Swatmanandendra Swamy
-
వైభవంగా రాజశ్యామల యాగం
పెందుర్తి: విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలుపంచుకున్నారు. అంతకుముందు శారదా పీఠానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలను కలిసి సీఎం జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం జగన్ సంప్రదాయ వస్త్రధారణతో స్వామీజీలతో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం స్వర్ణ మండపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దీక్ష పీఠం వద్ద విశేష పూజలు చేశారు. ప్రముఖ పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామీజీల సమక్షంలో దాదాపు 30 నిమిషాలు అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేసి స్వహస్తాలతో హారతులిచ్చారు. పీఠంలోని స్వయంజ్యోతి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామిలను దర్శించుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. వేద పండితులను సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం నిర్వహించిన రాజశ్యామల యాగాన్ని దర్శించుకుని, పూర్ణాహుతిలో పాలుపంచుకున్నారు. యాగ భస్మా న్ని స్వరూపానందేంద్ర సరస్వతి సీఎం నుదిటిన దిద్దారు. 2 గంటలకు పైగా సీఎం వైఎస్ జగన్ యా గం, పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. పీఠంలోని వేద విద్యార్థులతో ముచ్చటించారు. సీఎం వెంట వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు డాక్టర్ బీశెట్టి సత్యవతి, ఎం.వి.వి.సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, విశాఖ మేయర్ హరివెంకటకుమారి ఉన్నారు. రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం ఇదే: స్వామీజీ దేశంలో రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల సీఎంలు సైతం ఇక్కడ రాజశ్యామల యాగంలో పాల్గొన్న వారే అని తెలిపారు. శ్రీ శారదా పీఠంలో కొలువుదీరిన రాజశ్యామల మాత అత్యంత శక్తివంతమైన దేవత అని స్వామీజీ తెలిపారు. సీఎం జగన్ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనడం, రాజశ్యామల యాగాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. మేం ‘సిద్ధం’జగనన్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విశాఖ ప్రజల ఘన స్వాగతం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల యాగానికి వచ్చిన సీఎం జగన్‌కు విశాఖ ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీ శారదా పీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ‘నిన్ను మరోసారి గెలిపించడానికి మేం సిద్ధం జగనన్నా’అంటూ స్వాగతం పలికారు. ప్రజలు, మహిళలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుకు ఇరువైపులా నిల్చొని జెండాలు, సిద్ధం ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక అభిమాని కాన్వాయ్ వెంట ప్లకార్డు ప్రదర్శిస్తూ పరుగులు తీశాడు. సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ, అక్క చెల్లెమ్మలను పలకరిస్తూ శ్రీ శారదా పీఠానికి వెళ్లారు. -
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష విరమణ
-
విశాఖ శ్రీ శారదా పీఠం ప్రాముఖ్యత గురించి స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
-
రాజశ్యామల ఉపాసన కేంద్రం విశాఖ శారదాపీఠం
సింహాచలం: తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించే ఏకైక ఉపాసన కేంద్రంగా విశాఖ శ్రీశారదాపీఠం ఖ్యాతిగాంచిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది ఉన్నతస్థాయికి చేరుకున్నారని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ రాజశ్యామల అమ్మవారిని ఏకాంతంగాను, అంతర్లీనంగాను ఉపాసించాలంటే అది కేవలం విశాఖ శ్రీశారదాపీఠంలోనే సాధ్యమని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే వారు అదృష్టవంతులవుతారన్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ సాధారణ రోజుల్లోకన్నా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఆరాధిస్తే వేయిరెట్లు ఫలితం సిద్ధిస్తుందని చెప్పారు. ఈవేడుకల్లో లోకకల్యాణార్ధం చండీహోమం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జగన్మాత రాజశ్యామల అమ్మవారి ప్రీతికోసం శ్రీచక్రానికి నవావరణార్చన చేస్తున్నట్లు చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత మహాగణపతిపూజ, చండీహోమం, రాజశ్యామల హోమాన్ని నిర్వహించే పండితులు దీక్షాధారణ చేశారు. తొలిరోజు సోమవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. -
13 నుంచి శారదా పీఠాధిపతి చాతుర్మాస దీక్ష
పెందుర్తి: ఈనెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్షను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేపట్టనున్నారు. రుషికేష్‌లోని పవిత్ర గంగానదీ తీరాన శ్రీశారదాపీఠం శాఖలో గురుపూర్ణిమ సందర్భంగా స్వామీజీలు ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది. స్వామీజీకి ఇది 26వ చాతుర్మాస దీక్ష కాగా.. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నాలుగోసారి దీక్ష చేపట్టనున్నారు. దీక్షా కాలంలో పరివ్రాజ్యలు(పర్యటనలు) చేయరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను స్వీకరించరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు భండారా (అన్నదానం) నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తరువాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేపడతారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్‌కు వెళ్తుంటారు. -
కృష్ణా తీరంలో కొలువైన తిరుమలేశుడు.. (ఫోటోలు)
-
కృష్ణా తీరంలో తిరుమలేశుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది. ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలోనే స్వామి వారి దర్శనం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్‌ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. సాయంత్రం కార్యక్రమాలు.. ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?) -
హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు గిరిజన ప్రాంతాలు
సింహాచలం (పెందుర్తి)/పెందుర్తి: హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు గిరిజన ప్రాంతాలేనని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీశారదా పీఠం ఆధ్వర్యంలో చినముషివాడలోని శారదా పీఠం నుంచి సింహగిరికి 5 వేల మందితో పాదయాత్రని శ్రీగురుదేవా చారిటబుల్ ట్రస్ట్ శనివారం నిర్వహించింది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాం తం నుంచి వచ్చిన వందలాది మంది గిరిజనులతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మొత్తం 121 గ్రామాల నుంచి 5 వేల మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. హరినామస్మరణలు చేస్తూ సింహగిరికి చేరుకున్నారు. సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని తమ ప్రాంతాల్లో పండిన ధాన్యం తొలి పంటని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా వరాహ లక్ష్మీనృసింహస్వామికి స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం స్వామీజీ ఆలయ రాజగోపురం ఎదురుగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశా రు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో భక్తిభావాన్ని పెం పొందించేందుకు టీటీడీ, దేవదాయశాఖ ఆలయాలను, భజన మండళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన ఆదివాసీలు శారదా పీఠాన్ని విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాది మంది గిరిజనులు శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్యమతాల ఉచ్చులో పడవద్దని సూచించారు. పసుపు–కుంకుమలతో సౌభాగ్యంగా కనిపించేది కేవలం హిందూ ధర్మంలో మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల సన్నిధిలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. -
ఢిల్లీలోనూ విశాఖ శారదా పీఠం సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ శారదా పీఠం కార్యక్రమాలను దేశ రాజధాని ఢిల్లీకి సైతం విస్తరించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం అని, ఆ క్రమంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వెల్లడించారు. ఇందుకోసం స్థలం కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. తెలుగు వారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణలో శారదా పీఠం విశిష్ట సేవలందిస్తోందని, తాజాగా విశాఖ ఏజెన్సీ నుంచి గిరిజనులను తీర్థయాత్రలకు తీసుకెళ్లామని తెలిపారు. దళిత, గిరిజనుల కోసం ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిన ఇప్పటికే తమకు కాశీ మహాక్షేత్రంతో పాటు రిషికేశ్ గంగానది తీరాన ఆశ్రమం ఉందని, హైదరాబాద్‌లోనూ నిర్మాణం పూర్తికాబోతుందని వెల్లడించారు. -
స్వరూపానందేంద్ర స్వామికి విశ్వగురు పురస్కారం
విశాఖపట్నం: విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’సంస్థ ‘ఆర్ష విద్యా వాచస్పతి విశ్వగురు పురస్కార్-2021’ ప్రదానం చేసింది. స్వరూపానందేంద్ర స్వామి ఆథ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యవోలు రాంబాబు తెలిపారు. సోమవారం విశాఖ శారదాపీఠంలో జరిగిన కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి కూడా ‘విశ్వగురు పురస్కార్- 2021’ అవార్డు ప్రదానం చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా తాను ముక్కుతో గీసిన నాసికా చిత్రాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి అందజేసి ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ డైరెక్టర్ సత్యవోలు పూజిత, సలహాదారులు తుమ్మిడి రామ్‌కుమార్, సుందరపల్లి గోపాలకృష్ణ, బ్రహ్మశ్రీ బానాల దుర్గాప్రసాద్, తుమ్ముడి మణి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన స్వాత్మనందేంద్ర
-
శారదాపీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్
-
శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి. విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్ జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. గంటపాటు కొనసాగిన ఈ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ‘సీఎం జగన్మోహన్రెడ్డి మాటపై మాకు నమ్మకం ఉంది. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలి’ అని వారు పేర్కొన్నారు. శారదా పీఠ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వాగతం పలికారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: వైఎస్ జగన్‌కు ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డు -
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
సాక్షి, కాకినాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి రథాన్ని పరిశీలించిన స్వామీజీ.. రథం అత్యంత సుందరంగా ఉందని, 90 రోజుల్లో 40 అడుగుల రథాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంశించారు. స్వామివారి ఉత్సవాలకు ముందే రథాన్ని నిర్మించడం ఆనందదాయకమని స్వామీజీ పేర్కొన్నారు. రథం యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమానుసారం శాస్త్రబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులు, పండితులకు స్వామీజీ పలు సూచనలు చేశారు. ఆలయాల్లో రథాలు భగవంతుని శరీరంలో భాగమని పేర్కొన్న స్వామీజీ.. దైవ సంపద పరిరక్షణ దేవాదాయశాఖతో పాటు ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం కలిశారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల భద్రతపై సీఎంతో మాట్లాడానని తెలిపారు. స్వరూపానంద స్వామి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రికి నివేదించానని పేర్కొన్నారు. (చదవండి:పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) ‘‘తాను చెప్పిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. దాడులపై దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఎం చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో విజయవాడలో కూల్చిన దేవాలయాలను పునర్నిర్మిస్తామని..ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు. ఇప్పటికే 30 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టు చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ముందుంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారని’’స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. (చదవండి: మతాలతో ఆటలా..: సజ్జల రామకృష్ణారెడ్డి) -
విగ్రహాల ధ్వంసం బాధాకరం: స్వాత్మానందేంద్ర సరస్వతి
సాక్షి, విశాఖపట్నం: బురుజు పేటలోని శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారిని ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి శారదా పీఠం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాత్మానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమన్నారు. తొలిరోజుల నుంచీ హిందూ సంప్రదాయాలు, ఆలయ ఆస్తుల పరిరక్షణలో శారదాపీఠం పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దేవాదాయశాఖ మంత్రితో చర్చించారని, ఆలయాల భద్రతపై త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో స్వరూపానందేంద్ర సరస్వతి సమావేశమవుతారని స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. -
విశాఖ శారదా పీఠాధిపతుల పుణ్య స్నానం
రిషికేశ్: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ వద్ద గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే రిషికేశ్‌లో శారదాపీఠం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరానికి చేరుకున్నారు. తన పరివారంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పీఠాధిపతులు ఇద్దరూ దండ తర్పణం నిర్వహించారు. అనంతరం వేద విద్యార్ధులతో కలిసి చండీ పారాయణ చేసారు. స్వామి స్వాత్మానందేంద్ర గ్రహణ సమయాన్ని మొత్తం నదీ తీరంలోనే గడిపారు. నదీ జలాల్లో మునిగి ప్రత్యేక జపమాచరించారు. గ్రహణ కాలంలో విశాఖ శారదాపీఠం ఆవరణలోని సకల దేవతా మూర్తుల ఆలయాలను కూడా మూసివేశారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడల్లా ఈ తరహా నియమాలను పాటించడం విశాఖ శారదా పీఠానికి ఆనవాయితీగా వస్తోంది. -
శ్రీవారి లడ్డూ అమ్మకాలపై అసత్య కథనాలు మానుకోవాలి
రాజమహేంద్రవరం కల్చరల్: వివిధ జిల్లాల్లో టీటీడీ కల్యాణ మండపాల ద్వారా జరుగుతున్న శ్రీవారి లడ్డూల అమ్మకాలపై సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య కథనాలను మానుకోవాలని విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా, లోకకల్యాణార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ తన కార్యాలయ ప్రాంగణంలో ధన్వంతరీ సహిత మహాసుదర్శన యాగం, రాజశ్యామల సహిత రుద్రయాగం శుక్రవారం ప్రారంభించారు. ఈ యాగ పూర్ణాహుతిలో పాల్గొనడానికి ఆదివారం నగరానికి వచ్చిన స్వాత్మానందేంద్ర విలేకర్లతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► శ్రీవారి అనుగ్రహం, ఆశీస్సులు ఈ లడ్డూల రూపేణా లభిస్తున్నట్టు భావించాలి. ► టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయం. ► శార్వరి నామ సంవత్సరం కాలసర్ప దోషంతో ప్రారంభమైంది.. గ్రహకూటమి అనుకూలంగా లేదు. ► కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక శక్తితో ప్రతి ఒక్కరిలోనూ మానసిక స్థైర్యం తప్పకుండా చేకూరుతుంది. -
‘ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుంది’
సాక్షి, విశాఖపట్నం: కరోనా (కోవిడ్–19) మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభం అయ్యాయి. స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. పీఠంలో నేటి నుంచి ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా లోక కల్యాణం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ధన్వంతరి హోమం ప్రారంభమైంది. ముందు జాగ్రత్త చర్యగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే అన్ని ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి. పాప గ్రహాల శక్తి పుంజుకుంది ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నేటి నుండి నిర్వహిస్తున్నామన్నారు. వేద మంత్రాలు, బీజాక్షరాల సంపుటి చేసి, ఈ యాగాన్ని సామాజిక స్పృహతో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని పేర్కొన్నారు. రాహువు దృష్టి గ్రహాల మీద పడటం వల్ల ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. ‘శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీద ప్రభావం ఉంది. ఏప్రిల్ 2 నుండి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉంది. వీటన్నింటి వల్ల ఈ అమృత పాశు పత సహిత విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది ఈ క్రతువులో పాల్గొంటున్నారు. యాగంలో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు, గోమయంతో తయారైన పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నాం. ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుంది’ అని స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. -
30 నుంచి విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు ఈ నెల 30 నుంచి అయిదురోజుల పాటు నిర్వహించనున్నామని ఆ పీఠ ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హైందవ ధర్మ పరిరక్షణలో విశాఖ శారదా పీఠం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేస్తోందన్నారు. ఇక గురువారం ఉదయం శారదా పీఠం వేడుకలు ప్రారంభం కాగా ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. అయిదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో రాజశ్యామల అమ్మవారి విశేష యాగం, టీటీడీ చతుర్వేద సంహిత యాగం, తదితర హోమాలు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న విఠల్ దాస్ మహరాజ్ భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. శాస్త్ర సభల్లో అధ్యయనంతోపాటు, వాటిని పరిరక్షిస్తున్న పండితులను స్వర్ణ కంకణ ధారణతో ఘనంగా సత్కరిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జాతీయ శాస్త్ర సభలు, అగ్నిహోత్ర సభలు ప్రత్యేకంగా నిలుస్తాయని.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. -
సింహాచలం ఆలయంలో భోగి వేడుకలు
సాక్షి, సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ నరసింహ దేవస్థానం ప్రాంగణంలో అత్యంత వైభవంగా భోగి పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. చెడు గుణాలు ప్రాలదోలి... మంచి గుణాలను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామిజీ.. వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాత్మానంద్రేద్ర స్వామికి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామికి వరాహ నరసింహ స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు పొందారు. -
కడప చేరుకున్న స్వాత్మానందేంద్ర స్వామీజీ
సాక్షి, వైఎస్సార్: హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామీజీ శనివారం కడప జిల్లాకు చేరుకున్నారు. కడప అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకున్న అనంతరం శ్రీశ్రీ స్వత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ... హిందూ ధర్మ ప్రచారయాత్రా పేరుతో చేపట్టిన దేశవ్యాప్త యాత్రలో ఇప్పటికే 200 పైచిలుకు ఆలయాలను సందర్శించానని తెలిపారు. మొదటి విడత యాత్రలో భాగంగా చేపట్టిన 11 వేల కిలోమీటర్లు యాత్ర జనవరి 9న కృష్ణా జిల్లాలో పూర్తవుతుందని తెలిపారు. దక్షిణ భారత్ తరువాత ఉత్తర భారత్ యాత్ర చేపడతానని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా తనకు భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. స్వాత్మానందేంద్ర స్వామీజీ మొదటి విడత యాత్రలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, పల్లెలను సందర్శించనున్నారు. -
అప్పన్నను దర్శించుకున్న శారద పీఠాధిపతి
సాక్షి, విశాఖపట్నం : శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి , స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలు గురువారం సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్వర్ రావు పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిలిద్దరు కలిసి అర్చకుల సమక్షంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో 57 రోజుల పర్యటన చేపట్టనున్నట్లు స్మాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. అనంతరం దేవి శరన్ననవరాత్రులకు సంబంధించిన ఉత్సవాల బ్రౌచర్‌ను స్వరూపానందేంద్ర స్వామి విడుదల చేశారు. -
అట్టహాసంగా స్వాత్మానందేంద్ర పరిచయసభ
సాక్షి, హైదరాబాద్: శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ సభ బుధవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 5 నిమిషాల ముందే సభాస్థలికి వచ్చిన సీఎం కేసీఆర్.. స్వాత్మానందేంద్ర, స్వరూపానంద స్వాములకు స్వాగతం పలికి వారిని వేదికపైకి తీసుకొచ్చారు. ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ నూతన వస్త్రాలు, తులసిమాల, పుష్పమాలతో స్వాములిద్దరినీ సన్మానించారు. అనంతరం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం విశాఖ శారద పీఠానికి నగర శివారులోని కోకాపేటలో రెండెకరాల స్థలం కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ స్వరూపానంద స్వామికి అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రధాన దేవాలయాలకు చెందిన దేవతా శేషవస్త్రాలు, ప్రసాదాలను ఇద్దరు స్వాములకు అందించారు. కార్యక్రమం చివర్లో స్వాములిద్దరికీ కేసీఆర్ పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వరూపానంద స్వామి కేసీఆర్‌కు శేషవస్త్రాలు అందించి సన్మానించారు. కోకాపేటలో కేటాయించిన రెండెకరాల భూమి పత్రాలను స్వరూపానంద స్వామికి అందజేస్తున్న కేసీఆర్ తెలంగాణ నుంచే ధర్మప్రచారం.. తెలంగాణ నుంచే ధర్మప్రచారాన్ని ప్రారంభిస్తానని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. చాతుర్మాస దీక్షలో భాగంగా తెలంగాణ నుంచే హృశికేష్కు పయనమవుతున్నానని, కొంతకాలం తపస్సు తర్వాత మళ్లీ తెలంగాణకే వస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తన పరిచయసభ ఉన్నందున, ఇందులో పాల్గొన్న తర్వాతే హృశికేశ్కు వెళ్లాలన్న శారద పీఠాధిపతి ఆదేశంతోనే తానిక్కడికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. స్వరూపానంద స్వామి మాట్లాడుతూ ఆధ్మాత్మిక, ధర్మ ప్రచారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో శారదాపీఠం ముందుంటుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో రెండెకరాల భూమి కేటాయించడం సంతోషమన్నారు. తమ పీఠం విశాఖలో ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌తో సుదీర్ఘ అనుబంధముందన్నారు. ఇక్కడే రెండు పర్యాయాలు చాతుర్మాస దీక్ష నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రను నియమించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్వాత్మానందేంద్ర స్వామిని తులసిమాలతో సన్మానిస్తున్న సీఎం కేసీఆర్. పక్కన స్వరూపానంద స్వామి శారదాపీఠానికి భూమిపూజ విశాఖ శారదాపీఠానికి హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం కోకాపేటలో కేటాయించిన రెండెకరాల భూమిలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూమిని అధికారులు పీఠానికి అప్పగించడంతో బుధవారం పీఠాధిపతి శ్రీస్వరూపానందస్వామి భూమి పూజ చేశారు. పీఠం అర్చకులతో కలసి ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆయన హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండెకరాల భూమిలో ఆలయం, వేదభాషాగోష్టి మఠం, సంస్కృతి విద్యాసంస్థ, విద్యార్థుల వసతిగృహం, భోజనశాల, సమావేశమందిరం తదితరాలు నిర్మించనున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన పూజాకార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు. అక్కడకు వెళ్లిన విలేకరులను ఫొటోలు తీయవద్దని మఠం స్వామీజీలు, పోలీసులు కోరారు. ఇదిలా ఉండగా, టీవీ నటుడు రచ్చరవి స్వామీజీని కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. నన్ను పొగడొద్దు: కేసీఆర్ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి పరిచయ సభ అయినందున వ్యాఖ్యానంలో తనపై ప్రశంసలు కురిపించవద్దని, ప్రస్తావన తేవొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణమూర్తి.. కేసీఆర్‌ను ప్రశంసించబోగా, ఇదే విషయాన్ని సీఎం చిట్టీరాసి ఆయనకు పంపించారు. అదే విధంగా జలవిహార్ ఎండీ రామరాజు దంపతులు సన్మానించబోగా, కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారు. -
జలవిహార్‌లో ఘనంగా గురువందనం
సాక్షి, హైదరాబాద్ : స్వామి స్వాత్మానందేంద్ర శారదాపీఠం ఉత్తరాధికారిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారితో కలిసి హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జలవిహార్‌లో గురువందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు స్పీకర్, మంత్రులు కూడా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో శారదాపీఠానికి కేటాయించిన భూమి పత్రాలను కేసీఆర్ స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. కార్యక్రమంలోభాగంగా స్వాత్మానందేంద్ర, స్వరూపానందేంద్ర స్వాములకు పుష్పాభిషేకం చేశారు.