అరటికాయ బజ్జీల గురించి విని ఉన్నాం. కానీ అరటి పండుతో కూడా బజ్జీలు వేసుకోవచ్చట. ఇదేంటి పండుతో బజ్జీనా..!అనుకోకండి. చక్కగా బజ్జీలు చేసి తినేయొచ్చట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అరటి గెలను కోసుకొచ్చి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశారు. వారు గెలతో సహా ఆయిల్‌లో వేయించారు. ఆ తర్వాత ఆ గెలను ఆయిల్ నుంచి తీసేసి చక్కగా పళ్లు, గెలను వేరు చేశారు.
ఆ తర్వాత ఒక్కో అరటి పండును వొలిచి చక్కగా ఓ పాలిథిన్ పేపర్‌పే పెట్టి మెదిపి దాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న పిండి బేటర్‌లో ముంచి చక్కగా బజ్జీలు మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అరటి పండ్ల బజ్జీ రెడీ..!.అబ్బా ఇలా కూడా అరటిపండ్లతో బజ్జీలు చేసుకోవచ్చా అని అనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి.
(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?)
Comments
Please login to add a commentAdd a comment