ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే..
యూకేలో నార్త్ వేల్స్‌లో ఎరారీ నేషనల్ పార్క్‌లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్‌గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్‌కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్‌లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్‌లో క్యాబిన్‌లు, రూమ్‌ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్‌లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు.
ఇందులో ట్విన్ బెడ్‌లతో కూడిన నాలుగు క్యాబిన్‌లు, డబుల్ బెడ్‌తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్‌లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్‌లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస.
ఈ హోటల్‌కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్‌ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది.
కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్‌లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్‌లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు.
(చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి)
Comments
Please login to add a commentAdd a comment