
దాదాపు 9 నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. తిరిగి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీరికి స్వాగతం పలుకుతున్నారు.
తాజాగా వీళ్లకు స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు మరింత శక్తినివ్వాలి అని రాసుకొచ్చారు. 'సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కి స్వాగతం. ఇది చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. మీరు గొప్ప ధైర్యవంతులు'
(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)
'మీకు ఎవరూ సాటిలేరు. మీ (సునీతా విలియమ్స్) ప్రయాణం ఓ థ్రిల్లర్ అడ్వెంచర్ సినిమాలా అనిపిస్తోంది. ఇది గొప్ప సాహసం, నిజమైన బ్లాక్ బస్టర్' అని చిరంజీవి ట్విటర్ లో రాసుకొచ్చారు.
బుధవారం తెల్లవారు జామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సునీతా, విల్మోర్ ఉన్న స్పేస్ ఎక్స్ క్యాప్సల్ ల్యాండ్ అయింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)

Comments
Please login to add a commentAdd a comment