
ఉగ్రవాదులతో చర్చలు జరగాలి: దలైలామా
రోమ్: ఇస్లాం మతానికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో చర్చలు జరిపితే సత్పలితాలు ఉంటాయని చెప్పారు.
'ఇస్లాం అనేది శాంతితో కూడుకున్న మతం. అందులో ఉన్నవారే తమ సొంతమతానికి, సొంత సోదరులకు హానీ కలిగిస్తున్నారు' అని ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ తో సరైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.