investigates
-
అప్పుల ఊబిలో అతిపెద్ద బ్యాంక్.. లక్షల కోట్లు..
ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు సైతం గత కొన్ని రోజులుగుఫా ఆర్ధిక అనిశ్చితుల కారణంగా పతనమవుతున్నాయి, దివాలా తీసే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ జాబితాలో 'చైనాలోని అతిపెద్ద ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్యాంక్ 'ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' కూడా చేరింది. దివాలా తీయడానికి కారణాలు ఏంటి? నిర్వహణ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 139 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షల కోట్లు) నిర్వహణ కలిగిన 'ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' సంస్థల్లో పలు నేరాలు జరిగినట్లు అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తూ.. పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంస్థ మొత్తం సుమారు 12 అసెట్, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలను నిర్వహిస్తూ.. లోన్లు మాత్రమే కాకుండా, బ్రోకరేజ్ వంటి సేవలను అందిస్తూ అక్కడ అతి పెద్ద బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. 2021లో ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ 'షీ ఝికూన్' మరణించిన తరువాత.. మేనేజ్మెంట్లోని కీలక వ్యక్తులు కూడా సంస్థను వీడటం వల్ల దాని నిర్వహణలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత సంస్థ అప్పుల ఊబిలో కోరుకున్నట్లు తెలిసింది. ఈ సంస్థ అప్పులు 64 బిలియన్ డాలర్స్ వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. చైనాలో బ్యాంక్ తరహా ఆర్థిక సేవలందించే అతిపెద్ద షాడో బ్యాంకుల్లో ఒకటైన ఝంగ్‌ఝీ గ్రూప్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టారనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. అయితే చైనాలో ఈ బ్యాంక్ పతనావస్థకు చేరుకోవడం వల్ల ఈ రంగం మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రారంభంలో వేగంగా అభివృద్ధి చెందిన షాడో బ్యాంకింగ్ రంగం ఇప్పుడు పతనం కావడం జీర్ణించుకోలేని అంశం అనే చెప్పాలి. -
ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే...సోమర్సెట్ కౌంటీలోని ఇల్మిన్స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్‌కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) -
తెలుగు అకాడమీ కేసు: కస్టడీకి నలుగురు నిందితులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. నలుగురు నిందితులను చంచల్ గూడ జైల్ నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్ను కస్టడీకి తీసుకోగా, ఇప్పటికే యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలీని పోలీసులు ప్రశ్నించారు. నాలుగో రోజు కూడా మస్తాన్‌వలీని కస్టడీలోకి తీసుకున్నారు. కొట్టేసిన డబ్బును ఎక్కడ దాచారన్న దానిపై పోలీసులు ఆరా తీయనున్నారు. చదవండి: Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం -
రిక్రూట్మెంట్ సెల్ నడుపుతున్నాడా?
నసీర్ కార్యకలాపాలపై పోలీసుల అనుమానం పాస్‌పోర్టుల కోసం లక్షలు చెల్లించిన వైనం వాచ్‌మన్‌గా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా దందా నసీర్తో పాటు ఐదుగురి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జీహాది అల్ ఇస్లామి(హుజీ) సంస్థ సభ్యుల నియామకం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 14న నగర పోలీసులకు చిక్కిన పాకిస్తానీ మహమ్మద్ నసీరే...దీనికి కర్త, క్రియ అని భావిస్తున్నారు. చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్ వద్ద దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఇతను 15 మందికి పాస్‌పోర్టులు ఇప్పించి దేశం దాటించాడని తేలడంతో పోలీసులు ఈ విధంగా అనుమానిస్తున్నారు. వీరికి భారీ మొత్తంలో డబ్బు ఎరజూపడమే కాకుండా...లక్షలు వెచ్చించి మరీ పాస్‌పోర్టులు ఇప్పించాడు. ఉద్యోగ వీసాలపై దుబాయ్‌కు పంపిస్తున్నట్టు చెబుతున్నా...వారిని అక్కడి నుంచి పాకిస్తాన్‌కు తరలించినట్టు పోలీసులు భావిస్తున్నారు. హుజీ సంస్థలో వీరిని చేర్చుకునేందుకు...చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేందుకు 'ఉగ్ర' తరహాలో శిక్షణ ఇస్తున్నట్టుగా భావిస్తున్నారు. వాచ్‌మన్ అవతారం... ఐదు నెలల క్రితం నగరానికి వచ్చిన నసీర్.. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు...పోలీసు నిఘా లేని ప్రాంతాలను ఎంచుకున్నాడు. ఈ సమయంలోనే బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ పర్వేజ్ ఖాన్‌తో పరిచయమైంది. అక్కడి యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్ ఉద్యోగం ఉందని తెలుసుకున్న నసీర్...సొహైల్ సహాకారంతో అక్కడ విధుల్లో చేరాడు. ఆస్పత్రి నిర్వాహకులు అతడికి అక్కడే చిన్నపాటి గది కేటాయించడంతో మూడు నెలల పాటు సాఫీగా ప్రయాణం సాగింది. ఉదయం వేళలో కొన్ని గంటల పాటు బయటకు వెళ్లి 'సొంత' పని చేసుకునేవాడు. అందరితో మర్యాదపూర్వకంగా మెలిగి ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా చూసుకున్నాడు. నెలక్రితం సోహైల్, అతని బావ మహమ్మద్ మసూద్ అలీ ఖాన్ సహకారంతో చంచల్‌గూడ సమీపంలోని ఒక ఫ్లాట్‌కు మారాడు. ఇక్కడికొచ్చి నెలకూడా గడవకముందే పోలీసులకు దొరికిపోయాడు. ఏజెంట్ సహకారంతో పాస్‌పోర్టు... వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నసీర్‌కు హవాలా ద్వారా లక్షల రూపాయాలు అందేవి. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలసవచ్చి కడుబీదరికంలో బతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకునేవాడు. నసీర్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన నూర్, హషీమ్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో యువకులను జీహాది సాహిత్యం నూరిపోయడంతో పాటు దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికేవారు. తాము కొంచెం ప్రోత్సహిస్తే చాలు...హుజీ సంస్థలో సభ్యులుగా చేరిపోతారని అనుకున్న వాళ్లకు పాస్‌పోర్టులు ఇప్పించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నసీర్ పాస్‌పోర్టు కోసం తొలిసారి దరఖాస్తు చేసినప్పుడు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తిరస్కరించారు. పాస్‌పోర్టు ఏజెంట్ మహమ్మద్ మసూద్ అలీ సహకారంతో మరోసారి దరఖాస్తు చేస్తే క్లియరెన్స్ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్‌లోని కొంతమంది అధికారులు లంచం తీసుకుని నసీర్ పాస్‌పోర్టును క్లియర్ చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో పాత్ర ఉన్న ఇద్దరు పాస్‌పోర్టు అధికారులపై పోలీసులు మరో రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్బీ సిబ్బందిని కూడా సీసీఎస్ పోలీసులు సోమవారం పిలిచి మాట్లాడారు. కస్టడీ కోరుతూ పిటిషన్... నసీర్తో సహా పట్టుబడిన ఆరుగురు అనుమానితుల్నీ లోతుగా విచారించాలని సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు వారాలా పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, నసీర్ భార్య హబియా కటూన్ను కూడా సీసీఎస్ పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాల్లో ఆమె పాత్ర ఉందా? లేదా? అనేది నిర్థారించడంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.