ఫేమస్ డైలాగ్స్ తో బుక్! | mohan babu's 40years compleat in film industry | Sakshi
Sakshi News home page

ఫేమస్ డైలాగ్స్ తో బుక్!

Published Sun, May 8 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

ఫేమస్ డైలాగ్స్ తో బుక్!

ఫేమస్ డైలాగ్స్ తో బుక్!

డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబుది ఓ ప్రత్యేకమైన శైలి. ‘అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా.. కరిస్తే నిన్ను కూడా బొక్కలో ఏస్తా..’ అంటూ ‘అసెంబ్లీ రౌడీ’లో ఆయన చెప్పిన డైలాగ్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకా మోహన్‌బాబు చెప్పినవాటిలో బోల్డన్ని ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి. గతేడాది నవంబర్ 22తో మోహన్‌బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీప్రసన్న పలు కార్యక్రమాలను ప్రకటించారు.

అందులో భాగంగా మోహన్‌బాబు తన సినిమాల్లో చెప్పిన పలు ఫేమస్ డైలాగ్స్‌ని పుస్తక రూపంలోకి తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 11న సాయంత్రం ఆరున్నర గంటలకు బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్‌లో విడుదల చేయనున్నారు. నటుడిగా, విద్యావేత్తగా మోహన్‌బాబు చేస్తున్న కృషిని గుర్తించి, ఈ వేడుకలో ఏసియన్ లైట్ అనే సంస్థ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ సంయుక్తంగా ఆయన్ను సత్కరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement