ఎన్నో రకాల వింత వ్యాధుల గురించి విన్నాం. కానీ నిద్రిస్తే శ్వాస ఆగిపోవడం అనే వ్యాధి గురించి విని ఉండరు కదా! నిద్రిస్తేనే శ్వాస ఆగిపోతే ఎలా? నిద్రపోకుండా ఉండటం కూడా అసాధ్యమే. ఇదోకరకమైన అరుదైన వ్యాధి అట. దేనిపైన దీర్ఘంగా దృష్టి కేంద్రీకరించినా లేదా ఏకాగ్రత పెట్టినా.. శ్వాస ఆగిపోవడమే ఈ వ్యాధి లక్షణం. యూకేలోని ఓ చిన్నారి అచ్చం అలాంటి వ్యాధి బారినే పడింది. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని రక్షించుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా నానా అగచాట్లు పడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. యూకేలోని బర్మింగ్‌హామ్‌కు చెందిన 48 ఏళ్ల స్టార్ బౌయర్, ఆమె భర్త ఆండ్రూ బౌయర్ ఇద్దరు తమ కుమార్తె సాడీని రాత్రింబవళ్లు కంటి మీద కునుకులేకుండా అపురూపంగా చూసుకుంటున్నారు. సాడీ పుట్టిన ఆరు నెలల తర్వాత నుంచి శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొనడం ప్రారంభమైంది. ఆ తర్వాత దీని గురించి ఆ చిన్నారి కొన్నాళ్లు ఇంటెన్సీవ్ కేర్‌లో కూడా చికిత్స తీసుకుంది.
ఐతే ఆమె పుట్టుకతో సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఏదైనా సినిమా చూస్తూ ఉండిపోయినా లేదా గట్టిగా దేనిమీద అయినా ఏకాగ్రత పెట్టినా ఆమె మెదడు శ్వాస తీసుకోవడం మర్చిపోవడంతో ఆమె శరీరం నీలంగా మారి చనిపోయే స్టేజ్‌కి వెళ్లిపోతుంది.
దీంతో వైద్యులు ఆ చిన్నారికి ట్రాకియోస్టోమీ చేశారు. అంటే మెడకు రంధ్రం చేసి శ్వాసనాళ నుంచి ఒక గొట్టం ఏర్పాటు చేశారు. ఇది శ్వాస తీసుకునేలా చేసి మెదడుకు సంకేతాలు పంపి గుండె కొట్టుకునేలా చేస్తుంది. ఇది ఆమె ఏకాగ్రతగా ఉన్నప్పుడూ (దీర్ఘంగా సినిమా చూస్తుండిపోయినప్పుడూ).. శ్వాస తీర్చుకోవడం మర్చిపోయిన ప్రతి సారి ఈ గొట్టం శ్వాస గురించి మెదడుకు సంకేతాలు పంపుతుంది.
అదే ఒకవేళ ఆ చిన్నారి అకస్మాత్తుగా నిద్రపోయినా లేదా డీప్ స్లీప్‌లో ఉంటే అంతే సంగతి. శ్వాస ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. వెంటనే తల్లిదండ్రులు అది గమనించి వెంటిలేటర్‌పై ఉంచి కృత్రిమ శ్వాస అందించి తిరిగి బతికించుకుంటున్నారు. ఒకవేళ ఆమె శ్వాస ఆగిపోవడాన్ని గమనించనట్లయితే ఆమె శాశ్వతంగా దూరమైపోతుందని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రలుకు కంటి మీద కునుకు లేకుండా అయింది. 24/7 ఆమెను పర్యవేక్షించడమే వారికి నిత్యకృత్యంగా మారిపోయింది.
ఆమె రోజులో సాధారణ బిడ్డ మాదిరిగానే ఉన్నా.. నిద్రించిందా ఇక అంతే! ఆ చిన్నారి రూమ్ అంతా వైద్య పరికరాలతో నిండి ఉంటుంది. ఐతే తల్లిద్రండులు ఆమెకు వెంటిలేటర్ లేకుండా శ్వాస పీల్చుకునేలా ప్రత్యామ్నాయ మార్గం గరించి తెలుసుకున్నారు. నిద్రలో శ్వాస ఆగిపోకుండా డయాఫ్రాగ్మాటిక్ పేసర్‌లను అమర్చాలని నిర్ణయించుకున్నారు. దీన్ని అమర్చితే ఆ చిన్నారి నిద్రపోయినా పర్వాలేదు, పైగా తాము నిద్రపోకుండా చూసుకోవాల్సిన సమస్య తప్పదంటున్నారు తల్లిదండ్రులు. ఐతే అందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఆ డబ్బుల సేకరణ పనిలోనే తాము ఉన్నట్లు తల్లిదంద్రడులు వివరించారు.
(చదవండి: మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!: జెసిండా)
Comments
Please login to add a commentAdd a comment