మహిళలు ఉద్యోగాల్లో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అది ఆఫీసు బాస్ కారణంగానే లేక తోటి ఉద్యోగుల కారణంగానో సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంటుంది. అయితే కొంతమంది మరీ పైశాచికంగా ఒక మహిళా మంచిగా పనిచేస్తున్నప్పటికీ ఏవో సాకులు చూపుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేయడమే లేక తొలగించాలని చూస్తారు. అచ్చం అలాంటి సమస్య ఎదుర్కొంది.. ఇక్కడోక లెక్చరర్. పైగా కోర్టు మెట్లెక్కి మరీ ఆ సంస్థకు సరైన బుద్ధి చెప్పింది ఎలాగో తెలుసా!.
అసలు విషయంలోకెళ్తే.. యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ అన్నెట్ ప్లాట్‌ని అన్యాయంగా తొలగించారు. పైగా ఆమె స్వరం చాలా పెద్దదని, చాలా బిగ్గరగా మాట్లాడుతోందంటూ ఆరోపణలు చేసి మరీ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కోర్టులో.. "యూనివర్సిటీ తన పట్ల పక్షవాత ధోరణి చూపిస్తోంది. సహజంగానే నాది పెద్ద స్వరం. పైగా నా స్వరం పెద్దగా ఉండటానికి యూరోపియన్ యూదు నేపథ్యం కూడా ఒక కారణం.
అంతేకాదు ఈ కారణాన్ని సాకుగా చూపి తన సహ ఉద్యోగులు తన పట్ల చూపిస్తున్న వైఖరికి తట్టుకోలేక తాను చికిత్స నిమిత్తం వైద్యుడిని ఆశ్రయించాను. పైగా నేను దాదాపుగా మూడు దశాబ్దాలుగా(29 సంవత్సారాలు నుంచి) ఫిజిక్స్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నన్ను కేవలం బిగ్గరగా మాట్లాడుతున్నానంటూ తొలగించారు. అంతేకాదు నా తొలగింపుకు యూనివర్సిటీలో ఉన్న కొంతమంది సీనియర్ ఉద్యోగులు, హెచ్‌ఆర్ వాళ్ల మూసభావనలే కారణం’’ అని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఎక్సెటర్ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్థులతో ఆమె వ్యవహరించిన తీరు కారణంగానే తొలగించినట్లు తెలిపింది. దీంతో కోర్టు ఆమె తొలగింపుకు స్వరం, నేపథ్యంతో సంబంధం లేదంటూ కొట్టిపారేసింది. పైగా ఆమెను తొలగించటం అన్యాయం అని తీర్పు ఇవ్వడమే కాక విశ్వవిద్యాలయాన్ని ఆమెకు నష్ట పరిహారంగా రూ.కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో విశ్వవిద్యాలయం ప్రతినిధి ఈ తీర్పు సరైనది కాదనడమే కాక, ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టు నిర్ణయంపై అప్పీలు చేస్తున్నామని తెలిపారు.
(చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!)
Comments
Please login to add a commentAdd a comment