Belagavi
-
ఆటో డ్రైవర్ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్ బెలగావిలో ఖాడే బజార్‌లోని ఓ లాడ్జి బుక్ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్ సూర్యాజీతో గొడవకు దిగాడు.ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్‌తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం. -
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
నన్నే కాదంటావా.. ఆసుపత్రిలో నర్సుపైకి దూసుకెళ్లి..
బెంగళూరు: ఇటీవలి కాలంలో తమ ప్రేమను నిరాకరించారన్న కారణంగా యువతులపై దాడి ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ నర్సు.. పెళ్లికి నిరాకరించిదనే కారణంగా ఆమెపై దాడి చేశాడు యువకుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెళగావిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. ప్రసాద్ జాదవ్ అనే వ్యక్తి అక్టోబర్ 30వ తేదీన బెళగావిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. తాను తీసుకెళ్లిన బ్యాగులో నుంచి ఓ రాడును తీసి అక్కడే ఉన్న నర్సుపై దాడి చేయబోయాడు. ఈ క్రమంలో దాడిని గమనించిన బాధితురాలు.. అతడిని ఎంతో ధైర్యంగా అడ్డుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి లోపల ఉన్న మిగతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ జాదవ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అయితే, ప్రసాద్ జాదవ్ కొద్దిరోజులుగా సదరు నర్సును వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రికి దగ్గరలోనే ప్రసాద్ నివాసం ఉండటంతో తరచూ నర్సును ఫాలో చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు తెలిపింది. ఇక, ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితులు.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ జాదవ్ ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న ప్రసాద్.. నర్సుపై దాడి చేశాడు. One-sided love, attack on nurseAttacked with sickle for refusing to marry.The incident came to light from CCTV footage.The incident of a young man attacking a nurse with a sickle in Belgaum city of Karnataka has created a stir.#karnataka #love #hindi #belgaum #gulynews pic.twitter.com/H4OLr0mVl0— Guly News (@gulynews) November 28, 2024 -
తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి..
బెంగళూరు : కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటాం. అయితే కుక్కల్లో విశ్వాసమే కాదు.. అమితమైన ప్రేమ కూడా చూపిస్తాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. సాధారణంగా పెంపుడు కుక్కలు ఒక వీధి దాటి మరో వీధికి వెళ్లి తిరిగి రావడమే చాలా అరుదు. అలాంటి ఓ కుక్క ఏకంగా వందల కిలోమీర్లు ప్రయాణించింది. కొండలు,గుట్టలు, వాగులు,వంకలు దాటి చివరికి గమ్య స్థానానికి చేరుకుంది. దీంతో కుక్క యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా పిలిచి ఊరబంతి పెట్టించాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ప్రతి ఏడాది మహారాష్ట్రలోని పండరీపూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణి (విఠలుడి దేవాలయం) ఆలయానికి పాదయాత్ర చేస్తుంటారు. అలా ఓ ఏడాది పాదయాత్ర చేస్తున్న తన వెంట ఓ కుక్కని నడిచింది. అందుకే దానికి ‘మహారాజ్’ అని పేరు పెట్టాడు. తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే సమయంలో మహారాజ్‌ను తన వెంటే తీసుకుని వెళ్లేవారు.అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది విఠల్ రుక్మిణి ఆలయ దర్శనానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో పాదయాత్రగా వెళ్లిన కమలేష్‌కు మహారాష్ట పండరీపూర్‌కు వెళ్లిన తర్వాత మహారాజ్ తప్పి పోయింది. కుక్క గురించి స్థానికులను అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కమలేష్ తన పాదయాత్ర ముగించుకుని జులై 14న ఇంటికి చేరుకున్నారు.ఈ తరుణంలో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించిన కుక్క మహారాజ్ తన యజమాని కమలేష్ వద్దకు చేరింది. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. మహారాజ్ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు. -
మొక్కు తీరకుండానే మృత్యుఒడికి
రేణుకా యల్లమ్మా.. నీ దర్శనానికి వస్తున్నామమ్మా అని స్మరిస్తూ పాదయాత్రగా బయల్దేరారు. కానీ మధ్యలో మృత్యుశకటంలా బొలెరో వాహనం వచ్చింది. త్వరగా వెళ్లొచ్చు కదా అని అందులో బయల్దేరారు. విధి చిన్న చూపు చూసింది. యల్లమ్మ దర్శనానికి నోచుకోలేకపోయారు. బొలెరో ప్రమాదంలో ఆరు మంది భక్తులు అసువులు బాశారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే. కుటుంబీకుల శోకాలతో ఆ ప్రాంతం విషాద సంద్రమైంది. సాక్షి, బెంగళూరు: బెళగావి జిల్లాలో సవదత్తి రేణుకా యల్లమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం తెల్లవారుజామున రామదుర్గ తాలూకా హులకుంద గ్రామంలో ఈ దుర్ఘటన జరగ్గా, ఆరుమంది మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. బొలెరో ఎక్కిన కొంత సేపటికే - రామదుర్గ తాలూకా హులకుందకు చెందిన కొందరు భక్తులు తెల్లవారుజామున నడుచుకుంటూ యల్లమ్మ దేవి దేవస్థానికి బయల్దేరారు. - మార్గమధ్యలో బొలేరో గూడ్స్ వాహనం డ్రైవర్ వాహనం ఆపి సవదత్తిలో వదులుతానని చెప్పడంతో అందరూ ఎక్కారు. - మొత్తం వాహనంలో 23 మందిని ఎక్కించుకుని డ్రైవర్ బయలుదేరాడు. ఐదు నిమిషాలు ప్రయాణించిందో లేదో రామదుర్గ తాలూకా చుంచనూర వద్ద విఠల్ రుక్మిణి గుడి వద్ద పెద్ద చెట్టుకు గుద్దుకుంది. - వాహనం ధ్వంసం కాగా అందరూ తలోదిక్కుకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో మరొకరు మరణించారు. - హనుమవ్వ మెగాడి (25), దీపా (31), సవిత (12), సుప్రిత (11), మారుతి (43), ఇంద్రవ్వ (28)లను మృతులుగా గుర్తించారు. - మరో 16 మంది గాయపడగా వారిని గోకాక్, ఇతరత్రా ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మితిమీరిన వేగమే కారణం అతి వేగం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమైంది. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో తీసుకుని వెళ్తున్న పెద్ద పెద్ద ఇనుప పైపుల వల్ల ప్రమాద తీవ్ర ఇంకా పెరిగింది. ఇదే మార్గంలో దేవస్థానానికి వెళుతున్న ఇతర వాహనాల ప్రయాణికులు, గ్రామస్తులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కడకోళ పోలీసులు అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సంఘటన స్థలానికి ఎస్పీ సంజీవ పాటిల్ వచ్చి పరిశీలించారు. ప్రమాదంపై సీఎం బసవరాజు బొమ్మై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాకుల చెరో రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారి చికిత్సకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. -
దైవ దర్శనానికి వెళ్తూ జీపు బోల్తా.. ఆరుగురు యాత్రికులు మృతి
బెళగావి: దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు చేరుకున్నారు యాత్రికులు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), ఇందిరవ్వ(24), మారుతి(42)గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హులంద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సౌందత్తి యల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నారు. బొలెరో గూడ్స్ వాహనంలో మొత్తం 23 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో మర్రి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7 -
‘మహా’మేళాకు కర్ణాటక నో.. ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
బెళగావి: హద్దుల పంచాయితీతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారస్థాయికి చేరుకుంది. ‘మహా’ మేళ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవటంపై బెళగావి సమీపంలో సోమవారం వందల మంది ఆందోళన చేపట్టారు. కొగ్నోలి టోల్ ప్లాజా వద్దకు ‘మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి’(ఎంఈఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు వందల మంది చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెళగావి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున బెళగావిలో ప్రతిఏటా సమావేశం నిర్వహిస్తుంది మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి. గత ఐదేళ్లుగా సరిహద్దు వివాదంపై ఆందోళనలు చేస్తోంది ఎంఈఏస్. ఈ ఏడాది కూడా శీతాకాల సమావేశల తొలిరోజున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెళగావి జిల్లా ప్రధాన కేంద్రంలోని తిలక్‌వాడీ ప్రాంతంలో ఉన్న వ్యాక్సిన్ డిపో గ్రౌండ్ వద్ద ఎంఈఎస్ ఆందోళనకు దిగింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది ఎంఈఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్‌వాడీ రోడ్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహారాష్ట్ర వికాస్ అకాడీ(ఎంవీఏ) కార్యకర్తలు బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 5వేల మంది పోలీసులు.. బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95 మంది ఇన్స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలు ఆందోళనల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. Belagavi, Karnataka | Members of Maharashtra Ekikaran Samiti and NCP stage protest near Kognoli Toll Plaza near Karnataka-Maharashtra border over inter-state border issue pic.twitter.com/XaPJwEbBKv — ANI (@ANI) December 19, 2022 ఇదీ చదవండి: అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం -
రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం
దొడ్డబళ్లాపురం: మృత్యువులోనూ అన్నాచెల్లెళ్ల బంధం వీడలేదు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా గుర్లాపుర వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. గురువారం రాయబాగ తాలూకా కప్పలగుద్ది గ్రామానికి చెందిన అడివెప్ప బడిగేర (34), చెల్లెలు భాగ్యశ్రీ (22) కారులో వెళ్తుండగా ముధోళ–నిప్పాణి రాష్ట్ర రహదారిలో మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అడివెప్ప, భాగ్యశ్రీలు తీవ్ర గాయాలతో మరణించగా, మరో కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గోకాక్‌లోని ఉమారాణి ఆస్పత్రికి తరలించారు. మూడలగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. (చదవండి: పెళ్లింట విషాదం..గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురి మృతి.. పలువురికి సీరియస్) -
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. సరిహద్దు ప్రాంతం బెళగావిలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి, ‘కర్ణాటక రక్షణ వేదిక’ ఆధ్వర్వంలో బెళగావిలో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలే లక్ష్యంగా దాడులు చేపట్టారు ఆందోళనకారులు. ఓ లారీ అద్దలు పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక్కు చెందిన ఆందోళనకారులు సుమారు 400 మంది కర్ణాటక జెండాలు పట్టుకుని ధార్వాడ్ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర వాహనలపై రాళ్లు రువ్వారు. పుణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ లారీ విండ్‌షీల్డ్, అద్దం ధ్వంసమైంది. ఈ క్రమంలో భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం. అయినప్పటికీ పోలీసుల మాట పట్టించుకోకుండా రోడ్లపై బైఠాయించారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామల వద్ద వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తమకు చెందిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక ఇటీవల పేర్కొంది. దీంతో వివాదం మరింత ముదిరింది. మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్‌లు బెళగావిలో మంగళవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారి పర్యటన శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం హెచ్చరించటంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై ఈ ఇరువురు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది మహారాష్ట్ర. వారం క్రితం సైతం బెళగావిలో ఓ కళాశాల ఉత్సవాల్లోనూ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించటంతో మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు. #Maharashtra-#Karnataka border row simmers as protests erupt at the #Belagavi border; security tightened @NehaHebbs reports | #BREAKING_NEWS pic.twitter.com/ohpUguWcif — Mirror Now (@MirrorNow) December 6, 2022 ಸಾವಿರಾರು ಕನ್ನಡಿಗರನ್ನಾ ಪೊಲೀಸರು ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ ~ Police have detained 1000's of Pro Kannada Activists#Belagavi #belagavimarvellous pic.twitter.com/BEK2oTf5H8 — Belagavi_marvellous (@Belagavi_BM) December 6, 2022 ఇదీ చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం..ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
Crime News: భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ సొంత అన్నని..
బనశంకరి: అనుమానం పెనుభూతమైంది. సొంత అన్ననే కడతేర్చేందుకు వుసిగొల్పింది. కాళ్లు పట్టుకుని వేడుకున్నా తన భార్యతో సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో సొంత అన్నను హత్య చేశాడు ఇక్కడ ఓ తమ్ముడు. ఈ ఘటన కర్ణాటక బెళగావి జిల్లా చిక్కోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. చిక్కోడి పట్టణంలో అక్బర్ షేక్ (36), అమ్జద్ షేక్ అన్నదమ్ములు. ఒకే అంతస్తులో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. అయితే అక్బర్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం తమ్ముడైన అమ్జద్లో నెలకొంది. దీంతో పలుమార్లు అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి.. అలాంటిదేం లేదని తేల్చారు కూడా. కానీ.. అక్బర్ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం అమ్జద్లో నానాటికీ బలపడుతూ పోయింది. ఈ క్రమంలో.. అన్న అక్బర్‌ను లేకుండా చేయాలని అమ్జద్ పథకం రచించాడు. ఏకంగా ఓ కారు కొనుగోలు చేశాడు. శనివారం బైక్‌లో వెళ్తున్న అక్బర్‌ను కారుతో ఢీ కొట్టించాడు. యాక్సిడెంట్‌గా ఆ కేసు పోతుందని అనుకున్నాడు. అయితే యాక్సిడెంట్ చేసినా అక్బర్ చనిపోలేదని భావించి.. కారు దిగిన అమ్జద్ అక్బర్ వైపు వెళ్లాడు. తనకేం సంబంధం లేదని, వదిలేయాంటూ కాళ్లు పట్టుకున్నాడు అక్బర్. అయినా వినకుండా ఓ ఆయుధంతో అన్నను హతమార్చాడు. ఆపై నేరుగా చిక్కోడిపోలీస్స్టేషన్లో లొంగిపోయాడు అమ్జద్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి..
యశవంతపుర (బెంగళూరు): కుటుంబ విలువలకు సమాధి కడుతూ ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. ఇందులో కూతుర్ని కూడా భాగస్వామిని చేసింది. సినిమాలో మాదిరిగా భర్తను హత్య చేసిన భార్య, కూతురితో పాటు ప్రియున్ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రవీంద్ర గడాది వివరాలను వెల్లడించారు. బెళగావికి చెందిన సుధీర్ దుబాయ్‌లో వ్యాపారం చేసేవారు. ఆయన భార్య రోహిణి, కూతురు స్నేహ బెళగావిలో నివాసం ఉంటున్నారు. కరోనా కాలంలో సుధీర్ బెళగావికే వచ్చేశాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకొందనే అనుమానంతో సుధీర్ గొడవపడేవాడు. దుబాయ్‌లో వ్యాపారంలో సంపాదించిన డబ్బులను అతడు భార్య, కూతురికి ఇవ్వకుండా ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసేవాడు. నిద్రిస్తుండగా దాడి ఈ నెల 17న రాత్రి సుధీర్ భోజనం చేసి ఇంట్రో నిద్రిస్తున్నాడు. ప్లాన్ ప్రకారం రోహిణి, ఆమె ప్రియుడు అక్షయ్, కూతురు స్నేహ కలిసి మారణాయుధాలతో అతన్ని హత్య చేశారు. తెల్లవారుజామున ఎవరో చంపేశారని తల్లీకూతురు విలపించసాగారు. పోలీసులు విచారణలో.. సుధీర్ దేహంపై గాయాలు, చేయి విరగడం వంటివి చూసి తల్లీ కూతుళ్లతో పాటు ఎవరో పురుషుడు కూడా ఈ హత్యలో పాల్గొని ఉంటాడని అనుమానించారు. అనుమానంతో విచారణ భార్య, కూతురి మాటలపై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు నిందితుడు అక్షయ్‌ని కూడా పోలీసులు విచారించారు. దృశ్యం సినిమాలో మాదిరి తమకు ఏమీ తెలియదని రకరకాల అసత్య ఆధారాలను చూపించారు. కానీ చివరకు నిజం కక్కించారు. స్నేహ ప్రియుడు అక్షయ్ బెళగావికి చెందినవాడు కాగా, పుణెలో ఉంటున్నాడు. అతనికి పెళ్లయి, కూతురు ఉంది. భర్తని అడ్డు తొలగించుకోవడానికి రోహిణి, ఆమె కూతురు కలిసి అక్షయ్‌తో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
కట్టుకున్న భార్యే కాటికి పంపింది
యశవంతపుర: బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హొసూరు వద్ద వ్యక్తి హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేలింది. భార్యతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి రామదుర్గ తాలూకా హొసూరుకు చెందిన రైతు పాండప్ప (35) హత్యకు గురయ్యాడు. పాండప్ప, భార్య లక్ష్మీలు దంపతులు. లక్ష్మీకి రమేశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో పాండప్ప ఊరి నుంచి దూరంగా ఉన్న పొలంలోని షెడ్‌కు నివాసాన్ని మార్చాడు. దీంతో లక్ష్మి రమేశ్‌ను కలవడం కష్టంగా మారింది. పాండప్ప ఉంటే తాము జల్సాగా ఉండలేమని ఇద్దరూ భావించారు. రాత్రి నిద్రపోతున్న పాండప్పపై ఇద్దరూ బండరాయితో బాది హత్య చేశారు. శవాన్ని బైకుపై తీసుకెళ్లి సమీపంలోని కాలువలో పడేశారు. కోడలు, ఆమె ప్రియుడే ఈ హత్య చేశారని హతుని తండ్రి దుండప్ప ఫిర్యాదు చేశారు. (చదవండి: స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ) -
అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరానా భర్త హల్చల్
యశవంతపుర: గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రావాలని ఒత్తిడి చేయడానికి కాల్పులు జరిపాడో ఘరానా భర్త. బెళగావి జిళ్లా అథణి తాలూకాలో ఈ సంఘటన జరిగింది. విజయపుర జిల్లా సింధగికి చెందిన శివానంద కాలేబాగ సోమవారం సాయంత్రం భార్య ప్రీతి పుట్టినిల్లు అయిన అథణికి వెళ్లాడు. ప్రీతితో అతనికి నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా మూడేళ్ల చిన్నారి ఉంది. భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సంసారంలో విభేదాలు ఏర్పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం శివానంద అత్తవారింటికి వెళ్లి ప్రీతితో గొడవపడ్డాడు. తన వెంట రావాలని కోరగా ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేక శివానంద తనవద్దనున్న రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. నిన్ను చంపి నేను చచ్చిపోతానని వీరంగం సృష్టించాడు. దీంతో ప్రీతి, ఆమె తల్లిదండ్రులు అథణి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతన్ని అరెస్ట్ చేసి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని, విజయపుర జిల్లా వరకు మాత్రమే అనుమతి ఉందని గుర్తించారు. (చదవండి: అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..) -
లైంగిక ఆరోపణలు.. కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య!
బెలగావి: కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా.. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్‌కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది. అయితే.. తాజాగా ఇద్దరు కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది అక్కడ. అందులో లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంచలనం సృష్టించిన పోక్సో కేసు -
షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!
7 Aborted Fetuses: బెళగావి జిల్లాలోని ముదలగి గ్రామంలో ఒక డబ్బాలో గర్భస్రావం చేయబడిన ఏడు పిండాలను స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్ ఘటన బెళగావి జిల్లా ముదలగి గ్రామంలోని బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనే స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు పోలీసులు ఆ డబ్బాలో ఏడు పిండాలను గుర్తించారు. అవన్నీ ఐదు నెలల పిండాలని, భ్రూణ హత్యలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ విషయమై జిల్లా యంత్రంగాం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా ఈ పిండాలను ఆస్పత్రికి తరలించి, ఆపై పరీక్ష కోసం జిల్లా ఫంక్షన్ సైన్స్ సెంటర్ తీసుకువెళ్తున్నామని పోలీసులు చెప్పారు. (చదవండి: మహిళను బంధించి దోపిడీ) -
పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. దాడి
బెళగావి: కర్ణాటక బెళగావిలో కన్నడ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దమానే గ్రామంలో రేష్మ-సాయిబన్వర్‌ల వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలను ప్రదర్శించడంతో పాటు కన్నడ జెండాలతో డ్యాన్సులు చేశారు కొందరు. దీంతో చన్నమ్మనగర్‌కు చెందిన ఎంఈఎస్ కార్యకర్తలు కొందరు ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు యువకులను తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వాళ్లను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. పది మంది ఎంఈఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: వెడ్డింగ్ కార్డుపై 'వయలెన్స్' డైలాగ్.. వైరల్
Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 'కేజీఎఫ్ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో యశ్ చెప్పిన డైలాగ్‌లో పత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైనప్పటినుంచే యశ్ డైలాగ్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇందులోని 'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్, రీల్స్ వచ్చి ఎంతో అలరించాయి. అయితే తాజాగా ఈ డైలాగ్ తరహాలో తన మ్యారేజ్ గురించి వెడ్డింగ్ కార్డ్‌పై డైలాగ్ ప్రింట్ చేయించడం వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ తన పెళ్లి శుభలేఖపై 'మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవైడ్.' అని ముద్రించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది రాకీ భాయ్ క్రేజ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అలాగే మరోపక్క బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వైలెన్స్ బీభత్సంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చదవండి: కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. చదవండి: రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
బిల్డర్ కారును అడ్డగించి కారం పొడి చల్లి.. ఆపై కిరాతకంగా..
యశవంతపుర: బెళగావిలో మంగళవారం తెల్లవారుజామున జామున ఓ బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని గురుప్రసాద్‌నగరలో నివాసం ఉంటున్న బిల్డర్ రాజు దొడ్డబణ్ణవర (46) హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూడటానికి ఆయన కారులో వెళ్తుండగా దుండగులు కారును అడ్డగించి కారం పొడి చల్లి మారణాయుధాలతో నరికి పరారయ్యారు. మరో ఘటనలో.. వివాహిత ఆత్మహత్య యశవంతపుర: వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. బాగలకోటకు చెందిన విద్యాశ్రీ (22)ని మూడేళ్ల క్రితం బెళగావికి చెందిన ఆనంద్‌కు ఇచ్చి వివాహం చేశారు. హనూరు తాలూకా హొగ్యం గ్రామపంచాయతీ పీడీఓగా పని చేస్తున్న ఆనంద్ కొళ్లేగాలలో నివాసం ఉంటున్నారు. విద్యాశ్రీని కట్నం కోసం వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉంది. ఆనంద్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..
సాక్షి, బెంగళూరు(బనశంకరి): బెళగావిలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా, భర్త, అత్తమామలను అరెస్టు చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెళగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలు క్రిషా కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీశ్, అతని కుటుంబమే ఆమెను హత్యచేశారని ఆరోపించారు. వారందరినీ అరెస్ట్ చేసే వరకు మృతదేహాలను తీసుకునేదిలేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడురోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లీపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11 తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36), పిల్లలు వీరేన్ (07), బావీర్ (04) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబసభ్యులు పరారయ్యారు. కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ క్రిషాకు వేరొకరితో సంబంధం ఉందని, అదే ఆత్మహత్యలకు కారణమని అన్నారు. చదవండి: (పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..) -
కర్ణాటక: చేతబడికి గురైనట్లు అనుమానిస్తున్న రెండేళ్ల చిన్నారి మృతి
బెంగళూరు: కర్ణాటకలో చేతబడికి గురైనట్లు అనుమానిస్తున్న రెండేళ్ల చిన్నారి మరణించింది. బెలగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. అయితే ఇప్పటికీ ఆ చిన్నారి ఎవరనే విషయం తెలియరాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా సెప్టెంబర్ 24న బెలగావిలోని హల్యాలా గ్రామం వద్ద ఉన్న చెరుకు పొలంలో రెండేళ్ల బాలికను బట్టలో చుట్టి పడేసినట్లు కొంతమంది రైతులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో చేతబడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాధితురాలి ఒంటిపై సిగరెట్ పీకలు, కెమికల్స్ వాడినట్లు కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానించారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో చిన్నారిపై అత్యాచారం జరగలేదని తేలింది. అయితే ఆసుపల్రిలోని బాలిక ముందుగా కోలుకుంటున్న లక్షణాలు కనిపించినప్పటికీ మళ్లీ సిరీయస్ అయ్యిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఇప్పటి వరకు ఎవరూ కూడా మిస్సింగ్ కేసు నమోదు చేయలేదని తెలిపారు. కూతురు మిస్ అయినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటనలో వారి పాత్ర ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని గుర్తించేందుకు కర్ణాటకతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు పాప ఫోటోను పంపించారు. -
ప్రధానోపాధ్యాయుడి కీచక బుద్ధి.. వ్యాక్సినేషన్ వేయడానికి వచ్చిన నర్స్పై..
బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్లు వేసుకునే విధంగా.. ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ సెంటర్ ఉద్యోగిని పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించి.. అశ్లీల సందేశాలను పంపించాడు. బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బెళగావిలోని దేగాం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగిని గత రెండు వారాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ లు వేస్తుంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ చావలాగి .. మహిళా ఉద్యోగి సెల్‌ఫోన్ నంబర్‌ను సంపాదించాడు. ఆ తర్వాత.. ప్రతిరోజు ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా.. అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపుతూ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించసాగాడు. దీంతో ఆమె అతనికి ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. అయినప్పటికి అతగాడు తన వక్రబుధ్ది మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె బంధువులు, స్నేహితులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి గడిచిన బుధవారం (ఆగస్టు4) ప్రధానోపాధ్యాయుడి ఛాంబర్‌కు చేరుకుని ఆ కీచకుడిని గదిలో బంధించారు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేశారు. అయితే, తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సస్పెండ్ చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కాగా, బాధితురాలు సురేష్ చావలాగిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్ ఇంటికెళ్లి
బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టణమంతా ఎక్కడ చూసినా చెత్త ఉంటుండడంతో ఆయనకు మండింది. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన స్థానికంగా హట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా దక్షిణ బెళగావి ఎమ్మెల్యే అభయ్ పాటిల్ (బీజేపీ). బెళగావి పట్టణంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో వీధులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. బెళగావి పట్టణ మున్సిపల్ (బీసీసీ) అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఓ ట్రాక్టర్ తీసుకుని చెత్త వేసుకుని ఆయనే స్వయంగా నడుపుతూ విశ్వేశ్వరనగరలోని మున్సిపల్ కమిషనర్ కేహెచ్ జగదీశ్ ఇంటికి వెళ్లాడు. చెత్తనంతా ఇంటిముందు కుమ్మరించాడు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కమిషనర్‌కు చెప్పేందుకే తాను ఈ నిరసన చేపట్టినట్లు ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు కూడా ఇలాగే చేస్తామనని ఎమ్మెల్యే హెచ్చరించాడు. మరి ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో. ఈ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ గతంలో పలు వింత కార్యక్రమాలతో వార్తల్లో నిలిచాడు. కరోనా పోవాలని పట్టణంలో యాగం నిర్వహించడమే కాక నగరమంతా సామ్రాణి వేయించారు. Garbage full of tractor was dumped infront of City corporation commissioner K.H Jagadish's house today. Three month ago corporation officials were warned to maintain cleanliness in the city but there was no improvement, garbage is at every corner of city. pic.twitter.com/tv7ndkQw9T — Abhay Patil (@iamabhaypatil) July 25, 2021 -
ఆర్మీ జవాన్ మృతి.. సైనిక దుస్తుల్లో నాన్నకు సెల్యూట్
సాక్షి, బెంగళూరు: సైన్యంలో పనిచేసే కన్నతండ్రికి సైనిక దుస్తుల్లో నివాళులర్పించిన చిన్నారి తనయుడు అందరినీ కంటతడి పెట్టించాడు. నాగాల్యాండ్‌లో ఆర్మీ జీపు బోల్తా పడి కర్ణాటకలో బెళగావి జిల్లా శివపురకు చెందిన ఆర్మీ జవాన్ (డ్రైవర్) మంజునాథ గౌడన్నవర మరణించారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆర్మీ యూనిఫాంలో ఆయన తనయుడు స్వరూప్ (5) సెల్యూట్ చేస్తుండగా ఓదారుస్తున్న బెళగావి ఎంపీ మంగళా అంగడి. బాలున్ని ఆ పరిస్థితిలో చూసిన గ్రామస్తుల మనసులు చలించాయి. -
నా బావి కనిపిస్తలే.. కాస్త వెతికిపెట్టండి సారు
బెంగళూరు (బెలగావి): ప్రభుత్వ అధికారుల చేతివాటం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించగలరు. అలా ఏం చేశారో పాపం ఓ రైతు తన బావి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలు బావి కనిపించకపోవడం ఏంటి అనుకుంటున్నారా! అధికారులు సక్రమంగా పని చేసేంతవరకు ఇలాంటి విచిత్రాలే జరుగుతాయ్ మరి. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని మావినహొండ గ్రామంలో మల్లప్ప అనే రైతు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా వెతికి పెట్టాలి సారు అంటూ రాయబాగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఫిర్యాదును చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. బావి కనిపించకపోవడమేంటని రైతుని గట్టిగా నిలదీశారు కూడా. దీంతో ఆ రైతు ఈ ఫిర్యాదు వెనుక దాగున్న అసలు నిజం చెప్పాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు నిజం ఏమిటంటే.. మల్లప్ప పొలంలో ఎన్ఏఆర్ఈజీఏ పథకం కింద బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించారు. అదే క్రమంలో ఇందుకు రుణం రూపంలో రూ.77000 బిల్లును కూడా మంజూరు చేసి ప్రభుత్వ నిధులు కాజేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీనికి కారకులైన మహానుభావులకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్రస్తుతం దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పామును మెడకు చుట్టుకుని.. ఎంచక్కా సైకిల్‌పై చక్కర్లు!
పాము ఎదురుపడగానే చెమటలు పట్టి వణికిపోతారు ఎవరైనా. నోటమాట రాక నిశ్చేష్టులైపోతారు. ఇక పామును ముట్టుకోవాలంటే ప్రాణాలు పైనే పోతాయి. ఎవరో కొందరు ధైర్యవంతులు మాత్రం సర్పాలతో ఆడుతూ ఔరా అనిపిస్తారు. రెండో కోవకు చెందిన వ్యక్తే ఈ వృద్ధుడు. తన ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకుని మెడకు చుట్టుకుని సైకిలెక్కి ఊరంతా చుట్టివచ్చాడు. చూపరులందరూ సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టారు. కర్ణాటకలో బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో ఆదివారం ఈ విడ్డూరం చోటుచేసుకుంది. ఓ వృద్ధుని ఇంట్లోకి పాము (జెర్రిపోతు) చొరబడగా ఏమాత్రం చలించకుండా పామును పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. సైకిల్ మీద గ్రామంలో సంచరించాడు. కొందరు అతన్ని ఆపి ఆసక్తిగా చూశారు. తరువాత పామును దూరంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. – బనశంకరి -
Karnataka Bypoll: హమ్మయ్య గెలిచాం!
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో జరిగిన ఒక లోక్‌సభ స్థానం, రెండు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ రెండు విజయాలతో పరువు నిలుపుకొంది. కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. ఇటీవల ఉప ఎన్నికలు జరగ్గా ఆదివారం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. బెళగావిలో టెన్షన్.. మంగళ అంగడి గెలుపు బెళగావి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. బీజేపీ అభ్యర్థి మంగళ అంగడి కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ జార్కిహోళిపై 2,903 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. కేంద్ర మంత్రి సురేష్ అంగడి మృతితో బెళగావి లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు రావడం, ఆయన సతీమణి మంగళ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం తెలిసిందే. 35 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగగా, 36వ రౌండు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. 82వ రౌండ్లో మొగ్గు బీజేపీ వైపు మారింది. నువ్వా–నేనా అన్నట్లు ఇరుపక్షాలూ తలపడ్డాయి. మంగళకు 4,35,202 ఓట్లు, సతీష్‌కు 4,32,299 ఓట్లు వచ్చాయి. బీజేపీ శ్రేణులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. మంగళకు బీజేపీ హవా, సానుభూతి పవనాలు పని చేయలేదా..? అనేది చర్చనీయాంశమైంది. బసవకళ్యాణ, మస్కి చెరొకరికి బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర 20,449 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. కాంగ్రెస్ అభ్యర్థి మాలకు 50,107 ఓట్లు రాగా, జేడీఎస్ అభ్యర్థికి 11,390 ఓట్లు రాగా,బీజేపీ అభ్యర్థికి 70,556 ఓట్లు వచ్చాయి. ఇక మస్కి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ తుర్విహాళ్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌గౌడ పాటిల్‌పై 36,641 ఓట్లు మెజార్టీతో గెలుపాందారు. బీజేపీ అభ్యర్థి తరఫున ఇక్కడ సీఎం యడియూరప్ప, ఆయన తనయుడు విజయేంద్ర తదితరులు ప్రచారం చేయడం తెలిసిందే. కాగా ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు నేతల సహాయ నిరాకరణ వల్ల తాను ఓటమి పాలయ్యానని ప్రతాప్‌గౌడ పాటిల్ వాపోయారు. -
బెళగావి లోక్‌సభ సీటు బీజేపీ కైవసం
న్యూఢిల్లీ: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. కర్ణాటకలో బెళగావి లోక్‌సభ స్థానంలో దివంగత కేంద్రమంత్రి సురేష్ అంగడి భార్య, బీజేపీ అభ్యర్థి అయిన మంగళ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. కేరళలో మళప్పురం లోక్‌సభ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అయిన అబ్దుస్సమాద్ సమాదాని గెలిచారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ కంటే కాంగ్రెస్ నేత విజయ్ వసంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, కర్ణాటకలోని బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర గెలిచారు. మస్కిలో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ తురివనహాల్ గెలిచారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 2 చోట్ల, మరో చోట బీజేపీ గెలిచాయి. గుజరాత్లో మర్వా హదాప్ స్థానంలో బీజేపీ నేత నిమిషా సత్తార్ గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని సాల్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేష్ గెలిచారు. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ నేత నోముల భగత్ గెలిచారు. జార్ఖండ్‌లోని మధుపూర్‌లో జేఎఎం అభ్యర్థి హఫీజుల్ విజయం సాధించారు. -
లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధం: శ్రద్ధ
యశవంతపుర/కర్ణాటక: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తమ కుటుంబం బెళగావి లోక్‌సభ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుందని దివంగత కేంద్రమంత్రి సురేశ్ అంగడి కూతురు, మంత్రి జగదీశ్ శెట్టర్ కోడలు శ్రద్ధా శెట్టర్ తెలిపారు. బెళగావి విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బెళగావిలో పోటీకి మానసికంగా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. అయితే, పోటీపై బీజేపీ హైకమాండ్ నిర్ణయమే అంతిమం అని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందన్నారు. కాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి(65) గతేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం విదితమే. మహమ్మారి కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఆయన ప్రాతినిథ్యం వహించారు. సురేష్ అంగడి స్వస్థలం బెళగావి జిల్లాలోని కేకే కొప్పా. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శ్రద్ధ ఉన్నారు. ఇక సురేష్ అంగడి మరణంతో బెళగావి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, ఆ స్థానంలో ఆయన కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఈమేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కూతురు స్ఫూర్తితో సురేష్ అంగడి(ఫైల్ ఫొటో) చదవండి: రాజకీయాలకు రాంరాం: దీప -
ఘోర ప్రమాదం: ఆరుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలోనే ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెళగావి జిల్లా, రామదుర్గం తాలుకా చించనూరు గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ధార్వాడ జిల్లా మోరబ గ్రామంలో కూలీ పనులకు వెళ్లారు. శుక్రవారం రాత్రి పనులు ముగించుకొని టాటా ఏస్‌లో వస్తుండగా బెళగావి జిల్లా, సవదత్తి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ధార్వాడ రోడ్డులో బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు టాటా ఏస్ నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఐదుగురు మహిళలు, చిన్నారి ఘటనా స్థలంలో మృతి చెందారు. సవదత్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
తోపుడు బండిపై శవాన్ని తోసుకెళ్లిన భార్య..
-
తోపుడు బండిపై శవాన్ని తోసుకెళ్లిన భార్య..
బెంగళూరు: కర్ణాటకలో దయనీయ దృశ్యం చోటు చేసుకుంది. భర్త అంత్యక్రియలకు ఎవరూ చేయందించకపోవడంతో కొడుకుతో కలిసి ఓ మహిళ భర్త శవాన్ని తోపుడు బండిపై స్మశానానికి తోసుకుంటూ తీసుకెళ్లింది. జూలై 17న కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుండె జబ్బుతో బాధపడుతున్న 55 ఏళ్ల సదాశివ్ హిరాతీ అనే వ్యక్తి బుధవారం రాత్రి మరణించాడు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయితే అతడిని దహన సంస్కారాల కోసం తీసుకువెళ్లేందుకు కుటుంంబ సభ్యులు, బంధువులు కోవిడ్ భయంతో ముందుకు రాలేదు. (10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు) సాయం కోసం ఇంటి పక్కన ఉన్నవారి తలుపులు తట్టినా ఎవరూ ఎవరూ స్పందించలేదు. దీంతో ఆమె కంటనీళ్లతో తన భర్త శవాన్ని తెల్లని వస్త్రంతో కప్పి తోపుడు బండిపై పడుకోబెట్టింది. అనంతరం తన కొడుకుతో కలిసి శవాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లడానికి సిద్ధమైంది. అలా కొంతదూరం నడిచేసరికి ఓ కూలీ తోపుడు బండి నెట్టేందుకు ముందుకువచ్చాడు. అతని సహాయంతో మూడు నాలుగు కిలోమీటర్లు తోసుకుంటూ నడిచిన తర్వాత స్మశానానికి తీసుకెళ్లి భర్త శవానికి దహన సంస్కారాలు పూర్తి చేసింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన) -
రెండు రాష్ట్రాల మధ్య భూ వివాదం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక, మహారాష్ట్ర మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బెళగావి భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటకలో మరాఠా మాట్లాడుతున్న ప్రజలంతా బెళగావిలో నివశిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం తమదంటే తమదేనని రెండు రాష్ట్రాల మధ్య గతకొంత కాలంగా వివాదం సాగుతోంది. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ఆందోళనలు మరింత ఎక్కువగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెళగావి వివాదంపై ఆయన దృష్టిసారించారు. బెళగావి ముమ్మాటికి తమకే చెందుతుందని, దానిని సాధించి తీరుతామని ఠాక్రే స్పష్టం చేశారు. అనంతరం దీనిపై కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఠాక్రే వ్యాఖ్యలపై కన్నడనాట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఠాక్రే ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారని, బెళగావి ముమ్మాటికి తమదేనని పేర్కొన్నారు. కన్నడకు చెందిన ఇంచు స్థలం కూడా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆ ప్రాంతం కోసం తీవ్రంగా పోరాడుతున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్హాపూర్‌లో యడియూరప్ప దిష్టిబొమ్మను ఆ పార్టీ నేతలు దహనం చేశారు. దీంతో రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. తాజాగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి నేతలను రాష్ట్ర సరిహద్దుల్లో నిలబెట్టి తుపాకీతో కాల్చి పారేయాలంటూ కర్ణాటక నవనిర్మాణ సేన అధ్యక్షుడు భీమాశంకర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆందోళనకారులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొల్హాపూర్‌లో కన్నడ సినిమా ప్రదర్శనలను శివసైనికులు అడ్డుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా రెండు ప్రాంతాల మధ్య బస్సు సర్వీసులను రద్దు చేశారు. -
సైనికుడు రాహుల్‌కు కన్నీటి వీడ్కోలు
బొమ్మనహళ్లి: కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ గత శుక్రవారం వీర మరణం పొందిన బెళగావి తాలుకాలోని ఉచగాం గ్రామానికి చెందిన జవాన్ రాహుల్ బైరు సుళగేకర (21)కు కుటుంబం, వేలాది మంది ప్రజలు అశ్రునివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు మరాఠా సంప్రదాయం ప్రకారం జరిపారు. అంతిమ యాత్రలో గ్రామస్తులతో పాటు పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటకు బెళగావి సాంబ్రా విమానాశ్రయానికి పార్థివ దేహం తీసుకువచ్చారు. 30 కిలోమీటర్లు ఊరేగింపు అక్కడి నుంచి ఆర్మీ వాహనంలో 30 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వందలాది మంది నినాదాలు చేసుకుంటూ అనుసరించారు. రాహుల్ అమర్ రహే, భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. మంత్రి జగదీశ్ శెట్టర్, కేంద్రమంత్రి సురేశ్ అంగడి, ఎమ్మెల్యేలు అనిల్ బెనకె తదితరులు పాల్గొన్నా రు. జిల్లా కలెక్టర్ ఎస్బీ బొమ్మనహళ్లి, ఎస్పీ లోకేశ్‌కుమార్ తదితరులు నివాళులు అర్పించారు. భౌతికకాయంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని ఆర్మీ అధికారులు జవాన్ కుటుంబానికి జ్ఞాపకార్థంగా అందించే దృశ్యం చూసి వేలాది మంది హృదయాలు చలించాయి. -
యడియూరప్ప అల్లుడు పోలీసులతో వాగ్వాదం
-
పోలీసులపై సీఎం అల్లుడు తిట్ల వర్షం!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పెద్ద అల్లుడు విరూపాక్ష యమకనమరాది శనివారం పోలీసులతో ఘర్షణకు దిగారు. బెలగావిలోని ప్రభుత్వ ఆతిథి గృహం ( సర్క్యూట్ హౌస్ ) నుంచి విరూపాక్ష తన కారులో బయటకు వెళ్తున్న.. క్రమంలో నెమ్మదిగా వెళ్లమని పోలీసులు సూచించారు. అయితే ఆయన తమ మాటలు పట్టించుకోకపోవడంతో పోలీసులు కారును అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడై విరూపాక్ష తన కారును ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో పోలీసులపై తిట్ల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సర్క్యూట్ హౌస్ నుంచి బయటకు వచ్చి పోలీసులకు, విరూపాక్షకు మధ్య జరుగుతున్న ఘర్షణను శాంతింపజేశారు. కాగా యెడ్డీ పెద్ద అల్లుడైన విరూపాక్ష బెలగావికి చెందినవారు. ప్రస్తుతం ఆయన హుబ్లిలో పనిచేస్తున్నారు. కాగా విరూపాక్ష పోలీసులతో ఘర్షణ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కర్ణాటకలో తాండవిస్తున్న కరవు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర కర్ణాటకలోని బెలగావి జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్నవి. 2018, అక్టోబర్ నుంచి 2018, డిసెంబర్ నెల వరకు సరాసరి 152..5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా, కేవలం 50.6 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే పడింది. ఇదే జిల్లాలోని అథాని తాలూకాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ 135.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, కేవలం 40 మిల్లీమీటర్ల వర్షం పాతం కురిసింది. ఎక్కువగా జొన్నలు పండించే అక్కడి రైతులు ఈఏడాది పంట వేయలేదు. ప్రత్యామ్నాయంగా ఆవులు, మేకలు కాస్తూ బతుకుతున్నారు. లీటరు పాలు మార్కెట్లో 30 రూపాయలు పలుకుతుండడంతో ఆవు పాల వ్యాపారం కాస్త రైతులకు లాభసాటిగానే సాగుతూ వచ్చింది. అయితే బొత్తిగా వర్షాలు లేకపోవడం పశువుల పోషణకు కూడా శాపంగా మారింది. నీళ్లు లేక ఆవులను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అక్కడ ఈసారి పంటలు వేయకపోవడంతో ‘ప్రధాన మంత్రి ఫాసల్ భీమా యోజన కింద అక్కడి రైతులకు భీమా కూడా దక్కదు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలోనే రాష్ట్రంలోని 30 జిల్లాలకుగాను 23 జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో కూడా 16 జిల్లాల్లో కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని ‘సెంట్రల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్’ తెలిపింది. బెలగావి జిల్లాను మాత్రం శాశ్వత కరవు ప్రాంతంగా గుర్తించారు. వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ‘కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్’ వరుణ మిత్ర పేరిట ఫోన్ సేవలు వినియోగంలోకి తేగా, ఒక్క 2018లోనే దానికి 15,25,000 ఫోన్‌కాల్స్ వచ్చాయి. వాటిలో 90 శాతం రైతులు చేసినవే. ఒక్క బెలగావి జిల్లా నుంచి 52,471 కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. 700, 800 అడుగుల లోతుకుపోతేగానీ బోరింగ్‌ల్లో నీళ్లు రావడం లేదు. మరో దిక్కు రాష్ట్రంలోని పలు రిజర్వాయర్‌లో నీటి మట్టం 15 శాతానికి దిగువకు పడిపోయాయి. ఇప్పటికే రుతుపవనాల రాక పక్షం రోజులు ఆలస్యం అవడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. -
రాత్రికి రాత్రే ఇంటిలా మార్చేశారు!!
సాక్షి, బెంగళూరు : బెలగావి జిల్లాలోని కిట్టూర్ తాలూకాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పని పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాకపోకలు అంతంత మాత్రంగా ఉండే కిట్టూర్ బస్టాండ్ గోడలపై ఇటుకలు పేర్చి, తలుపులు కూడా బిగించి.. ఇంటిలా మార్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి వరకు బస్టాండ్లా ఉండి.. తెల్లారేసరికి ఓ ఇంటిగా మారడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా ఎవరో ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని, ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
ఫిట్నెస్ చాలెంజ్; సరికొత్త సంచలనం!
బెల్గావి: ‘డాన్సింగ్ అంకుల్’ను తలదన్నే రీతిలో ‘అల్టిమేట్ ఫిట్నెస్ చాలెంజ్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ నుంచి ఫిట్నెస్ చాలెంజ్‌ల పరంపర మొదలుకావడం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించడం, సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నక్రమంలో.. హోరువానలో నడిరోడ్డుపై నిలబడి ఈ పెద్దాయన చేసిన విన్యాసాలను నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్నెస్ చాలెంజ్: కడుపునిండా మద్యం సేవించి, ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఈ పెద్దాయన చేసిన విన్యాసాలకు నెటిజన్లు ‘ఫిట్నెస్ చాలెంజ్’తో పోల్చుతున్నారు. కాసేపు పుషప్స్ కొట్టి.. మరికాసేపు ఆకాశంతో అలౌకిక సంభాషణచేసి.. మళ్లీ పుషప్స్ కొట్టి.. తొగడొట్టి... చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. కర్ణాటకలోని బెల్గావి పట్టణంలో ఈ వీడియోను చిత్రీకరించారు. అక్కడ భారీ వర్షాలు: కర్ణాటకలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుముకురు, ధావన్గిరి, కలబుర్గి, ధర్వాడ్, హుబ్లీ, గదగ్ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల జనజీవనం అస్తవ్యవస్థమైపోయింది. -
ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్నెస్ చాలెంజ్!
-
కన్నడ నాట ప్రలోభాల పర్వం!
యశ్వంతపుర(బెంగళూరు): ఎన్నికల వేళ కన్నడ నాట ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకుల ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రెషర్ కుక్కర్ల లోడుతో కూడిన లారీని బెళగావి ఎన్నికల అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాల్కర్ ఫొటోలతో కూడిన స్టిక్కర్లు ఉండటం గమనార్హం. ఈమె బెళగావి రూరల్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. బీజేపీ నేత అనిల్ బెనకె ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక లారీని తనిఖీ చేయగా కుక్కర్లు కనిపించాయి. ఒక్కో కుక్కర్ విలువ రూ.700 ఉంటుందని అధికారులు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వీటిని తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. మే 12న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 15న ఫలితాలు వెలువడతాయి. -
ఆ మంత్రి భోజనం మహా ఖరీదు
► 10 రోజులకు తిండి ఖర్చు రూ.4 లక్షలు ► బెళగావి అసెంబ్లీ సమావేశాల వ్యయం రూ.7కోట్లు సాక్షి, బెంగళూరు: ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పై చట్టసభల్లో చర్చకు రాకపోయినా ప్రజా ధనాన్ని మాత్రం మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఇందుకు గత ఏడాది బెళగావిలో జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలే నిదర్శనం. 2016 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 3 వరకూ పది రోజుల పాటు బెళగావిలో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ పది రోజుల్లో చట్టసభల్లో వివిధ విషయాల పై చర్చ జరిగింది కేవలం 55 గంటలు మాత్రమే. అయితే అసెంబ్లీకి హాజరైన వారికి స్థానిక ఫైవ్‌స్టార్ హోటల్లో 53 గదులను బాడుగకు తీసుకున్నారు. ఇందుకు రూ.57,99,375లను చెల్లించారు. ఇక ప్రజాప్రతినిధుల తిండి ఖర్చులు చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర రూ.4,07,033లో మొదటి స్థానంలో ఉండగా బీజేపీ పక్ష నేత జగదీశ్ శెట్టర్ రూ.50లతో చివరి స్థానంలో ఉన్నారు. ఇక ఒక్క పూట ఖర్చు విషయం తీసుకుంటే కుమారస్వామి ఒక రోజు రాత్రి భోజనం కోసం రూ.3,352 ఖర్చు చూపించగా ఐవాన్ డిసౌజ రూ.3,105లను ఖర్చుచేశారు. మొత్తంగా గదుల అద్దె, ప్రజాప్రతినిధుల భోజనం వారి ప్రయాణం, భద్రత, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే ఆ సమావేశాల వ్యయం రూ.7.20 కోట్లు. ఈ వివరాలన్నీ ఆర్టీఐ కార్యకర్త బీమప్పనవర్ సంధించిన ప్రశ్నకు సంబంధిత అధికారులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం. -
ఆ ఊరిలో.. ఇంటికో టీచర్!
బెళగావి: ఉపాధ్యాయ వృత్తి.. అన్ని వృత్తుల కంటే ఎంతో పవిత్రమైనది. ఓ విద్యార్థికి ఉన్నతమైన భావాలు కలిగేలా తీర్చిదిద్దడంలో ఈ వృత్తి పాత్ర అమోఘం. ఆ గొప్ప వృత్తినే తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంది ఓ గ్రామం. ఇంటికో టీచర్‌తో టీచర్స్ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ టీచర్స్ విలేజ్ ఎక్కడుందో మనమూ ఓ సారి తెలుసుకుందాం.. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని సావదాతి తాలుకాకు చెందినది ఇంచల్ గ్రామం. ఆ గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మొదటి చాయిస్‌గా ఉపాధ్యాయ వృత్తినే కోరుకుంటారట. వారి కోరిక మేరకు పిల్లలు కూడా ఉపాధ్యాయ వృత్తినే తమ ఉపాధిగా ఎంచుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం ఆరు వేల జనాభా ఉన్నారు. వీరిలో 600 పైగా మంది టీచర్లే. కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో వీరు టీచర్లుగా పనిచేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ విద్యాలయాల్లో టీచర్లుగా పనిచేస్తుంటే.. మరికొంతమంది ప్రైవేట్ విద్యాలయాల్లో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ ప్రొగ్రామ్ పూర్తిచేసుకున్న యువత కూడా టీచర్ పోస్టింగ్‌లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుందట. టీచర్ ఫ్యామిలీస్‌లో అతిపెద్ద కుటుంబం షబ్బీర్ మిరాజనవార్ది. వీరు కర్ణాటక స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన బైహోన్గల్ తాలుక్ సెక్రటరీ. ఇతని కుటుంబంలో 13 మంది టీచర్లుగా కొనసాగుతున్నారు. ఇంచల్ గ్రామంలో చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారని, రెండో ఆప్షన్‌గా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని సావదాతి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ఎల్ భజన్త్రీ చెప్పారు. అయితే 1970 వరకు ఇంచల్లో ఒక ప్రైమరీ స్కూల్, ఎనిమిది మంది టీచర్లు మాత్రమే ఉండేవారు. స్టడీస్‌ను కొనసాగించాలంటే విద్యార్థులు బైహోన్గల్ పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలామంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపివేసేవారు. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న శివానంద్ భారతి స్వామిజీ కొంత మంది టీచర్లతో ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటుచేశారు. గ్రామంలోనే ఉన్నత చదువులు అభ్యసించేలా అవకాశం కల్పించారు. అనంతరం 1984లో రూరల్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయింది. ఆ సెంటర్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ కల్పించారు. అలా ఇంచల్ గ్రామం అక్షరాస్యత శాతాన్ని అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థుల టీచర్స్ ట్రైనింగ్‌కు సహకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఓ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, పీయూ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బీఏఎమ్ఎస్ కాలేజీ, సంస్కృత విద్యాలయం ఉన్నాయి. -
భారత్‌ను వెలుగురేఖలా కీర్తిస్తున్నాయి: మోదీ
బెలగావి: తమ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి దేశవ్యాప్తంగా ఉన్న అవినీతితో ప్రజలు విసిగెత్తి ఉన్నారని.. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కర్నాటకలోని బెలగావిలో శనివారం రైతుసభలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. ప్రపంచదేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో సైతం భారత్ మెరుగైన వృద్ధిరేటు సాధించిందన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ను వెలుగురేఖలా కీర్తిస్తున్నాయని మోదీ తెలిపారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవారంగాలను అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. రైతులకు సరైన నీటి సౌకర్యాన్ని కల్పిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపిన ప్రధాని.. ఇందుకోసం ప్రవేశపెట్టిన క్రిషీ సించాయ్ యోజన మంచి ఫలితాలను ఇస్తోందని స్పష్టం చేశారు. నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, వాటర్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ అన్నారు. నఖిలీ ఎరువులను తమ ప్రభుత్వం అదుపు చేసిందని మోదీ తెలిపారు. కృత్రిమ ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు వాడాలన్నారు. ఈ సందర్భంగా తన మిత్రుడు అనంత్ కుమార్ వేప మిశ్రమాలతో కూడిన ఎరువులతో మంచి ఫలితాలు సాధించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ విధానం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని మోదీ వెల్లడించారు. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం సైతం మంచి ఫలితాలను ఇస్తోందని ప్రధాని తెలిపారు. -
బెళగావి బంద్ హింసాత్మకం
ఆందోళనకారుల దాడిలో ఆరు బస్సులు ధ్వంసం బెంగళూరు : బెళగావిలో కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (కేఏటీ)ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు బుధవారం నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. జిల్లా న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బెళగావి నగరంలో బంద్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు చెలరేగి పోయి బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆరు బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆందోళనలు తీవ్రతరం కాకుండా నగరంలో పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. బెళగావిలో కర్ణాటక అడ్మినిష్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా జిల్లా న్యాయవాదుల సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తోంది. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడంతో బుధవారం బంద్ నిర్వహించి న్యాయవాదులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. బంద్ సందర్భంగా ఉదయం నుంచే బెళగావి నగరంలోని వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. అంతేకాక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించాయి. ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసివేయాల్సిందిగా కన్నడ సంఘాలకు చెందిన కొందరు ఆందోళనకారులు కార్యాలయాల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.