దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హోటల్‌లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు.
(చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?)
అసలు విషయంలోకెళ్లితే...సోమర్‌సెట్ కౌంటీలోని ఇల్మిన్‌స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్‌లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్‌లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్‌లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్‌కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్‌సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు.
అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం.
(చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ)
Comments
Please login to add a commentAdd a comment