Balakrishna Signs Another Movie With Director Boyapati Srinu, News Goes Viral - Sakshi
Sakshi News home page

Balakrishna-Boyapati Srinu: బోయపాటితో మరో మూవీ.. కానీ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బాలయ్య!

Published Sun, Apr 24 2022 1:42 PM | Last Updated on Sun, Apr 24 2022 2:17 PM

Balakrishna Signs Another Movie With Boyapati Srinu, News Goes Viral - Sakshi

బాలయ్య, బోయపాటి సినిమా అనగానే అందరూ ఆ సినిమా ఎక్స్‌ఫెక్ట్‌ చేస్తారు.

టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉండవచ్చు. కాని బోయపాటి, బాలయ్య కాంబోకు తిరుగులేదు. సింహా, లెజెండ్,అఖండ తెలుగు సినిమా  చరిత్రలో తిరుగులేని బ్లాక్ బస్టర్స్. బీసీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అందించిన మూవీస్. అందుకే ఈ కాంబో మళ్లీ రిపీట్ బాగుంటుందని టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం బోయపాటి కూడా అదే పనిలో ఉన్నాడని సమాచారం.
(చదవండి: 40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్‌ చేశాను: చిరంజీవి)

బాలయ్య, బోయపాటి సినిమా అనగానే అందరూ అఖండ -2 ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఓ రియాలిటీ షోలో ఆల్రెడీ బోయపాటి స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. కాని బాలయ్య అక్కడే  బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. బోయపాటితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే లెజెండ్ రేంజ్ లో పొలిటికల్ స్టోరీ ఉండాలి అంటున్నాడట. అందుకు బోయపాటి కూడా సరే అన్నాడని సమాచారం. 

ప్రస్తుతం బోయపాటి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ కమిట్ అయ్యాడు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.మరో వైపు బాలయ్య కూడా గోపీచంద్ మలినేని మేకింగ్ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత అనిల్‌ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి సినిమా సెట్‌లో అడుగుపెట్టాలనుకుంటున్నాడట బాలయ్య. ఆ లోపు బోయపాటి ఓ పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ స్టోరీ రెడీ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement