అరటికాయల మీద తొక్కు తీసేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి జీడి పప్పు వేసి దోరగా వేగిన తరవాత, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ఉడికించిన అరటి కాయ ముక్కలు వేసి గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి కొత్తిమీరతో అలంకరించి, కూర దింపేయాలి (అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది) -నిర్వహణ: వైజయంతి పురాణపండ - కర్టెసీ: ఆలూరు కృష్ణప్రసాదు -
ఈ ‘బనాన గర్ల్’ డైటేమిటంటే....
ఆమె అసలు పేరు లియాన్నె ర్యాట్‌క్లిఫ్. పాతికేళ్ల వయస్సులో అందరిలాగే ఆమె బొద్దుగా ఉండేది. ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో సన్నని నడుముపైన చెంచాడు కొవ్వు కూడా లేకుండా ముద్దుగా తయారయింది. అప్పుడు ఇష్టంగా మూడు పూటలు మాంసాహారం తినేది. ఇప్పుడు అంతకంటే ఇష్టంగా శాఖాహారమే తింటోంది. అది కూడా వండి వడ్డించిన ఆహారం కాకుండా పండ్లు, పచ్చి కాయగూరలనే తింటోంది. దాదాపు 14 ఏళ్లుగా ఆమె తీసుకుంటున్న డైట్ ఇదే! అందుకే ఆమె అప్పటికి, ఇప్పటికి 18 కిలోలు తగ్గారట. ర్యాట్క్లిప్ ప్రతిరోజు ఉదయం అల్పాహారం కింద సగం పుచ్చకాయ తింటుంది. మధ్యాహ్నం లంచ్ కింద నాలుగు అరటి పండ్ల ముక్కలు, ఓ బొప్పాయి కాయ, రెండు అంజిరా పండ్లను పోలిన టర్కీ పండ్ల ముక్కలను పాలులేకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్‌తో కలిపి తింటుంది. అప్పుడప్పుడు పీనట్ బటర్‌తో ఈ పండ్ల ముక్కలను కలుపుకొంటుంది. ఇక రాత్రి పూట వివిధ రకాల కూరగాయ ముక్కలను కొబ్బరి చట్నీలో అద్దుకొని తింటుంది. ఆమె రోజు తినే ఆహారం మొత్తం కలసి 2,700 కాలరీలు మాత్రమే. అరటి పండులా పై నుంచి కింది వరకు ఒకే తీరుగా ఉంటుందనో లేక రోజూ అరటి పండ్లు తింటుందనో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు ఆమెను ‘బనాన గర్ల్’ అని పిలుస్తున్నారు. ర్యాట్క్లిప్కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జన్మించిన బనాన గర్ల్ సెప్టెంబర్ 19వ తేదీన తన 40వ పుట్టిన రోజు జరుపుకొని ఆ సందర్భంగా తన ఆహార అలవాట్లకు సంబంధించి తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నేటి వరకు దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. మాంసహారిగా బతికిన తాను శాకాహారిగా ఎలా మారిందో కూడా బనాన గర్ల్ వివరించారు. ‘చచ్చిన జంతువులను తినడమంటే వాటిని పాతి పెట్టడమే గదా! అంటే మన కడుపును శ్మశానంగా మార్చడమే గదా! అందుకని శాకాహారిగా మారాను. మాంసాహారంలో లభించే ప్రోటీన్లు శాకాహారంలో కూడా ఉంటాయని ఆమె చెప్పారు. ‘అదంతా సరేగానీ, మీరు తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువగా సుగరే ఉంటుంది. సుగర్ ఎక్కువగా తింటూ శరీరాన్ని ఇలా ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమెకు చురకలంటిస్తోన్న వారు లేకపోలేదు. -
కరోనా కాలంలో ఈ పండ్లు తింటే బేఫికర్!
పానీపూరీలు ఎప్పుడైనా తినొచ్చు.. ప్రస్తుతానికి నాలుగు నేరేడు పండ్లు పొట్టలోకి పంపుదాం. నూడుల్స్ రుచి తర్వాతైనా ఆస్వాదించవచ్చు.. ఇప్పటికి బత్తాయిల పని పడదాం. చాట్లు, బజ్జీలు చలికాలంలో తినొచ్చులే.. ఈ రోజుకు ద్రాక్ష, ఖర్జూరాలతో జిహ్వను ఊరుకోబెడదాం. సూపు బదులు నిమ్మరసం, సాధారణ టీ బదులు హెర్బల్ టీ.. కుండలో నీరు బదులు కాస్తంత అల్లం కలిపిన వేడినీరు. ఇలా చిన్న చిన్న మార్పులతో కరోనా కాలంలో వ్యాధి నిరోధక శక్తిని ఎంతో పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు సైతం ఫలాలతో ప్రతిఫలాలెన్నో అంటూ సామాజిక మాధ్యమాల్లో వివరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఏ పండులో ఏముందో తెలుసుకుందాం.. నేరేడు పండ్లు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా లభించే పండ్ల జాతుల్లో నేరేడు పండ్లది అగ్రస్థానం. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి, శుభ్రపరచడానికి ఇవి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్న సమయంలో ధనియాలు రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడురసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపితీసుకోవాలి. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్. జింక్, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. బొప్పాయి.. బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్లు మరే పండ్లలో లేవని వైద్యులు అంటారు. విటమిన్ ఎ, బీ, సీ, డీలు తగిన మోతాదులో ఉంటాయి. తరచూ బొప్పాయిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్పిన్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేస్తుంది. బొప్పాయి తినడం ద్వారా శరీరం ఉల్లాసంగా కూడా కనిపిస్తుంది. ఖర్జూరం.. ఏ పండైనా పండుగానే బాగుంటుంది. ఖర్జూరం మాత్రం ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలో నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది. సంప్రదాయ ఫలంగా కూడా ఖర్జూరానికి చాలా మంచి పేరుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేషం లాంటి వాటికి ఈ పండు గుజ్జు, సిరప్ మంచి ప్రయోజనకారి. పుచ్చ(వాటర్ మిలన్) వాటర్‌మిలన్(పుచ్చ) చాలా మందికి ఇష్టమైన పండ్ల జాతి. వేసవిలో వీటి వినియోగం ఎక్కువ. ఎండలో దాహార్తిని తీర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చేది పుచ్చకాయలే. వీటిని కాయలే అని అంటున్నప్పటికీ పండు మాత్రమే తినేందుకు ఉపయోగపడుతుంది. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. పనస పండ్ల జాతిలో అతి పెద్ద ఫలాలు ఇచ్చేది పనస చెట్టు మాత్రమే. ఒక పనసపండు 36 కిలోలు వరకూ కూడా ఉంటుంది. వైద్యపరంగా జీర్ణశక్తిని పనస పండు మెరుగుపరుచుతుంది. మలబద్దకం నివారిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్ సి ఉన్నందున వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నివారణకు ఎంతో సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయి. కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నిషీయం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు పనసలో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ దానిమ్మ పండ్ల ద్వారా శరీరానికి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. సంతాన సౌఫల్యతను పెంచే శక్తి దానిమ్మపండ్లలో ఉంది. నారింజ నారింజ పండ్లలో రెండు రకాలు ఉన్నాయి. పుల్ల నారింజ, తీపి నారింజ, పుల్ల నారింజకాయలో నీరు అధికంగా ఉంటుంది. నారింజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కరోనా కట్టడికి బాగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలో దోహదపడుతుంది. గుండె బాగా పని చేసేటట్లు చేస్తుంది. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. నారింజలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. మామిడి.. మామిడిని పండ్ల రాజు అంటారు. మామిడిలో 15 శాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, తగిన శాతంలో విటమిన్ ఎ, బి, సి లతో పాటు కాల్షియం ఉంటుంది. మామిడి పండ్ల తినడం ద్వారా రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టవచ్చు. మామిడిపండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. యాపిల్ పెక్టిన్ దండిగా ఉండే యాపిల్ పండ్లను తినడం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య వృద్ధి చెందుతుంది. యాపిల్‌లో కొవ్వు పదార్థాలు అత్యల్పంగా ఉంటాయి. పొటాషియం అధికంగా, విటమిన్ సి అధికంగా ఉంటుంది. పైనాపిల్.. సీతంపేట: జిల్లాలో అత్యధికంగా దొరికే ఫలాల్లో ఒకటి పైనాపిల్. మనకు చాలా సులభంగా దొరికే ఈ పండ్లతో ఎన్నో లాభాలుంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్‌లో ఉండే పొటాషియం, సోడియం నిల్వలు ఒత్తిడి, ఆందోళనల నుంచి రక్షణ ఇస్తాయి. మలబద్దకం, పచ్చకామెర్ల వంటి వ్యాధులకు పైనాపిల్ దివ్యమైన ఔషధం. ఇందులో నీరు 87.8 గ్రాములు, ప్రొటీన్లు 0.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రాములు, పిండి పదార్థం 10.8 గ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు, పాస్పరస్ 9 మిల్లీగ్రాములు, ఇనుము 2.4 మిల్లీగ్రాములు, సోడియం 34.7 మిల్లీగ్రాములు, పొటాషియం 37 మిల్లీగ్రాములు, మాంగనీస్ 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయని సీతంపేట వైద్యాధికారి నరేష్కుమార్ తెలిపారు. అరటిపండ్లు అరటి పండ్లలో 74 శాతం కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23 శాతం కార్బో హైడ్రేట్లు, 1 శాతం ప్రోటీనులు, 2.6 శాతం పైబరు ఉంటుంది. అరటి చాలా శక్తిదాయకమైనది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా మంచిది. శరీరంలో విష పదార్థాలను అరటిపండు తినడం ద్వారా తొలగించుకోవచ్చు. ద్రాక్ష.. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో కూడా ద్రాక్ష సాగు ఉంది. ఇండ్లపై వీటిని పెంచుతున్నారు. వీటి వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల్లబద్దకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. విటమిన్ సి, కే ఎక్కువ. కిస్మిస్లు కూడా అంతులేని ఖనిజాలను అందిస్తాయి. -
ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమే
సీజన్‌తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ లభించే పండు అరటి. ఈ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. అరటి పండు తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ బరువు తగ్గేందుకు ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తోందని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అరటి ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ తీసుకునే ఆహరంలో కనీసం ఒక అరటిపండు చేర్చడం వల్ల ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే వీటి ధర కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి ప్రతిరోజు వీటిని స్వీకరించవచ్చు. (బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ ఒక్కటి చేస్తే చాలు) అరటితో ప్రయోజనాలు ఉదయం అరటిపండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అరటిలో శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అరటి పండ్లలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉంటాయి. పరగడపున అరటి తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. తిన్న తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. కడుపులో పుండ్లకు అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అరటి శక్తి సంపదగా పనిచేస్తుంది. జీర్ణాశయాన్ని మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంలో.. అల్సర్లను తగ్గించడంలో అరటి పండు కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల బలహీనతను నివారించడంలో సహకరిస్తుంది. (కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..) పండిన అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. డయేరియాతో బాధపడేవారు ఇవి తింటే మంచిది. అరటి పండు కండరాలు పట్టివేయడాన్ని, కీళ్ళ నొప్పిని నివారిస్తుంది. అరటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. దీనికి అరటిలో ఉంటే ఫైబర్ కారణం. కాబట్టి అతిగా ఆహారం తీసుకోవడం తగ్గించవచ్చు. వ్యాయాయం తర్వాత అరటి పండు తీసుకోవడం వల్ల వర్కౌట్ల సమయంలో కలిగే నొప్పిని తగ్గిస్తుంది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిన్లో ప్రచురించబడిన అధ్యయనంలో ఇది తేలింది.అరటిపండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తరచూ అనారోగ్యానికి గురికావడం తగ్గిస్తుంది. (పరగడుపున కరివేపాకు నమిలారంటే..) అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కటి నిద్రపట్టేలా చేస్తాయి. నిద్రిస్తున్నపుడు రక్తపోటుని అరటి పండు నియంత్రిస్తుంది. అరటిలోని పొటాషియం శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అరటి పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. క్యాన్సర్, ఉబ్బసం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. (వారంలో ఏడు కిలోల బరువు తగ్గాలంటే..) ఇక అరటితో ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా లాభాలు పుష్కలంగా ఉన్నాయి. అరటి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. బాగా మగ్గిన అరటి పండును మెత్తగా చేసి కొద్దిగా తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అరటి రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. మగ్గిన అరటి పండును నలిపి మాడుకు, జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల ఆగాక షాంపూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. (కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా) -
మూసీ పరీవాహకంలో అరటిసాగు?
మూసీ పరీవాహకంలో కలుషిత నీటితో పండించే పంటలు తినడం వల్ల కేన్సర్ వంటి భయానక వ్యాధులు సంభవిస్తుండడంతో ప్రత్యామ్నాయంగా అరటి తోటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం.. అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రైతులు, వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి గురువారం జరిగే సీఎం సమావేశానికి సిద్ధమైంది. కంది, పత్తికి సైతం ప్రాధా న్యమివ్వనుండడంతో వరి సాగు తగ్గే అవకాశముంది. సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సమగ్ర రైతు విధానంపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమీక్ష కోసం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తల అభిప్రాయాల మేరకు భూసారాన్ని బట్టి పండే పంటలను గుర్తిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పండించే వరికి బదులుగా కంది, పత్తి ఎక్కువగా సాగయ్యేలా చూడాలని, మూసీ పరీవాహకంలో అరటితోటలు వేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతులు, వివిధ వర్గాల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతస్థాయి యంత్రాంగం సీఎం సమీక్ష సమావేశానికి హాజరై ప్రతిపాదనల నివేదిక అందజేయనున్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లా పరిధిలో రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల మూసీ జలాలు కలుషితమవుతున్నాయి. కలుషిత జలాల కారణంగా భూసారం కోల్పోవడమే కాకుండా పంట ఉత్పత్తులను తినడం వల్ల కేన్సర్ వంటి భయానక రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఇందులో 95వేల ఎకరాలు దొడ్డురకం, 35ఎకరాల్లో సన్న రకాలను పండించారు. ఇందులో అత్యధికంగా 70వేల ఎకరాల్లో మూసీపరివాహకంలోనే సాగవుతుంది. అయితే విషతుల్యమైన మూసీ ఆయకట్టులో వరిసాగును తగ్గించి అరటితోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే మూసీ పరీవాహకంలో భూమి కూడా అరటితోటలకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో భువనగిరి పరిసరాల్లో తమలపాకు తోటలు పెద్ద ఎత్తున పెంచేవారు. ఇక్కడి తమల పాకులకు అత్యంత డిమాండ్ ఉండేదని రైతులు చెబుతుంటారు. దీని దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. పత్తి, కంది పంటలకూ పెద్దపీట జిల్లాలో వరి విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానంలో పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈమేరకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో గత సీజన్లో 1.60లక్షల ఎ కరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సీజన్లో రెండు లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరి సాగుకంటే అధి కంగా పత్తిని ఇప్పటికే సాగు చేస్తున్నారు. అలా గే 27వేల ఎకరాల్లో సాగు చేసిన కందిని 50వేల ఎకరాలకు పెంచే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లాలో 2019 వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి3,37,812ఎకరాల్లో సాగు చేయగా, 2020 వానాకాలం సీజన్లో 3,54,750 ఎకరాల్లో వ్య వసాయ సాగు అంచనా వేసింది. అయితే మా రిన ప్రభుత్వ విధానం నేపథ్యంలో వరిసాగును తగ్గించి పత్తి, కందిసాగును పెంచే దిశగా చర్యలు చేపడుతుంది.జిల్లా యంత్రాంగం తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. -
హ్యాట్యాఫ్ పోలీస్ సాబ్..
-
డజన్ అరటి పండ్లు రూ.5లే
వైఎస్ఆర్ జిల్లా,అగ్రికల్చర్: జిల్లాలోని రైతు బజార్లలో శుక్రవారం నుంచి డజన్ అరటిపండ్లు రూ.5లకు, గెల రూ.50–60లకు విక్రయించనున్నట్లు ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె,బద్వేలు రైతు బజార్లలో ఈ అమ్మకాలు సాగుతాయని.. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
శ్మశానంలో కుళ్లిన అరటిపండ్లను తింటూ..
న్యూఢిల్లీ: ఆకలి రుచి ఎరుగదు అంటారు. నిజమే, ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులకు శ్మశానంలో పారబోసిన కుళ్లిన అరటిపండ్లే ఆహారమయ్యాయి. ఈ దయనీయ ఘటన బుధవారం ఢిల్లీలోని యమునా నదీ తీరంలో జరిగింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లోని శ్మశానంలో కొందరు తినడానికి పనికి రానివి, కుళ్లిన స్థితిలో ఉన్న అరటిపండ్లను పడేసి పోయారు. ఇది లాక్డౌన్ వల్ల స్వస్థలాలకు వెళ్లలేక, యమునా నదీ తీరం దగ్గరే చిక్కుకుపోయిన వలస కార్మికుల కంట పడింది. తిండీనీళ్లు లేక అలమటిస్తున్న వాళ్లు వెంటనే ఆ శ్మశానంలోని అరటిపండ్లను ఏరుకోవడం ప్రారంభించారు. (‘యమున’ సాక్షిగా పస్తులు) అక్కడే బ్యాగులో అరటిపండ్లను నింపుకుంటున్న ఓ వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ.. "అరటిపండ్లు అంత త్వరగా చెడిపోవు. మంచివి ఏరుకుంటే కొద్ది కాలమైనా మా ఆకలి తీర్చేందుకు ఉపయోగపడతాయి" అని పేర్కొన్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన ఓ వలస కార్మికుడు మాట్లాడుతూ.. "మాకు సరిగా తిండి పెట్టడం లేదు. కాబట్టి వీటిని తీసుకొని జాగ్రత్తపడటమే మంచిది. రెండు రోజులు కడుపు మాడిన తర్వాత ఈరోజు ఆహారం దొరికింది" అంటూ తమ దయనీయ పరిస్థితిని వెల్లడించాడు.(కరోనా: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 60 వేలమంది) -
తొక్కే కదా అని తీసిపారేయకండి...
అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. బయట ఎక్కువగా తీరుతున్న వారికి చర్మంపై దుమ్ముచేరి, కమిలిపోతుంది. అలసటకు కూడా గురవుతారు. అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. బొప్పాయి గుజ్జుతో ఫేసియల్ చేయడం అందరికీ తెలుసు. వీటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని కూడా ప్యాక్ గా వేసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. యాపిల్ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. నారింజ తొక్కలు కూడా సున్నిపిండిలో వేసి మర పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది. దీన్ని కూడా నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. అలాగే తొక్కల గుజ్జుతో ప్యాక్ చేసుకుంటే నల్లని మచ్చలు, కంటికింద వలయాలు తగ్గుతాయి. నిద్రనుంచి లేచినప్పుడు కొందరి ముఖం ఉబ్బి పోతుంది. ఇది తగ్గాలంటే బంగాళా దుంప తొక్కలు ఉడికించిన నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన చర్మం మామూలుగా అయిపోతుంది. అలాగే ఉడికిన తొక్కల్ని ప్యాక్ గా చేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది. -
'తొక్క'తో బోలెడు ప్రయోజనాలు
అరటిపండులో పోషకాలు మెండు. పండును తినేసి తొక్కను పడేస్తుంటాం. కానీ, వస్తువుల వాడకంలో అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుంటే పడేయడానికి ఇక చెత్తబుట్టను వెతకాల్సిన పనిలేదు. ♦ స్టీల్, వెండి వస్తువులపై మరకలు పోవడానికి, డిష్వాషర్ సోప్ రసాయనాలను తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి. సేంద్రీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు నాన్‌స్టిక్ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్ త్వరగా పోదు. ♦ దుమ్ము లేకుండా తడి క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత అరటిపండుతొక్కతో రుద్దితే షూ శుభ్రపడి, మెరుస్తాయి. ♦ కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు, గీతలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి ∙ఇంకు మరకలు పోవాలంటే అరటిపండు తొక్కతో రుద్ది, కడగాలి.