lecturer
-
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.అక్టోబర్‌లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్‌తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్‌లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్పై తాము చెప్పిన విధంగా వర్క్‌లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్‌ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. -
లెక్చరర్ కుర్చీ కింద బాంబు.. విద్యార్థుల ప్రతీకారం..
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్‌కి వచ్చే లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు. లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్‌కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్‌కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
గురు పూజోత్సవం స్పెషల్..
షాబాద్: పల్లె అనంతరెడ్డి.. హైతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్.. చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పలక, బలపం కొనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలోనే అతని గురువులు సాయం చేశారు. అన్నీ సమకూర్చారు. దీన్నే అనంతరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం తన జీతంతోపాటు జీవితాన్ని అంకితం చేశారు.‘నేను విధుల్లో చేరినప్పుడు కొండాపూర్ యూపీఎస్ శిథిలమైన గదుల్లో కొనసాగుతోంది. 1 నుంచి 7వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో స్కూల్ ఆవరణలో తడకలు వేయించి పాఠాలు చెప్పా. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, దాతల ద్వారా రూ.70 లక్షలతో ఏడు రూమ్‌లు నిర్మించాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మరో రూ.30 లక్షలు పెట్టి సకల సౌకర్యాలు సమకూర్చాం. కరోనాలో పేద ప్రజలకు రూ.60 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశాం. స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఇప్పించి విద్యార్థులకు డిజిటల్ బోధన కొనసాగించాను.పూర్వపు విద్యార్థులు అనంతరెడ్డికి బహుమతిగా ఇచ్చిన బుల్లెట్ బండి..హైసూ్కల్‌గా అప్‌గ్రేడ్ చేయించా. ప్రస్తుతం అక్కడ 1,100 మంది చదువుతున్నారు’అని అనంతరెడ్డి చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో అనంతమైన సంతృప్తి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆయన హైతాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు. అంతేకాదు.. నిరుపేద విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడూ తన వంతు సాయాన్ని అందిస్తూ అనంతరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆటపాటలతో పాఠాలు..సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కవిత టీచర్ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఆమె ఆటపాటలతో పాఠాలను చెప్పేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత.. విద్యార్థులకు ఇంటి వద్ద లభించే కాగితం, అట్టముక్కలను తక్కువ ఖర్చుతో వివిధ రూపాల్లోకి మార్చి వాటి ద్వారా క్లాసులు బోధిస్తున్నారు.గణితంలో ఎక్కాల చట్రం, స్నేక్ ల్యాడర్ గేమ్, నంబర్స్, అల్ఫాబెట్స్ కాన్సెప్ట్ గేమ్ పేరుతో విద్యార్థులను ఆకట్టుకుంటూ వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేలపై చుట్టూరా విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రతి అంశంపై బొమ్మల ద్వారా బోధిస్తున్నారు. అంతేకాదు.. గణితం, సైన్స్, తెలుగు వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాలను, టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్‌ను ఇన్‌స్టా గ్రాం, యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.మా‘స్టారు’.. శేషగిరి సారు..బషీరాబాద్: నెల జీతం కోసం పనిచేసే వారు కొందరుంటే.. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి పాఠాలు చెప్పే సార్లు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే శేషగిరి సారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్గౌడ్తండాలో ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలతో విద్యార్థులు, గ్రామస్తుల మనసు గెలుచుకున్నారు. 2018లో మంతన్‌గౌడ్ స్కూల్‌కు వచ్చిన ఆయన గత జూలై వరకూ పనిచేశారు.మట్టిగణపతులను చేయిస్తున్న శేషగిరిఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో మా సారు మాకే కావాలి.. అంటూ గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రంఅందజేశారు. ఆయన రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పనిచేసి పాఠశాల రూపురేఖలు మార్చేశారు. స్కూల్ ఆవరణలోనే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజనం కోసం వాడేలా చేశారు. ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించారు.అంతేకాదు.. ఏటా విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లి, చారిత్రక ప్రదేశాలను చూపించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం.. మట్టితో వినాయకులను తయారు చేయించి గ్రామంలో ఇంటింటా మట్టి వినాయకులే ప్రతిష్టించేలా మార్పు తీసుకొచ్చారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పిల్లల విషయంలో జాగ్రత్తలు బో ధించేవారు. అందుకే సారు బదిలీ అయ్యారనేసరికి. ఊరంతా కదిలివచ్చింది. కన్నీరు రాల్చింది.శేషగిరి, ఉపాధ్యాయుడు -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్‌లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
హెచ్‌సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి వర్చువల్‌గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
లెక్చరర్ కారుకు నిప్పు
అనంతపురం: నగరంలోని అశోక్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ఇంటి ముందు ఆపి ఉంచిన కారుకు దుండగులు నిప్పుపెట్టడంతో బాధితులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రెడ్డెప్ప వివరాలమేరకు.. స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న చంఽద్రశేఖరరెడ్డి కుటుంబం అశోక్‌నగర్‌లోని హరిహర ఆలయం సమీపంలో నివాసం ఉంటోంది. రోజువారిగానే ఇంటి ముందు కారు (క్రెటా)ను పార్క్ చేశారు. అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో కారు మంటల్లో తగలబడుతూ కనిపించింది. మంటలను ఆర్పిన అనంతరం చూడగా కారు కింద చెత్తాచెదారాన్ని వేసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తమకు ఎవరితోనూ శతృత్వం లేదని చంద్రశేఖర్ చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అప్పుడు పాచి పని చేసింది.. ఇప్పుడు లెక్చరర్‌గా రాణిస్తోంది
పిల్లల చదువుల కోసం ఇళ్లలో పాచిపనులు చేసిన మధు ఇప్పుడు కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పాఠాలు చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ చదువులు మీరేం చదువుతారని పిల్లలకు అడ్మిషన్ ఇవ్వలేదు. అలాంటి ఆమె పిల్లలు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ప్రతిరోజూ పోరాటమే అని వివరిస్తారు రాజస్థాని భిల్వారా నివాసి మధు. ఆమె గురించి అడిగితే సక్సెస్‌ని ఏ విధంగానైనా కష్టపడి సాధించుకోవచ్చు అని చెబుతుంది. ‘‘మేం ఆరు మంది తోబుట్టువులం. మా నాన్న చనిపోయినప్పుడు నాకు నాలుగేళ్లు. ఎన్నో ఇక్కట్ల మధ్య పెరిగాను. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక పెళ్లయింది. నా భర్త ఒక కంపెనీలో వర్కర్‌గా పనిచేసేవాడు. అతని జీతం ఇంటి అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. పిల్లలు పుట్టాక ఇంకా సమస్యలు పెరిగాయి. దీంతో కుట్టుపని మొదలు పెట్టాను. కొంత కాలానికి మా ఆయనకు కీళ్లనొప్పులు వచ్చి, ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన చేస్తున్న పనిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఈ కష్టకాలంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వారి స్కూల్‌కు దగ్గరలో కుట్టుమిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. అక్కడ కూర్చొని కుట్టుపని చేసేదాన్ని. అక్కడ బ్యాగులు, కవర్లు తయారు చేయడం మొదలుపెట్టినప్పుడు, ఆ స్కూల్ టీచర్ ఒకరు నేను చాలా త్వరగా వర్క్ నేర్చుకుంటానని గమనించారు. నా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని కాన్వెంట్ స్కూల్లో చేర్పించడానికి వెళితే, ‘మీరు చదువుకోలేదు, స్కూల్ ఫీజులు కూడా కట్టలేరు, అడ్మిషన్ ఇవ్వలేం’ అన్నారు. ఈ విషయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ నేను కుట్టుపని చేస్తున్నప్పుడు బ్యాగుల తయారీ గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేవారు. ఆ సమయంలో పిల్లలతోపాటు నన్ను కూడా చదువుకోమని ప్రోత్సహించారు. అందుకు తగిన దూరవిద్య ఫామ్స్ కూడా తెచ్చి ఇచ్చారు. దీంతో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, నేను కుట్టుమిషన్ దగ్గరే చదువుకునేదాన్ని. రోజూ ఉదయాన్నే నాలుగిళ్లలో పనులు చేయడం, కుట్టుమిషన్‌పై బ్యాగులు కుట్టడం, ఖాళీ సమయంలో డిగ్రీ పుస్తకాలు చదవడం... ఇలాగే నడిచేది. అడ్డంకిగా మారిన పరిస్థితులు నేను పట్టుదలగా చదువుకోవడం చూసిన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా నన్ను ప్రోత్సహించేవారు. పిల్లలు కూడా నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే, మా అత్తగారు ఆపేవారు. మామగారికి మా బంధువులు వెక్కిరిస్తున్నారని చెప్పేవారు. ఆమె సాయంత్రం పూట ఎక్కడకు వెళ్తుందో, ఎక్కడి నుండి వస్తుందో అని విపరీతపు మాటలు రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ, నా భర్త వాటన్నింటినీ పట్టించుకోవద్దని చెప్పేవారు. నేను ఎం.ఏ. పరీక్షలు రాస్తున్నప్పుడు మా మామగారు చనిపోయారు. దీంతో చదువును వదులుకునే పరిస్థితి వచ్చింది. కానీ, స్కూల్ టీచర్ శైలజ వచ్చి మా అత్త గారికి నచ్చచెప్పి, నన్ను చదువు కొనసాగించమని ప్రోత్సహించ డంతో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాను. లెక్చరర్‌గా చేస్తూనే.. మొదటిసారి నెట్లో అర్హత సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఏ. పూర్తిచేసి, పీహెచ్‌డీకి అడ్మిషన్ తీసుకున్నాను. పిల్లలు పెద్దవడంతో డబ్బు అవసరం కూడా పెరిగింది. దీంతో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చేరాను. నెలకు ఆరువేల రూపాయలు వచ్చేవి. వాటితోనే ఇల్లు గడవదని, టైలరింగ్ పనులు చేస్తూనే ఉండేదాన్ని. కానీ, మనం అనుకున్నవి అన్నీ జరగవు కదా. మా వారి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ట్రీట్మెంట్ నెలలపాటు కొనసాగింది. దీనిని తట్టుకుంటూనే నా జీవన పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కూతురు ఐఐటీలో సీటు సంపాదించి, మాస్టర్స్ కూడా చేసింది. కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు. నాలుగిళ్లలో పనిచేసుకునే నేను ఇప్పుడు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకున్నాను. పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే మంచి ఉద్యోగాల్లో వారిని చూడబోతున్నాను’’ అని ఆనందంగా వివరించే మధు జీవనపోరాటంలో విజయం ఒక్కరోజుతో సాధ్యం కాలేదని, ప్రతిరోజూ కఠోరశ్రమ చేస్తే వచ్చిందని చెబుతోంది మధు. -
మహిళా లెక్చరర్‌కు వేదింపులు.. కాలేజీ సమీపంలోనే దాడి..
అన్నానగర్ (తమిళనాడు): మహిళా అధ్యాపకురాలిని లైంగికంగా వేధించిన అధ్యాపకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కప్పలూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మదురైకి చెందిన ఓ మహిళ తాత్కాలిక లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఉసిలంబట్టికి చెందిన రఘుపతి (42)కూడా అదే కళాశాలలో తాత్కాలిక లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అతను ఆమెను తరచూ లైంగికంగా వేధిస్తున్నాడు. గతనెల 26న కళాశాల సమీపంలో అతను మహిళా లెక్చరర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎదురు తిరిగిన ఆమెను చంపుతానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రఘుపతిని పోక్సో చట్టం కింద ఆదివారం అరెస్టు చేశారు. -
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్ ప్రతాపం
సాక్షి, పటమట (విజయవాడ): విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కాలితో తన్నిన ఘటనను మరువక ముందే నగరంలోని నారాయణ కళాశాలలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయి. అయితే, మార్కులు ఎందుకు తగ్గాయంటూ ప్రసాదరావు అనే లెక్చరర్ శుక్రవారం మధ్యాహ్నం సదరు విద్యార్థిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనించిన ఆ లెక్చరర్, కళాశాల ప్రతినిధి కోటితో కలిసి అతన్ని(చిత్రీకరిస్తున్న విద్యార్థి) తీవ్రంగా కొట్టారు. అంతేగాక వారిద్దరినీ వేరే తరగతి గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించడమేగాక సెల్‌ఫోన్ లాక్కొని పగులకొట్టారు. జరిగిన ఘటనను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేంద్ర చెప్పారు. చదవండి: (ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు) -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్‌లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
వేములవాడ: సాంఘిక డిగ్రీ కాలేజీ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం
-
మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్ అలకాటూరు. నగరి: మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్ గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నంబాకం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. అయితే కలెక్టర్ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్‌కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్ రాసినా మెయిన్స్ క్లియర్ కాలేదు. లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఫోన్ ద్వారా ఆన్లైన్లోని మెటీరియల్‌నే చదివారు. 2018లో సివిల్స్ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మహేష్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈయన భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్‌గా ఉన్నారు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) సాధనతోనే సాధ్యం సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్‌లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్‌గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్లైన్లో ఎన్సీటీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని చదివారు. అలాగే ఆన్లైన్లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్ సివిల్స్‌లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్ నాకు మెటీరియల్‌గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్‌పై పట్టు పెంచుకుంటే సివిల్స్‌లో రాణించవచ్చు. న్యూస్ రీడింగ్ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది. –మహేష్, నంబాకం గ్రామం, నగరి మండలం. -
లెక్చరర్ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ..
తంబళ్లపల్లె(అన్నమయ్య జిల్లా): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. వివరాలు.. ఎస్వీయూ సంస్కృత విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ మంగళవారం విద్యార్థినితో మాధవరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, ములకలచెరువు సీఐ షాదిక్ అలీ, ఎస్ఐ శోభారాణి.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
బిగ్గరగా మాట్లాడుతోందని ఆ లెక్చరర్‌ను ఏం చేశారంటే?
మహిళలు ఉద్యోగాల్లో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అది ఆఫీసు బాస్ కారణంగానే లేక తోటి ఉద్యోగుల కారణంగానో సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంటుంది. అయితే కొంతమంది మరీ పైశాచికంగా ఒక మహిళా మంచిగా పనిచేస్తున్నప్పటికీ ఏవో సాకులు చూపుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేయడమే లేక తొలగించాలని చూస్తారు. అచ్చం అలాంటి సమస్య ఎదుర్కొంది.. ఇక్కడోక లెక్చరర్. పైగా కోర్టు మెట్లెక్కి మరీ ఆ సంస్థకు సరైన బుద్ధి చెప్పింది ఎలాగో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే.. యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ అన్నెట్ ప్లాట్‌ని అన్యాయంగా తొలగించారు. పైగా ఆమె స్వరం చాలా పెద్దదని, చాలా బిగ్గరగా మాట్లాడుతోందంటూ ఆరోపణలు చేసి మరీ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కోర్టులో.. "యూనివర్సిటీ తన పట్ల పక్షవాత ధోరణి చూపిస్తోంది. సహజంగానే నాది పెద్ద స్వరం. పైగా నా స్వరం పెద్దగా ఉండటానికి యూరోపియన్ యూదు నేపథ్యం కూడా ఒక కారణం. అంతేకాదు ఈ కారణాన్ని సాకుగా చూపి తన సహ ఉద్యోగులు తన పట్ల చూపిస్తున్న వైఖరికి తట్టుకోలేక తాను చికిత్స నిమిత్తం వైద్యుడిని ఆశ్రయించాను. పైగా నేను దాదాపుగా మూడు దశాబ్దాలుగా(29 సంవత్సారాలు నుంచి) ఫిజిక్స్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నన్ను కేవలం బిగ్గరగా మాట్లాడుతున్నానంటూ తొలగించారు. అంతేకాదు నా తొలగింపుకు యూనివర్సిటీలో ఉన్న కొంతమంది సీనియర్ ఉద్యోగులు, హెచ్ఆర్ వాళ్ల మూసభావనలే కారణం’’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఎక్సెటర్ విశ్వవిద్యాలయం పీహెచ్డీ విద్యార్థులతో ఆమె వ్యవహరించిన తీరు కారణంగానే తొలగించినట్లు తెలిపింది. దీంతో కోర్టు ఆమె తొలగింపుకు స్వరం, నేపథ్యంతో సంబంధం లేదంటూ కొట్టిపారేసింది. పైగా ఆమెను తొలగించటం అన్యాయం అని తీర్పు ఇవ్వడమే కాక విశ్వవిద్యాలయాన్ని ఆమెకు నష్ట పరిహారంగా రూ.కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో విశ్వవిద్యాలయం ప్రతినిధి ఈ తీర్పు సరైనది కాదనడమే కాక, ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టు నిర్ణయంపై అప్పీలు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!) -
హెల్మెట్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టి ప్రయాణం.. మృత్యు రూపంలో వచ్చిన మరో బైక్
సాక్షి, ఖమ్మం (కొణిజర్ల): అనుకోని ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన మోదుగు కృష్ణయ్య (44) రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. బండికున్న హెల్మెట్ ధరించి ఉంటే..బతికేవాడేమో అంటూ అయినవారు కన్నీరు పెడుతున్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో చిట్టీ డబ్బులు తీసుకుని తన బైక్‌పై..అత్తగారి ఊరు ముదిగొండ మండలం మేడేపల్లికి వెళ్తున్న క్రమంలో కొణిజర్ల ఏపీజీవీబీ వద్ద రోడ్డు దాటుతుండగా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణయ్య కింద పడిపోగా తల రోడ్డుకు గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డారు. అయితే..హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకుండా బండి ట్యాంక్‌పై ఉంచి ఖాళీగా వస్తున్నారు. చదవండి: (స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..) ఒకవేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే తల భాగం సురక్షితంగా ఉండేదని, మరణం సంభవించి ఉండేది కాదని పలువురు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే వైరా నుంచి ఖమ్మం వెళ్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాదస్థలిలో ఆగి మానవత్వం చాటారు. కృష్ణయ్యతో పాటు గాయపడిన మరో ద్విచక్రవాహనదారుడు, కొణిజర్లకు చెందిన చింతల వీరేందర్‌ను తన ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఐదు నెలలుగా కృష్ణయ్య మేడేపల్లిలో ఉంటున్నారు. ఈ దుర్గటనతో మృతుడి భార్య అశ్విని, పిల్లలు మోజెస్‌బెన్నీ, సాత్విక కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై కొణిజర్ల ఎస్సై టీవై.రాజు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) -
ఫలానా చోటికే బదిలీ చేయాలని ఉద్యోగి పట్టుబట్టజాలడు
న్యూఢిల్లీ: ఉద్యోగి ఫలానా ప్రాంతానికే బదిలీ చేయాలని పట్టుబట్టజాలడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీకి చెందిన మహిళా లెక్చరర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధబోస్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘ఒక ఉద్యోగి/ ఉద్యోగిని తనను ఫలానా చోటికే బదిలీ చేయాలనీ లేదా బదిలీ చేయరాదని పట్టుబట్టకూడదు. యాజమాన్యమే అవసరాలను అనుగుణంగా బదిలీలను చేపడుతుంది’అని పేర్కొంది. అమ్రోహాలోని కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్ తనను గౌతమ్‌బుద్ధ నగర్‌లోని కళాశాలకు బదిలీ చేయాలని అధికారులను కోరగా తిరస్కరించారు. దీనిపై ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్లుగా అమ్రోహాలో పనిచేస్తున్న ఆమె, గతంలో 2000–2013 వరకు దాదాపు 13 ఏళ్లపాటు గౌతమబుద్ధ నగర్లో పనిచేసినట్లు గుర్తించిన హైకోర్టు తిరిగి అక్కడికే బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొంది. పనిచేసిన ప్రాంతానికే తిరిగి బదిలీ చేయాలని పట్టుబట్టరాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి -
ఏలూరులో అధ్యాపకుడి ఆత్మహత్య
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలోని కార్మెల్ డీఎడ్ కళాశాలలో దేవదానం అనే అధ్యాపకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల మూడో అంతస్తులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మృతదేహాన్ని పరిశీలించి చూడగా నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. కళాశాలకు సెలవులు కావడంతో ఎవరూ గుర్తించలేదు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్‌బోర్డ్ అధికారిపై దాడి చేసిన లెక్చరర్
-
మహిళను కాపాడిన లెక్చరర్
కావలిరూరల్: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మహిళను ప్రాణాలకు తెగించి ఓ అధ్యాపకుడు కాపాడారు. పట్టణంలోని జనతాపేటకు చెందిన మాదవరపు మహేష్ కో ఆపరేటీవ్ కళాశాలలోని తన గురువు విశ్రాంత ప్రిన్సిపల్ రత్నజోసెఫ్ ఇంటికి వచారు. ఆ సమయంలో రత్నజోసెఫ్ ఇంటి ఎదురుగా మిద్దెపైన ఉన్న మందా వెంకటేశ్వరరావు ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. వీధిలోని వారంతా అక్కడ గుమికూడి చూడగా వంట గదిలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. వెంకటేశ్వరరావు భార్య అన్నపూర్ణ మంటలను దాటుకొని బయటకు రాలేక భయంతో కేకలు వేస్తూంది. అక్కడికి చేరుకున్న వారు అగ్నిమాపకశాఖ వారికి సమాచారమందించి చూస్తూ నిలబడిపోయారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన మహేష్ వెంటనే మిద్దె మీదకు వెళ్లి తలుపులు నెట్టివేసి లోనికి వెళ్లాడు. అయితే మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫ్రిజ్‌కు అంటుకుంటున్నాయి. అత్యంత వేగంగా అన్నపూర్ణను చాకచక్యంగా పక్కకు తప్పించి గ్యాస్ సిలిండర్‌ను నెట్టేయడంతో అది పక్కకు పడిపోయింది. బెడ్షీటును తడిపి గ్యాస్ సిలిండర్‌పై వేయడంతో మంటలు ఆరిపోయాయి. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి సిలిండర్ కిందకి తీసుకువెళ్లాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించి పూర్తిగా ప్రమాదం తప్పిందని నిర్ధారించారు. మహేష్ ప్రాణాలకు తెగించి ఈ సాహసం చేసి అన్నపూర్ణను కాపాడటతో పలువురు అభినందించారు. -
దారి తప్పిన ప్రొఫెసర్‌కు గుణపాఠం చెప్పిన అమ్మాయిలు
-
ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ కీచకపర్వం
-
వాట్సప్ గ్రూప్‌లో లెక్చరర్ అశ్లీల పోస్టులు
భాగ్యనగర్‌కాలనీ: బ్రిగ్గింగ్ టు గెదర్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో చిన్నారుల పట్ల అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్న ఓ వ్యక్తిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుషాల్ అలియాస్ పవర్ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతను క్రియేట్ చేసిన గ్రూపులో చిన్నారులను అశ్లీల పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే కుషాల్పై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పోస్ట్‌లు పెట్టినట్లు లె లియటంతో కుషాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.