రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారు చూపించిన తెగువ, ప్రదర్శించిన శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. అచ్చం అలానే ఒక్కడోక బామ్మ నాటి సమయంలోని ఒక ఉక్కు పరిశ్రమను కాపాడి అందరిచే ప్రశంసలు అందుకుంది. పైగా ఆమె నిస్వార్థ కృషికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది యూకే ప్రభుత్వం.
వివరాల్లోకెళ్తే....యూకేకి చెందిన వందేళ్ల వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్కు పరిశ్రమను కూలిపోకుండా కాపాడింది. ఆమె యుక్త వయసులో ఆ ఉక్కు పరిశ్రమలో పనిచేసినప్పుడూ..పురుషుల కంటే తక్కువ వేతనంతో ఇతర మహిళలతో కలిసి పనిచేసింది. ఆమె 72 గంటల వారాలు విధులు నిర్వర్తించేది. ఆ వృద్ధురాలి పేరు కాథ్లీన్ రాబర్ట్స్. తనతోపాటు పనిచేసిన వారిలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి ఆ బామ్మ.
సంక్షోభం, ఆర్థిక పతనం వంటి విపత్కర సమయాల్లో తన దేశం కోసం అంకితభావంతో పనిచేసింది. కాథ్లీన్ బృందం గనులు, ప్లాంట్‌లలోని భారీ యంత్రాలు, క్రేన్‌లను నిర్వహించేవారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్న పట్టించుకోకుండా నిరాటంకంగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎప్పుడూ ఎటు నుంచి వైమానిక దాడులు జరుగుతాయోనన్న భయంతో హెల్మట్‌లు ధరించి మరీ విధులు కొనసాగించేవారు. కొన్నాళ్ల తర్వాత విధుల నుంచి తొలగింపబడ్డారు.
ఐతే కాథ్లీన్ మౌనంగా ఊరుకోలేదు. ఉక్కుమహిళల వారసత్వాన్ని కాపాడేందుకు ఏడేళ్లు ప్రచారం చేసింది. చివరికి 70 ఏళ్ల తర్వాత ఆమె రచనలు షెఫిల్డ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. క్యాథిలిన్‌ని ఉక్కు కార్మికురాలిగా, ప్రచారకురాలిగా ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించడంతో ఆమె గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ని అందుకుంది.
ఈ మేరకు కాథ్లీన్ మాట్లాడుతూ...తనకు ఈ గౌవర డిగ్రీ ఇవ్వనున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. యుద్ధ ప్రయత్నానికి సహకరించిన ఉక్కుమహిళలందరి తరుఫున ఈ గౌరవ డాక్టరేట్‌ని తీసుకోవడం సంతోషంగా ఉంది. చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేశారు. "మీరు ప్రతీది పుస్తకం నుంచి నేర్చుకోలేరు. కేవలం అనుభవంతోనే కొన్నింటిని తెలుసుకోగలరు అని అన్నారు. అలాగే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ కలలను సాకారం చేసుకోండి" అని సూచించారు.
(చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment