Deep
-
ఆనంద్ గ్రూప్ ఫౌండర్ కన్నుమూత
ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఆనంద్ సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నారు. యూకేలోని చిపెన్హామ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్‌గా 1954లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్, గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్‌మాంట్ కార్పొరేషన్‌తో కలిసి ఆయన స్థాపించారు.తరువాతి దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన అగ్ర ఆటోమోటివ్ సంస్థలు ఎన్నింటితోనో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆనంద్ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్ గ్రూప్ టర్నోవర్ రూ. 9,000 కోట్లు. -
ఇది ఫేస్ డీప్ క్లీనింగ్ డివైస్..! ప్రయాణాల్లో..
స్కిన్ కేర్‌లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్‌తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్‌తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్‌పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్‌తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్‌ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్‌కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్‌ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్‌ని వాడుకోవచ్చు.ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్‌ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. -
అరటిపండ్లతో బజ్జీ ఎప్పుడైనా ట్రై చేశారు?
అరటికాయ బజ్జీల గురించి విని ఉన్నాం. కానీ అరటి పండుతో కూడా బజ్జీలు వేసుకోవచ్చట. ఇదేంటి పండుతో బజ్జీనా..!అనుకోకండి. చక్కగా బజ్జీలు చేసి తినేయొచ్చట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అరటి గెలను కోసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు. వారు గెలతో సహా ఆయిల్లో వేయించారు. ఆ తర్వాత ఆ గెలను ఆయిల్ నుంచి తీసేసి చక్కగా పళ్లు, గెలను వేరు చేశారు. ఆ తర్వాత ఒక్కో అరటి పండును వొలిచి చక్కగా ఓ పాలిథిన్ పేపర్పే పెట్టి మెదిపి దాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న పిండి బేటర్‌లో ముంచి చక్కగా బజ్జీలు మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అరటి పండ్ల బజ్జీ రెడీ..!.అబ్బా ఇలా కూడా అరటిపండ్లతో బజ్జీలు చేసుకోవచ్చా అని అనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Crispyfoodstation (@crispyfoodstation) (చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
వచ్చే ఏడాదే ‘సముద్రయాన్’: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్‌కు సముద్రయాన్ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఈ ఏడాది ఆఖరుకల్లా పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని వెల్లడించారు. సముద్రయాన్‌కు 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మత్స్య6000’ జలాంతర్గామిలో ముగ్గురు పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖర్లో హిందూ మహాసముద్రంలో వారు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి. -
అలా చేయడం తప్పు, అందుకు ఇదే ఒక ఉదాహరణ: రష్మిక
హీరోయిన్ రష్మికా మందన్నా అంటూ మార్ఫింగ్ చేసిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు. నన్ను అభిమానిస్తూ, నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అలాగే ఇలాంటి ఘటనలకు (మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను ఉద్దేశించి) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిలు... అబ్బాయిలు... ఎవరైనా కావొచ్చు. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, దుర్వినియోగం చేయడం అనేవి తప్పు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారీ బ్యూటీ. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్‌లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్‌గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్‌కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్‌లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్‌ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్‌తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్‌కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్‌ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
కార్తీక దీపం.. శోభాయమానం (ఫొటోలు)
-
హృదయ విదారక దృశ్యం: నడుము లోతు నీళ్లలోనే అంతిమ వీడ్కోలు!
బెంగళూరు: కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని కోడ్లు గ్రామం వర్షాం వస్తే చాలు జలమయం అయిపోతుంది. ఐతే ఆ సమయంలో ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఏ వ్యక్తి అయిన చనిపోతే వారిని శ్మశానానికి తీసుకువెళ్లడం గ్రామస్తులకు ఒక సవాలుగా ఉంది. పైగా అక్కడ నివాసితులు వర్షకాలం అంటేనే చాలా భయపడతారు. శ్మశాన వాటిక రహదారులన్ని ఈ వర్షాకాలం ముంపునకు గురై శవాలను తరలించడం అత్యంత కష్టంగా ఉంటుంది ఈ మేరకు ఆ కోడ్లు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే నడుమ లోతు నీళ్లో శవాన్ని తీసుకువెళ్తున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వర్షాకాలం వస్తేనే చాలు ఈ గ్రామంలోని రోడ్డన్నీ నీళ్లతో నిండిపోతాయని, పరిష్కారం కోసం ఎన్నో నెలలుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సహాయం అందించడంలేదని వాపోయారు. పైగా ఇది రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గ్రామం. (చదవండి: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ అందజేసిన ప్రకాశ్ రాజ్) -
అమెరికా అతలాకుతలం
-
తీవ్రవిషాదాన్ని నింపిన వాయుగుండం
-
గతంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన గోతులివే!
-
చిత్రావతిలో భారీ గొయ్యి.. సంచలనం
పుట్లూరు: అనంతపురం జిల్లాలో అకస్మాత్తుగా ఏర్పడిన భారీ గొయ్యి సంచలనం సృష్టిస్తోంది. చిత్రావతి నది సమీపంలో భారీ శబ్దంతో గురువారం రాత్రి పెద్ద గొయ్యి ఏర్పడింది. పుట్లూరు మండలం లక్ష్ముంపల్లి గ్రామ సమీపంలోఈ గొయ్యి ఏర్పడింది. చూసేందుకు భారీ సైజున్న బావిలా కనిపించడంతో జనం ఏం జరిగిందోనని తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. అర్ధరాత్రి పెద్ద శబ్దం రావటంతో లక్ష్ముంపల్లి గ్రామస్తులు ఏదో జరిగిందని హడలిపోయారు. ఉదయం.. నిద్రలేచిన తర్వాత.. ఈ భారీ గొయ్యిని చూసిన జనం షాక్ తిన్నారు. మొదట చిన్నదిగా ఏర్పడ్డ ఈ గొయ్యి క్రమంగా పెరుగుతండటంతో.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జియాలజీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో భారీ గొయ్యి కలకలం!
-
మృత్యుంజయుడు
పరవాడ: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ చిన్నారి ఒక రైతు సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో మృత్యుంజయుడయ్యాడు. విశాఖ జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెం శివారు పాతరాజానపాలెంలో సోమవారం ఈ ఘటన జరిగింది. తల్లితో పాటు అమ్మమ్మ ఇంటికి వచ్చిన దీప్ (2) సరుగుడు తోట వద్దకు వెళ్లిన అమ్మమ్మ నేస్తాలమ్మను చూసి అక్కడికి వెళ్లాడు. ఆడుకుంటూ వ్యవసాయ బోరు బావిలోకి జారిపోయి 20 అడుగుల లోతుకు వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన నేస్తాలమ్మ కేకలు వేసింది. అక్కడే ఉన్న రైతు మండల అప్పలనాయుడు పరుగున వచ్చి బోరు బావిలో పడిన దీప్‌ను తాడు సాయంతో చాకచక్యంగా బయటకు లాగి రక్షించాడు. దీంతో అతడ్ని అంతా అభినందించారు. చిన్నారి అమ్మానాన్న లక్ష్మి, నరసింగరావు సంతోషించారు.