రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
తాజాగా సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment