bhogi celebrations
-
శిల్పారామం, కూకట్పల్లి మలేషియా టౌన్షిప్లో భోగి వేడుకలు (ఫోటోలు)
-
కూసుమంచి భోగి వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి దంపతులు
-
కడపలో భోగి సందడి.. వేకువజామునే ఆట, పాటలతో చిందులు (ఫోటోలు)
-
పల్లెల్లో భోగి పండగ సందడి
-
ఊరూ వాడా భోగి సంబురం (ఫొటోలు)
-
భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబం
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు..
సాక్షి, హైదరాబాద్/తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండుగ వేడుక సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సంబరాలు చేసుకున్నారు. ప్రజలు భోగి శుభాకాంక్షలు తెలిపారు.నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి వద్ద భోగి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ కుటుంబ సభ్యులతో సందడి చేశారు. అటు విశాఖ నగరంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకుంటున్నారు.విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తెలుగు వారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు . వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకున్నారు. కానీ, ఈరోజు ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ప్రజలంతా ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి ప్రజలకు నిరాశ, నిస్పృహలను మిగిల్చింది. ఎన్నికల ముందు కూటమి అనేక హామీలిచ్చింది. ఇప్పుడు కరెంట్, నిత్యవసర ధరల పెంచేసి ప్రజలపై భారం మోపిందన్నారు. ఇటు తెలంగాణలో సహా భోగి పండుగ వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామునే భోగీ మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు.. నగరవాసులంతా పల్లెలకు తరలి వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. -
జగన్ ముందే జగన్ మిమిక్రీ..
-
ఏలూరులో ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకలు
-
Live: సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
-
హైదరాబాద్ లో భోగి సంబరాలు
-
విశాఖలో భోగి సంబరాలు
-
భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రలో ఈ పండుగ హడవిడి మాములుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో కొత్త కోడళ్లు, అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడి పందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటలు రుచులుతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్న ఈ పండుగ వస్తే ఊళ్లకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు చలిమంటలు ఎందుకు వేస్తారు?. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం!. భోగి అనే పేరు ఎలా వచ్చిందంటే.. 'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే..పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ!. భోగిమంటలు ఎందుకంటే.. అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే..? ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ భోగిమంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణ వాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72 వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే తగిన ఔషధం ఇవ్వోచ్చు. అదే అందరికీ ఇవ్వడం కాస్త కష్టం, పైగా అసాధ్యం కూడా. వైద్యం చేయించుకోలేని పేదవాళ్లు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించే మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి ఐక్యమత్యానికి శ్రీకారం చుడుతుంది. అంత మహిమాన్వితమైన ఈ భోగి పండుగ రోజును మీ లోగిళ్లో భోగిమంటలు వేసుకుని పెద్దచిన్న అంతా పాల్గొని ఆయురారోగ్యాల పొందడమే గాక భోగభాగ్యాలు కలిగేలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!) -
అంబటి భోగి డ్యాన్స్...
-
మంత్రి రోజా ఇంట్లో సంక్రాంతి సంబరాలు
-
భోగి వేడుకలు.. డ్యాన్సులతో మంత్రి అంబటి సందడి
సాక్షి, గుంటూరు: ఊరూవాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. పముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డ్యాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించానని తెలిపారు. ‘‘గతంలో డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించాను. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునే. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడిని.. టీడీపీ, జనసేన ఆనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను భోగిమంటల్లో వేసి తగలపెడతారు’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) పాల్గొన్నారు. విజయవాడలోని క్రీస్తు రాజపురం 5వ డివిజన్ లో భోగి సంబరాల్లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, కార్పొరేటర్లు , వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ లో తెల్లవారుజామున భోగి వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
-
ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భోగి, ఉత్తరాయణ పర్వదినాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలకు ఉత్తరాయణ, భోగి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజులు అందరికీ సంతోషాన్ని, శుభాలను కలుగజేయాలని, జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను’అని ఆయన ట్వీట్లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భోగి పండుగను, ఉత్తరాయణం సందర్భంగా గుజరాత్ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు. -
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్ట్ వల్
-
విశాఖలో భోగి సంబరాలు (ఫొటోలు)
-
కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి భోగి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు. Telangana | BRS MLC K Kavitha participated in the Bhogi celebrations organised by Bharat Jagruthi at KBR park in Hyderabad. pic.twitter.com/n31mFG4Sxy — ANI (@ANI) January 14, 2023 -
భోగి వేడుకల్లో.. మంత్రి అంబటి హుషారు స్టెప్పులు
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారక ముందు నుంచే భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సంబరాలు ప్రారంభించుకున్నారు ప్రజలు. ఇక.. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. తన ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు చేశారాయన. ఆపై గిరిజనులతో కలిసి స్టెప్పులు వేసి ఆటపాటల్లో పాల్గొన్నారాయన. వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. అక్కడున్న వాళ్లను హుషారెత్తించారు మంత్రి అంబటి. -
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
-
భోగభాగ్యాల భోగి..
-
భోగి వేడుకల్లో మెగా ఫ్యామిలీ...
-
మలేషియా టౌన్ షిప్లో భోగి సంబరాలు
-
సీఎం వైఎస్ జగన్ భోగి పండగ శుభాకాంక్షలు
-
కళాకారులకు సీఎం జగన్ ఆశీస్సులు
-
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
-
కుటుంబంతో కలిసి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి భోగి సంబరాలు
-
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
CM YS Jagan To Attend In Sankranthi Celebrations: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు. తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చ తెలుగు పంచెకట్టుతో ఆయన గోశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. మేళ తాళాల మధ్య వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సీఎం దంపతులు గోపూజ నిర్వహించి, గో సేవ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. దాదాపు గంటన్నర సేపు సీఎం దంపతులు వేడుకలను తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ.. చదవండి: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు? ఆకట్టుకున్న గోశాల ప్రాంగణం: గ్రమీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గోశాలను తీర్చిదిద్దారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తులసి కోట, ధాన్యపు రాశులు, చెరుకు గడలు, రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, డోలు వాద్యాలు, కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అరిసెల వంటకాలతో ఆ ప్రాంతం పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టింది. కోలాటం, డోలు విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఆలపించిన సంక్రాంతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుకు సీఎం దంపతులు బియ్యం అందజేశారు. గోమాతకు పసుపు కుంకుమ సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు, కళాకారులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అర్చకులు సీఎంకు దేవుడి చిత్రపటాన్ని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరో చిత్ర పటాన్ని అందజేశారు. కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కర్నూలులో ఘనంగా భోగి సంబరాలు
-
విశాఖ శారదాపీఠంలో భోగి వేడుకలు
-
భోగి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు డాన్స్
-
భోగి సంబరాల్లో పాల్గొన్న సినీ నటుడు బాలకృష్ణ
-
కుటుంబ సభ్యులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు
-
భోగి సంబరాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్
-
Sankranti 2022 : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మంత్రి పేర్ని నాని నివాసంలో భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్
-
విజయవాడలో ఘనంగా భోగి సంబరాలు
-
కాకినాడలో ప్రారంభమైన భోగి సంబరాలు
-
చీపురు, చాట మంటల్లో వేయండి.. 'వాట్స్ దట్ చాట్ తాతా?'
భోగి పండగ రోజు సాధారణంగా అందరూ ఏం చేస్తారు. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి, ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని, అంతా ఆరుబైటకు చేరి, భక్తితో భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల కోసం దైవ నామస్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుడిని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. మంచు ఫ్యామిలీ కూడా భోగి పండగను జరుపుకుంది. మోహన్‌బాబు కుటుంబం అంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. చీపురు, చాటలు, పాత వస్తువులు మంటల్లో వేయండని మోహన్‌బాబు చెప్తుండగా అతడి మనవరాలు వాట్స్ దట్ చాట్? (చాట అంటే ఏంటి?) అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న విని బిత్తరపోయిన ఆయన నీకు చాట అంటే తెలీదా అంటూనే దాని గురించి వివరంగా చెప్పేందుకు ప్రయత్నించాడు. మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు చాట అంటే తెలీకపోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు. -
ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
-
విశాఖపట్నంలో ప్రారంభమైన భోగి సంబరాలు
-
కూకట్ పల్లిలో భోగి సంబరాలు
-
Sankranti Festival Celebrations 2022 : సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival 2022 Celebrations: ఊరంతా సంక్రాంతి
-
Sankranti 2022: సంక్రాంతి శోభ
-
Sakshi TV Exclusive :సంక్రాంతి సందడంతా సాక్షిలోనే
-
బంగార్రాజు సంక్రాంతి బరిలోకి దిగితే.. ఖేల్ ఖతం త్వరలో...
-
కనుమ అంటే..‘ముక్క’ పడాల్సిందే..తగ్గెదేలే త్వరలో...
-
చార్మినార్ భోగీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
-
సింహాచలం ఆలయంలో భోగి వేడుకలు
సాక్షి, సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ నరసింహ దేవస్థానం ప్రాంగణంలో అత్యంత వైభవంగా భోగి పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. చెడు గుణాలు ప్రాలదోలి... మంచి గుణాలను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామిజీ.. వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాత్మానంద్రేద్ర స్వామికి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామికి వరాహ నరసింహ స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు పొందారు. -
భక్తి శ్రద్ధలతో భోగి
-
పల్లెల్లో ఆరంభమైన భోగి సందడి
-
అనపర్తిలో వైభవంగా సంక్రాంతి వేడుకలు
-
వైజాగ్‌లో భోగి సంబరాలు
-
పశ్చిమ గోదావరిలో ఘనంగా భోగి సంబరాలు
-
తెలుగు రాష్త్రాల్లో వెల్లి విరిసిన భోగి వెలుగులు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి.. తెలుగువారికి ప్రీతికరమైన పండుగ. మూడు రోజుల ఈ పండుగలో మొదటది భోగి. ఈ భోగి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. పాత చీడలన్నీ పోయి... జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని భగవంతుడిని ప్రార్థించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్ గ్రౌండ్లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగభాగ్యాల భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పవిత్రమైన ఉత్తరాయణ ఘడియలను వెంట పెట్టుకుని వస్తున్న భోగిని ఊరువాడా భక్తిశ్రద్ధలతో ఆహ్వానించారు. మంచుతెరల పరదాలను పక్కకు నెడుతూ తెల్లవారుజామునే భోగిమంటలు వేసుకున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో భోగి పండుగ కనులవిందుగా జరిగింది. అలాగే రాజమండ్రిలో భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ భోగి... భోగభాగ్యాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకున్నారు. విశాఖలో భోగి సంబరాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లముందు భోగి మంటలు వేశారు. పాత వస్తువులను మంటల్లో దహనం చేసి కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా విజయనగరంలో పల్లె వాతావరణం ఉట్టిపడుతోంది. అపార్ట్మెంట్ల కల్చర్‌లోనూ భోగి పండుగను అంతా కలిసి మెలిసి జరుపుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మలేషియన్ టౌన్ షిప్లో భోగి పండుగను జరుపుకున్నారు. భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేశారు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్‌లో జరిగిన భోగి మంటల వేడుకలో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. గతాన్ని భోగి మంటల్లో కాల్చేద్దాం.. కొత్త ఆశలు, ఆశయాలను ఆహ్వానిద్దామని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
ఊరూరా భోగి సందడి
నేడు సంక్రాంతి పండగ నెల్లూరు(అర్బన్): సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నారుు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా భోగి పండగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి ప్రారంభమైంది. తాటి ఆకుతో పాటు పాతచీపుర్లు, పాత కాగితాలు, సామగ్రితో భోగి మంటలు వేశారు. ఒకరితో ఒకరు పోటీ పడటంతో మంటలు ఆకాశాన్ని అంటారుు. నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, వింజమూరుతో పాటు ప్రతి పల్లెలో వేకువ నుంచే భోగి సందడి కనిపించింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నా జనం లెక్కచేయక మంటలు వేసి చలిని తరిమికొట్టారు. దాదాపు ప్రతి చోట యువకులు, పిల్లలు బృందాలుగా ఏర్పడి భారీ ఎత్తున మంటలు వేశారు. పల్లెల్లోని కూడళ్లలో అరుుతే పండగ సందడి మరింత ఎక్కువ కనిపించింది. సంప్రదాయంలో భాగంగా చిన్నారులకు భోగిపండ్లు పోయడంతో పాటు శనగలు, పూలు, చెరకు ముక్కలు, నాణేలతో ఆశీర్వదించి దిష్టి తీశారు. అపార్ట్మెంట్ వాసులు సామూహిక భోగి మంటలను వేసుకుని సందడి చేశారు. గొబ్బిపాటలతో పల్లెలు మార్మోగాయి. నెల్లూరులోని బాలాజీనగర్‌లో చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసులు కీర్తనలు ఆలపించడం పండగకు ప్రత్యేక శోభ తెచ్చాయి. తాటాకు ధరకు రెక్కలు భోగి పండగలో కీలకమైన తాటాకు ధర చుక్కలనంటింది. గతంలో గ్రామాల్లో తాటిచెట్లు భారీగా ఉండేవి. ప్రధానంగా జిల్లాలోని తీరప్రాంతంలో తాటి తోపులు విస్తారంగా కనిపించేవి. ఇటీవల కాలంలో వెనామీ సాగు జోరందుకోవడం, పలు పరిశ్రమలు ఏర్పాటవడంతో తాటిచెట్లు నేలకూలారుు. ఈ క్రమంలో తాటకు ధర భారీగా పెరిగింది. 20 ఆకులు కూడా లేని కట్టను రూ.200 వరకు విక్రరుుంచారు. దీంతో నగర, పట్టణ వాసులకు పండగ ఖర్చు కొంత పెరిగింది. ప్రధాన కూడళ్లలో కనిపించే పెద్దపెద్ద మొద్దుల స్థానంలోనూ టాటాకులే కనిపించారుు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పల్లెల్లో గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నత్యాలు కనులవిందు చేస్తాయి. హరిలో రంగ హరీ అంటూ నెత్తిపై నుంచి నాసిక వరకు తిరుమణి పెట్టుకొని ఘల్లుఘల్లు మంటూ చిందులు వేస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసు ప్రత్యక్షమవుతారు. అయితే ప్రస్తుతం హరిదాసుల సంస్కృతి బాగా తగ్గిపోయి కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. నగరాల్లో కంటే పల్లెల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండగ ఎంతో ప్రత్యేకం. ఎక్కడున్నా తొలి పండగకు భార్యతో అత్తవారింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే వారు అత్తారింటికి సందడి చేస్తున్నారు. బోడిగాడితోటలో ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బోడిగాడితోట(హిందూ శ్మశాన వాటిక)లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పితృ దేవతలకు సంతర్పణ చేసే కార్యక్రమం నగరంలో భారీ స్థాయిలో జరగనుంది. ఇప్పటికే నగర వాసులు పలువురు తమ ఆత్మీయుల సమాధులను ప్రత్యేకంగా అలకరించారు. గురువారం ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారు.