Reddeppa
-
‘నా ఇంటిపై దాడి చేసి మాపైనే కేసులా?: రెడ్డప్ప
తిరుపతి: ఒకవైపు వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. నిన్న(గురువారం) ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై దాడులకు పాల్పడ్డ టీడీపీ శ్రేణులు.. ఇప్పుడు తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టడం.. దానిపై పోలీసులు కేసులు నమోదు చేయడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తాజాగా మిథున్‌రెడ్డి, రెడ్డప్పలపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా తప్పుపట్టింది.దీనిపై మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ.. ‘నా ఇంటిపై దాడి జరిగితే మాపైనే కేసులు పెడతారా?, మాపై దాడులకు పోలీసులే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. వాహనాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. మిథున్‌రెడ్డి, నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మాపై హత్యా యత్నం కేసులు ఎలా నమోదు చేస్తారు. మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యం చెందిన పోలీసులు, మా వాహనాలు ధ్వంసం చేస్తుంటే చోద్యం చూసిన పోలీసులు మాపై రెండు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది’ అంటూ ధ్వజమెత్తారు. -
ఇదంతా సీఎం జగన్ వల్లే సాధ్యం గెలిచి బహుమతిగా ఇస్తాం ..!
-
సామాజిక జైత్రయాత్ర: వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన మంత్రులు
-
చంద్రబాబుపై రెడ్డప్ప సెటైర్లు..
-
పరువు హత్య బాధితునికి ప్రభుత్వ సాయం
సాక్షి, పలమనేరు: మండలంలోని ఊసరపెంట పరువుహత్య ఘటనకు సంబంధించిన బాధితుడు కేశవ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన రూ.5లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీ రెడ్డెప్ప శనివారం అందజేశారు. కులాంతర వివాహం చేసుకుందని తల్లిదండ్రులు, తోబుట్టువులు కలిసి హేమావతిని హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో వారికి సీఎం సహాయనిధి, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా రూ.13.50 లక్షల సాయంలో భాగంగా రూ.5లక్షల చెక్కును బాధితుడు కేశవకు అందజేశారు. ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిన నగదును తల్లిలేని పిల్లాడు జగన్మోహన్ పేరిట డిపాజిట్ చేసి, అతని బాగోగులకు వినియోగించాలని సూచించారు. త్వరలో మిగిలిన నగదు, బోరు డ్రిల్లింగ్, ఉద్యోగం తదితర సదుపాయాలను అధికారులు చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి రాజ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ కన్వీనర్లు బాలాజీనాయుడు, మండీసుధా, నాయకులు విశ్వనాథ రెడ్డి, చెంగారెడ్డి, రాజారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ నాయకులు శ్యామ్‌సుందర్‌రాజు, ప్రహ్లాద, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు, ఏఎస్‌డబ్యూఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
చౌడేపల్లి : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చిన్నకొండమర్రి సమీపంలోని బాలయ్యగుండ్ల వద్ద ఓ వ్యక్తిని శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వ్యక్తిని శెట్టిపేట పంచాయతీలోని అజ్జపల్లి గ్రామానికి చెందిన పి.రెడ్డప్ప రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధారాల సేకరణ కోసం సంఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పిస్తున్నట్లుగా సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. -
సైనికుడి నుంచి క్రిమినల్‌గా..
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: తండ్రి ఆయశం మేరకు ఆయన సైనికుడిగా దేశరక్షణలో పాలుపంచుకున్నాడు.. కానీ డబ్బుపై ఆశ.. జల్సాపై మోజు.. దురలవాట్లకు బానిసై నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. స్థానిక బొమ్మలసత్రంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం నుంచి రూ. 1.40 కోట్లు కాజేసిన గోవర్దన్ నేరచరిత్ర ఇది. చిత్తూరు జిల్లా పాకాల మండలం పాలగుట్టుపల్లె గ్రామానికి చెందిన రెడ్డెప్ప సీఆర్పీఎఫ్లో హెడ్‌కానిస్టేబుల్‌గా రక్షణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లోని పని చేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని చాంద్రాయన్ గుట్టలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. తనలాగే కొడుకు గోవర్దన్ కూడా దేశానికి సేవ చేయాలనేది రెడ్డెప్ప ఆశయం. దీంతో సీబీఎస్ఈ సిలబస్‌లో ఫ్లస్‌టూ చదివిన గోవర్దన్‌ను భారత సైన్యంలో చేర్పించాడు. గోవర్దన్ ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్‌లో అల్వార్లలో పారాటూపర్ హాదాలో పని చేశారు. కాని గోవర్దన్ సైనికుడిగా ఉంటూనే చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం వదిలేసి ఘరాన క్రిమినల్‌గా మారాడు. జల్సాలు, దురలవాట్లే కారణం: గోవర్దన్‌కు చెడు అలవాట్లు ఎక్కువ. అల్వార్‌కు రైలులో సైనికుడి దుస్తుల్లో వెళ్తూ నిద్రపోతున్న మహిళల ఆభరణాలు, నగదును కాజేసేవాడు. 2011లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిల్లర దొంగతనాలకు పాల్పడుతూ బాలానగర్ సీసీఎస్ పోలీసులకు దొరికాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి నేరస్తుడిగా మారాడు. ఈ సేవా కేంద్రాల ద్వారా ఇతరుల ఓటరు కార్డులను సేకరించి, వాటిని ఫొటోషాప్‌లో మార్పింగ్ చేసి అతని ఫొటో ఉన్నట్లు నకిలీ కార్డులను తయారు చేశాడు. వీటి ఆధారంగా పలు బ్యాంక్‌ల్లో ఖాతాలను తెరిచి, ఏటీఎంలను సంపాదించాడు. వాటి ద్వారా ఇతరుల ఖాతాల్లో నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసే విధానం ద్వారా రూ.11లక్షలను డ్రా చేశాడు. కాని ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్ పోలీసులకు చిక్కడంతో, పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. జైలు జీవితం అనుభవించి, పరివర్తన చెందకపోగా విజయవాడకు చెందిన నేరస్తుడు సుధాకర్ ద్వారా ఏటీఎంలలో ఇతరులు డబ్బు డ్రా చేసే విధానాన్ని కనిపెట్టాడు. తర్వాత రెండు నెలల క్రితం బొమ్మలసత్రంలోని ఎస్బీఐ ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేయడానికి యత్నించి, క్యాన్సిల్ బటన్ నొక్కాడు. బ్యాంక్ లావాదేవీలు నిలిచి పోలేదు. గోవర్దన్‌కు డబ్బు రాగా, అతని ఖాతాలో నుంచి డబ్బు క్రెడిట్ కాలేదు. దీంతో రోజూ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేవాడు. తన వద్ద ఉన్న 31 ఏటీఎం, క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 14 నుంచి మే 3వరకు నంద్యాలలోనే మకాం వేసి రోజూ కొంత మొత్తంగా దాదాపు రూ.1.40 కోట్లను డ్రా చేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా నల్ల అద్దాలు, టోపీని ధరించేవాడు. కాని డబ్బును పోగొట్టుకున్న ఖాతాదారులకు ఎస్బీఐ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 20 త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలా చిక్కాడు: సీసీ కెమెరాల్లో ఉన్న దృశ్యాల ఆధారంగా పోలీసులు అతికష్టం మీద గోవర్ధన్‌ను గుర్తించి ఏటీఎం సెంటర్‌వద్ద మాటు వేశారు. కడపలో ఓ యువతిలో కలిసి కారులో నంద్యాలకు వచ్చిన గోవర్దన్ ఏటీఎం కేంద్రం వద్ద మళ్లీ డబ్బు డ్రా చేయడానికి యత్నించాడు. పోలీసులు వెంటపడటంతో కర్నూలు మీదుగా బెంగుళూరు హైవేలో వెళ్తూ గుంతకళ్ పోలీసులకు చిక్కాడు. వీరి నుంచి నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుండి రూ.73లక్షల విలువైన నగదు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, కారును స్వాధీనం చేసుకున్నారు.