puraskaram
-
డాక్టర్ కేఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం!
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీ వేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తుంది.భారతీయ భాషాసాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయస్థాయిలో నిరంతర సాహితీసేవకూ గుర్తింపుగా డాక్టర్ కే. శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు నాందీ సేవా న్యాస్ సమితి సన్మాన పత్రంలో పేర్కొంది.వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిందీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ రాధా వల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్ సింహ్ పాండే, డాక్టర్ శశికళా పాండే ప్రభృతులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్.. -
ట్రావన్ కోర్ యువరాణికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారం
సాక్షి, తిరుపతి: సనాతన ధర్మానికి నిరంతర సేవ చేస్తున్న ట్రావన్ కోర్ ప్రిన్సెస్ అశ్వతి గౌరి లక్ష్మీబాయికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో సేవ్ టెంపుల్స్ భారత్, వేద విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయిని ఘనంగా సత్కరించారు. పద్మనాభ స్వామి దేవాలయం సంపదల పరిరక్షణలో ఆమె చేసిన పోరాటం ప్రశంసనీయమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్, టెంపుల్స్ భారత్ చైర్మన్ డా.గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాహసానికి సెల్యూట్.. ఉగ్రమూకతో పోరాడిన హిమప్రియ
శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం న్యూకాలనీ: 2018 ఫిబ్రవరి 10.. జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్టర్స్.. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.. ఉదయం ఐదు గంటల సమయం. చిక్కటి చలిలో.. చీకటిలో ఆదమరిచి నిద్ర పోతున్న మనుషులంతా ఆ రోజు తూటా చప్పుళ్లకు ఉలిక్కిపడి లేచారు. ఇంకా చీకటి ఉండగానే ఉగ్రమూక ఆ క్వార్టర్స్‌పై దాడికి తెగబడింది. నాలుగైదు గంటల పాటు ఆపకుండా తూటాల వర్షం కురిపిస్తూనే ఉంది. ఆ భీకర దాడిలో ఓ బాలిక అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. ఆర్మీ జవానైన తండ్రి ఆ సమయంలో ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది. ఒంటి నిండా దెబ్బలు తగిలినా వెరవకుండా తన తల్లితో పాటు తోటి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆమె పేరు గురుగు హిమప్రియ. తల్లి పద్మావతి. తండ్రి పేరు గురుగు సత్యనారాయణ. ఆర్మీ జవాన్. ఈ దాడి సమయంలో ఆయన అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం రూరల్ మండలం, పొన్నాం గ్రామం. ఈ సాహసాన్ని అప్పట్లోనే కేంద్రం గుర్తించింది. రక్షణమంత్రి అభినందనలు అందుకుని.. హిమప్రియ ధైర్యసాహసాలు తెలుసుకున్న నాటి రక్ష ణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జమ్ములోని ఆర్మీ క్వార్టర్స్‌కు వెళ్లి, హిమప్రియ ఇంటిని సందర్శించి ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు. అప్పటికి హిమప్రియ వయసు 8 ఏళ్లు. ఇప్పు డు ఆ బాలికకు ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ప్రకటించినట్టు కలెక్టర్ శ్రీకే ష్ బి.లాఠకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ బాలికా దినోత్సవం రోజున.. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాది గురుగు హిమప్రియ ఎంపికైంది. బాలిక ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వర్చువల్ విధానంలోధ్రువీకరణపత్రం, రూ.లక్ష నగదు అందుకోనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 24 ఉదయం 11.30 గంటల నుంచి వెబ్ కాస్ట్ ద్వారా హెచ్‌టీటీపీఎస్://పీఎంఇండియా వెబ్‌కాస్ట్.ఎన్ఐసీ.ఇన్/ లేదా దూరదర్శన్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు, ముఖ్యంగా పాఠశాల/కళాశాలల విద్యార్థులు వీక్షించాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ విజ్ఞప్తి చేశారు. హ్యాట్సాఫ్ హిమప్రియ.. హిమప్రియ 2019లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆర్మీకి సంబంధించిన ఓ పుస్తకంలో ఆమె ధైర్యసాహసాలను వివరిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది. నాటి ఘటనలో బాలిక తల్లికి చేయి పూర్తిగా దెబ్బతింది. హిమప్రియ భుజానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హిమప్రియ పూణేలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెవెన్త్ చదువుతోంది. -
స్వరూపానందేంద్ర స్వామికి విశ్వగురు పురస్కారం
విశాఖపట్నం: విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’సంస్థ ‘ఆర్ష విద్యా వాచస్పతి విశ్వగురు పురస్కార్-2021’ ప్రదానం చేసింది. స్వరూపానందేంద్ర స్వామి ఆథ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యవోలు రాంబాబు తెలిపారు. సోమవారం విశాఖ శారదాపీఠంలో జరిగిన కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి కూడా ‘విశ్వగురు పురస్కార్- 2021’ అవార్డు ప్రదానం చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా తాను ముక్కుతో గీసిన నాసికా చిత్రాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి అందజేసి ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ డైరెక్టర్ సత్యవోలు పూజిత, సలహాదారులు తుమ్మిడి రామ్‌కుమార్, సుందరపల్లి గోపాలకృష్ణ, బ్రహ్మశ్రీ బానాల దుర్గాప్రసాద్, తుమ్ముడి మణి తదితరులు పాల్గొన్నారు. -
‘నారీ శక్తి పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: 2019 సంవత్సరానికి ‘నారీ శక్తి పురస్కార్’కోసం కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మహిళా సాధికారతకు, ముఖ్యంగా బలహీన, అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతి కోసం అసాధారణ కృషి చేసిన వ్యక్తులు, సమూహాలు, సంస్థలకు ఏటా ఇచ్చే జాతీయ అవార్డు ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చేఏడాది మార్చి 8న పురస్కారాలు అందజేయనున్నారు. పురస్కారానికి సంబంధించి అర్హతలు, ఇతర వివరాలు http://narishaktipuraskar.wcd.gov.in/ వెబ్సైట్లో పొందుపరిచారు. దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలి. సమర్పణకు చివరి తేదీ అయిన వచ్చే ఏడాది జనవరి ఏడు లోపు దరఖాస్తులు, నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. -
దివాకర్ల, విశ్వనాథల సమ్మేళనమే ‘శలాక’
పంచ సప్తతి గోష్ఠిలో మహా మహోపాధ్యాయ గోపాలకృష్ణ జటావల్లభులకు ‘శలాక విద్వత్’ పురస్కార ప్రదానం రాజమహేంద్రవరం కల్చరల్ : విఖ్యాత పండితుడు దివాకర్ల వేంకటావధాని వినయసౌజన్యాలను, సుప్రసిద్ధ రచయిత విశ్వనాథ సత్యనారాయణ పాండితీగరిమను ప్రాచార్య శలాక రఘునాథశర్మలో చూడవచ్చని మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస, శంకరుల ఆర ్షవాజ్ఞ్మయ ప్రచారమే రఘునాథశర్మ జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం ధర్మంచర కమ్యూనిటీహాల్లో జరిగిన రఘునాథ శర్మ పంచసప్తతి పూర్తి అభినందన గోష్ఠిలో విశ్వనాథ మాట్లాడుతూ శలాక శతమానోత్సవం కూడా నగరంలో జరగాలని ఆకాంక్షించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు శలాక రచించిన సప్త గ్రంథాలను ఆవిష్కరించారు. శలాక విశ్వగురువు అని కొనియాడారు. శలాక ఇటీవల రచించిన రచించిన ‘ఆదిత్య హృదయ హృదయము, మహాత్ములు– మణిదీపాలు, కల్పవృక్ష వాగ్వైభవము, ఉత్తర గీతాసౌరభము, స్ఫురణాదీపకలికలు, పంచామృతరసవాహిని, భాగవత నవనీతము’ గ్రంథాలను భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు సభకు పరిచయం చేశారు. ఆదిత్య హృదయాన్ని గీతతో సమన్వయం చేస్తూ శలాక రచించిన ‘ఆదిత్య హృదయ హృదయము’ గ్రంథాన్ని పరిచయం చేస్తూ.. భారతంలో గీత, రామాయణంలో ఆదిత్య హృదయము– రెండూ యుద్దభూమిలోనే చెప్పబడ్డాయని, రెండింటిలో శ్రోతలు(అర్జునుడు, శ్రీరాముడు) దైన్యస్థితిలో వాటిని విని, ఉత్తేజితులయ్యారని తెలిపారు. అనంతరం రఘునాథశర్మ ‘మహాభారత ధర్మజ్ఞ’ జటావల్లభుల జగన్నాథాన్ని ‘శలాక విద్వత్సమర్చన పురస్కారం’ పేరిట రూ.30,000 నగదుతో సత్కరించారు. అన్నజ్ఞాన సమారాధన యజ్ఞాన్ని ప్రారంభించినట్టు ప్రకటించారు. సాహితీవేత్తలు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, అరిపిరాల నారాయణరావు, గురజాల హనుమంతరావు శలాకకు అభినందనలు తెలిపారు. హాజరైన సాహితీవేత్తలు శలాకను ఘనంగా సత్కరించారు. వెదురుపాక విజయదుర్గా పీఠం తరఫున అడ్మినిస్ట్రేటర్ వి.బాపిరాజు శలాకకు ఆశీస్సులందజేశారు. నగరంలోని సాహితీకారులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
పుస్తకావిష్కరణలు.. పురస్కారాలు
అనిశెట్టి రజితకు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో, అనిశెట్టి రజితకు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదాత: నారదాసు లక్ష్మణ్‌రావు. గ్రహీత పరిచయం: అన్నవరం దేవేందర్. జనవరి 12న సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌లోని కామ్రేడ్ బి.విజయ్‌కుమార్ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సభలో బూర్ల వేంకటేశ్వర్లు, అమ్మంగి వేణుగోపాల్, జూకంటి జగన్నాథం, గాజోజు నాగభూషణం, నిజాం వెంకటేశం, బి.నర్సన్ పాల్గొంటారు. బ్రౌన్ పండిత పురస్కారం 2015 అనువాదంలో కృషికి గుర్తింపుగా ముకుంద రామారావుకు మన్మథ నామ సంవత్సరపు బ్రౌన్ పండిత పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తమ్మినేని యదుకుల భూషణ్ తెలియజేస్తున్నారు. అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణంలో కృషికి ఈ పురస్కారాన్ని 2007 నుంచి ఇస్తున్నారు. అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి లాంటి అనువాద కవితా సంకలనాల్ని ముకుంద రామారావు వెలువరించారు. సాహితీ మాణిక్యం పురస్కారాలు కవి సీతారం తన తల్లి మాణిక్యం పేరిట ఇస్తున్న ‘సాహితీ మాణిక్యం’ పురస్కారాలకుగానూ 2016 సంవత్సరానికి కవులు శిఖామణి, యాకూబ్ ఎంపికయ్యారు. జనవరి 15న ఉదయం 11 గంటలకు ఖమ్మంలో పురస్కార ప్రదానసభ జరగనుంది. అవార్డు గ్రహీతల కవిత్వ విశ్లేషణ: కోయి కోటేశ్వరరావు, వంశీకృష్ణ. పువ్వాడ అజయ్ కుమార్, ఖాదర్ మొహియుద్దీన్, మువ్వా శ్రీనివాస్, ప్రసేన్, రవి మారుత్ పాల్గొంటారు. 61 పుస్తకాల ఆవిష్కరణ సౌభాగ్య తన షష్టిపూర్తి సందర్భంగా, తన 61 పుస్తకాలను ఆవిష్కరించ బోతున్నారు. తనికెళ్ళ భరణి ఆధ్వర్యంలో- ఈ సభ, సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ దగ్గరి సన్‌షైన్ హాస్పిటల్‌లోని శాంతా ఆడిటోరియంలో జనవరి 16న సాయంత్రం 6:01కి జరగనుంది. తొలితరం చిత్రకారుడు మార్చాల పుస్తకావిష్కరణ జి.యాదగిరి రాసిన ‘తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు’ పుస్తకావిష్కరణ జనవరి 17న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: కె.వి.రమణాచార్యులు. కారంచేడు బుచ్చిగోపాలం, శ్రీరంగాచార్య, కొడిచెర్ల పాండురంగాచార్యులు, వై.నాగిరెడ్డి, గిరిజా మనోహరబాబు పాల్గొంటారు. కె.వి.రమణారావుకు చాసో స్ఫూర్తి పురస్కారం చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారాన్ని 2016కుగానూ ‘పుట్టిల్లు’ కథాసంకలనం వెలువరించిన కె.వి.రమణారావుకు ప్రదానం చేయనున్నారు. జనవరి 17న సాయంత్రం 5:30కి విజయనగరంలోని హోటల్ మయూరలో జరిగే పురస్కార సభలో కె.శ్రీనివాసరావు, మృదుల గర్గ్, కేతు విశ్వనాథరెడ్డి, కమల్ కుమార్, ఎ.కృష్ణారావు, రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, రామసూరి, జి.ఎస్.చలం, చీకటి దివాకర్ పాల్గొంటారు. అనంతరం, చాగంటి తులసి కూర్చిన ‘నీ ఉత్తరం అందింది’తోపాటు, ఆమె హిందీలోకి అనువదించిన కేతు విశ్వనాథరెడ్డి, మెడికో శ్యామ్ కథల పుస్తకావిష్కరణలు కూడా జరుగుతాయి. ‘ఆవిర్భావానంతర’ సంచిక కోసం... ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలని’ కోరుతూ, ‘ప్రజల పక్షం వహించే కవులు లేరనే అపవాదును తుంచి’వేసే లక్ష్యంతో, కాలనాళిక పేరిట తేబోయే కవితల సంకలనానికి కవులు స్పందించాలని తెలంగాణ రచయితల వేదిక కోరుతోంది. ‘గోలకొండ కవుల సంచిక’ స్ఫూర్తితో తెస్తున్న దీనికి సంపాదకులుగా జయధీర్ తిరుమలరావు, జలజం సత్యనారాయణ వ్యవహరిస్తారు. సంచికను మహబూబ్‌నగర్‌లో జరిగే తెరవే జిల్లా మహాసభల్లో విడుదల చేస్తారు. చిరునామా: కాలనాళిక, 402, ఘరోండా అపార్ట్మెంట్, డి.డి.కాలనీ, హైదరాబాద్-7. ఈమెయిల్: jayadhirtr@gmail.com -
మిధున్‌రెడ్డికి ప్రజాతపస్వి బిరుదు ప్రదానం
చిత్తూరు(అర్బన్): ప్రజాశేయస్సే పరమావధిగా నిరంతరం వారి సంక్షేమానికి కృషి చేస్తున్న రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్‌రెడ్డికి ప్రజాతపస్వి బిరుదును ప్రదానం చేయడం సంతోషకరమని యూనివర్సల్ పీస్ క్రాస్ వ్యవస్థాపకుడు, కవి మర్రిపూడి దేవేంద్రరావు అన్నారు. అలాగే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నీలం సంజీవరెడ్డి స్మారక అవార్డు, వైఎస్సార్ ఫౌండేషన్ కర్నాటక శాఖ కార్యదర్శి పి.రాఖేష్‌రెడ్డికి కార్మిక భూషణ్ అవార్డులను అందజేసినట్టు ఆయన తెలిపారు. మిధున్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల పురోగతికి దోహదపడాల్సిన అవసరం ఉందన్నారు. నీలం సంజీవరెడ్డి ఆశయాలను అంతరంగంలో దాచుకున్న ఏకైక శిష్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తింపు పొందడం విశేషమని రాఖేష్‌రెడ్డి అన్నారు. రాష్ట్రీయ వైఎస్సా ర్ సేవాదళ్ అధ్యక్షుడు జి.లక్ష్మీపతి, వైస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా ప్రధా న కార్యదర్శి కోటీశ్వర మొదలియార్, కార్యదర్శి దేవరాజులు, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి విశ్వచైతన్య తదితరులు పాల్గొన్నారు.