Akhanda Completes 50 Days In Theatres, Check Box Office Collections Details - Sakshi
Sakshi News home page

Akhanda Collections: ‘అఖండ’ విజయం.. 50 రోజులు.. 200 కోట్ల కోట్ల కలెక్షన్స్‌

Published Thu, Jan 20 2022 2:33 PM | Last Updated on Thu, Jan 20 2022 3:36 PM

Akhanda Successfully Completes 50 Days In 103 Centres - Sakshi

ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 50 రోజులు.. 100 రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా రెండు వారాల కంటే ఎక్కువ ఆడడం కష్టమే. సూపర్‌ హిట్‌ అయితే.. ఓ నాలుగు వారాలు నడవడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు థియేటర్స్‌లో ఆడిదంటే మాములు విషయం కాదు. చాలా రోజుల తర్వాత ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్‌ చేసింది.

గతేడాది డిసెంబర్‌ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు.  అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి.. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి  నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement