సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు.
వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి.
చదవండి: ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి
Comments
Please login to add a commentAdd a comment