స్వరూపానందేంద్ర స్వామికి విశ్వగురు పురస్కారం | Swaroopanandendra Saraswati Awarded Aarsha Vidya Vachaspathi Viswaguru Puraskar | Sakshi
Sakshi News home page

స్వరూపానందేంద్ర స్వామికి విశ్వగురు పురస్కారం

Published Tue, Sep 28 2021 5:11 PM | Last Updated on Tue, Sep 28 2021 7:26 PM

Swaroopanandendra Saraswati Awarded Aarsha Vidya Vachaspathi Viswaguru Puraskar - Sakshi

విశాఖపట్నం: విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ‘విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌’సంస్థ ‘ఆర్ష విద్యా వాచస్పతి విశ్వగురు పురస్కార్‌-2021’ ప్రదానం చేసింది. స్వరూపానందేంద్ర స్వామి ఆథ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ‘విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యవోలు రాంబాబు తెలిపారు.


సోమవారం విశాఖ శారదాపీఠంలో జరిగిన కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి కూడా ‘విశ్వగురు పురస్కార్‌- 2021’ అవార్డు ప్రదానం చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా తాను ముక్కుతో గీసిన నాసికా చిత్రాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి అందజేసి ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. 


ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్‌ రికార్డ్ సంస్థ డైరెక్టర్‌ సత్యవోలు పూజిత, సలహాదారులు తుమ్మిడి రామ్‌​కుమార్‌, సుందరపల్లి గోపాలకృష్ణ, బ్రహ్మశ్రీ బానాల దుర్గాప్రసాద్‌, తుమ్ముడి మణి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement