మిధున్‌రెడ్డికి ప్రజాతపస్వి బిరుదు ప్రదానం | mithunreddy receives 'prajataptsvi' award | Sakshi
Sakshi News home page

మిధున్‌రెడ్డికి ప్రజాతపస్వి బిరుదు ప్రదానం

Published Sat, Jan 17 2015 8:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

mithunreddy receives 'prajataptsvi' award

చిత్తూరు(అర్బన్): ప్రజాశేయస్సే పరమావధిగా నిరంతరం వారి సంక్షేమానికి కృషి చేస్తున్న రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్‌రెడ్డికి ప్రజాతపస్వి బిరుదును ప్రదానం చేయడం సంతోషకరమని యూనివర్సల్ పీస్ క్రాస్ వ్యవస్థాపకుడు, కవి మర్రిపూడి దేవేంద్రరావు అన్నారు. అలాగే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నీలం సంజీవరెడ్డి స్మారక అవార్డు, వైఎస్సార్ ఫౌండేషన్ కర్నాటక శాఖ కార్యదర్శి పి.రాఖేష్‌రెడ్డికి కార్మిక భూషణ్ అవార్డులను అందజేసినట్టు ఆయన తెలిపారు.

మిధున్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల పురోగతికి దోహదపడాల్సిన అవసరం ఉందన్నారు. నీలం సంజీవరెడ్డి ఆశయాలను అంతరంగంలో దాచుకున్న ఏకైక శిష్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తింపు పొందడం విశేషమని రాఖేష్‌రెడ్డి అన్నారు. రాష్ట్రీయ వైఎస్సా ర్ సేవాదళ్ అధ్యక్షుడు జి.లక్ష్మీపతి, వైస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా ప్రధా న కార్యదర్శి కోటీశ్వర మొదలియార్, కార్యదర్శి దేవరాజులు, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి విశ్వచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement