బాధితుడు కేశవకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెలే, ఎంపీ వెంకటేగౌడ, రెడ్డెప్ప
సాక్షి, పలమనేరు: మండలంలోని ఊసరపెంట పరువుహత్య ఘటనకు సంబంధించిన బాధితుడు కేశవ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన రూ.5లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీ రెడ్డెప్ప శనివారం అందజేశారు. కులాంతర వివాహం చేసుకుందని తల్లిదండ్రులు, తోబుట్టువులు కలిసి హేమావతిని హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో వారికి సీఎం సహాయనిధి, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా రూ.13.50 లక్షల సాయంలో భాగంగా రూ.5లక్షల చెక్కును బాధితుడు కేశవకు అందజేశారు.
ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిన నగదును తల్లిలేని పిల్లాడు జగన్‌మోహన్ పేరిట డిపాజిట్ చేసి, అతని బాగోగులకు వినియోగించాలని సూచించారు. త్వరలో మిగిలిన నగదు, బోరు డ్రిల్లింగ్, ఉద్యోగం తదితర సదుపాయాలను అధికారులు చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి రాజ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు బాలాజీనాయుడు, మండీసుధా, నాయకులు విశ్వనాథ రెడ్డి, చెంగారెడ్డి, రాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగ నాయకులు శ్యామ్‌సుందర్‌రాజు, ప్రహ్లాద, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు, ఏఎస్‌డబ్యూఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment