కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీ వేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తుంది.
భారతీయ భాషాసాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయస్థాయిలో నిరంతర సాహితీసేవకూ గుర్తింపుగా డాక్టర్ కే. శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు నాందీ సేవా న్యాస్ సమితి సన్మాన పత్రంలో పేర్కొంది.
వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిందీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ రాధా వల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్ సింహ్ పాండే, డాక్టర్ శశికళా పాండే ప్రభృతులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్..
Comments
Please login to add a commentAdd a comment