![Bhogi Celebrations At Simhachalam Narasimha Swamy Temple - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/14/bhogi.jpg.webp?itok=LXFIPhPe)
సాక్షి, సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ నరసింహ దేవస్థానం ప్రాంగణంలో అత్యంత వైభవంగా భోగి పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. చెడు గుణాలు ప్రాలదోలి... మంచి గుణాలను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామిజీ.. వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాత్మానంద్రేద్ర స్వామికి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామికి వరాహ నరసింహ స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment