
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
బి.కొత్తకోట: రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు.
‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన మాటలకు తలూపుతున్నారని అన్నారు.