ఆ డైలాగ్స్‌ వింటే ఇప్పటికీ గూస్‌బంప్స్: మోహన్ బాబు | Mohan Babu Shares His Super Hit Movie Scene Goes Viral | Sakshi
Sakshi News home page

Mohan Babu: అడవిలో అన్న.. ఆ సీన్ చూస్తే ఇప్పటికీ గూస్‌బంప్స్: మోహన్ బాబు

Published Tue, Dec 24 2024 3:53 PM | Last Updated on Tue, Dec 24 2024 4:34 PM

Mohan Babu Shares His Super Hit Movie Scene Goes Viral

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, విలన్‌గా తన నటనతో అభిమానులను మెప్పించారు. అప్పటి స్టార్ హీరోలతోనూ చాలా సినిమాల్లో కనిపించారు. ఇటీవల తాను నటించిన పాత్ర చిత్రాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. తాను నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు సంబంధించిన పోస్టులు పెడుతున్నారు.

తాజాగా మరో బ్లాక్‌బస్టర్‌ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1997లో వచ్చిన ‍అడవిలో అన్న అనే యాక్షన్‌ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ వింటే ఇప్పటికీ గూస్‌బంప్స్ ఖాయమని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' బి. గోపాల్ దర్శకత్వం వహించిన చిత్రం అడవిలో అన్న. ఈ కథను పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా రాశారు. ఈ చిత్రం ఎప్పటికీ సినిమాటిక్ క్లాసిక్‌గా నిలుస్తుంది. వందేమాతరం శ్రీనివాస్ మరపురాని సంగీతం అందించారు. ఇందులో ప్రతి సన్నివేశం ఓ శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే నా సోదరుడు, దివంగత గద్దర్ కూడా ఈ కళాఖండానికి సాహిత్యంతో పాటు కొన్ని డైలాగ్స్ అందించారు. పవర్‌ఫుల్‌ డైలాగ్స్ ఉన్న ఈ ఐకానిక్ సీన్‌ చూస్తే ఇప్పటికీ గూస్‌బంప్స్‌ ఇస్తూనే ఉంది.' అంటూ పోస్ట్ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement