కేజీఎఫ్‌ 2 ఎఫెక్ట్‌: వెడ్డింగ్‌ కార్డుపై 'వయలెన్స్‌' డైలాగ్‌.. వైరల్‌ | Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card | Sakshi
Sakshi News home page

KGF 2 Movie: 'కేజీఎఫ్‌ 2' మేనియా.. పెళ్లి శుభలేఖపై 'వయలెన్స్‌' డైలాగ్‌

Published Wed, Apr 20 2022 3:55 PM | Last Updated on Wed, Apr 20 2022 4:01 PM

Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card - Sakshi

Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో  'కేజీఎఫ్‌ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్‌. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కు, యశ్‌ యాక్టింగ్‌, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో యశ్ చెప్పిన డైలాగ్‌లో పత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటినుంచే యశ్‌ డైలాగ్‌లకు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. 

ఇందులోని 'వయలెన్స్‌.. వయలెన్స్‌.. వయలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌' ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్‌, రీల్స్ వచ్చి ఎంతో అలరించాయి. అయితే తాజాగా ఈ డైలాగ్‌ తరహాలో తన మ్యారేజ్‌ గురించి వెడ్డింగ్‌ కార్డ్‌పై డైలాగ్‌ ప్రింట్‌ చేయించడం వైరల్‌ అవుతోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్‌ తన పెళ్లి శుభలేఖపై 'మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌. ఐ అవైడ్‌. బట్‌, మై రిలేటివ్స్‌ లైక్‌ మ్యారేజ్‌. ఐ కాంట్‌ అవైడ్‌.' అని ముద్రించాడు. దీంతో ఈ వెడ్డింగ్‌ కార్డు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది రాకీ భాయ్‌ క్రేజ్‌ అని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. అలాగే మరోపక్క బాక్సాఫీస్‌ వద్ద 'కేజీఎఫ్‌ 2' వైలెన్స్‌ బీభత్సంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 

చదవండి: కేజీఎఫ్‌ 2 ఎఫెక్ట్‌: బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్‌..



చదవండి: రాకీభాయ్‌ ఊచకోత.. ‘కేజీయఫ్‌ 2’ కలెక్షన్స్‌ ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement