‘మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చి ‘అఖండ’ సినిమా వీక్షిస్తున్నారు. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం’అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’. గత ఏడాది డిసెంబరు 2న విడుదైన ఈ చిత్రం.. జనవరి 20 (గురువారం)తో యాభై రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్‌లో అర్థ శతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం.
ఇప్పుడు అఖండ పండుగ ఇది. ఈ చిత్రం శుక్రవారం(జనవరి 21) నుంచి డిస్నీప్లస్ హార్ట్‌స్టార్‌లో విడుదల కానుంది. చూసి ఎంజాయ్ చేయండి’అన్నారు. ఈ విజయాన్ని ఎన్టీఆర్ గారికి అంకితమిస్తూన్నామని అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు’అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment