paranormal investigator
-
ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే...సోమర్సెట్ కౌంటీలోని ఇల్మిన్స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్‌కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) -
శ్మశానంలో సాహసం : దెయ్యం రాకతో హడల్
హాంట్స్, ఇంగ్లండ్ : 800 ఏళ్ల పురాతన శ్మశానంలో సాహసయాత్రకు వెళ్లిన ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్ తగిలింది. ఓ దెయ్యం వెంబడించటంతో అతను హడలిపోయాడు. దెయ్యం తనపై దాడికి వస్తున్న ఘటనను టోని ఫెర్గూసన్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హాంట్స్లో సెయింట్ మెరీ చర్చ్ వద్ద ఏదో ఉందని పుకార్లు వస్తుండటంతో ఫెర్గూసన్ అక్కడకు వెళ్లాడు. శ్మశాన పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుండగా ఉన్నట్లు ఉండి ఓ ఆత్మ అతనిపైకి వచ్చింది. ఈ ఘటనతో ఫెర్గూసన్ నిర్ఘాంతపోయాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చే వారిని ఈ దెయ్యమే భయపెడుతున్నట్లు చెప్పాడు. అయితే, ఫెర్గూసన్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఎడిటెడ్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దెయ్యం దెబ్బకు ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్
-
ప్రముఖ హిప్నాటిస్ట్ అనుమానాస్పద మరణం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ (32 )అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారు. భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు. బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్దం బిగ్గరగా వినిపించడంతో కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యారు. బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా... అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా అలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. పారానార్మల్ (విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009 లో ఏర్పాటు పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది.