‘నారీ శక్తి పురస్కార్‌’కు దరఖాస్తుల ఆహ్వానం | WCD Ministry Invites Applications For Nari Shakti Puraskar 2019 | Sakshi
Sakshi News home page

‘నారీ శక్తి పురస్కార్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Dec 28 2019 5:55 PM | Last Updated on Sat, Dec 28 2019 5:55 PM

WCD Ministry Invites Applications For Nari Shakti Puraskar 2019 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2019 సంవత్సరానికి ‘నారీ శక్తి పురస్కార్‌’కోసం కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మహిళా సాధికారతకు, ముఖ్యంగా బలహీన, అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతి కోసం అసాధారణ కృషి చేసిన వ్యక్తులు, సమూహాలు, సంస్థలకు ఏటా ఇచ్చే జాతీయ అవార్డు ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చేఏడాది మార్చి 8న పురస్కారాలు అందజేయనున్నారు. పురస్కారానికి సంబంధించి అర్హతలు, ఇతర వివరాలు http://narishaktipuraskar.wcd.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. సమర్పణకు చివరి తేదీ అయిన వచ్చే ఏడాది జనవరి ఏడు లోపు దరఖాస్తులు, నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement