
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్ బెలగావిలో ఖాడే బజార్‌లోని ఓ లాడ్జి బుక్ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్ సూర్యాజీతో గొడవకు దిగాడు.
ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్‌తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment