
సాక్షి, విశాఖపట్నం: అఖండ సినిమా ఘన విజయంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ. అఖండ భారీ విజయం నేపథ్యంలో గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు బాలకృష్ణ. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు.ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు....చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు.
(చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు)
అంతేకాక ‘‘ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాలకృష్ణ.
చదవండి: అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment