Akhanda 2: Balakrishna And Boyapati Srinu Likely To Reunite For Akhanda Movie Sequel - Sakshi
Sakshi News home page

Akhanda Part 2: బన్నిని ఫాలో అవుతున్న బాలయ్య.. బోయపాటిపై ఒత్తిడి!

Published Tue, Feb 22 2022 11:19 AM | Last Updated on Tue, Feb 22 2022 1:54 PM

Akhanda 2: Balakrishna And Boyapati Srinu Focus On AKhanda Sequel - Sakshi

కొద్ది రోజులుగా బాలయ్య జోరు పెంచాడు.అభిమానులు కోరుకున్న విధంగా ట్రెండింగ్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఓటీటీ వరకు వచ్చి టాక్ షో చేశాడు.ఇప్పుడు ఇదే స్పీడ్ లో తాను నటించిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ తెరకెక్కాలని పట్టుబడుతున్నాడట.గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం.. చాలా కాలం తర్వాత బాలయ్యకు భారీ బ్లాక్‌ బస్టర్‌ను అందించింది.సింహా, లెజెండ్ చిత్రాలను మించి వసూళ్లను కొల్లగొట్టింది.ఇటు థియేటర్స్ లోనూ, అటు ఓటీటీలో దుమ్మురేపింది.అందుకే ఇప్పుడు ఇమిడియెట్ గా సీక్వెల్ తెరకెక్కాలి అంటున్నాడట. అందుకోసం దర్శకుడు బోయపాటి పై ఒత్తిడి తీసుకొస్తున్నాడట.


అఖండ తర్వాత బన్నితో బోయపాటి మూవీ చేయాల్సి ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు.దాంతో బోయపాటి ఇమిడియెట్ గా రామ్ తో మూవీ లాక్ చేసుకున్నాడు.ఎనర్జిటిక్ స్టార్ తో కలసి ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.ఇటీవలే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.అయితే రామ్ తో మూవీ తర్వాత బోయపాటి అఖండ2 పై ఫోకస్ పెట్టనున్నాడట.అఖండ 2 స్టోరీ లైన్ కు సంబంధించినలీడ్ ను మొదటి భాగం క్లైమాక్స్ లో చెప్పకనే చెప్పాడు బోయపాటి.పైగా అందుకు తగ్గ స్టోరీ కూడా రెడీగా ఉందని అన్ స్టాపబుల్ షోలో చెప్పాడు. అందుకే రామ్ తో మూవీ కంప్లీట్ కాగానే అఖండ 2 పట్టాలెక్కించాలనుకుంటున్నాడట.పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.వేడి తగ్గకముందే పార్ట్ 2 రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడు బన్ని. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను బాలయ్య అండ్ బోయపాటి  ఫాలో కావాలనుకుంటున్నారు. అన్ని కుదిరితే 2023 అఖండ పార్ట్‌ 2 పట్టాలెక్కనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement