Paranormal
-
ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే...సోమర్సెట్ కౌంటీలోని ఇల్మిన్స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్‌కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) -
తాండాలో మంటల మిస్టరీ...
-
దెయ్యాలు నిజంగానే ఉన్నాయా?
సాక్షి, వెబ్ డెస్క్ : మీరు కళ్లు తెరచి పడుకుంటున్నారా?, నిద్రిస్తున్న సమయంలో ఏవైనా వింత శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా?. సహజంగా ఒకసారి, రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పదేపదే శబ్దాలు వినిపిస్తే మాత్రం అనుమానం(ఏదో ఉందని) మొదలవుతుంది. ఏదో గుర్తించలేని అదృశ్య శక్తి మనల్ని వెంబడిస్తుందని భావిస్తాం. ఒక్కోసారి పడుకున్న చోటును ఎటూ కదలలేకపోతాం. దీంతో మనల్ని ఎవరో వెంటాడుతున్నారన్న భయం పెరిగిపోతుంది. అప్పటినుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తాం. చీకటి పడుతుంటుంది. ఇంటికి వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. రాత్రికి మళ్లీ ఏం జరుగుతోందనని హడలెత్తిపోతుంటాం. ఇలాంటి అనుభూతులన్నీ దెయ్యాలు, భూతాల వల్ల కాదని సైకాలజీ ప్రొఫెసర్ ఎలైస్ గ్రెగరీ తేల్చేశారు. గోల్డ్‌స్మిత్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో ఆయన పని చేస్తున్నారు. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏదో ఉన్నట్లు భావించే వారు అధికంగా బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్నారని చెప్పారు. ఇదే వారిని మానసిక ప్రశాంత నుంచి దూరం చేస్తోందని వెల్లడించారు. నిద్ర పక్షవాతం నిద్ర మొత్తం 3 స్టేజ్లలో ఉంటుందని గ్రేగ్ చెప్పారు. మనుషులు మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారని, సమయం గడిచే కొద్దీ గాఢ నిద్రలోకి వెళ్తారని, ఆ తర్వాత రకరకాల కలల్లోకి వెళ్తామని గ్రెగరీ పేర్కొన్నారు. ఈ దశలో కలలోని పనులను మనం నిజంగానే చేస్తున్నట్లు భావిస్తామని, బెడ్‌పై కాళ్లు, చేతులు, ముఖ కవళికలు కలకు అనుకూలంగా మారతాయని చెప్పారు. ఈ స్థితిని నిద్ర పక్షవాతం అంటారని చెప్పారు. బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రించేవారిలో ఈ మూడు స్టేజ్‌లు పూర్తికావని దాంతో వారు పగటిపూట అవిశ్రాంతిగా ఫీల్ అవుతారని తెలిపారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెల్కొన్న తర్వాత కూడా కదలలేకపోవడం, ఏదో జరుగుతున్నట్లు ఫీల్ అవ్వడం వంటివి జరుగుతాయని వివరించారు. -
ఆ పరిశోధకుడిది ఆత్మహత్యే..!
ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పారానార్మల్ సొసైటీ స్థాపకుడు గౌరవ్ తివారీ ది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చి చెప్పారు. అతడు తన ఇంట్లోని బాత్రూమ్ లో స్వయంగానే ఉరి వేసుకున్నాడని, అది ఆత్మహత్యేనని ప్రాథమిక శవపరీక్ష నివేదిక ఆధారంగా తేలినట్లు తెలిపారు. అతడి మరణం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో విచారించిన పోలీసులు... అతడు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నన్లు చెప్పారు. భారత్ లో ప్రేతాత్మల పరిశోధకుడిగా గుర్తింపు పొందిన గౌరవ్ తివారీ ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. 2009 లో ప్రారంభమైన ఇండియన్ పారా నార్మల్ సొసైటీ సీఈవో గౌరవ్ తివారీ.. సొసైటీ తరపున మూఢనమ్మకాలు, ప్రేతాతమ్మల భయంతో బాధపడే వారికి అవగాహన కల్పించి, వారిలోని భయాలను పోగెట్టేవాడు. 32 ఏళ్ళ తివారీకి తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. అయితే అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గౌరవ్ ది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారించారు. చివరికి ప్రాథమిక శవపరీక్ష నివేదికల ఆధారంగా ఆత్మహత్యేనని ధృవీకరించారు. అతడి మరణం వెనుక ఎటువంటి కుట్ర జరగలేదని తెలిపారు. గౌరవ్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య సహా తల్లిదండ్రులు తెలిపారని, ఓ గుడ్డతో ద్వారకా ఫ్లాట్ లోని బాత్రూమ్ లో ఇంట్లో అందరూ ఉన్న సమయంలోనే ఉరి వేసుకున్నట్లు తెలిపారని ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. తివారీ తరచుగా రాత్రి సమయంలో పని చేసే వాడని, సంపాదన కూడా పెద్దగా లేదని తెలిపిన కుటుంబ సభ్యులు అతడు చేపట్టిన కార్యకలాపాలపై ఏమాత్రం సంతోషంగా లేనట్లు విచారణలో తెలిసిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.