Rajolu
-
కూటమి నేతల హల్చల్.. కోడి పందెం, రికార్డింగ్ డ్యాన్స్..
సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్‌లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్‌లను ప్రోత్సహించారు. ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. -
పవన్ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు. నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం. -
రాజోలు నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
విచిత్ర ఘటన: కరోనా భయంతో.. ఏడాదిన్నరగా ఇంట్లోనే
తూర్పుగోదావరి: రాజోలు మండలం కడలి గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి భయంతో ఓ కుటుంబం ఏడాదిన్నర కాలంగా ఇంటికే పరిమితమైంది. ఐదుగురు కుటుంబసభ్యులు ఒకే గదిలో ఉంటున్నారు. ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అవసరాల కోసం తండ్రి, కుమారుడు మాత్రమే బయటకు వచ్చేవారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలం విషయంలో వాలంటీర్ బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయాలని అడిగారు. అయితే, తాము బయటకు రాబోమని, తమకు ఇంటి స్థలం ఏమీ వద్దని తేల్చి చెప్పారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామ సర్పంచ్ చొరవతో రాజోలు పోలీసులు వారి ఇంటికి వెళ్లి వారిని బయటకు తీసుకు వచ్చారు. సరైన ఆహారంలేక బక్కచిక్కిన ముగ్గురు మహిళలను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి -
రాజోలు శ్రీ చైతన్య జూ. కాలేజీలో అమానుషం
-
అంతర్వేది ఘటన : కరోనా కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : ఇటీవల చోటుచేసుకున్న అంతర్వేదీ ఘటనలో కరోనా కలకలం రేపుతోంది. రథం దగ్ధమైనందుకు నిరసనగా పలువురు ఆందోళనలో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 36 మంది నిందితుల్లో ఇద్దరికి కరోనాగా నిర్ధారణ కాగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు కూడా పరీక్షలు చేసుకున్నారు. దీనిలో జిల్లా అదనపు ఎస్పీ( పరిపాలన) కరణం కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఆయనతో పాటు ఈ కేసును విచారించిన ఎస్పీ నయీమ్ ఆస్మి, రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఆయన డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. పలువరు పోలీసు అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు) కాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 6న ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. ఈ కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. దీనిలో సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది. (అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం) -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
రాజోలు(తూర్పుగోదావరి):వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని... కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు భార్య ప్రియుడితో కలసి కుట్ర పన్నింది. పథకం ప్రకారం మత్తు బిళ్లలు మజ్జిగ, అన్నంలో కలిపి భర్తకు ఇచ్చి అనారోగ్యం పాల్జేసింది. చివరకు ప్రియుడితో కలసి భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తి చేసింది. అడ్డుతొలగిందని ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా కూతురు విని తండ్రి హత్యకు గురైనట్టు తెలుసుకుని సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరకకు చెందిన ఉప్పు ప్రసాద్ (48) ఈ నెల 2న హత్యకు గురయ్యాడు. భర్తను హత్య చేసిన కేసులో నిందితులైన భార్య ప్రశాంతి, ప్రియుడు చొప్పల సుభాకర్(శివ), మరో ఇద్దరు నల్లి వెంకట నరసింహారావు, జిల్లెళ్ల ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. మధ్యవర్తిత్వం చేసి మత్తు బిల్లులు అందించిన మరో నిందితురాలు యడ్ల ప్రమీలరాణి పరారీ ఉంది. సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరకలో ప్రశాంతి అలియాస్ శాంతి భర్త ఉప్పు ప్రసాద్ సోడాషాపు నిర్వహించుకుంటున్నాడు. ప్రశాంతికి కేశవదాసుపాలేనికి చెందిన చొప్పల సుభాకర్(శివ)కు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. తమ సంబంధానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ప్రియుడు మత్తు బిళ్లలను మధ్యవర్తిగా ఉన్న యడ్ల ప్రమీలరాణి ద్వారా ప్రశాంతికి ఇస్తే వాటిని రోజూ భర్తకు మజ్జిగ, అన్నంలో కలిపి ఇచ్చేది. అలాచేస్తే అనారోగ్యానికి గురై ఎవరికీ అనుమానం రాకుండా భర్త చనిపోతాడని భావించారు. ఎంతకీ భర్త చనిపోక పోవడంతో ప్రియుడు శివ నేరుగా రంగంలోకి దిగాడు. ఈ నెల 2న సోడాషాపు వద్దకు వచ్చి నిమ్మసోడా కావాలంటూ ఉప్పు ప్రసాద్‌ను శివ అడిగాడు. ఈ నేపథ్యంలో వెనుక నుంచి శివ అనుచరులైన నల్లి వెంకట నరసింహారావు అలియాస్ పండు (చింతలమోరి), జిల్లెళ్ల ప్రసాద్ అలియాస్ డెక్కన్ (కేశవదాసుపాలెం)లు ప్రసాద్ మెడకు తువాలు వేసి కింద పడేశారు. పడిపోయిన ప్రసాద్ గొంతును శివ నులుమి ప్రాణాలు తీశాడు. ఎవరికీ అనుమానం రాకుండా షాపులో ఉన్న కురీ్చలో ప్రసాద్ శవాన్ని కూర్చోబెట్టి వెళ్లిపోయారు. భార్య ప్రశాంతి వచ్చి లబోదిబోమని మొసలి కన్నీరు కారుస్తూ కూతురు మేరి ప్రేస్లీని పిలిచింది. ప్రేస్లీ స్థానికుల సహకారంతో తండ్రిని రాజోలు ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అప్పటికే ప్రసాద్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తమ ఆచారం ప్రకారం మృతదేహాన్ని గ్రామంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. తండ్రి చనిపోయిన నాటి నుంచి తల్లి ప్రవర్తనలో మార్పు రావడంతో కూతురు ప్రేస్లీకి అనుమానం వచ్చింది. తల్లి సెల్‌ఫోన్ సంభాషణలపై దృష్టి పెట్టింది. ప్రియుడు శివతో తల్లి ప్రశాంతి మాట్లాడిన మాటలను విని తన తండ్రి హత్యకు గురయ్యాడని తెలుసుకుంది. ఈ నెల 26న తల్లిపై కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సఖినేటిపల్లి ఎస్సై సురేష్‌కుమార్ హత్య కేసు నమోదు చేశారు. ట్రైనీ డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, సీఐ డి.దుర్గాశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. ఈ నెల 26న ఖననం చేసిన ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించారు. హత్య కేసును ఛేదించిన ట్రైనీ డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి, ఎస్సై సురేష్‌కుమార్‌ను ఎస్పీ నయీం అస్మీ అభినందించారు. -
అవహేళన చేస్తావా.. అంటూ కత్తితో..
సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): చీటికీ మాటికీ తనను అవహేళనగా మాట్లాడుతున్న ఉపాధ్యాయుడిపై ఒక యువకుడి కత్తితో దాడి చేశాడు. రాజోలు తోరం వారి వీధిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బుడితి నాగ కోట సత్యనారాయణమూర్తిపై సోమవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన యువకుడు నల్లి విన్సెంట్ కత్తితో దాడి చేశాడు. ఉపాధ్యాయుడికి వీపుపై రెండు, ఛాతీపై రెండు మొత్తం నాలుగు చోట్ల కత్తిపోట్లు దిగాయి. దీంతో దాడి జరిగిన ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారింది. గాయాలతో కిందపడి ఉన్న ఉపాధ్యాయుడిని స్థానికులు రాజోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన యువకుడు రాజోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. యువకుడి చేతికి కూడా గాయం కావడంతో బంధువులు రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు మలికిపురం మండలం గుడిమెళ్లంక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ భార్య, కుమార్తెతో కలిసి రాజోలులోని తోరం వారి వీధిలో నివాసం ఉంటున్నాడు. అదే వీధిలో పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న పాస్టర్ నల్లి విక్టర్‌బాబు కుమారుడు విన్సెంట్. విన్సెంట్, ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి గత కొంతకాలంగా మాటామాటా అనుకుంటున్నారని స్థానికులు తెలిపారు. చీటికీమాటికీ తనను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడని అందుకే దాడికి పాల్పడినట్టు యువకుడు విన్సెంట్ తెలిపాడు. రోడ్డుపై వెళ్తుండగా ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి తనను పిలిచి కత్తి చూపించి బెదిరించాడని, దీంతో కోపం వచ్చి ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని వివరించాడు. ఈ పెనుగులాటలో ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి పాల్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో విన్సెంట్ చేతికి కూడా కత్తి గుచ్చుకుని గాయమైంది. రాజోలు ఎస్సై ఎస్.శంకర్ మాట్లాడుతూ గాయపడ్డ ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తిని అమలాపురం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, ఉపాధ్యాయుడి వాగ్మూలం నమోదు చేసుకునేందుకు సిబ్బంది వెళ్లారన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
రాజోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా బొంతు రాజేశ్వరరావు నామినేషన్
-
చనిపోయిందనుకున్న మహిళ ఆస్పత్రిలో ప్రత్యక్షం
మలికిపురం (రాజోలు): తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన పుట్టి వెంకటలక్ష్మి 2016లో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. కొద్ది రోజుల పాటు కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడింది. క్రమంగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబీకులు ఆమె ఆచూకీ కోసం వాకబు చేశారు. ఎటువంటి సమాచారం రాకపోవడంతో చనిపోయి ఉంటుందని భావించి అదే ఏడాది చివర్లో దిన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ క్రమంలో కువైట్‌లో తూర్పుగోదావరి జిల్లా ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న మహాసేన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఈ నెల 10న ఫోన్ కాల్ వచ్చింది. అక్కడి ఓ ఆస్పత్రిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ అపస్మాకర స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మహాసేన సభ్యులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. మహాసేన టీం సభ్యులు ఆమె ఫొటోను కువైట్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి, వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వాసుల ద్వారా ఆమె పాస్‌పోర్టు వివరాలు తెలుసుకుని, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి విషయాన్ని ఆమె భర్త రాఘవులు, కుమారుడు దుర్గాప్రసాద్‌కు తెలిపారు. అప్పటివరకూ వెంకటలక్ష్మి స్పృహలోకి కూడా రాలేదు. వెంకటలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ మహాసేన సభ్యులతో ఫోన్లో మాట్లాడగా..ఆ ఫోనును ఆమె చెవి వద్ద పెట్టడంతో కుమారుడి మాటలకు వెంకటలక్ష్మి స్పృహలోకి వచ్చింది. ఆమె ఎందుకు ఈ దుస్థితికి వెళ్లిందనేది చెప్పలేకపోతోందని మహాసేన సభ్యులు చెబుతున్నారు. ఆమెను భారత్‌కు తరలించేందుకు మహాసేన సభ్యులు కృషి చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం నుంచి న్యాయపరమైన అనుమతి పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని కువైట్ మహాసేన టీం అధ్యక్షుడు యల్లమిల్లి ప్రదీప్, సభ్యుడు గంటా సుధీర్ తెలిపారు. త్వరలో ఆమెను స్వదేశానికి పంపిస్తామని మహాసేన సభ్యులు చెప్పారు. -
సిరుల కోనసీమా.. నీకెన్ని కష్టాలమ్మా!
సాక్షి, రాజోలు: ‘‘బయటి ప్రపంచానికి కోనసీమ అంటే చాలా సిరిసంపదలున్న ప్రాంతంగా అనిపిస్తుంది. కానీ గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు దుర్మార్గ పాలనలో ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. గోదావరి ప్రవహించే ఈ గడ్డపై మంచినీళ్ల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. వరికి కనీసమద్దతు ధర దొరకడంలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొబ్బరి ధర 4వేల రూపాయలు పడిపోయింది. బోరు వేస్తే ఉప్పునీళ్లు, లేదంటే ఆయిల్ కంపెనీల కారణంగా కలుషితమైన నీరు వస్తుంది. కోనసీమ దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ప్రారంభించిన నీటిశుద్ధి కేంద్రాలను ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదు. సంపదగల ఈ ప్రాంతం నుంచే చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దేశంకాని దేశంలో ఘోరమైన కష్టాలు అనుభవిస్తోన్న వారిని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలులేవు. ఈ ప్రాంతానికి పట్టిన చంద్రబాబు పీడ విరగడయ్యేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జనం ఆశీర్వాదంతో రాబోయే ప్రజా ప్రభుత్వంలో కోనసీమకు తిరిగి జీవం పోస్తామని మాటిస్తున్నా..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 194వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళారీల నాయకుడు చంద్రబాబు: ధాన్యం పండిచే రైతులు, కొబ్బరి రైతులు, తమలపాకు రైతులు, సరుగుడు సాగుదారులు... ఎవర్ని కసిలినా కష్టాలు, కన్నీళ్లే. ఇక కూలీల పరిస్థితైతే ఇంకా దారుణం. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కోనసీమలో రబీ పంటకు సాగునీరు లేదు. సరే, ఏదోరకంగా కాపాడుకుని పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కనీస మద్దతు ధర దొకదు. ధాన్యం దళారీలపాలైపోయిన తర్వాతగానీ కొనుగోలు కేంద్రాలను తెరవడు ఈ ముఖ్యమంత్రి. దళారీలకు పెద్ద నాయకుడు చంద్రబాబు కాబట్టే రైతులు, పేదల కష్టాలు రెట్టింపు అయ్యాయి. నాలుగేళ్ల పాటు ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని పట్టించుకున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. ఈయన తీరు చూస్తుంటే నాకొక కథ గుర్తుకొస్తోంది... సార్.. టైమిస్తే స్టేట్ ఫస్టొస్తా!: అనగనగా ఒక విద్యార్థి ఉన్నాడు.. ఈ చంద్రబాబు మాదిరి. ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లాడు. మూడు గంటల పరీక్షలో రెండున్నర గంటలు ఏమీ రాయకుండా కూర్చున్నాడు. తీరా పరీక్ష సమయం దగ్గరపడుతుందనగా, మాస్టారు దగ్గరికొచ్చి.. ‘సార్.. నాకు ఇంకో మూడు గంటలు టైమివ్వండి పరీక్ష రాస్తాను’ అన్నాడు. విద్యార్థి తీరుకు విస్తుపోయిన మాస్టారు.. ‘మరి ఇంతసేపు ఏం చేశావయ్యా!’ అని నిలదీస్తాడు. అప్పుడా విద్యార్థి.. ‘సార్, మీరు నెల టైమిస్తే స్టేట్ ఫస్ట్ వస్తా, ఐదు నెలలు టైమిస్తే ప్రపంచంలోనే ఫస్టొస్తా..’ అని చెబుతాడు.. 2020 కల్లా దేశంలో, 2050 కల్లా ప్రపంచంలో ఏపీని నంబర్ వన్ చేస్తానంటున్న చంద్రబాబు ఈ కథలోని విద్యార్థి అయితే, మాస్టారుగా ఆయన్ని నిలదీసేది ప్రజలు. బాబు చేతిలో మోసపోనివారు లేరు: రైతు రుణాల మాఫీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కులానికో పేజీ చొప్పున అన్ని కులాలకు మేలు... అంటూ పెద్ద ఎత్తున హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిలో ఏఒక్కదానినైనా నెరవేర్చాడా? కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నది ఈయనే కదా, ఆ విషయం అడిగితే వాళ్లను తిడతాడు, రిజర్వేషన్ అడిగిన మత్స్యకారుల తాటతీస్తానంటాడు, న్యాయం చేయమని వచ్చిన నాయీ బ్రహాహ్మణులనేమో తొకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు. అసలు ఇలాంటి వాడు మనిషేనా, ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా అని అడుగుతున్నాను.. అయ్యయ్యో మీకు ఏమీ రావట్లేదా?: నాలుగేళ్లూ కళ్లుమూసుకున్న చంద్రబాబు ఆరునెల్లో ఎన్నికలుండటంతో కపటనాటకాలు మొదలుపెట్టాడు. అయ్యయ్యో.. మీకు పెన్షన్లు రావట్లేదా, రేషన్ కార్డులు లేవా.. మీకు బియ్యం రావట్లేదా.. ఆగండి.. ఇప్పుడే ఆఫీసర్లకు ఆర్డర్ ఇస్తా.. అంటాడు. ఇళ్ల స్థలాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నానంటాడు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అన్నా క్యాంటీన్లు, రెండు రూపాలయలకే మంచినీరు, ఆక్వా రైతుల కోసం ఏదో చేసినట్లు బిల్డప్ ఇస్తాడు. విభజన హామీలు చేయలేదు కాబట్టి ఎన్టీఏ నుంచి బయటికొస్తా అంటాడు. అయ్యయ్యో.. ప్రత్యేక హోదా రాలేదా, మోదీతో పోరాడుతా.. అని ఢిల్లీకి పోయి మోదీ ముందు వంగివంగి సలామ్‌లు చేస్తాడు.. ఈ మోసకారిని క్షమించొద్దు: ఈ చెడిపోయిన వ్యవస్థ మారాలంటే ప్రజలందరూ సహకరించాలి. ఒక నాయకుడు మాట చెప్పి, దాన్ని నెరవేర్చని పక్షంలో రాజీనామాచేసే రోజులు రావాలి. పొరపాటునగానీ ఈ దుర్మార్గ చంద్రబాబును క్షమిస్తే, మరిన్ని ఆకర్షణలతో ప్రజలముందుకొస్తాడు. ఇంటికో కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటాడు. ఓటుకు మూడు వేలు చొప్పున కొనే ప్రయత్నం చేస్తాడు. అతను ఇచ్చేవి తీసుకున్నా పర్లేదుగానీ, ఓటు మాత్రం మీ మనస్సాక్షిని అనుసరించి వేయండి. మోసగాళ్లు, అవినీతిపరులు మనకు నాయకులుగా ఉండటం శ్రేయస్కరంకాదని గుర్తించాలి... డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మన ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఏమేం చేస్తామన్నది నవరత్నాల ద్వారా వివరించాం. ఈ రోజు డ్వాక్రా మహిళల కోసం ఏమేం చేయబోతున్నామో మరోసారి గుర్తుచేసుకుందాం.... ఎన్నికల నాటికి ఎంతైతే బ్యాంకుల్లో అప్పు ఉంటుందో ఆ అప్పంతా నేరుగా అక్కచెల్లెమ్మలకే నాలుగు దఫాలుగా ఇస్తాం. వడ్డీ లేకుండా రుణాలు అందిస్తాం. ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లించే ఏర్పాట్లు చేస్తాం. గతంలో మహానేత వైఎస్సార్ రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆయన బాటలోనే ఇంకా ఇల్లులేని ప్రతి పేదకూ పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిస్తున్నా. ఆ ఇల్లు అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బు అవసరమైతే, నేరుగా బ్యాంకు వెళ్లి ఇంటిపై పావలా వడ్డీకే రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తాం. మనం అధికారంలోకి వచ్చాక విడదలవారీగా మద్యనిషేధాన్ని అమలులోకి తెచ్చుకుందాం. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా...’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ప్లాట్‌ఫాం ‘పైకే’ వచ్చెను
రాజోలు: ‘ఫలానా బస్సు ఫలానా ప్లాట్‌ఫాంపైకి వస్తుంది’ అన్న అనౌన్స్మెంట్లు ఆర్టీసీ బస్టాండ్లలో మామూలే. ‘ప్లాట్‌ఫాం పైకి’ అంటే ఆ ప్లాట్‌ఫాంకు సంబంధించి, ‘దిగువన బస్సులు నిలిచే చోటికి ’అనే అర్థం. అయితే రాజోలు బస్టాండ్‌లో ఆదివారం ఓ బస్సు ప్లాట్‌ఫాం పైకే వచ్చేసి, అందరినీ బెంబేలెత్తించింది. ఉదయం 6 గంటల సమయంలో రాజోలు నుంచి అమలాపురం వెళ్లే బస్సును డ్రైవర్ నాలుగో నంబరు ప్లాట్‌ఫాంకు తీసుకువచ్చాడు. బస్సు ఇంజన్ ఆపివేసి, తాళం ఆన్‌చేసి డ్యూటీ చార్టర్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో తాళం ఆన్‌చేసి ఉన్న బస్సు ఇంజన్ స్టార్టయి, ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసింది. గమనించిన కొందరు డ్రైవర్లు బస్సు ఎక్కి ఇంజన్‌ను ఆపి వేశారు. బస్సు పైకి దూసుకొచ్చిన సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరు. బస్సు ముందు భాగం ధ్వంసం కావడంతోపాటు, ప్రయాణికులు కూర్చునే బల్లలు విరిగిపోయాయి. 12 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన టెలివిజన్ పగిలిపోయింది. ఈ సంఘటనపై ఎంక్వయిరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి
రాజోలు : వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో అక్కాచెల్లెళ్లుమృతిచెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ లాకుల సెంటర్లో బుధవారం చోటుచేసుకుంది. బి. సావరం గ్రామానికి చెందిన శిరీషా(12), అనూష(8) తండ్రితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎస్ఎంసీ చైర్మన్‌పై దాడి
రాజోలు(కురవి) : రాజోలు జెడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ బానోత్ అర్జున్‌పై ఆదివారం పలువురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు. బాధితుడు అర్జున్ కథనం ప్రకారం.. బాలు తండాకు చెందిన బానోత్ అర్జున్ ఇటీవల రాజోలు హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగా, అదే తండాకు చెందిన మాలోత్ రమేష్, మాలోత్ వీరన్న, సురేష్, భద్రు, ధరావత్ సుందర్‌లు తండా శివారులో కాపు కాసి అర్జున్‌పై దాడికి పాల్పడ్డారు. దీం తో ఆయన తలకు గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. అనంతరం అర్జున్ను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన పై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'సువర్ణ ఇండియా' ఎండీ ఇంటిపై బాధితుల దాడి
రాజోలు : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడులో 'సువర్ణ ఇండియా' చిట్ ఫండ్ కంపెనీ ఎండీ బూశెం వెంకటవేణు నివాసంపై బాధితులు మంగళవారం దాడి చేశారు. ఆయన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. మలికిపురం కేంద్రంగా సుమారు రూ.3 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన సువర్ణ ఇండియా 18 నెలల క్రితం బోర్డు తిప్పేసింది. డిపాజిట్ దారులందరికీ వారి సొమ్ములు తిరిగి చెల్లించలేదు. ఈ కేసు విషయంలో వేణు అరెస్ట్ కాగా, అనంతరం బెయిల్‌పై విడుదలై... బకాయిలన్నింటినీ చెల్లిస్తానని డిపాజిట్ దారులకు హామీ ఇచ్చారు. అయితే 15 రోజుల క్రితం 'సువర్ణ ఇండియా' కంపెనీపై రాజమండ్రిలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీ డిపాజిట్ దారుల్లో మళ్లీ ఆందోళన చెలరేగింది. డిపాజిట్లు రావేమోనన్న ఆందోళనతో మంగళవారం సుమారు 15 మంది వేణు నివాసంపై దాడి చేశారు. ఆ సమయంలో వేణు, ఆయన భార్య రాజ్యలక్ష్మి ఇంట్లో లేరు. బాధితులతో రాజ్యలక్ష్మి ఫోన్లో మాట్లాడి, అందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కేసు కోర్టులో ఉన్నందున దాడులు సరికావని చెప్పడంతో వారు శాంతించి వెనక్కి వెళ్లిపోయారు. -
జనం నెత్తిన ఫైనాన్స్ సంస్థల కుచ్చుటోపి
-
బోర్డు తిప్పేసిన 'సువర్ణ ఇండియా'
రాజమండ్రి: మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఫైనాన్ష్ సంస్థలను భారీ హంగులతో ఏర్పాటు చేయడం.. ఆపై ప్రజలను బురిడీ కొట్టించడం గత కొంతకాలంగా పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఇదే జాబితాలో సువర్ణ ఇండియా ఫైనాన్స్ సంస్థ కూడా చేరిపోయింది. ప్రజలకు లేని పోని ఆశల చూపించి దాదాపు రూ.30 కోట్లు సేకరించిన అనంతరం బోర్డు తిప్పేశారు. గుట్టుచప్పుడు కాకుండా బ్రాంచీలను మూసేసిన నిర్వాహకులు మెల్లగా మూటా ముళ్లు సర్దుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ సంస్థలో పెట్టుబడిన పెట్టిన ప్రజలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సంస్థ నిర్వాహకుడ్ని పోలీసులు రాజోలులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాజోలు మాజీ ఎమ్మెల్యే వెంకట రామరాజు మృతి
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే వెంకట రామరాజు (85) కన్నుమూశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఆయన గతరాత్రి మృతి చెందారు. వెంకట రామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సీబీఐ పార్టీ తరపున తొలి ఎమ్మెల్యేగా రాజోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నేడు వెంకట రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
రాజోలు రభస
-
నటి అంజలి అరెస్ట్ అవుతుందా?
చెన్నై : నటి అంజలిని పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కలైంజయం ....ఆమెపై దాఖలు చేసిన పిటిషన్‌పై చెన్నైలోని సైదాపేట కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు పలుమారు్లు విచారణకొచ్చినా అంజలి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో గత నెల 29న సైదాపేట కోర్టు నాన్‌బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం అంజలి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నట్లు సమాచారం. దాంతో చెన్నై పోలీసులు కోర్టు అరెస్ట్ వారెంట్‌ను రాజోలు పోలీసులకు గురువారం పంపించినట్లు దర్శకుడు కలైంజయం న్యాయవాది జయప్రకాష్ తెలిపారు. దీంతో అంజలి అరెస్ట్ అవుతుందా లేక అంతకు ముందే కోర్టుకు హాజరు అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కోలీవుడ్, టాలీవుడ్లో చర్చ సాగుతోంది.