ఆ మీమ్స్ ఏంట్రా?.. ఒక్క డైలాగ్‌తో చంపేస్తున్నారు!! | Vijay Devarakonda Latest Movie Family Star Dialogue Memes Goes Viral | Sakshi
Sakshi News home page

Family Star: ఆ ఒక్క డైలాగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!

Published Fri, Oct 27 2023 3:56 PM | Last Updated on Fri, Oct 27 2023 4:11 PM

Vijay Devarakonda latest Movie Family Star Dialogue Meams Goes Viral - Sakshi

విజయ్‌ దేవరకొండ, పరుశురామ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఫ్యామిలీస్టార్‌. ఈ చిత్రంలో సీతారామ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. గీతగోవిందం సూపర్ హిట్ తర్వాత పరశురామ్‌తో మరోసారి జతకట్టారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీలో ఓ డైలాగ్ మాత్రం‌ ఇప్పుడు సోషల్‌మీడియాను ఊపేస్తోంది. నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. అంతే కాకుండా  ఈ డైలాగ్‌పై నెట్టింట మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లోని సీన్స్‌కు ఈ ఫ్యామిలీ స్టార్‌లోని 'ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?' అనే డైలాగ్‌లో మీమ్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే మిర్చి సినిమాలోని డైలాగ్‌తో లింక్ చేస్తూ విజయ్ దేవరకొండ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇంటర్నెట్‌లో అసలు ఏం నడుస్తోంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఐరనే వంచాలా ఏంటి? అనే డైలాగ్‌తో ప్రభాస్‌ బాహుబలి, అల్లు అర్జున్‌ సరైనోడు, రేసుగుర్రం సినిమాల్లోని సీన్లతో కలిపి తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఒక్క డైలాగ్ హాట్‌ టాపిక్‌గా మారింది. మీరు కూడా ఈ డైలాగ్‌పై వచ్చిన మీమ్స్ చూస్తే నవ్వుకుండా ఉండలేరు. 

అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఐరన్‌ డైలాగ్‌, విజువల్స్‌ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్‌ వచ్చాయి. వాటిని తిప్పికొట్టేందుకే మేకర్స్ ఇలా ప్లాన్‌ చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement