Balakrishna Akhanda Movie OTT Review: Got Huge Response, Details Inside - Sakshi
Sakshi News home page

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న ‘అఖండ’.. తొలిరోజే రికార్డు నమోదు

Published Sun, Jan 23 2022 5:51 PM | Last Updated on Mon, Jan 24 2022 8:16 AM

Huge Response For AKhanda Movie In OTT Disney Plus Hotstar - Sakshi

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హైట్రిక్‌ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 

ఇక తాజాగా ఓటీటీలో విడుదలైన ‘అఖండ’.. అక్కడ కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. జనవరి 21 నుంచి  ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హార్ట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీ.. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఓటీటీలో భారీ ఓపెనింగ్స్‌ రావడంతో పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘అఖండ’.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులకు మా చిత్రం వీక్షించడం పట్ల సంతోషంగా ఉంది ’ అన్నారు బాలకృష్ణ. కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లో చూడలేకపోయిన వారంతా.. ఓటీటీలో ‘అఖండ’ చిత్రం వీక్షించి ఆస్వాదించండి’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement