అప్పుల ఊబిలో అతిపెద్ద బ్యాంక్.. లక్షల కోట్లు.. | China Investigates Major Shadow Bank Zhongzhi For Crimes | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలో అతిపెద్ద బ్యాంక్.. మొదలైన దర్యాప్తు!

Published Tue, Nov 28 2023 1:08 PM | Last Updated on Tue, Nov 28 2023 1:30 PM

Popular Shadow Bank Zhongzhi For Crimes Govt Investigates - Sakshi

ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు సైతం గత కొన్ని రోజులుగుఫా ఆర్ధిక అనిశ్చితుల కారణంగా పతనమవుతున్నాయి, దివాలా తీసే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ జాబితాలో 'చైనాలోని అతిపెద్ద ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్యాంక్ 'ఝంగ్‌ఝీ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్' కూడా చేరింది. దివాలా తీయడానికి కారణాలు ఏంటి? నిర్వహణ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

139 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షల కోట్లు) నిర్వహణ కలిగిన 'ఝంగ్‌ఝీ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్' సంస్థల్లో పలు నేరాలు జరిగినట్లు అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తూ.. పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంస్థ మొత్తం సుమారు 12 అసెట్‌, వెల్త్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీలను నిర్వహిస్తూ.. లోన్లు మాత్రమే కాకుండా, బ్రోకరేజ్ వంటి సేవలను అందిస్తూ అక్కడ అతి పెద్ద బ్యాంకులలో ఒకటిగా నిలిచింది.

2021లో ఝంగ్‌ఝీ ఎంటర్‌ప్రైజ్ 'షీ ఝికూన్‌' మరణించిన తరువాత.. మేనేజ్‌మెంట్‌లోని కీలక వ్యక్తులు కూడా సంస్థను వీడటం వల్ల దాని నిర్వహణలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత సంస్థ అప్పుల ఊబిలో కోరుకున్నట్లు తెలిసింది. ఈ సంస్థ అప్పులు 64 బిలియన్ డాలర్స్ వరకు ఉన్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..

చైనాలో బ్యాంక్ తరహా ఆర్థిక సేవలందించే అతిపెద్ద షాడో బ్యాంకుల్లో ఒకటైన ఝంగ్‌ఝీ గ్రూప్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టారనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. అయితే చైనాలో ఈ బ్యాంక్ పతనావస్థకు చేరుకోవడం వల్ల ఈ రంగం మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రారంభంలో వేగంగా అభివృద్ధి చెందిన షాడో బ్యాంకింగ్‌ రంగం ఇప్పుడు పతనం కావడం జీర్ణించుకోలేని అంశం అనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement