తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే వెంకట రామరాజు (85) కన్నుమూశారు.
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే వెంకట రామరాజు (85) కన్నుమూశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఆయన గతరాత్రి మృతి చెందారు. వెంకట రామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సీబీఐ పార్టీ తరపున తొలి ఎమ్మెల్యేగా రాజోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నేడు వెంకట రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.