dialogue
-
పుష్ప 2 ఫేమస్ డైలాగ్.. ప్రొ కబడ్డీలోనూ వాడేశారు!
పుష్ప-2 ఆ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం రావాల్సిందే. అంతలా సినీప్రియులను ఊపేస్తోంది తాజాగా రిలీజైన ట్రైలర్. ఆ డైలాగ్స్, ఆ మేనరిజం బన్నీ ఫ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఊపేస్తున్నాయి. నవంబర్ 17న పాట్నా వేదికగా భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. దేశంలో ఇంతవరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డులను పుష్ప-2 సాధించింది.అయితే పుష్పలోని ఆ డైలాగ్ చెబితే ఫ్యాన్స్‌కే కాదు.. ఎవరికైనా పూనకాలే. అంతలా ఫేమస్ అయింది. పుష్ప-2 ట్రైలర్లో 'పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అనే బన్నీ డైలాగ్ ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఇలాంటి ఫేమస్ డైలాగ్‌ను ప్రొ కబడ్డీ లీగ్‌లోనూ వాడేశారు.ఈ సీజన్లో విజయాలతో జోరుమీదున్న తెలుగు టైటాన్ టీమ్ ప్రత్యేకంగా పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ డైలాగ్‌తో ఉన్న టీమ్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. 'టైటాన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను పుష్ప టీమ్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. టైటన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ 🔥#ProKabaddi #PKL11 #LetsKabaddi #ProKabaddiOnStar #TeluguTitans pic.twitter.com/EZXQMMkOKD— ProKabaddi (@ProKabaddi) November 18, 2024 -
ఎన్టీఆర్ 'దేవర'.. నెట్టింట వైరలవుతోన్న పవర్ఫుల్ డైలాగ్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న యాక్షన్ చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్ర నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా దేవరకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయమైన విషయం నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం. 'సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.' అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ డైలాగ్ వింటే ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. Actress Mani Chandana garu has started dubbing for #Devara, She is playing #JanhviKapoor's mother role in the film ❤️సాదా సీదా మగాళ్ళు కావాలా...ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా...! 🔥🔥🔥#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/WcbbRVJ0kk— Dhanush🧛 (@Always_kaNTRi) July 10, 2024 -
రేవంత్ నోట మహేష్ బాబు డైలాగ్.. సినిమా వాళ్లకి కండిషన్..
-
అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు!
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఈ సినిమా గ్లింప్స్‌ను ఆయా భాషల్లో సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో గ్లింప్స్ రిలీజైంది. ‘‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: రత్నవేలు. -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
మాట్లాడితే పంచ్ పడాలంతే..!
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్ ఉండాలంతే.. పంచ్ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్ చేసిన హడావుడి బాగా పేలింది. ఇప్పుడు ప్రచారంలో పంచ్ డైలాగ్‌లు లేకుంటే పస ఉండదని భావిస్తున్న పార్టీల అభ్యర్థ్ధులు మంచి మంచి కొటేషన్లతో పంచ్‌లు విసురుతున్నారు. సోషల్ మీడీయాలో వాటిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట :ఈ నెల 30న అందరి వేళ్లకు ఇంక్.. రాష్ట్రమంతా పింక్ అంటూ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ..ఇప్పుడు ఎట్లయ్యింది తెలంగాణ అని బీఆర్ఎస్ అభ్యర్థుల కొటేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 2014లో ఎలా ఉండే.. 2023లో ఎలా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు డైలాగ్ కొటేషన్‌తో ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు కాంగ్రెస్, బీజేపీ కొటేషన్లు కూడా సోషల్ మీడియాలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకున్న కొటేషన్లు కొన్ని.. అన్నా... జిల్లాజిల్లాకూ ఐటీ టవర్.. మా గుండెల్లో ఉంటాడు కేటీఆర్ ఫరెవర్ మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్‌నగర్ క్రౌడ్.. డెవలప్మెంట్ ఆగొద్దంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్ మర్చిపోతామా సాయన్న చేసిన సాయమూ.. కంటోన్మెంట్లో లాస్యమ్మ గెలుపు ఖాయమూ.. బాల్కొండలో ఎగురబోతుంది గులాబీ జెండా... ప్రశాంత్ అన్న మన అందరికీ అండా దండా.. ఎవరికి పడితే వాడికి కొట్టం జిందాబాద్... మా గోవర్న రూరల్ నిజాంబాద్ కాంగ్రెస్ బీజేపీ అందరు పక్కకు జరగాలి... మెదక్‌లో భారీ మెజారిటీ రాబోతుంది మా పద్మక్క కాంగ్రెస్ మారుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ బాగుండాలి ఐదేళ్ల జీవితం.... రావాలి ఐదు వేళ్ల హస్తం కాంగ్రెస్ మనకు అండ దండ... ఇస్తుంది రూ. 500కే గ్యాస్ బండ కాంగ్రెస్ వస్తే ఎన్నో ఉపయోగాలు.... యువతకు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు తెలంగాణలో కమలం జెండా ఎగరాలి.. బీజేపీ గెలవాలి... బీసీ సీఎం కావాలి బద్దలు కొడదాం దొరల గడీ సాలు దొర... సెలవు దొర. -
పొలిటికల్ పటాకులు.. పేలుతున్న డైలాగులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఐదేళ్లకోసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల పండుగకు ఈసారి దీపావళి తోడైంది. ఈ వేడుకలు అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గుర్తుకువచ్చేది టపాసులే. తోకబాంబుల నుంచి చిచ్చుబుడ్లు, రాకెట్లు, బాంబులు, భూచక్రాలు తదితరాలను ఎంతో ఇష్టపడి కాలుస్తుంటారు. ఓవైపు దీపావళికి జనాలు సిద్ధమవుతున్న తరుణంలో నాయకులు తమ విమర్శలకు పదును పెడుతున్నారు. మాటలను తూటాలుగా చేసి, ప్రత్యర్థులపై సంధిస్తున్నారు. సీనియర్ నాయకులు మరో అడుగు ముందుకేసి, తమ ఆరోపణాస్త్రాలను టపాసుల్లా పేలుస్తున్నారు. తమ నోటి నుంచి వచ్చే ఆరోపణలు, మాటలు, హామీలను చిచ్చుబుడ్డి, రాకెట్, భూచక్రాలు, తోక పటాకుల్లా సందర్భాన్ని బట్టి తమకు అనుకూలంగా మలచుకొని, ప్రయోగిస్తున్నారు. ఇవి పేలగానే జనాలు చప్పట్లతో స్వాగతిస్తున్నారు. అలాంటి తూటాల్లాంటి మాటలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం! తెలంగాణతో నాది కుటుంబ బంధం! ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అనేక పంచ్ డైలాగులు విసిరారు. అందులో తెలంగాణతో నాది రాజకీయ బంధం కాదు, కుటుంబ బంధం అంటూ సభికులను కలుపుకుపోతూ చెప్పిన మాటలు వారి మనసును రాకెట్లలా తాకాయి. రాహుల్‌కు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? ఇటీవల ధర్మపురిలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్‌కు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? ఏమీ తెలియని వాడు కూడా ధరణిని తొలగిస్తాం అంటున్నాడని వ్యాఖ్యానించారు. గులుగుడు గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే! సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ కొన్ని రోజులుగా ప్రతీ వేదిక మీద చెబుతున్న భూచక్రాల్లాంటి మాటలివి. ప్రజలంతా తమవైపే ఉన్నారని, ఒకరిద్దరు వ్యతిరేకంగా ఉన్నా.. కారుకే ఓటేస్తారని చెప్పే క్రమంలో గులుగుడు.. గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే అన్న మాటలు ట్రెండ్ అవుతున్నాయి. సంక్షేమమా? సంక్షోభమా? హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్‌కు హాజరైన మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే ఈటల మాటలకు మోసపోవద్దని, బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని అన్నారు. సంక్షోభం కావాలా? సంక్షేమం కావాలా? తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐదేళ్లు నా రక్తం ధారపోస్తా! అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో 20 రోజులు కష్టపడండి.. రాబోయే ఐదేళ్లు నా రక్తాన్ని ధారపోస్తా అని మంత్రి గంగుల కమలాకర్ అన్న మాటలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడే పుట్టిన.. ఈ గడ్డ మీద పెరిగిన నేను ఇక్కడే పుట్టిన.. ఈ గడ్డ మీద పెరిగిన.. ఇక్కడ గాలి పీల్చి న.. మీతోనే ఎదిగిన.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న.. అని బీఆర్ఎస్ కో రుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ అ న్నారు. వాళ్లంతా ఎన్నికల టైంలో వచ్చేటోళ్లు.. మళ్లీ కనబడరు.. యాదించుకోండ్రి.. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఎంకు గుంట భూమి ఎక్కువ.. ధరణి పోర్టల్‌ను విమర్శించే క్రమంలో 53 ఎకరాల 30 గుంటలకు బదులు 53 ఎకరాల 31 గుంటలు చూపిస్తోంది అని సీఎం కేసీఆర్ అఫిడవిట్‌ను చూపిస్తూ బండి సంజయ్‌కుమార్ చేసిన కామెంట్లు చిచ్చుబుడ్డిలా పేలుతున్నాయి. రైతు రాజ్యమా? రాబంధుల రాజ్యమా? బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్, రుణమాఫీ లాంటి పథకాలతో రైతులు సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుందని బీఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వారు వస్తే మూడు గంటల కరెంట్, ధరణిని ఎత్తివేస్తామంటూ, రైతుబంధును కుదిస్తామంటూ మాట్లాడుతున్నారని.. రైతు రాజ్యం కావాలో.. రాబంధుల రాజ్యం కావాలో తేల్చుకోవాలని జగిత్యాల ప్రజలను కోరారు. ఇవి చదవండి: విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా.. -
లావణ్య అక్కా.. నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా?.. ఇప్పుడదే నిజమైంది!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లికి ముందు జరిగిన కాక్టైల్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్ కామెంట్స్! అయితే గతంలో లావణ్యను ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘చావు కబురు చల్లగా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. 'ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అదే ఇప్పుడు నిజమైందంటూ నెటిజన్స్ కూడా తెగ కామెంట్స్ చేశారు. ఆ సినిమా డైలాగ్ నిజమైంది అలాగే లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లి అయినప్పటికీ.. యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అల్లు అరవింద్ మాటల్లాగే.. ఓ సినిమా డైలాగ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. గతంలో లావణ్య త్రిపాఠి నటించిన అందాల రాక్షసి సినిమాలో ఈ పెళ్లికి సరిగ్గా సెట్ అవుతుంది. అందులో కొంతమంది పిల్లలు మాట్లాడుతూ..' లావణ్య అక్కా.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారంటా కదా? అంటే పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా? అంటూ లావణ్యను అడుగుతారు. అందుకు లావణ్య కూడా అవునని చెబుతుంది. ఆ తర్వాత పిల్లలంతా గ్యాంగ్ లీడర్ కూడా వస్తున్నారంటూ అల్లరి చేస్తారు. ఆ సినిమా డైలాగ్ 2012లో వచ్చినా.. 2023లో అదే సీన్ రిపీట్ అయిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మన నిజ జీవితంలో జరగడం చాలా అరుదుగా చూస్తుంటాం కదా! కాగా.. అందాల రాక్షసి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం. ఇందులో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్. ఎస్. రాజమౌళి వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 2012 ఆగస్టు 10 న విడుదలైంది. -
ఆ మీమ్స్ ఏంట్రా?.. ఒక్క డైలాగ్‌తో చంపేస్తున్నారు!!
విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబినేషన్లో వస్తోన్న ‘ఫ్యామిలీస్టార్. ఈ చిత్రంలో సీతారామ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. గీతగోవిందం సూపర్ హిట్ తర్వాత పరశురామ్‌తో మరోసారి జతకట్టారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీలో ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు సోషల్‌మీడియాను ఊపేస్తోంది. నెట్టింట ట్రెండ్ అవుతోంది. అంతే కాకుండా ఈ డైలాగ్పై నెట్టింట మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లోని సీన్స్‌కు ఈ ఫ్యామిలీ స్టార్‌లోని 'ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?' అనే డైలాగ్‌లో మీమ్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే మిర్చి సినిమాలోని డైలాగ్‌తో లింక్ చేస్తూ విజయ్ దేవరకొండ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఐరనే వంచాలా ఏంటి? అనే డైలాగ్‌తో ప్రభాస్ బాహుబలి, అల్లు అర్జున్ సరైనోడు, రేసుగుర్రం సినిమాల్లోని సీన్లతో కలిపి తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఒక్క డైలాగ్ హాట్ టాపిక్‌గా మారింది. మీరు కూడా ఈ డైలాగ్పై వచ్చిన మీమ్స్ చూస్తే నవ్వుకుండా ఉండలేరు. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఐరన్ డైలాగ్, విజువల్స్ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్ వచ్చాయి. వాటిని తిప్పికొట్టేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Promotions lo evadina ma vadi tharvatha ne ani prove chesadu Insta story of #VijayDeverakonda 𝙃𝙖𝙩𝙚𝙧𝙨 𝙩𝙝𝙧𝙤𝙬𝙞𝙣𝙜 𝙨𝙩𝙤𝙣𝙚𝙨 𝙤𝙣 𝙝𝙞𝙢 😅 𝘽𝙪𝙩 𝙝𝙚 𝙞𝙨 𝙗𝙪𝙞𝙡𝙙𝙞𝙣𝙜 𝙖𝙣 𝙀𝙢𝙥𝙞𝙧𝙚 𝙬𝙞𝙩𝙝 𝙩𝙝𝙚𝙢 𝙆𝙄𝙉𝙂 👑#Airanevonchalaenti pic.twitter.com/7T1OHhLyGy — THE CHANTI (@chanticomr95290) October 26, 2023 #AiranevanchalaEnti 😅#FamilyStar #VijayDeverakonda pic.twitter.com/u5wEjJeH71 — Ee Nagaraniki Emaindi Meme Project (@enememeproject) October 26, 2023 #Airanevanchalaenti #AlluArjun #FamilyStar @TheDeverakonda Entertainment Teaser 😂 pic.twitter.com/3yRMQQONfr — 𝕂ℝ𝕚𝕤𝕙𝕟🅰️🅰️ (@sAAi_krishnAA) October 26, 2023 Me from last 2 days#FamilyStar @zunkkkkkk @sanjaysahu4510 pic.twitter.com/cwQVSomXdn — Vinsmoke Akhil🚬(Mr.Typo) (@Erengaadu) October 26, 2023 Twitter mottham idhe Lolli🚶🏻♂️#Airanevonchalaenti #FamilyStar pic.twitter.com/bMkif1b5LA — Devil🦦 (@AlwaysDevill) October 26, 2023 Sorry but not sorry .#VijayDevarakonda #FamilyStar #AiraneVanchalaEnti pic.twitter.com/KAMGdztXyT — filmyentity (@filmyentity) October 26, 2023 Wait for it🙂#FamilyStar pic.twitter.com/yZER1ciIuT — VIRAT⭐️ #AiraneVanchalaEnti (@ReyyViratuu) October 26, 2023 #FamilyStar X #NaaSaamiRanga 🙂 pic.twitter.com/BFEQa0g1cY — VIRAT⭐️ #AiraneVanchalaEnti (@ReyyViratuu) October 26, 2023 -
ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి జతకట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) అయితే ఈ మూవీ గ్లింప్స్‌లో..' ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు. ప్రస్తుతం 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్లో ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్‌ను సైతం విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ డైలాగ్‌కు ప్రభాస్ మిర్చి సినిమాలో విలన్‌తో ఫోన్లో మాట్లాడే డైలాగ్‌ను జోడించారు. ఇంటర్నెట్.. అసలు ఏం నడుస్తోంది? అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ ఐరన్ డైలాగ్‌ను జతచేసి పోస్ట్ చేయడంతో ఐరనే వంచాలా ఏంటి(#Airanevanchalaenti), ఫ్యామిలీ స్టార్ (#FamilyStar) ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఏకంగా పోస్టర్‌నే రిలీజ్ చేసింది. (ఇది చదవండి: వరుణ్‌తేజ్- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్!) అయితే దీని వెనుక మరో కారణం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఐరన్ డైలాగ్, విజువల్స్ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్.. వాటిని తిప్పికొట్టేందుకు టీమ్ ఇలా ప్లాన్ చేసిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Maakkuda 🤣🤣 #AiraneVanchalaEnti #FamilyStar https://t.co/nHkerzL0Zk — Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023 Have you said it yet :) pic.twitter.com/5dWTnHJIEp — Vijay Deverakonda (@TheDeverakonda) October 26, 2023 -
'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించగా.. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రబృందాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. ఆ ఒక్క డైలాగ్‌తో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ ట్వీట్‌కు అనసూయ రిప్ కూడా ఇచ్చింది. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ చిత్రంలో ఒక్క డైలాగ్‌తో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఒక్క వారంలోనే మెసేజ్ అందరికీ చేరేలా చేశారు. మీడియా ద్వారా అయితే దాదాపు 10 ఏళ్లు పట్టేది. మాస్ మసాల సినిమాలో ఇలాంటి గొప్ప అంశాన్ని పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్లే ఇది సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బాలయ్య పక్కన శ్రీలీల చూడటం అద్భుతంగా అనిపించింది.' అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ట్వీట్‌కు అనసూయం సైతం స్పందించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రిప్లై ఇచ్చింది. The good touch-bad touch scene in #BhagavantKesari will achieve in a week what other mediums will take 10 years. Thank you for bringing this topic to mass masala cinema @AnilRavipudi garu and NBK garu🙌🏽🙌🏽 Communicated in such a simple and yet highly effective manner like only NBK… — Rahul Ravindran (@23_rahulr) October 23, 2023 -
సనాతన్ లక్ష్యం
ఆది సాయికుమార్ టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుంది. ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. కార్పొరేట్ లీడర్ విక్రమ్ చక్రవర్తి హత్యను చేధించడమే లక్ష్యంగా సీఎస్ఐ (క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్) సనాతన్ ఐదుగురు నిందితులను విచారించడం ఈ ట్రైలర్లో కనబడుతుంది. ఐదుగురూ ఐదు రకాలుగా చెబుతారు. ‘నిజాన్ని అస్సలు ఊహించలేము’ అని సనాతన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగుతుంది. ‘‘మర్డర్ మిస్టరీగా రూపొందించిన ఈ చిత్రం ఉత్కంఠభరింతగా ఉంటుంది’’ అని నిర్మాత అజయ్ శ్రీనివాస్ అన్నారు. -
చంటి లోకల్! అనే సినీ డైలాగ్‌తో వసూళ్లు..నివ్వెరపోయిన పోలీసులు
సాక్షి, వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపేది టాస్క్‌ఫోర్స్.. కానీ ఆ విభాగంలోని అధికారుల్లో కొందరు అవే అక్రమాలకు పాల్పడడం... విచారణలో తెలిసిన విషయాలు చూసి నివ్వెరపోయిన పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం కమిషరేట్‌లో కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.నరేష్కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె.సోమలింగం, కానిస్టేబుల్ బి.సృజన్‌లు బియ్యం దందాతోపాటు మ రికొన్నింట్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ సీపీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 3న పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ ముందుగా సొంతింటిని చక్కబెట్టుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్లకు వారే సూత్రధారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ ఏర్పడినప్పటినుంచి కొంతమంది సిబ్బందికి ఎలాంటి బదిలీలు లేవు. దీంతో శాఖలోని లొసుగులను ఆసరా చేసుకుని వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి టాస్క్ ఫోర్స్‌ను అడ్డుపెట్టుకుని సస్పెన్షన్‌కు గురైన ఓ హెడ్ కానిస్టేబుల్ ఏకంగా లక్షల రూపాయల వసూళ్లకు పా ల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కానిస్టేబుల్‌కు రూ.10వేల కంటే తక్కువ ఇస్తే వాటిని ముఖంపై విసిరికొట్టేవాడని చెబుతుండేవారు. కొంతకాలంగా వీరిపై వస్తున్న వసూళ్ల ఆరోపణలపై దృష్టి సారించిన సీపీ రంగనాథ్ ఆ దిశగా విచారణ జరిపారు. కొందరు అధికారుల అవినీతి బయటపడుతుందని ఆశించిన వారికి టాస్క్‌ఫోర్స్‌లో అది వెలుగుచూడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు బృందాల్లోని టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా పనిచేసిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఒకేసారి సస్పెండ్ కావడం చూస్తుంటే ఏ స్థాయిలో వసూళ్లు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల విచారణ...నలుగురిపై వేటు పీడీఎస్ బియ్యం దందాపై జరిగిన విచారణలో భా గంగా హసన్పర్తికి చెందిన ఓ బియ్యం వ్యాపారి, మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలో ఉండే మరో వ్యాపారి, ఓ రిపోర్టర్‌ను వారం రోజులపాటు విచారించడంతో నిజాలు వెలుగుచూసినట్లు తెలిసింది. మామూ ళ్ల వసూళ్లలో కమిషనరేట్‌కు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. వరుస సస్పెన్షన్ వేట్లతో ఉరికిస్తున్న సీపీ.. రానున్న రోజుల్లో ఎవరిపై చర్యలు హాట్‌టాపిక్‌గా మారింది. చంటి లోకల్.. వసూళ్ల సూత్రధారి ఓ రిపోర్టర్ వేటుపడిన టాస్క్‌ఫోర్స్ అధికారి ఉన్నతాధికారుల ముందు ‘చంటి లోకల్...అధికారులు వస్తారు...పోతారు’ అనే సినిమా డైలాగ్‌ను పదేపదే చెప్పడంతోపాటు తనకు ఓ ఎమ్మెల్యే అండ ఉందని, తనను ఎవరు ఏమీ చేయరనే ధైర్యంతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతినెలా లక్షల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. వరంగల్ ప్రాంతంలో ఓ యూ ట్యూబ్ రిపోర్టర్‌ను మధ్యవర్తిగా పెట్టుకుని పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. (చదవండి: మానవత్వంలో ‘రాజా’రాం... ) -
Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాల్సింది కాదు!
కోల్‌కతా: సినిమా డైలాగులు పేల్చడం రాజకీయ నాయకులకు ఈమధ్య బాగా అలవాటైంది. అయితే పంచ్ కోసం పేలుస్తున్న ఆ డైలాగులు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. తృణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలోంచి కొట్టిన డైలాగ్.. బీజేపీకి బాగా కోపం తెప్పించింది. మొత్తం బెంగాల్ ప్రభుత్వం తీరే పుష్ప సినిమాలాగా ఉంది. ఎర్ర చందనపు స్మగర్ల సినిమాలో ఏవో డైలాగులు కొడితే.. ఇక్కడి టీఎంసీ నేత కూడా అలాగే డైలాగులు కొడుతున్నాడు. ఒకరేమో యువత హక్కులను దోచుకుంటున్నారు. మరొకరేమో స్కామ్‌లు చేసి వాళ్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టీఎంసీ నేతల తీరు.. ఆ సినిమాలోని ఎర్ర చందనపు స్మగ్లర్లలాగే ఉంది. వాళ్లతో పాటు ఆ పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతోంది అంటూ బీజేపీ నేత ఉమేశ్ రాయ్ మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఎదిగిన మనోజ్ తివారీ.. ఆదివారం ఓ ర్యాలీలో పార్టీ కార్యకర్తలంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ సాలా' (తెలుగులో నీయవ్వ.. తగ్గేదే లే) అంటూ బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ భగ్గుమంది. అయితే.. ర్యాలీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మీడియా ప్రతినిధులు ఆయన తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ఆ డైలాగ్ కొట్టాల్సింది కాదు అని తివారీ క్షమాపణలు చెప్పారు. -
ఫిర్యాదు చేసేందుకు వచ్చి....ఏకంగా పోలీస్ అధికారి సీటులో కూర్చొని....
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చిలో కూర్చొన్న వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తి బిల్డర్ సురేష్ పాండురంగ పాటిల్ అలియాస్ చౌదరి అని, మాన్పాడ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడానికి వచ్చి ఈ వీడియోని షూట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో రాణి నహీం హై తో క్యా హుమా యే బాద్షా ఆజ్ భీ లకోన్ దిలోన్ పే రాజ్ కర్తా హై (నాకు రాణి లేకపోయినప్పటికీ లక్షల హృదయాలను పాలిస్తున్నాడు) అనే డైలాగ్ వస్తుంది. అంతేగాదు సదరు వ్యక్తి తన స్నేహితులతో కలిసి తుపాకీ ఊపుతూ ఫోజ్ పెట్టిన మరో వీడియోని కూడా జోడించి మరీ పోస్ట్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏ పోలీస్టేషన్లో షూట్ చేశాడో అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వోద్యోగిగా నటించడం, ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి నేరాలకు గాను కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...బిల్డర్ సురేష్ మాన్పాడ పోలీస్ స్టేషన్లో నరబలి, మూఢనమ్మకాలకు పేరుతో ఓ వ్యక్తి చేతిలో రూ. 19 లక్షలు పొగొట్టుకున్నానంటూ ఫిర్యాదు చేశాడు. ఆ తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆ డబ్బులు వసూలు చేసుకునేందుకు పోలీస్టేషన్‌కి వచ్చినప్పుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వివిధ పోలీస్టేషన్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాగే అతని వద్ద నుంచి లైసెన్సు తుపాకిని, మెర్సిడేజ్ కారు, కొడవలి, ఐదు లైవ్ కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నారు. Man Shoots Video From Cop's Chair, Gets Locked Up At Same Police Station https://t.co/Fe9ToXGilt pic.twitter.com/fsAICzuthK — NDTV News feed (@ndtvfeed) November 1, 2022 (చదవండి: దాగుడుమూతలు ఆడుతూ.. లిఫ్ట్ కిటికిలో తల పెట్టి...) -
బెయిల్‌పై బయటికి.. వెంటనే పుష్ప డైలాగ్ కొట్టాడు
అధికారం ఉందని ఓ మహిళను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించాడు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ. అస్సాంలో మహిళా కానిస్టేబుల్‌ను దుర్భాషలాడిన చేసిన కేసులో జిగ్నేష్ మేవానీకి శుక్రవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటికి వచ్చి రాగానే అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ కొట్టాడాయన. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ(తలవంచను).. తగ్గేదే లే.. డైలాగ్‌తో ఓ మీడియా ఛానెల్ ముందు పుష్పరాజ్ తరహా మేనరిజాన్ని ప్రదర్శించాడు జిగ్నేష్ మేవానీ. ‘‘నా అరెస్ట్ సాధారణ విషయం కాదు. పీఎంవోలో ఉన్న పొలిటికల్ బాస్‌ల సూచనలతోనే జరిగింది. నేను చేసిన ట్వీట్లో తప్పేం లేదు. ఆ విషయం ఇప్పటికీ గర్వంగా చెప్తున్నా.. జరిగిన మతఘర్షణలను, అల్లర్లను చూసి ఈ దేశంలో ఒక పౌరుడిగా శాంతి సామరస్యాలను కాపాడమని దేశ ప్రధానిని కోరా. అడగడానికి నాకు హక్కు ఉంది. అంటేకాదు చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరా. అది నా విధి. అదేగా నేను చేసింది. దానికే కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని మేవానీ తెలిపారు. ఆపై ఒక ఆడదాన్ని అడ్డుపెట్టి.. కథను అల్లి మరో కేసు పెట్టారు. పిరికిపంద చర్యే ఇది. గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అందుకే బీజేపీ ఇలా చేస్తోంది అని మేవానీ ఆరోపించారు. అరెస్ట్ వేళ తనకు మద్దతు ఇచ్చిన అస్సాం ప్రజానీకానికి, కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపాడాయన. అలాగే ఎక్కడో అస్సాంలో తనను అరెస్ట్ చేయడం, కేసులు బనాయించి బయటకు రాకుండా చేయడం.. ముమ్మాటికీ బీజేపీ కుట్రే అని అంటున్నాడు. ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వీళ్లు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నన్నూ టార్గెట్ చేశారు. దళితులు, గుజరాత్ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు. గుజరాత్ ఎన్నికల్లో వాళ్లు(బీజేపీ) మూల్యం చెల్లించుకోక తప్పదు. అని పేర్కొన్నాడు ఎమ్మెల్యే మేవానీ. (చదవండి:ఎట్టకేలకుజిగ్నేష్ మేవానీకి బెయిల్) పోలీసులపై కోర్టు ఆగ్రహం మహిళా కానిస్టేబుల్‌పై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని ‘‘కావాలనే’’ ఇరికించేందుకు ప్రయత్నించారంటూ అస్సాం పోలీసులపై అక్కడి కోర్టు మండిపడింది. బార్పేట కోర్టు మేవానీకి బెయిల్ మంజూర్ చేసే క్రమంలో తీవ్రంగా పోలీసులను మందలించింది. రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్‌గా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: వెడ్డింగ్ కార్డుపై 'వయలెన్స్' డైలాగ్.. వైరల్
Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 'కేజీఎఫ్ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో యశ్ చెప్పిన డైలాగ్‌లో పత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైనప్పటినుంచే యశ్ డైలాగ్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇందులోని 'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్, రీల్స్ వచ్చి ఎంతో అలరించాయి. అయితే తాజాగా ఈ డైలాగ్ తరహాలో తన మ్యారేజ్ గురించి వెడ్డింగ్ కార్డ్‌పై డైలాగ్ ప్రింట్ చేయించడం వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ తన పెళ్లి శుభలేఖపై 'మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవైడ్.' అని ముద్రించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది రాకీ భాయ్ క్రేజ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అలాగే మరోపక్క బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వైలెన్స్ బీభత్సంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చదవండి: కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. చదవండి: రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
18న భారత్–అమెరికా 2+2 చర్చలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య రెండో విడత 2+2 మంత్రుల స్థాయి చర్చలు 18వ తేదీన జరగనున్నాయి. రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించే ఈ భేటీ వాషింగ్టన్లో జరుగనుందని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. మన దేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇందులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ వెల్లడించారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లుపై వ్యక్తమైన అభ్యంతరాలపై అమెరికా ప్రజాప్రతినిధులతో మాట్లాడామన్నారు. భారత్ వైఖరిని వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గువాహటిలో 15వ తేదీ నుంచి 17 వరకు జరగాల్సిన భారత్–జపాన్ భేటీ వేదికపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ లేదన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ భారత్ పర్యటన వాయిదా వేసుకోవడంపై ఆయన స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మత పరమైన హింస జరుగుతున్నట్లు భారత్ ఎన్నడూ విమర్శించలేదన్నారు. పౌరసత్వ బిల్లుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే ముందు సొంత దేశంలో మైనారిటీలపై ఎలాంటి వివక్ష కొనసాగుతోందో తెలుసుకోవాలన్నారు. -
బన్నీ మళ్లీ దొరికిపోయాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయాడు. మొన్నీ మధ్యే మోదీ తనకు ఇన్సిపిరేషన్ అంటూ బన్నీ ఇచ్చిన స్టేట్ మెంట్ వైరల్ అయి దుమారం రేపింది. ఇప్పుడు కొత్త చిత్రం నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ మూలంగా బన్నీని సోషల్ మీడియాలో నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ‘సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ డైలాగ్ చెబుతాడు. అయితే అల్లు అర్జున్ అఫీషియల్ ట్విటర్ ప్రొఫైల్ లో మాత్రం "సౌత్ ఇండియన్ యాక్టర్'' అని ఉండటం గమనించిన కొందరు.. దేశభక్తి డైలాగుల వరకేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. రీల్ స్టార్సే తప్ప రియల్ స్టార్స్ కాదంటూ... ట్వీట్లు చేస్తూ బన్నీని ఏకేస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆ సంగతి పక్కన పెడితే వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన "నా పేరు సూర్య చిత్రంలో అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ కాగా, అర్జున్, బొమన్ ఇరానీ, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
కూర్చోని మాట్లాడుకుందాం రండి!?
ఇస్లామాబాద్ : అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో పాకిస్తాన్ వైఖరిలో మార్చు వచ్చినట్లు కనిపిస్తోంది. చతుర్భుజ కూటమితో భారత్ బలోపేతమవుతున్ననేపథ్యంలో పాకిస్తాన్.. రెండడుగులు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ సహా పలు వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలకు తాము సిద్ధమంటూ పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పద అంశంగా నలుగుతున్న కశ్మీర్ సహా, సియాచిన్, సిర్‌క్రీక్ వంటి అంశాలపై చర్చలు పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ ప్రకటించారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. భారత ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక చట్టాల ప్రకారం.. మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించాక.. ఎవరినీ కలిసేందుకు అనుమతించం..అయితే కేవలం మానవతా దృక్ఫథాన్ని దృష్టిలో పెట్టుకుని కులభూషన్ జాదవ్‌ను కలిసేందుకు ఆమె భార్యకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో భారత్ క్రూయిజ్ మిసైల్‌ను పరీక్షించడంపైనా ఆయన స్పందించారు. భారత్ మిసైల్ పరీక్షలు నిర్వహించడం వల్ల రీజియన్‌లో శాంతి భద్రతలు ప్రమాదంలో పడతాయని ఆయన అన్నారు. -
ముషారఫ్‌కు చేదు అనుభవం
-
‘వాళ్లు రాళ్లేస్తుంటే మేం పూలు ఇవ్వలేం’
న్యూఢిల్లీ: రాళ్ల దాడులు ఆగిపోయేవరకు కశ్మీర్ సమస్యపై ఎలాంటి మాటలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఒక్కసారి దాడులు ఆగితే ప్రారంభమయ్యేది చర్చలే అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరితో తాము చర్చించేందుకు సిద్ధమని అన్న ఆయన ముందు రాళ్ల దాడులు ముగిసిపోవాలని, సైనికులపై దాడులు ఆగాలని చెప్పారు. గతంలో పనిచేసిన ఎన్డీయే మాదిరిగానే ఇప్పటి ఎన్డీయే కూడా వేర్పాటువాదులతో చర్యలు జరుపుతారా అని అమిత్ షాను ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘మేం ఇప్పటికే చెప్పాం. రాళ్ల దాడి ముగిసిన వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని. కానీ అక్కడ ఇంకా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు చేయలేం. వాళ్లు రాళ్లు విసురుతుంటే మేం పువ్వులివ్వలేం. వారే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం పీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంతో సంతృప్తి చెందుతున్నారా అని ప్రశ్నించగా చాలా బాగా పనిచేస్తుందని అన్నారు. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంతో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. -
రామమందిరంపై స్పందించిన సీఎం యోగి
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. చర్చలతో, మధ్యే మార్గంగా అయోధ్య సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. తప్పనిసరిగా చర్చల ద్వారానే రామమందిరం విషయంలో పరిష్కారం జరగాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ అధికారిక మేగిజిన్ పాంచజన్యకు ఇంటర్వ్యూ సందర్భంగా స్పష్టం చేశారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యోగి వాయువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కబేళాల విషయంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చగా మారింది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం విషయంలో కూడా యోగి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో తాజాగా చర్చల మార్గానికే ఆయన మద్దతిస్తూ అభిప్రాయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను నేను స్వాగతిస్తున్నాను. ఈ సమస్య వివాద రహితంగా సమన్వయంతో చర్చల జరపడం ద్వారా పరిష్కరించుకోవాలి. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని యోగి చెప్పారు. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) 2015లో, హైకోర్టు 2017లో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే తాము అక్రమ కబేళాలపై కొరడా ఝళిపించామని అన్నారు. ఇక ఆహారం విషయంలో ఎవరి ఇష్టం వారిదని అన్నారు. కాయగూరల భోజనం చేసేవారి ఆరోగ్యం బాగుంటుందని, అయితే, ఈ విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. అయితే, స్వేచ్ఛ పేరుతో అక్రమ చర్యలు చేస్తే మాత్రం ప్రభుత్వం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. -
ఇది నా జీవితంలో అరుదైన సంఘటన!
‘‘హీరో ఇమేజ్ కంటే క్యారెక్టర్ ఇమేజ్ తక్కువయితే... హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయాలి. శాతకర్ణిలో అలాంటి డైలాగులు రాసే అవసరం రాలేదు’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 12న రిలీజవుతోంది. సాయిమాధవ్ చెప్పిన సంగతులు... ► ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత క్రిష్‌గారు శాతకర్ణిపై పరిశోధన ప్రారంభించారు. హిందీలో ‘గబ్బర్’, తర్వాత తెలుగులో ‘కంచె’ చేస్తూనే క్రిష్ రీసెర్చ్ కొనసాగించారు. ఆయన నాతో చెప్పిన తర్వాత నేనూ రీసెర్చ్ చేశా. తెనాలిలో ‘యజ్ఞశ్రీ శాతకర్ణి’కి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖల ద్వారా అప్పటి సంస్కృతి తెలిసింది. ► చిన్న చిన్న గణరాజ్యాలుగా ఉన్న భారతావనిని ఓ దేశంగా మార్చడానికి శాతకర్ణి ఎలాంటి యుద్ధం చేశాడనేది ఈ చిత్రకథ. శాతకర్ణికున్న బిరుదుల్లో ‘త్రిసముద్ర తోయపాన వాహన’ ఒకటి. ‘మూడు సముద్రాల్లోనూ నీళ్లు తాగిన గుర్రాలను అధిరోహించినవాడు’ అని అర్థం. ఓటమి ఎరుగని శాతకర్ణి విజయగాథ – ఈ చిత్రకథ. ► కథ సిద్ధమైన తర్వాత ‘బాలకృష్ణగారు తప్ప ఇంకెవరూ శాతకర్ణి పాత్రను చేయలేరేమో’ అనంటే... ‘ఆల్రెడీ నేను మాట్లాడాను. ఆయనే చేస్తున్నారు’ అన్నారు క్రిష్. చరిత్రలో జరిగింది చెబుతున్నాం. కథలో కల్పితాలు ఏం లేవు. ► తొలిసారి మొరాకో సెట్స్‌లో బాలకృష్ణగారికి డైలాగులు చెప్పడానికి వెళ్లినప్పుడు నాకు భయం వేసింది. 99 సినిమాల్లో మహానుభావులు రాసిన డైలాగులు చెప్పారాయన. నా డైలాగులు నచ్చుతాయో? లేదో? అనుకున్నా. ఆయన ఒక్క డైలాగ్ కూడా మార్చమనలేదు. శాతకర్ణి శక్తిమంతుడు కావడంలో మంచి డైలాగులు పడ్డాయి. ► ‘ఖైదీ నంబర్ 150’లో కొన్ని సీన్లకు డైలాగులు రాశా. చిన్నప్పట్నుంచీ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు చూస్తూ ఇక్కడి వరకూ వచ్చా! వాళ్లే నాకు స్ఫూర్తి. వాళ్ల ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచే చిత్రాలకు మాటలు రాయడం అదృష్టం. ఎవరూ కలలు కనే ధైర్యం కూడా చేయని అరుదైన సంఘటన నా జీవితంలో జరిగింది. సావిత్రి గారి జీవితకథతో నాగ అశ్విన్ తీయబోయే ‘మహానటి’కి, హీరో సందీప్‌కిషన్–మంజుల సినిమాకి మాటలు రాస్తున్నా. -
'ప్లీజ్.. భారత్-పాక్ చర్చలకు రావాలి'
న్యూయార్క్: ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చించుకోవడానికి రావాల్సిందిగా భారత్, పాకిస్థాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. దక్షిణాసియా దేశాల్లో శాంతియుత పరిస్ధితులు ఉంటేనే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్పిన ఆయన చర్చలకే భారత్-పాక్ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఈ నెలాఖరులో బాన్ కీ మూన్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బాన్ కీ మూన్ తరుపున ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి ఫరాన్ హక్ ఈ ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో సరిహద్దు వద్ద మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయినా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చూసి చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఓ పాక్ జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హక్ స్పందిస్తూ మూన్ మాటలుగా పలు విషయాలు చెప్పారు. కశ్మీర్ విషయాన్ని పట్టించుకోవడం లేదనే మాటలు సరికాదని, తాము అన్నింటిని పరిశీలిస్తున్నామని, ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా చేస్తూనే ఉన్నామని తెలిపారు. పాక్- భారత్ దేశాల మధ్య చర్చలకు బాన్ కీ మూన్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.