
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.
బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్‌తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్‌లలో 57 విందులను ఆస్వాదించాడు.
వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్‌కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు.

పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
(చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment