తిరుపతి: ఒకవైపు వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. నిన్న(గురువారం) ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై దాడులకు పాల్పడ్డ టీడీపీ శ్రేణులు.. ఇప్పుడు తిరిగి వారిపైనే కేసులు పెట్టారు.
రైతుల ముసుగులో టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టడం.. దానిపై పోలీసులు కేసులు నమోదు చేయడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తాజాగా మిథున్‌రెడ్డి, రెడ్డప్పలపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా తప్పుపట్టింది.
దీనిపై మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ.. ‘నా ఇంటిపై దాడి జరిగితే మాపైనే కేసులు పెడతారా?, మాపై దాడులకు పోలీసులే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. వాహనాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. మిథున్‌రెడ్డి, నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మాపై హత్యా యత్నం కేసులు ఎలా నమోదు చేస్తారు. మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యం చెందిన పోలీసులు, మా వాహనాలు ధ్వంసం చేస్తుంటే చోద్యం చూసిన పోలీసులు మాపై రెండు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది’ అంటూ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment