honour killing
-
ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్‌పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
లేడీ కానిస్టేబుల్ హత్యలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
సాక్షి,రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది.నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో ట్విస్ట్.. వెలుగులోకి అసలు నిజాలుఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది.రెండవ భర్త శ్రీకాంత్‌ను ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నాగమణి భూమిలో తనకు వాటా ఇవ్వాలని తమ్ముడిని మళ్లీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన పరమేష్ నాగమణి స్కూటీపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో నరికి చంపాడు. ఇదీ చదవండి: ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం..? -
Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా
జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. -
యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి..
లక్నో: యూపీలోని బారాబంకిలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్ళ మధ్య వాగ్వాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి హత్యకు దారితీసింది. అన్న ఆవేశాన్ని ఆపుకోలేక తోడబుట్టిన చెల్లెలిని కిరాతకంగా తల నరికి చంపి తలతో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు.. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని బారాబంకి మిత్వారా గ్రామంలో నివాసముంటున్న రియాజ్(22) అతని సోదరి ఆషిఫా(18) మధ్య ప్రేమ విషయమై చిన్న వివాదం చోటుచేసుకుంది. చెల్లెలు ఆషిఫా అదే గ్రామానికి చెందిన చాంద్ బాబుతో వెళ్ళిపోయినందుకు రియాజ్ ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె అన్నయ్యకు మొదట నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా రియాజ్ శాంతించకపోవడంతో ఆషిఫా కూడా ఎదురు సమాధానం చెప్పింది. ఆలోచన పనిచేయక.. ఆగ్రహోద్రిక్తుడైన రియాజ్ ఆవేశం కట్టలు తెంచుకుంది. దగ్గర్లోని పదునైన కత్తిని తీసుకుని ఒక వేటుకు చెల్లి తలా మొండెం వేరుచేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం చెందకుండా తెంచిన తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగిందంతా వివరించి లొంగిపోయాడని తెలిపారు. ఈ సంఘటను పరువు హత్యగా పేర్కొంటూ సాక్ష్యాధారాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో పరువు హత్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. వయసుకొచ్చిన అమ్మాయిలు ఎవరికి వారు తమ జీవితభాగస్వాములను ఎంచుకుని తొందరపాటులో చేసే చిన్న పొరపాటే ఇంతటి అనర్ధాలకు దారితీస్తోంది. నచ్చజెప్పడమైనా సర్దుకుపోవడమైనా ఓ మెట్టు దిగే గుణంలోనే ఉంటుందన్న ఇంగితాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. ఎవరికీ ప్రయోజనం లేని నిర్ణయాలతో ఆవేశానికి లోనై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
దారుణం: కన్నకూతురిని కడతేర్చిన తండ్రి, మనస్తాపంతో ప్రియుడు సైతం
కర్ణాటకలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో సొంత కూతురిని హత్య చేశాడు ఓ తండ్రి. అయితే ప్రియురాలి మరణ వార్త తట్టుకోలేక ప్రియుడు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం కోలార్ జిల్లాలోని కేజీఎఫ్ ప్రాంతంలో వెలుగుచూసింది. కేజీఎఫ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి కీర్తి 24 ఏళ్ల గంగాధర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో తండ్రి కృష్ణమూర్తి వీరి ప్రేమను నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో యువతికి ఆమె తండ్రితో అనేకమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గంగాధర్ ప్రేమను మర్చిపోవాలని కృష్ణమూర్తి తన కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వినలేదు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదవ్వడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన కృష్ణమూర్తి కూతురిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కీర్తిది ఆత్మహత్య కాదు హత్య అని తేల్చారు. తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రియుడు గంగాధర్ మేస్త్రీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కీర్తి మృతి విషయం తెలుసుకున్న గంగాధర్.. తట్టుకోలేక సమీపంలోని రైలు పట్టాల వద్ద వస్తున్న రైలుకు ఎదురెళ్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు కేజీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ కె ధరణి దేవి పేర్కొన్నారు. చదవండి: ఏమైంది శ్రీకృష్ణ... ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు -
పరువుహత్య చేసి మొసళ్లకు మేతగా పడేశారు
దేశంలో పరువు హత్యల పరంపరం కొనసాగుతోంది. ప్రేమ, డేటింగ్‌ల పేరుతో తిరిగే జంటలనూ.. చివరకు పెళ్లి చేసుకున్నా కూడా అయినవాళ్లే కనికరించడం లేదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి సంచలనంగా మారిందా రాష్ట్రంలో.. ఎంపీ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించుకున్న జంటను నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపిన పెద్దలు.. మొసళ్లు తిరిగే నదిలో మేతగా పడేశారు. పిల్లలు కనిపించకుండా పోయారంటూ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. రతన్‌బసాయ్ గ్రామానికి చెందిన శివాని తోమర్, పొరుగు గ్రామం బాలూపూర్‌కు చెందిన రాధేశ్యామ్ తోమర్ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి(18) తరపు కుటుంబ సభ్యులు వాళ్ల బంధాన్ని ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన వాళ్లను కాల్చి చంపేసి.. ఆ మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్ నదీ ప్రాంతంలో పడేశారు. కొడుకు(21), అతను ప్రేమించిన అమ్మాయి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తొలుత వాళ్లు ఎక్కడికైనా పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. అయితే.. వాళ్లు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులను పిలిచి గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. సిబ్బంది సాయంతో ముక్కలైన వాళ్ల మృతదేహాలను వెలికి తీశారు స్థానిక పోలీసులు. చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2,000 కంటే ఎక్కువ మొసళ్లు ఉంటాయనేది ఒక అంచనా. ఇదీ చదవండి: ముస్లింలే ఛత్రపతి శివాజీని కొనియాడుతున్నారు! -
Crime: ప్రాణం తీసిన పక్కింటి కుర్రాడి ప్రేమ
పక్కింటి కుర్రాడు.. అదీ వేరే వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తెలిసి ‘వద్దని’ చెల్లెలిని వారించాడు ఆ అన్న. అయినా ఆమె వినలేదు. అతనితో మాటలు కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ మరింత చనువుగా ఉండడం చూసి రగిలిపోయాడు ఆ అన్న. అతనిలో కోపం కట్టలు తెంచుకుని.. ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. ఉత్తర ప్రదేశ్ గోండాలో పరువు హత్య కలకలం సృష్టించింది. 16 ఏళ్ల టీనేజర్‌ను ఆమె సోదరుడే అత్యంత పైశాచికంగా హతమార్చాడు. మూడు నెలల కిందట పక్కింటి కుర్రాడితో వాట్సాప్ ఛాటింగ్ చేస్తూ ఆమె అన్న కంటపడింది. దీంతో ఆమెను చితకబాది.. అతనికి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోవడంతో.. ఆమెతో గొడవకు దిగాడు. ఏం చేస్తావో చేస్కో అంటూ తెగేసి చెప్పేసరికి ఆ అన్నలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ అతని కంటపడ్డారు. గురువారం రాత్రి ఓ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై కాట్రా బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కిందట నిందితుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి సోదరితో కలిసి దామోదర్ గ్రామంలోకూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డాడు. అయితే వేరే వర్గానికి చెందిన కుర్రాడితో తన చెల్లెలు చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇదీ చదవండి: అశ్లీల సైట్లు చూసే అత్యాచారం చేశారట! -
విజయపురలో పరువు హత్య?
యశవంతపుర: ప్రేమ విషయంగా ఓ యువకుడిని హత్య చేసిన ఘటన విజయపుర జిల్లా తికోటా పరిధిలో కలకలం రేపింది. తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన యువకుడు మల్లికార్జున (19) బాగలకోట జిల్లా బీళగి తాలూకా హదరిహళ గ్రామం వద్ద కృష్ణానది పరివాహక ప్రాంతంలో గోనసంచిలో శవమై కనిపించాడు. మూడు రోజుల క్రితం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. సహ విద్యార్థినితో ప్రేమ వివరాలు...ఘోణసగినకి చెందిన మల్లికార్జున బీఏ చదివేవాడు. సహ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరు కాలేజీకి వెళ్తున్నామంటూ విజయపుర వెళ్లేవారు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియటంతో మొదట చదువు.. ఆ తరువాతే ప్రేమ అంటూ సర్ది చెప్పారు. పెద్దల మాటలను పట్టించుకోకుండా ఇద్దరు ప్రేమాయణం సాగించారు. దీంతో తల్లిదండ్రులు మల్లికార్జునను బాగలకోట జిల్లా బనహట్టిలోని మిలిటరీ కాలేజీలో చేర్చారు. ఇద్దరు రోజూ ఫోన్లో గంటలకొద్ది మాట్లాడేవారు. ఇదిలా ఉంటే బీఏ పరీక్షలు రాయడానికి మల్లికార్జున గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ అదృశ్యం సెప్టెంబర్ 23న రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. తన కూతురిని కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి తికోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు కనిపించటంలేదంటూ మల్లికార్జున తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. అక్టోబర్ 10న కృష్ణానది పరివాహక ప్రాంతంలో మల్లికార్జున శవాన్ని కనుగొన్నారు. యువతి ఎక్కడ ఉందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. యువతి కుటుంబం ధనవంతులు కావటం వల్ల పరువు కోసం తన కొడుకును హత్య చేయించినట్లు యువకుని తండ్రి ఆరోపించారు. దీంతో తికోటా పోలీసులు యువతి తండ్రి గురప్ప, బంధువు అజీత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. (చదవండి: స్టోన్ క్రషర్లో భారీ పేలుడు) -
సూర్యాపేటలో పరువు హత్య? మాట్లాడుకుందాం రమ్మని పిలిచి..
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువుపై కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని చందనబోయిన దిలీప్(19)గా గుర్తించారు. ఈ ఘటనను పరువు హత్యగా అనుమానిస్తున్నారు. తాళ్లగడ్డకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ ప్రేమ వ్యవహారం యువతి సోదరుడికి నచ్చలేదు. దీంతో అతనిపై పగ పెంచుకున్నాడు. ఈక్రమంలోనే మాట్లాడుకుందాం రమ్మని సద్దల చెరువు వద్దకు దిలీప్‌ను పిలిచాడు. చెరువు వద్దకు వెళ్లిన దిలీప్‌పై యువతి సోదురుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. బీరు సీసాలతో పదే పదే పొడిచాడు. దీంతో దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చదవండి: దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్ -
పరువు హత్య: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. యువతి సోదరులు..
రాయచూరు రూరల్: తమ సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువతి సోదరులు పరువు హత్యకు పాల్పడిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. అఫ్జల్‌పుర తాలూకా దేవల గాణగాపురలోని ఓ లాడ్జిలో విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్(24)కు అదే ఊరులో డిగ్రీ చదువుతున్న జేవర్గి తాలూకా హుల్లూరుకు చెందిన అమ్మాయితో పరిచయమైంది. ఆరు నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇటీవల ఇళ్లు వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అమ్మాయి పెద్దలు వారి ఆచూకీని కనుగొని ఈ నెల 3న బెంగళూరు నుంచి పిలుచుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి అంటే ఇష్టం లేదని చెప్పాలని ఆమె సోదరులు ఈరప్ప, హులిగప్ప, రాకేష్‌లు చంద్రకాంత్‌పై శతవిధాలుగా ఒత్తిడి తెచ్చారు. చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..) అందుకు చంద్రకాంత్ ససేమిరా అనడంతో అతనిని అంతమొందించాలని ప్రణాళిక రచించారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి అతనిని లాడ్జిలోనే నిర్బంధించి క్రిమిసంహారక మందును తాపించి గొంతు నులిమి చంపి సమీపంలోని ఇంగళిగి వద్ద పొలంలో మృతదేహాన్ని పడేశారు. సమాచారం అందుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనపరచుకున్న దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
Hyderabad: పథకం ప్రకారమే నారాయణరెడ్డి హత్య!
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు చెందిన నారాయణరెడ్డిని నిందితులు పక్కా పథకం ప్రకారమే అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తు న్న శ్రీనివాస్‌రెడ్డి..తన బంధువుల అమ్మాయి ని నారాయణరెడ్డి ప్రేమ, పెళ్లి పేరుతో పరువుకు భంగం కలిగించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని..అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని మరో ఇద్దరు నిందితులతో కలిసి రెండు నెలల ముందే పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చులు, సహకరించిన వారికి సుపారీ పేరు తో యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డి నుంచి రూ.ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ముందుగా మూడు లక్షలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు అదే ప్రాంతానికి చెందిన కాశీ, షేక్ ఆషిక్లతో కలిసి నారాయణరెడ్డిని గత నెల 27న అంతమొందించిన త ర్వాత విషయాన్ని వెంకటేశ్వరరెడ్డికి వీడియోకాల్ ద్వారా తెలిపి ముగ్గురు ఒక్కొక్క లక్ష రూపాయలు తీసుకొని ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. అయితే నారాయణరెడ్డి కనిపించకుండా పోయిన ఫిర్యాదును స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును మొదలు పెట్టారు. నారాయణరెడ్డికి చివరిగా వచ్చిన శ్రీనివాసరెడ్డి సెల్ నెంబర్ ఆధారంగా అతనికి ఫోన్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి తనకు పోలీసులు ఫోన్ చేస్తున్నారు, మీరు కూడా ఎవరికి దొరకకుండా ఉండాలని, ఏమి చెప్పవద్దని హెచ్చరించి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. దీంతో శ్రీనివాసరెడ్డి ఫోన్ నుంచి చివరిగా కాల్ వెళ్లిన కారు డ్రైవర్ షేక్ ఆషిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కుట్రకోణం బట్టబయలయ్యింది. దీంతో శ్రీనివాసరెడ్డి, కాశి, షేక్ ఆషీక్, వెంకటేశ్వరరెడ్డిలపై కేసునమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా హత్యకేసులో ముందుగా పట్టుబడి వివరాలు వెల్లడించిన షేక్ ఆషిక్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. షేక్ ఆషిక్ నగరంలోని ఓ పేరొందిన కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేసినట్లు తెలిసింది. అయితే అతని ఇంటిని గాలించిన సమయంలో అతని ప్యాంటు జేబుల్లో 50 వేల నగదుతో పాటు అతను తాను చదువుతున్న కళాశాల నుంచి తీసుకున్న టీసీ కనిపించింది. కాగా శ్రీనివాసరెడ్డి, కాశీలు గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!) -
కేటీఆర్‌ను కలిసిన పరువు హత్య కేసు బాధితులు
సాక్షి,అబిడ్స్(హైదరాబాద్): బేగంబజార్‌లో గత నెలలో జరిగిన పరువు హత్య కేసులోని బాధితులు శుక్రవారం రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు నందకిశోర్ వ్యాస్, పూజావ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నందకిశోర్ వ్యాస్, పూజావ్యాస్ బిలాల్, పరువు హత్యకు గురైన నీరజ్ పన్వార్ భార్య సంజనా పన్వార్, తల్లి నిషా పన్వార్, ఇతర కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగాలని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో ఫోనులో మాట్లాడి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారించేలా చూడాలని ఆదేశించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా కేసును ఛేధించాలని ఆదేశించినట్లు నందకిశోర్ వ్యాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోషామహాల్ నియోజకవర్గంలో సీనియర్లకు, యాక్టివిస్టులకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని మంత్రికి నందకిశోర్ వ్యాస్ విజ్ఞప్తి చేశారు. -
కర్నాటకలో పరువు హత్య.. దళితుడిని ప్రేమించిందని 17 ఏళ్ల కూతురిని..
బెంగళూరు: పరువు ప్రతిష్ఠ మాటున మరో అమ్మాయి హత్యకు గురైంది. దళిత యువకుడిని ప్రేమించిందనే కోపంతో కన్న కూతురిని కడతేర్చారు తల్లిదండ్రులు! ఈ దారుణం కర్ణాటకలోని పెరియపట్న తాలూకు కగ్గుండి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళ్లహళ్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని సమీప గ్రామం కగ్గుండికి చెందిన అగ్రవర్ణానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి ప్రేమించింది. ప్రేమవ్యవహారం తెల్సి అమ్మాయి తల్లిదండ్రులు కూతురుని తీవ్రంగా మందలించారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. తల్లిదండ్రులతో కలిసి ఉండబోనని అమ్మాయి తెగేసి చెప్పడంతో పెరియపట్న పోలీసుల సూచన మేరకు అమ్మాయిని రెండు నెలల క్రితం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వసతిగృహంలో ఉంచామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హెచ్‌టీ కమల చెప్పారు. గొడవలు లేవని, ఇక ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో రెండు వారాల క్రితం అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఇంటికెళ్లిన కొద్దిరోజుల్లోనే హత్యకు గురవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులే ఆమెను చంపేశారని, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులే బైక్ మీద ఊరి అవతలికి తీసుకెళ్లి పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాకే హత్య పూర్తి వివరాలు చెప్పగలమని ఎస్పీ చేతన్ అన్నారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌చేశారు. చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం -
ఆదిలాబాద్‌లో మరో పరువు హత్య.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని
నార్నూర్: పరువు కత్తికి మరో ప్రాణం బలైంది. కనిపెంచిన తల్లిదండ్రులే.. కన్నప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించారు. కూతురు వేరే మతం యువకుడిని ప్రేమించిందని కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్‌కొండకి చెందిన పవార్ దేవీదాస్, సావిత్రీబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేశారు. చిన్నకూతురు రాజేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన సలీం ప్రేమించుకున్నారు. సలీం, రాజేశ్వరి పొలాలు గ్రామంలో పక్కపక్కనే ఉన్నాయి. 7వ తరగతి వరకు చదివిన రాజేశ్వరి తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలం వద్దకు వచ్చే సలీంతో స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. తల్లిదండ్రులు లేని సమయంలో రాజేశ్వరి తరచూ పొలం వద్దకు వెళ్లి సలీంను కలిసేది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేరే మతం యువకుడితో ప్రేమ వద్దని కూతురిని మందలించారు. తమను పెద్దలు కలవనీయరని భావించిన వారు మూడు నెలల క్రితం పారిపోయారు. మహారాష్ట్రలోని సలీం బంధువుల ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో యువతి తండ్రి పవార్ దేవీదాస్.. సలీంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నెల రోజులుగా అతడు ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు. దీనిపై రాజేశ్వరి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేది. తాను సలీంనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చచ్చిపోతానని బెదిరించేది. తమ కూతురు అతడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గురువారం కూరగాయల కత్తితో రాజేశ్వరి గొంతుకోసి హతమార్చారు. ఆత్మహత్యగా నమ్మించే యత్నం... శుక్రవారం ఉదయం దేవీదాస్ సర్పంచ్ సునీత ఇంటికి వెళ్లి తమ కూతురు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా.. అవి ఇంటి చుట్టూ తిరిగి దేవీదాస్, సావిత్రీబాయి వద్దకు వచ్చి ఆగిపోయాయి. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తామే చంపామని వారు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దేవీదాస్, సావిత్రీబాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. చదవండి: యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి.. -
బేగంబజార్ పరువు హత్య: సంజన తల్లి ముందుగానే హెచ్చరించినా..
హైదరాబాద్: నగరంలోని బేగం బజార్లో.. పరువు హత్యకు గురైన నీరజ్ పర్వాన్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు అంశాలు వెలుగు చూశాయి. సంజన తల్లి నీరజ్-సంజనలను ముందుగానే హెచ్చరించినా.. వాళ్లు వినకపోవడం, తదనంతర పరిణామాలు సంజన బంధువుల్లో నీరజ్ పట్ల మరింత విద్వేషాన్ని రగిల్చిందని తెలుస్తోంది. కులాంతర వివాహం కావడంతో పరువు పోయి ఆ అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టినతర్వాత యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యాదవ్ సమాజ్‌లోని కార్యక్రమాలకు సైతం సంజన కుటుంబీకులను పిలవకపోవడంతో ఆ కుటుంబం రగిలిపోయిందట. పైగా తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. ఎక్కడికి వెళ్లినా అవమానపడ్డ సంజన కుటుంబ సభ్యులు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో సంజనకు, మరో అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే అంతుకు ముందే ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజన, నీరజ్‌ను షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో.. బాబు పుట్టాక తన తల్లితో సంజన మాట్లాడింది. ఆ సమయంలో.. ఎట్టిపరిస్థితుల్లో బేగం బజార్‌కు రావొద్దని సంజన తల్లి ఆ జంటను హెచ్చరించినట్లు రిపోర్ట్‌లో ఉంది. అయితే ఆమె హెచ్చరికలను లెక్క చేయని ఆ జంట.. బేగం బజార్లోనే ఉంది. దీంతో ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు నిందితులు. గురువారం జుమేరాత్ బజార్లో కత్తులు, రాడ్లు కొన్నారు. ఘటనకు ముందు పీకలదాకా మద్యం సేవించారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఓ బాలుడితో రెక్కీ చేశారు. ఆ సమయంలో తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్ కంట్లో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి హతమార్చారు. చదవండి: నా అత్తమామలకు కూడా ప్రాణహాని ఉంది-నీరజ్ భార్య -
నీరజ్‌ను చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్: సరూర్ నగర్ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్ పన్వార్‌లు షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్‌నుమాలోని షంషీర్‌గంజ్‌లో కాపురం పెట్టారు. నీరజ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్‌పై కక్ష పెంచుకున్నారు. తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్ బంటీపై హత్యకు స్కెచ్ గీశారు. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్. నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్‌తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్‌ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో మరో పరువు హత్య.. కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. పరువు హత్య? వివరాల ప్రకారం.. బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో అతని భార్య సోదరులు, వారి స్నేహితులను కిరాతకంగా హతమార్చారు. ఆ వెంటనే కర్ణాటకలోని గుడిమిత్కల్ ప్రాంతానికి వారు పారిపోయారు. రెండు వాహనాల పై వెళ్ళిన ఐదుగురు హంతకులు మృతుడు నీరజ్ భార్య సంజన కజిన్ బ్రదర్స్, వారి ముగ్గురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు కర్ణాటక గుడిమత్కల్లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమిత్కల్‌లో వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 10మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నీరజ్ పోస్టుమార్టంపై ప్రాథమిక నివేదిక నీరజ్ పోస్టుమార్టంపై ప్రాథమిక నివేదికను ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. నీరజ్ శరీర భాగాల్లో పలుచోట్ల గాయాలు గుర్తించారు ఫోరెన్సిక్ వైద్యులు. నీరజ్ తల, మెడ, ఛాతి భాగాల్లో 10కిపైగా కత్తిపోట్లు గుర్తించారు.దీనికి సంబంధించిన ప్రాథమికి నివేదికన పోలీసులకు అందజేశారు వైద్యులు. చదవండి: హైదరాబాద్‌లో మరో పరువు హత్య?.. బేగంబజార్‌లో యువకుడిని ఘోరంగా చంపిన దుండగులు -
పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్ భార్య
సాక్షి, హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ ఘటనపై నీరజ్ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది. ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే.. -
తాత కళ్లముందే దారుణం.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య?
అబిడ్స్ (హైదరాబాద్): బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన నలుగురు దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. తాత నిశ్చేష్టుడై చూస్తుండగానే కత్తులతో అతి కిరాతకంగా పొడిచారు. క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యారు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీరజ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌పై అతని భార్య కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేశారని నీరజ్ తండ్రి రాజేందర్ పన్వార్ ఆరోపించారు. ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నీరజ్ తన ఇంటికి సమీపంలో నివసించే వేరే కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి పెళ్లికి సంజన కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్న వీరు పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటున్నారు. వారికి మూడు నెలల బాబు కూడా ఉన్నాడు. కాగా శుక్రవారం రాత్రి తాత జగదీష్ పన్వార్‌తో కలిసి కైనెటిక్ హోండాపై వెళ్తున్న నీరజ్‌ను అటకాయించిన దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. అతని శరీరంపై 15 నుంచి 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే బేగంబజార్ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ దారుణ హత్యోదంతంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. గోషామహాల్ ఏసీపీ సతీష్‌కుమార్, షాహినాయత్‌గంజ్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్‌ల నేతృత్వంలో పోలీసులు నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంజన కుటుంబీకులే దాడి చేశారు ప్రేమ వివాహం చేసుకున్నందుకే సంజన కుటుంబీకులు తన కుమారుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారని నీరజ్ తండ్రి రాజేందర్ పన్వార్ రోదిస్తూ ఆరోపించారు. వారితో తన కుమారుడికి ప్రాణహాని ఉందని గతంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఏడాదిన్నరగా కక్ష పెంచుకున్న వారు తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. తన కుమారుడని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా నీరజ్‌ను హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ సతీష్‌కుమార్ తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు నీరజ్ పన్వార్‌ను అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో వివరాలు సేకరించింది. -
ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు అనే దళిత యువకుని దారుణ హత్య... మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో స్పష్టం చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన అస్రీన్ సుల్తానా అనే యువతి, వికారాబాద్‌కు చెందిన నాగరాజు ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీన్ని సహించలేకపోయిన సుల్తానా సోదరుడు, అతడి స్నేహితులు హైదరాబాద్‌లో నాగరాజుపై దాడి చేసి, హత్య చేశారు. నాగరాజుపై పదిహేను నిముషాల పాటు వరుసగా రాడ్లతో దాడి చేసారనీ... జనం చూస్తూ వీడియోలు తీస్తున్నారు తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదనీ, తాను ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకొచ్చి సాయపడలేదనీ, వాళ్ళను వేడుకొంటూ తాను సమ యాన్ని వృథా చేసాననీ సుల్తానా మీడియా ముందు వాపోయింది. గతంలోనే తన సోదరుడు ఈ పెళ్ళి చేసు కోవద్దని తనను బాగా కొట్టాడనీ, ఉరివేసి చంపడానికి ప్రయత్నించాడనీ, తనను ఉరి వేసుకుని చనిపొమ్మని ఆదేశించాడనీ కూడా తెలిపింది. గతంలో రెండుసార్లు తాము పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కలిగించాలనీ విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ఆమె తెలియజేసింది. ఇక్కడ అనేక విషయాలు మనల్ని ఆలోచింప జేస్తున్నాయి. మన వ్యవస్థలన్నీ ఇంత నిర్వీర్యం అయిపోయాయా? మనం ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా? వీటిని నిరోధించే అవకాశమే లేదా? మనలో కూడా తెలిసిగానీ తెలియకుండా గానీ ఇలాంటి అమానుషత్వం దాగి ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా ఈ అంశం ఇవ్వాళ ఎన్నో రకాల చర్చలకు, సమాలోచనలకు కేంద్రంగా నిలిచింది. సాధారణంగానే దళిత సంఘాలు ముస్లిం సంఘాల మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలపై హిందూత్వ శక్తులు దాడులు చేసిన ఎన్నో సందర్భాలలో ఆ బాధ తెలిసిన దళితులుగా తాము ముస్లింలకు మద్ధతుగా నిలిచామనీ, ఇప్పుడు ముస్లింల చేతిలో దళిత యువకుడు హత్యకు గురికావడం తట్టు కోలేనిదిగా ఉందనీ అభిప్రాయాలు వచ్చాయి. పలు ముస్లిం సంఘాలు కూడా తమకు దళితులపై గౌరవం ఉందనీ, ఈ హత్యను ఖండిస్తున్నామనీ, నిందితులను కఠినంగా శిక్షించాలనీ ప్రకటనలు చేశాయి. ఈ హత్యను వ్యక్తిగతంగానే చూడాలనీ, ఇది రాజకీయమైనది కాదనీ కొందర న్నారు. (ఆ హత్యను ఖండిస్తున్నాం) పైకి ఇది పరువు హత్యగా కనిపిస్తుంది. కానీ దీని వెనక సమాజంలో వేళ్ళూనుకు పోయి ఉన్న మౌఢ్యాల చరిత్ర, కొత్త తరాలకు సరైన విలువలు, ఆదర్శాల్ని ఇవ్వలేకపోతున్న ఆధునికతా వైఫల్యాలు దాగి ఉన్నాయి. – జి. కళావతి ‘అధ్యాపక జ్వాల’ సహాయ సంపాదకులు -
ఆ హత్యను ఖండిస్తున్నాం
ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారన్న ఆక్రోశంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ చర్య అమానుషమైనది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ విలువలకు పూర్తిగా విరుద్ధమైనది. తీవ్రంగా వివక్షకు గురైన నల్లజాతి వారిని హృదయానికి హత్తుకున్న మొహమ్మద్ ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకమైనది. కులాన్ని పాటించడమంటే పవిత్ర ఖురాన్‌ను నిరాకరించడమే! ముస్లిం సమాజం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నాగరాజు కుటుంబానికి మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ విషమ సమయంలో తీవ్ర బాధితురాలైన ఆశ్రీన్ సుల్తానా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుతున్నాము. నాగరాజును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా ఆశ్రీన్ సుల్తానాకూ, నాగరాజు కుటుం బాలకూ పూర్తి రక్షణ కల్పించాలనీ, ఆశ్రీన్ సుల్తానాను ఆదుకోవాలనీ కోరుతున్నాము. ఈ సంఘటనను సాకుగా చూపి దళితులకూ ముస్లింలకూ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కొందరు మహనుభావులు. వీరి విష రాజకీయాలకు గురి కావద్దని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ( కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు) – ముస్లిం థింకర్స్ డయాస్ (సయ్యద్ సలీంపాషా, డా. ఖాజా, డా. రియాజ్, స్కైబాబ, ఖుర్షీద్, హుసేన్, డా. మాలిక్, ఇనాయతుల్లా, వహీద్ మహమ్మద్, డా. రఫీ, షఫీ, నస్రీన్ ఖాన్, డా. మహబూబ్ బాషా, షేక్ పీర్ల మహమూద్, అక్బర్ ఆర్టిస్ట్, నబి కరీమ్ ఖాన్, డా. అఫ్సర్, డా. యాకూబ్) -
సరూర్‌నగర్ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ, సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా. సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని.. తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు ఆయన. #Nagraju की नृशंस हत्या पर साफ़ साफ़ बोले @asadowaisi - “जुर्म है ये , क़ानूनन जुर्म है ये।मैं खुलेआम condemn करता हूँ। अल्लाह से डरो” याद नहीं आता कि किसी मुस्लिम युवक की हत्या पर आज तक किसी भाजपा या हिंदूवादी नेता ने एक भी शब्द कहा हो। pic.twitter.com/yTZoVQL0FN — Vinod Kapri (@vinodkapri) May 6, 2022 ► ఖార్గోన్(మధ్యప్రదేశ్), జహంగీర్‌పురి(ఢిల్లీ) మత ఘర్షణలపైనా స్పందిస్తూ.. ఇకపై ఏ మతానికి సంబంధించి ఉరేగింపులు జరిగినా మసీదులపై హైరెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉరేగింపులు జరిగేటప్పుడు లైవ్ టెలికాస్టింగ్ చేయాలని, అప్పుడు రాళ్లు రువ్వేది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ... సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని వాళ్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: కాపాడమని కాళ్లు పట్టుకున్నాను, ఎవరూ ముందుకు రాలేదు-అశ్రిన్ -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్‌లో పరువు హత్య చేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సరూర్ నగర్లో బుధవారం రాత్రి పరువు హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు, అశ్రీన్ దంపతులు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్‌లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు మృతుడు నాగరాజు భార్య అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా తన భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి చంపారని తెలిపింది. హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టి తలను తీవ్రంగా గాయపరిచారని వాపోయింది. ‘నాగరాజును కొట్టొద్దంటూ నేను అతని మీద పడ్డాను. నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారు. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చినరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి’ అని మీడియా ముందు వాపోయింది. ఇద్దరే నిందితులు: ఏసీపీ నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకంటామని ఏసీపీ తెలిపారు. నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు: డీసీపీ ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో గత రాత్రి నాగరాజు అనే వ్యక్తి పై ఇద్దరు దుండగులు దాడి చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసామన్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించి ఇద్దరిని ట్రెస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ లుగా గుర్తించామన్నారు. వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లి చెందిన బిల్లపురం నాగరాజు జనవరిలో మోబిన్ అహ్మద్ సోదరి సుల్తానా అశ్విన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో వాళ్లు నాగరాజు పై కక్ష్య పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు. నిన్న నాగరాజు పనిచేస్తున్న మలక్ పేట మారుతి షోరూం వద్ద మోబిన్ గుర్తించాడు. జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి హత్య చేశారని చెప్పారు. బంధువు మసూద్ తో కలిసి మోబిన్ సుల్తానా ను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డు తో దాడి చేసి పారిపోయారని డీసీపీ తెలిపారు. ఫాస్ట్రాక్ కోర్టు లో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ
సాక్షి, యాదగిరిగుట్ట/వలిగొండ : ఉమ్మడి జిల్లాలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. నాడు నరేశ్, ప్రణయ్‌లు పరువుకు బలి కాగా అదే తరహాలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎరుకల రామకృష్ణను దారుణంగా మట్టుబెట్టారు. ఆరేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు యువకులు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ ఇంటి వద్ద చదువుకుని.. సిద్దిపేట జిల్లా లకుడారంలో పరువు హత్య కాబడిన రామకృష్ణ వలిగొండ మండలం లిగంరాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముండేవాడు. ఇతడి స్వస్థలం హుజూర్నగర్. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు అమ్మమ్మ ఊరైన లింగరాజుపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు.రామకృష్ణకు తల్లి కలమ్మ, చెల్లి నాగలక్ష్మి, తమ్ముడు రమేష్ ఉన్నారు. రామకృష్ణ ఇంటర్ వరకు వలిగొండలో చదువుకున్నాడు. 2016వ సంవత్సరంలో హోంగార్డుగా ఉద్యోగం సాధించి కొంతకాలం వలిగొండలోనే విధులు నిర్వహించారు. 2019లో యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఎవరీ వెంకటేశ్ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన వెంకటేష్ ప్రస్తుతం రాజాపేట మండలం కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటగా పల్లెపాటి వెంకటేష్ సొంత గ్రామమైన గౌరాయపల్లిలో మస్కూరిగా విధులు నిర్వహించాడు. వెంకటేష్ 10వ తరగతి పూర్తి కాకపోవడంతో గ్రామంలోనే వీఆర్ఏగా పని చేశాడు. ఈ సమయంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి వీఆర్ఓగా ఉద్యోగం సాధించాడు. అనంతరం రాజాపేట తహసీల్దార్ కార్యాలయంలో కాల్వపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. సొంత గ్రామమైన గౌరాయపల్లి నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరాంనగర్‌కు వచ్చి ఇల్లు నిర్మించుకున్నాడు. ఐదేళ్లుగా వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలోని సొంత ఇంట్లో ఉంటున్నాడు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె భార్గవి ఉన్నారు. భార్గవి 2020లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెంకటేష్, ఆయన భార్య, కుమారులు గుట్టలో ఉంటున్నారు. వెంకటేష్ వీఆర్ఓ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గుప్త నిధుల తవ్వకాల్లో.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా ఉంటూ పోలీస్ వాహనం నడుపుతున్న సమయంలో రామకృష్ణకు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో గుప్త నిధులు తవ్వకాల సమయంలో కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో గుప్త నిధులు తవ్వకాలు జరిగే బృందంలో హోంగార్డు రామకృష్ణపై కేసు నమోదు కాగా.. ఆ కేసులో ని«ంధితుడుగా ఉన్న వీఆర్ఓ వెంకటేష్‌ను ఆ కేసులో నుంచి అప్పట్లో పోలీసులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల కేసులోనే రామకృష్ణను హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటర్ నుంచే.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణకు భార్గవి ఇంటర్ మొద టి సంవత్సరం చదువుతున్న క్రమంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో రామకృష్ణ స్థానికంగా ఉండే పోలీస్ క్వాటర్స్‌లో ఉండే వాడు. ఆ తర్వాత పోలీస్ క్వాటర్స్‌లో గదిని ఖాళీ చేసిన రామకృష్ణ ప్రేమించిన భార్గవితో మరింత దగ్గర అయ్యేందుకు శ్రీరాంనగర్‌లో భార్గవి తండ్రి వీఆర్ఓ వెంకటేష్ నిర్మించుకున్న ఇంటికి ముందు ఉన్న ఓ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ తరుణంలోనే వెంకటేష్, రామకృష్ణలు ఇ ద్దరు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. ఒప్పుకోకున్నా.. రామకృష్ణ, భార్గవిల వివాహం 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో జరిగింది. అంతకు నెల రోజుల ముందే భార్గవి, రామకృష్ణల ప్రేమ వ్యవహారం వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తెలిసింది. దీంతో వెంకటేష్ తన కూతురు భార్గవిని మందలించాడు. ఈ సమయంలో తనకు రామకృష్ణ అంటే ఇష్టమని తండ్రి వెంకటేష్‌తో భార్గవి చెప్పింది. కళాశాలకు వెళ్లనివ్వకుండా వెంకటేష్ కుమార్తె భార్గవిని ఇంట్లోనే ఉండమన్నాడు. రామకృష్ణపై ఉన్న ప్రేమతో భార్గవి 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో వివాహం చేసుకున్నారు. 10రోజుల క్రితం గుట్టలోనే.. రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భువనగిరితో పాటు యాదగిరిగుట్టలో భూములు అమ్మకా లు, కొనుగోలు చేసేందుకు వచ్చేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. 10రోజుల క్రితం ఎకరం భూమి కావాలని ఓ వ్యక్తితో యాదగిరిగుట్టకు వచ్చాడని తెలిసింది. అంతే కాకుండా రెండు, మూడు రోజుల క్రితం పట్టణంలోని గాయత్రి హోటల్లో భోజనం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఐదేళ్లుగా హోంగార్డుగా యాదగిరిగుట్టలోనే విధులు నిర్వహించిన రామకృష్ణకు స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య మిర్యాలగూడ అర్బన్: 2018 సెప్టంబర్ 14న మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసు అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. తిరునగరు మారుతీరావు కూతురు అమృత మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ స్కూల్లో విద్యనబ్యసించే నుంచి ప్రేమించకున్నారు. ఇద్దరూ ఒక్కటై కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం నచ్చని అమృత తండ్రి మారుతీరావు పరువు పోయిందని భావించి అప్పటినుంచి అదును కోసం వేచి చూశాడు. అమృత ఐదు నెలల గర్భవతి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భర్త, అత్తతో కలిసి వచ్చింది. వైద్య పరీక్షలు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటికి వస్తున్న క్రమంలో వెనుకనుంచి వచ్చిన సుపారీ కిల్లర్ పదునైన కత్తితో ప్రణయ్‌ను దారుణంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తిరునగరు మారుతీరావు కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఆర్యసమాజ మందిరంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నమ్మించి.. మట్టుబెట్టి.. ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లలో రజక కులానికి చెందిన అంబోజు నరేష్, లింగరాజుపల్లిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తుమ్మల స్వాతి ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో భయపడి తలదాచుకోవడానికి 2016లో ముంబాయికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు నమ్మించి ఇద్దరినీ స్వగ్రామానికి రప్పించారు. వారం రోజులకు స్వాతి తన ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన ఐదారు రోజుల్లో అంబోజు నరేష్ అదృశ్యం అయ్యాడు. దీంతో నరేష్ తల్లిదండ్రులు భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతి కుటుంబంపై అనుమానం ఉండడంతో అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాసంఘాల కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నరేష్‌ను అదే ఏడాది మే నెలలో కిడ్నాప్ చేసి లింగరాజుపల్లి శివారులో వ్యవసాయ బావి వద్ద హత్య చేసి దహనం చేసినట్లు స్వాతి తండ్రి అంగీకరించారు. పోలీసులు ఆ కోణంలో తిరిగి విచారణ చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నిలబడలేదు. -
రామకృష్ణ పరువు హత్య! స్పందించిన భార్య భార్గవి
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాజాగా రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదని తెలిపారు. మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావుని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా? అని తననే ప్రశ్నించారని తెలిపారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారని అన్నారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ తన భర్త రామకృష్ణను సంప్రదించారని పేర్కొన్నారు. లతీఫ్‌ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు పరిచయం చేశారని చెప్పారు. ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారని అన్నారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారంటూ తెలిపారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పుట్టింటితో సంబంధాలు లేవని పేర్కొంది. ‘మీరు చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు’ అని భార్గవి తెలిపారు. -
అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వెంకటేష్ రాజపేట మండలం కాలువపల్లిలో వీఆర్వోగా పనిచేస్తుండగా.. రామకృష్ణ హత్య కేసులో మరో హోంగార్డు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లి ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. ఇటీవల రామకృష్ణ తుర్కపల్లి గుప్తా నిధులు కేసులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసకుంటున్నాడు. చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. భర్తతో గొడవలు.. న్యాయవాది ఆత్మహత్య ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపించడానికి ఏప్రిల్ 15న రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య భార్గవి శనివారం ఉదయం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. -
పరువు హత్య.. జైలు నుంచి రిలీజ్ కాగానే భారీ ఊరేగింపుతో స్వాగతం
సోషల్ మీడియాలో సెన్సేషన్, పాక్ పూనం పాండేగా పేరున్న క్వాందీల్ బలోచ్ హత్య ఉదంతం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అశ్లీల వీడియోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ కుటుంబం పరువు తీస్తోందంటూ తోడబుట్టినవాడే 2016, జులైలో ఆమెను దారుణంగా హతమార్చారు. అయితే ఇంతకాలం జైలుశిక్ష అనుభవించిన ఆమె సోదరుడు.. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఊరేగింపుగా జనం ఇంటికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఫౌజియా అజీమ్ అలియాస్ క్వాందీల్ బలోచ్ అలియాస్ కందిల్ బలోచ్.. పాక్ తొలి సోషల్ మీడియా సెలబ్రిటీ. భర్త నుంచి విడిపోయాక ఆమె.. హాట్ ఫొటోలు, వీడియోలతో పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో భారత క్రికెటర్లు, సినీ తారల పేర్లను సైతం ఆమె ఉపయోగించుకుంది. ఇదిలా ఉండగా..ఆపై ఆమె పరివర్తనలో మార్పొచ్చింది. ఉద్యమకారిణిగా పలు అంశాలపై పోరాడింది. ఇదిలా ఉండగా.. 2016లో క్వాందీల్(26) దారుణంగా హత్యకు గురైంది. అశ్లీల ఫొటోలు, వీడియోలతో తమ కుటుంబ పరువు తీస్తున్నందువల్లే తన సోదరిని హతమార్చానని బలోచ్ సోదరుడు వసీమ్ ప్రకటించాడు. అంతేకాదు ఇందుకు తానేం బాధపడడం లేదని, ఆమె హద్దులు దాటిందంటూ తన చర్యను సమర్థించుకున్నాడు కూడా. ఈ కేసులో వసీమ్‌కు జీవిత ఖైదు పడింది. ఈ హత్య ఉదంతం మడోనా లాంటి పాప్ సింగర్ దగ్గరి నుంచి ఎంతో మంది సెలబ్రిటీలను కదిలించింది. ఆడవాళ్ల స్వేచ్ఛ.. దానికి ఉండాల్సిన పరిధులపైనా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది కూడా. పాక్‌లో ఇలాంటి నేరాలకు చట్ట సవరణ పై చర్చ జరగ్గా.. చట్టాలకు కీలకమైన మార్పులు సైతం జరిగాయి. అదే టైంలో ఇలాంటి కేసుల్లో క్షమాభిక్షలు ఇవ్వకూడదనే డిమాండ్ బలంగా వినిపించింది. మరోవైపు తమ కుమార్తె హత్య కేసులో కొడుకు వసీంను క్షమించే ప్రసక్తే లేదని తొలుత ఆ పేరెంట్స్ వ్యాఖ్యానించారు కూడా. చివరికి.. క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో ఆరేళ్ల శిక్షా కాలం పూర్తి కాకముందే వసీం బయటకు వచ్చేశాడు. బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని మహ్మద్ వసిమ్ అరెస్ట్ అయిన సమయంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యాక కూడా అతని పరివర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. స్థానిక మీడియాకు అదే మాట చెప్పాడు. ఇక ముల్తాన్ సిటీలోని అతనుండే ఏరియా మొత్తం వసీమ్‌ను ‘హీరో’గా అభివర్ణిస్తోంది. పైగా అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, ఆ విషయంలో దారి తప్పితే వసీమ్ లాంటి హీరోలు పుట్టుకొస్తారంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు సైతం ప్రదర్శించడం విశేషం. ఇంట్లో వాళ్లు అతన్ని రానివ్వకపోవడంతో.. అదే ఏరియాలో మరో అద్దె ఇంట్లో దిగాడు వసీమ్ ఇప్పుడు. -
ప్రేమించి, పారిపోయి పెళ్లి.. అక్క తల నరికి సెల్ఫీ దిగిన తమ్ముడు
ముంబై: సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఇంకా కొందరు అనాగరికంగానే ప్రవర్తిస్తున్నారు. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో రక్తం పంచుకొని పుట్టిన వారిపైనే జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రేమించి పారిపోయి పెళ్లిచేసుకుందనే ఆక్రోశంతో గర్భిణీ అయిన తోబుట్టువునే హతమర్చాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించడం గమనార్హం. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఔరంగబాద్ జిల్లాకు 19 ఏళ్ల కీర్తి థోర్ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో వారిని ఎదురించి ఈ జూన్‌లో పారిపోయి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం గర్భవతి అయిన యువతి వైజాపూర్‌లో భర్తతో కలిసి జీవిస్తోంది. ఇటీవల తల్లి తన కూతురు ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లింది. ఈ ఆదివారం(డిసెంబర్5) మరోసారి తన మైనర్ కొడుకుని వెంట పెట్టుకొని కూతురు ఇంటికి వచ్చింది. అత్తగారితో కలిసి పొలంలో పని చేస్తున్న కీర్తి.. తన తల్లీ, తమ్ముడిని చూసి పొలంలో పని వదిలేసి ఆనందంతో పరుగెత్తుకొచ్చి వారిని పలకరించింది. ఇద్దరికీ నీళ్ళు ఇచ్చి, టీ చేయడానికి వంటింట్లోకి వెళ్లింది. చదవండి: రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి ఆ సమయంలో అల్లుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతను వేరే గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన తల్లి, తమ్ముడు కోసం కీర్తి తీ తయారు చేస్తుండగా .. అక్కపై వెనక నుంచి తమ్ముడు దాడి చేశాడు. తల్లి కూడా కీర్తి కాళ్లు అదిమి పట్టుకొని కొడుక్కి సాయం చేసింది. దీంతో తనవెంట తెచ్చుకున్న పదునైన కొడవలితో గర్భవతి అని కూడా కనికరం లేకుండా దారుణంగా తలను నరికివేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అయితే వంటింట్లో పాత్రలు పడిపోతున్న శబ్దం విని అనారోగ్యంతో పడుకున్న నిద్రలేచిన మహిళ భర్త వంటగదిలోకి పరుగెత్తాడు. నిందితుడు తన బావను కూడా చంపడానికి ప్రయత్నించగా.. అతను తప్పించుకున్నాడు. తరువాత తెగిన కీర్తి తలతో ఆమె తమ్ముడు, తల్లి సెల్ఫీ తీసుకున్నారు. చేతులో తలను పట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి చూపుతూ స్థానికులకు భయాందోళనలకు గురిచేశాడు. అనంతరం నిందితుడు తన తల్లితో కలిసి విర్గావ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. చదవండి: కూతురి తల నరికిన తండ్రి.. ఆపై -
బంధువుతో పెళ్లి వద్దన్నందుకు.. కాల్చి చంపిన కుటుంబ సభ్యులు
సిరియా: బంధువును వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు అల్ హసకా గవర్నరేట్ ప్రాంతానికి చెందిన సిరియా మైనర్ బాలికను కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఓ 13-16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికను తమ బంధువుకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఆమె వేరొకరిని ప్రేమించడంతో పెళ్లికి నిరాకరించింది. దీంతో ఓ 10 మందికి పైగా యువకులు అమ్మాయిని ఆటోమేటిక్ రైఫిల్స్‌తో హత్య చేశారు. అయితే ఈ ఘటనపై తూర్పు సిరియాలో భద్రతా అధికారులు అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కానీ, ఈశాన్య సిరియాలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ భద్రతా అధికారులు ఈ నేరం జరిగినట్లు ధృవీకరించారు. ఇక బాధితురాలి తండ్రి, సోదరులు, బంధువులు ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై సిరియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
వారం క్రితం ప్రేమపెళ్లి.. నూతన జంటను వెంటాడి వేటాడి..
ఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకా నగరంలో పరువు హత్య కలకలం రేపింది. పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటపై ఏడుగురు దుండగులు వారి ఇంట్లోకి చొరబడి చంపేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో ఆ జంట తప్పించుకునే ప్రయత్నం చేయగా.. రోడ్డుపై వెంటాడి మరి తుపాకులతో కాల్చారు. ఈ దాడిలో యువకుడు చనిపోగా.. అతని భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నా ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. డీసీపీ ఎస్కే. మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సోనాపేటకు చెందిన వినయ్ దహియా, కిరణ్‌లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారం క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు కుటుంబసభ్యులు ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. దానికోసం పథకం వేసి కిరాయి అంతకులను మాట్లాడి వారు ఉంటున్న ప్రాంతం వివరాలు ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వచ్చిన వినయ్ తన భార్య కిరణ్‌తో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇదే సమయంలో వారు ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన అగంతకులు తుపాకీలతో కాల్పులు జరిపారు. వినయ్ శరీరంలోకి బులెట్లు దిగడంతో ప్రాణభయంతో అతను భార్యను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. కానీ అగంతకులు వారిని వెంటాడి మరీ కాల్పులు జరిపారు. దీంతో వినయ్ అక్కడికక్కడే మరణించగా.. కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా స్థానికులు వచ్చి వారిని దగ్గర్లోని వెంకటేశ్వర్ ఆసుపత్రిలో చేర్చారు. వినయ్ అప్పటికే మృతి చెందగా.. కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
పరువు హత్య: దర్శకుడిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు
వెబ్‌డెస్క్: ఇరాన్‌కు చెందిన దర్శకుడు బాబక్ ఖోర్రామ్డిన్ దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలో సంచలన సృష్టించిన ఈ పరువు హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖోర్రామ్డిన్‌ను అతడి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. నిందితులు కేవలం ఖోర్రామ్డిన్‌ని మాత్రమే కాక వారి కుమార్తె, అల్లుడిని కూడా ఏళ్ల క్రితమే ఇంతే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బిడ్డలను చంపినందుకు తాము ఏ మాత్రం బాధపడటం లేదనడం గమనార్హం. ఆ వివరాలు.. ఖోర్రామ్డిన్ దారుణ హత్య ఇరాన్లో సంచలనం సృష్టించింది. దర్శకుడి పొరుగింటి వారు తమ నివాసం ఎదురుగా ఉన్న చెత్తకుప్పలో కొన్ని మానవ శరీర భాగాలున్నాయని పోలీసులకు తెలపడంతో దర్శకుడి హత్య వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా రెండు తెగిపడిన చేతులు కనిపించాయి. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అవి దర్శకుడు ఖోర్రామ్డిన్‌విగా గర్తించారు. ఇక దర్శకుడి హత్య గురించి తెలిసిన నాటి నుంచి అందరూ అతడి తల్లిదండ్రుల మీదనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఖోర్రామ్డిన్ తల్లిదండ్రులు ఇరాన్ ఖోర్రామ్దిన్( 74), అక్బర్ ఖోర్రామ్దిన్(81)లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వారు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కొడుకుని తామే హత్య చేశామని తెలిపారు. చైర్‌కు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ఊపిరాడకుండ చేసి చంపేశామని.. ఆ తర్వాత అతడిని ముక్కలుముక్కలుగా నరికి రెండు సూట్‌కేసులలో పెట్టి.. డస్ట్‌బిన్‌లో పడేశామని వెల్లడించారు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ఖోర్రామ్డిన్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘గత శుక్రవారం రాత్రి నా భార్య చికెన్ వండింది. దానిలో విషం కలిపాము. కానీ నా కుమారుడు భోజనం చేయలేదు. తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. దాంతో చికెన్ ఫ్రిజ్‌లో పెట్టాం. మరుసటి రోజు తింటాడని భావించాం. కానీ అలా జరగలేదు. దాంతో మరుసటి రోజు నా కుమారుడు బయటకు వెళ్లి వచ్చే వరకు ఆగాం. సాయంత్ర ఐదు గంటల సమయంలో ఇంటికి వచ్చిన నా కుమారుడిని చైర్‌కు కట్టేసి.. తన తలకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేశాం. ఆ తర్వాత కత్తితో తనని పొడిచి చంపేశాం. ఆ తర్వాత తనను ముక్కలుగా నరికి రెండు సూట్‌కేస్‌లలో శరీర భాగాలను సర్ది.. బయట పడేశాం’’ అని తెలిపారు. విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడు.. తమ కుమారుడు తన కోచింగ్ సెంటర్లోని విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడని.. దాని వల్ల సమాజంలో తమ పరువు పోతుందనే ఉద్దేశంతోనే అతడిని హత్య చేశామని తెలిపారు. అంతేకాక కొన్నేళ్ల క్రితం తమ కుమార్తె, ఆమె భర్తను కూడా ఇలానే హత్య చేశామని వెల్లడించారు. కుమార్తె డ్రగ్స్‌కు అలవాటు పడిందని.. అల్లుడు తమను తిడుతూ.. శాపనార్థాలు పెట్టేవాడని.. అందుకే వారిద్దరిని అంతం చేశానని వెల్లడించారు. ఇక మేం చేసిన పనికి మాకేం బాధ కలగడం లేదు. నా బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తున్నారు. వారి వల్ల మా పరువు పోతుంది. అందుకే నా భార్య సాయంతో వాళ్లని చంపేశాం అన్నాడు. ఈ కేసు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. మరణించిన ఖోర్రామ్డిన్ ‘క్రెవిస్’, ‘ఓత్ టు యషర్’ వంటి లఘు చిత్రాలతో సహా పలు ప్రాజెక్టులు తెరకెక్కించాడు. అతను 2009 లో టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సినిమా విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థులకు బోధించడానికి 2010లో ఇరాన్‌కు మారాడు. చదవండి: ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య -
ఆదోనీలో పరువు హత్య కలకలం
సాక్షి, కర్నూలు: ఆదోనిలో పరువు హత్య కలకలం రేపింది. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో కొట్టి చంపారు. మృతుడిని నందవరం మండలం గురజాలకు చెందిన ఫిజియోథెరపి వైద్యుడిగా గుర్తించారు. నెల క్రితం మహేశ్వరి అనే యువతిని స్మిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి ఆదోని విట్టా కిష్టప్ప నగర్లో ఆడమ్ స్మిత్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదోనిలోని ఓ నర్సింగ్ హోంలో స్మిత్ పనిచేస్తున్నారు. ఆయన ఇంటి నుంచి నర్సింగ్ హోంకు బైక్‌పై వెళ్తుండగా అటకాయించి తలపై బండరాయితో కొట్టి దుండగులు హత్య చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నామనే కారణంతో తన కుటుంబసభ్యులే హత్య చేశారని మృతుడి భార్య ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
పరువు హత్య
-
‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో దారుణ హత్యకు గురైన హేమంత్ తమ్ముడు సుమంత్ సాక్షి టీవీతో శనివారం మాట్లాడారు. తన అన్న హత్య కేసులో ప్రమేయమున్నా ఒక్కరినీ వదలొద్దని అతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి హత్యలు జరగొద్దని కోరుకున్నారు. హత్యోదంతంపై సుమంత్ మాట్లాడుతూ.. మా అన్న హేమంత్‌ను కొట్టుకుంటూ సంగారెడ్డి తీసుకెళ్లి చంపారట. చివరి సారిగా ఆకలిగా ఉందని చెప్పినా వాళ్లు కనికరించలేదంట. (చదవండి: మరో ‘పరువు’ హత్య) నీకెందుకురా అన్నం అంటూ కొట్టారంట. హత్య వెనకాల అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, తల్లి అర్చన ప్రధాన పాత్ర పోషించినట్టు తెలసుస్తోంది. నా అన్న చంపిన వారిని వదలొద్దు. ఇలాంటి హత్యలు మళ్లీ జరగొద్దు. యూకేలో హోటల్ బిజినెస్ ప్లాన్ చేశాను. కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాం. ఈ లోపే అన్నయ్యకు ఇంత దారుణం జరగడం కష్టంగా ఉంది. అన్నయ్య సినిమాల్లో ప్రయత్నించాడు. అమ్మ ఇద్దరినీ అందంగా ఉండాలని కోరుకునేది. కానీ చివరిసారిగా అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’అని సుమంత్ కన్నీరుమన్నీరయ్యాడు. (చదవండి: వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) -
వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి
సాక్షి, హైదరాబాద్: హేమంత్‌ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్కౌంటర్ చేయాలని అతని భార్య అవంతిరెడ్డి డిమాండ్ చేశారు. తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. నాపై ప్రేమ ఉంటే నేను ప్రేమించిన వ్యక్తిని చంపుతారా? మా అమ్మానాన్నల కంటే అత్తామామ ఎక్కువగా ప్రేమిస్తారు. మా ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారు. (చదవండి: హేమంత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు) హత్యలో మేనమామలు ఇన్వాల్వ్ అవుతారని అనుకోలేదు. మేనమామలు విజేందర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, కలిసి చేశారు. నా భర్తను హత్య చేసిన వారందరినీ ఎన్కౌంటర్ చేయాలి’అని అవంతి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కాగా, కూతురు ప్రేమ పెళ్లి నచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్‌ని హత్య చేయించారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డి. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్ హత్య చోటుచేసుకుంది. (చదవండి: మరో ‘పరువు’ హత్య) -
కలకలం రేపిన పరువు హత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రణయ్ పరువు హత్యకేసు ఇంకా మరువకముందే.. జిల్లాలో మరో పరువు హత్య సంచలనం కలిగించింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని గురువారం రాత్రి యువతి తరపు కుటుంబీకులు, బంధువులు అతి కిరాతకంగా హత్యచేసి ఈ జిల్లాలో పడేయడం సంచలనం రేపింది. నగరానికి శివారులో ఉండడంతో.. హైదరాబాద్ నగరానికి జిల్లా శివారులో ఉండడంతో హత్యలు చేయడానికి, హత్యలు నగరంలో చేసి మృతదేహాలు ఇక్కడ పడేయడానికి నిందితులు ఇక్కడ స్థలాన్ని ఎంచుకుంటున్నారు. చందానగర్‌కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని జూన్ 10న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి తరపు కుటుంబీకులు, బంధువులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. భార్యాభర్తలు ఇద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు, కుటుంబీకులు అదను చూసి గురువారం మధ్యాహ్నం అవంతిని, హేమంత్‌ను కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లారు. (ప్రేమే నేరమా..!) ఈ క్రమంలో మార్గమధ్యలో అవంతి కారులోనుంచి తప్పించుకుంది. హేమంత్‌ను మాత్రం సంగారెడ్డి సమీపంలోని హైదరాబాద్–బీదర్ జాతీయ రహదారి మార్గంలో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొండాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిష్టయ్యగూడెం ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హేమంత్‌ను నగరంలోనే హత్య చేసి ఇక్కడికి తెచ్చి పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా..? అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ.. పరువు హత్యలే కాకుండా పాత కక్షలతో జిల్లాలో హత్య చేయడమో..ఇతర ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ మృతదేహాలను పడేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఐదు నెలల క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తిని అతని బంధువులే పటాన్చెరు సమీపంలోగల రుద్రారం పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై నరికి చంపారు. -
మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ కుమార్ భార్య అవంతి డిమాండ్ చేశారు. తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్‌ను హత్య చేశారని ఆమె తెలిపారు. అవంతి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘మేము 8 ఏళ్లుగా మేమిద్దం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం) నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్ని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకువెళుతుండగా ఇద్దరం అందులో నుంచి కిందకు దూకేశాం. అయితే హేమంత్‌ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకుని వెళ్లిపోయారు. నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెంటనే 100కి కాల్ చేసినా.. 40 నిమిషాల వరకు పోలీసులు స్పందించలేదు. హేమంత్ చనిపోయినట్లు ఇవాళ ఉదయం పోలీసులు మాకు చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రణయ్‌ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం. హేమంత్‌ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్‌ను ఎలా చంపుతారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); ఇలా ప్రాణాలు తీస్తారనుకోలేదు.. కేవలం కులం అనే కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని మృతుడు హేమంత్ తల్లి లక్ష్మీ భోరున విలపించారు. తన కొడుకుకు ఒక్క చెడు అలవాటు కూడా లేదని, ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా తెలియదన్నారు. ‘తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అవంతికి చెప్పాను. అయితే వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అర్థరాత్రులు ఫోన్ చేసి బెదరించారు. నా కొడుకును చూస్తే ఎలా చంపాలనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నా కొడుకుని ఓ దెబ్బ కొడతారేమో అనుకున్నా కానీ, ఇలా ప్రాణాలు తీస్తారని ఎప్పుడూ ఊహించలేదని హేమంత్ తండ్రి చింతా మురళి కన్నీటిపర్యంతమయ్యారు. హేమంత్ హత్య కేసులో 13 మంది అరెస్ట్ హత్య కేసులో 13మందిని అరెస్ట్ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అవంతి,హేమంత్‌ను తీసుకెళ్లారన్నారు. హేమంత్ తండ్రి 100కు కాల్ చేశారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6.30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయానికే హేమంత్‌ను చంపేశారని, ఈ హత్య కేసులో యువతి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులదే ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసుల అలసత్వం ఏమీ లేదని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. హేమంత్ హత్యకు కొద్ది క్షణాల ముందు తీసిన ఫోటో -
కుల హత్య : నిర్దోషిగా కౌసల్య తండ్రి
సాక్షి, చెన్నై : తమిళనాట తీవ్ర కలకలం రేపిన దళిత యువకుడు శంకర్ హత్య కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కౌసల్య అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నందుకు శంకర్ దారుణ హత్యకు గురైన కేసులో ప్రధాన నేరస్తుడు, కౌసల్య తండ్రి చిన్నసామిపై ఉన్న అన్ని అభియోగాలనూ రద్దు చేసి, నిర్దోషిగా తీర్పు చెప్పింది. అతనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఇప్పటికే చిన్నసామి ఏదైనా జరిమానా చెల్లించి వుంటే ఆ జరిమానా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది. అలాగే కౌసల్య తల్లి అన్నలక్ష్మితోపాటు సోదరుడు పండిదురై, మరో బంధువు ప్రసన్నకుమార్ ను నిర్దోషులుగా ప్రకటించి సంచలనం రేపింది. మద్రాస్ హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు ఎం సత్యనారాయణన్ ఎం.నిర్మల్ కుమార్ ఈ కేసులో మరో ఐదుగురికి మరణశిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుగా మార్చుతూ సోమవారం తీర్పునిచ్చింది. కౌసల్య తల్లి, మరో ఇద్దరు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. కిరాయి హంతకులు జగదేసన్, మణికందన్ (పళని), సెల్వకుమార్, కాలా తమిళవానన్, మాథన్ అలియాస్ మైఖేల్‌లను మాత్రమే దోషులకు తేల్చిన కోర్టు వీరి మరణశిక్షను కూడా రద్దు చేసింది. ఈ కేసులో 2017, డిసెంబర్లో తిరుప్పూర్ జిల్లా సెషన్స్ కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. దీనిపై చిన్నసామి తదితరులు హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది. వీడియో రికార్డింగ్ మీద ఆధారపడిన ప్రాసిక్యూషన్ ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను రుజువు చేయలేక పోయిందని చిన్నసామి న్యాయవాది సుందరేసన్ తెలిపారు. అలాగే స్థానిక దుకాణంలో రికర్డైన సీసీటీవీ విజువల్స్ మార్ఫింగ్ చేసినవని ఆయన వాదించారు. కాగా తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో 2016 మార్చి13న శంకర్ దారుణ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ షాపింగ్ మాల్ దగ్గర కౌసల్య దంపతులపై దుండుగులు కత్తులతో విరుచుకుపడిన ఘటనలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కౌసల్య కొన ఊపిరితో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీలో రికర్డు అయ్యాయి. అయితే దళితుడిని పెళ్లాడి నందుకే కక్ష గట్టి తన తండ్రి తన భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించాడని ఆరోపించిన కౌసల్య, దీనిపై న్యాయపోరాటం చేస్తోంది. తన తల్లిదండ్రులతోపాటు, ఇతరలకు శిక్ష పడే వరకూ తన పోరు కొనసాగుతుందని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన కౌసల్య తాజా తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అటు పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో 2018లో కౌసల్య కోవైకి చెందిన డప్పు కళాకారుడు శక్తిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. -
ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య
టెహ్రాన్: రెజా అష్రాఫీ (37) తన 14 ఏళ్ల కుమార్తెను వ్యవసాయ కొడవలితో దారుణంగా నరికి చంపే ముందు ఒక న్యాయవాదిని కలిశాడు. ‘నా కుమార్తె రోమినా, తన 29 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయి కుటుంబం పరువు తీసింది. తనను చంపేయాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి శిక్ష పడుతుంది’ అని న్యాయవాదిని అడిగాడు. అందుకు సదరు లాయర్.. ‘నువ్వు అమ్మాయి సంరక్షకుడిగా ఉన్నావు. కనుక మరణశిక్ష పడదు. కానీ 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తావు’ అని న్యాయవాది అతనికి తెలిపాడు. ఈ సంభాషణ జరిగిన మూడు వారాల తర్వాత అష్రాఫీ.. గదిలో నిద్రిస్తున్న తన కుమార్తె రోమినాను దారుణంగా తల నరికి చంపేశాడు. గత నెలలో ఉత్తర ఇరాన్ పచ్చని కొండలలోని ఒక చిన్న గ్రామంలో చోటు చేసుకున్న ఈ పరువు హత్య దేశాన్ని కదిలించింది. మహిళలు, పిల్లల హక్కుల గురించే కాక సామాజిక, మత, చట్టపరమైన వైఫల్యాలపై దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. రోమినా ఓ యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి తండ్రి ఆమెను హెచ్చరించాడు. మాట వినకపోతే చంపుతానని చాలాసార్లు బెదిరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని రోమినా తల్లి తెలిపింది. రోమినా ప్రియుడు మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల వయసు నుంచి నాకు ఆమె తెలుసు. తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ రోమినా తండ్రి అందుకు అంగీకరించలేదు. నేను అతడికి నచ్చలేదు. దాంతో అతడు తనను ఇంట్లో బంధించాడు.. ఫోన్ లాగేసుకున్నాడు. బెదిరించాడు. ఓ రోజు ఏకంగా ఇంటికి ఎలుకల మందు, తాడు తీసుకొచ్చి రోమినాను ఆత్మహత్య చేసుకోమని చెప్పాడు. తండ్రి చర్యలతో భయపడిన రోమినా ఓ లెటర్ రాసి పెట్టి నా దగ్గరకు వచ్చింది. ‘నాన్న మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నాను. నా గురించి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. చనిపోయానని చెప్పండి’ అని లెటర్లో రాసింది. తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చింది’ అని తెలిపాడు. అతడు మాట్లాడుతూ.. ‘విషయం తెలుసుకున్న అష్రాఫీ నా మీద కిడ్నాప్ కేసు పెట్టాడు. కానీ రోమినా తన ఇష్టపూర్వకంగా నా దగ్గరకు వచ్చిందని తెలుసుకున్న పోలీసులు కేసు కొట్టివేశారు. కానీ రోమినాను తండ్రితో వెళ్లమని చెప్పారు. అందుకు తను ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్తే తండ్రి తనను చంపుతాడని ఆమె భయపడింది. కానీ పోలీసులు అలా ఏం జరగదని హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు రాత్రే తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యింది’ అంటూ ఆవేదన వ్యక్యం చేశాడు. రోమినా తండ్రికి కఠిన శిక్ష పడాలని కోరుకున్నాడు. ప్రస్తుతం రోమినా తండ్రి జైలులో ఉన్నాడు. హత్య చేస్తే మరణశిక్ష కానీ.. ఇరాన్లో హత్య చేసిన వ్యక్తికి ‘కంటికి కన్ను’ అనే షరియా ఆదేశం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. కానీ ఇస్లామిక్ చట్టం ఆధారంగా శిక్షాస్మృతి, తన బిడ్డను చంపినందుకు ఒక సంరక్షకుడికి మరణశిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇరాన్లో పిల్లల తల్లితండ్రులని చట్టపరమైన సంరక్షకులుగా పేర్కొంటారు. అయితే తన బిడ్డను చంపిన తల్లి మరణశిక్షను ఎదుర్కొంటుంది. రోమినా పరువు హత్య పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు, అయతోల్లా అలీ ఖమేనీ, రోమినా హత్యను తీవ్రంగా ఖండించారు. స్త్రీలను వేధింపులకు గురిచేసే ఏ వ్యక్తికైనా ‘కఠినమైన శిక్ష’ విధించాలని పిలుపునిచ్చారు. మరణశిక్ష ఇస్లామిక్ చట్టానికి వ్యతిరేకం కానీ సంప్రదాయవాద మతాధికారి, చట్టసభ సభ్యుడు మౌసా గజన్ఫరాబాది స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు సరిపోతాయి. మేము రోమినా తండ్రిని ఉరితీయలేము. ఎందుకంటే ఇది ఇస్లామిక్ చట్టానికి విరుద్ధం’ అన్నారు. ‘తండ్రి కుమార్తెను చంపడం.. అతడికి మరణశిక్ష నుంచి మినహాయింపు లభించడం ఏంటి’ అని ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, మాజీ చట్టసభ సభ్యుడు ఫేజె హషేమి ప్రశ్నించారు. ప్రజలు కూడా ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని మార్చాలని పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ సాయుధ దళాలతో అనుబంధంగా ఉన్న ఒక పరిశోధనా కేంద్రం విడుదల చేసిన నివేదికలో 2019 ఇరాన్లో జరిగిన మొత్తం హత్య కేసులలో దాదాపు 30 శాతం పరువు హత్యలుగా గుర్తించింది. రక్షణ లేని రోమినాలు ఎందరో రోమినా పరువు హత్య ఉదంతంతో పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న మానసిక, శారీరక హింస గురించి వెల్లడించారు. టెహ్రాన్‌కు చెందిన 49 ఏళ్ల ఇద్దర బిడ్డల తల్లి మినూ మాట్లాడుతూ.. ‘నా భర్త 17 ఏళ్ల నా కుమార్తెను వీధిలో ఒక మగ స్నేహితుడితో చూసి కొట్టాడు’ అని చెప్పింది. హనీహ్ రాజాబీ, పీహెచ్.డీ తత్వశాస్త్రం విద్యార్ధిని ‘ఐస్ క్రీం తినడానికి వెళ్లాను. కాలేజీ బస్సు వెళ్లి పోయింది. దాంతో వేరే బస్సులో ఇంటికి వచ్చాను. విషయం తెలిసి నా తండ్రి నన్ను బెల్టుతో కొట్టాడు. ఒక వారం పాటు కాలేజీకి పంపలేదు’ అని ట్వీట్ చేశారు. మరికొందరు అత్యాచారం, శారీరక, మానసిక వేధింపుల కథలను పంచుకున్నారు. తమ భద్రత కోసం ఇంటి నుంచి పారిపోయమన్నారు. ‘ఈ దేశంలో రక్షణ లేని వేలాది మంది రోమినాలు ఉన్నారు’ అని కిమియా అబోద్లాజాదే ట్వీట్ చేశారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల కంటే ఇరాన్ మహిళల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుందని చెప్పవచ్చు. ఇరాన్ మహిళలు న్యాయవాదులు, వైద్యులు, పైలట్లు, ఫిల్మ్ డైరెక్టర్లు, ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారికి యూనివర్సిటీల్లో 60 శాతం సీట్లు, ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇరాన్ మహిళలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. పార్లమెంట్, క్యాబినెట్‌కు ఎన్నుకోబడతారు. వీటితో పాటు మహిళలకు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. స్త్రీలు తమ జుట్టు, చేతులు, నడుము భాగాలను కప్పి ఉంచాలి. దేశం విడిచి వెళ్లలన్నా, విడాకులు అడగాలన్నా.. విదేశాల్లో పని చేయాలన్నా వారికి మగ బంధువు అనుమతి తప్పనిసరి. -
లాక్డౌన్: దళితులపై పెరిగిన దాడులు
చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేధింపుల రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నన్ని దాడులు మరే రాష్ట్రంలో జరగడం లేదని మధురైకి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు దళితులు హత్యకు గురయ్యారంటూ సామాజిక కార్యకర్త కథీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు లాక్డౌన్ సమయాన్ని దళితులపై దాడి చేసేందుకు ఓ అవకాశంగా వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కథీర్ మాట్లాడుతూ.. ‘40-50 మంది జనాలు గుంపులుగా ఏర్పడి నిమ్నవర్గాల వారిపై దాడులకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఇది ఎలా సాధ్యమయ్యింది?. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో గృహహింస పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే కేవలం గృహ హింస మాత్రమే కాక కులం పేరుతో జరిగే వేధింపులు కూడా బాగా పెరిగాయి. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 100 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో కొన్ని అత్యాచారం, హత్య, పరువు హత్య వంటి తీవ్ర నేరాలు కూడా ఉన్నాయి’ అని అన్నారు. దేశంలో మొదటి దశ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మార్చి 29న ఆరనిలోని మోరప్పంతంగల్ గ్రామంలో పరువు హత్య చోటు చేసుకుందని కథీర్ తెలిపారు. ‘గ్రామంలోని ఒద్దార్ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ అనే యువకుడు వన్నియార్ కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దాంతో సదరు యువతి తల్లిదండ్రులు సుధాకర్ మీద దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు యువతి తండ్రితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో హైకోర్టు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఫలితంగా ఈ తరహా కేసుల్లో నిందితులు సులభంగా బెయిల్ పొంది.. శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు’ అంతేకాక ఈ ఘటనల గురించి ప్రచారం చేసిన రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారరని కథీర్ ఆరోపించారు. పట్టణాల నుంచి గ్రామాలకు వస్తోన్న నిమ్న వర్గాల వారి మీద కూడా దాడులు పెరిగాయని కథీర్ వెల్లడించారు. ‘పట్టణాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాక ఉన్నత వర్గాల ప్రజల దళితుల కాలనీల చుట్టు కంచెలు ఏర్పాటు చేసి వారిని గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దుకాణాదారులు వారికి నిత్యావసరాలు అమ్మడం లేదు’ కరోనా మహమ్మారి సమయంలో కూడా, కులతత్వం ఆగిపోలేదని.. ఈ వివక్షను, దాడులను ఆపడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని కథీర్ కోరారు. (వలస కూలీలను బూటుకాలితో తన్నిన పోలీస్) -
‘అమ్మాయి బతికి ఉంటే దొరికేది కదా’
కన్నకూతుర్ని దారుణంగా పరువు హత్య చేసిన ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. సగోత్రీకుడిని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో తమ కుమార్తె శీతల్(25)ను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో విసిరేసారు. తాము చేసిన ఘోరం ఎవరికి తెలియదులే అనుకొని ఊరుకున్నారు. కానీ నేరస్తులు ఎంతటివారైనా ఎప్పటికైనా దొరకక మానరు. సత్యం ముందు కచ్చితంగా తలవంచాల్సిందే. శీతల్ పరువు హత్య కేసులో అదే మరోసారి రుజువైంది. శీతల్ భర్త అంకిత్ భాటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు శీతల్ అద్యశ్యం మిస్టరీని ఛేదించారు. కిడ్నాప్, హత్య ఆరోపణలతో శీతల్ తల్లిదండ్రులు, రవీందర్, సుమన్, మేనమామలు (సంజయ్, ఓం ప్రకాష్) ఇద్దరు కజిన్స్ అంకిత్, పర్వేష్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ(తూర్పు) జస్మీత్ సింగ్ తెలిపారు. అదే గోత్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు నచ్చలేదని, అందుకే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారని వెల్లడించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శీతల్, భాటి కుటుంబాలు పక్క పక్కనే నివసించేవి. ఇరు కుటుంబాలు పాల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో శీతల్, భాటి గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారు, కానీ ఎవరి కుటుంబాలతో వారు కలిసి ఉన్నారు. అయితే ఇటీవల భాటి తమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పాడు. అటు శీతల్ కూడా జనవరి 20న తేదీన తమ పెళ్లి విషయాన్ని తల్లి తండ్రులకు చెప్పింది. అంతే ఆగ్రహంతో రగిలిపోయిన ఆ కుటుంబం ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని పథకం వేసింది. జనవరి 29 రాత్రి మరో నలుగురితో కలిసి, తల్లిదండ్రులు ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం రెండు కార్లలో ఆరుగురు నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని సికంద్రబాద్ (తమ సొంత గ్రామానికి దగ్గర)కు తీసుకెళ్లారు. వెనుక ఒక కారులో మేనమామలు, ఇతర బంధువులు రాగా తమ కన్నకూతురు మృతదేహాన్ని ఉంచుకుని ముందు కారులో (వాగన్ఆర్)లో శీతల్ తల్లిదండ్రులు వెళ్లారు. మొదట మృతదేహాన్ని సికంద్రబాద్లో దింపారు. అక్కడ కుదరక మళ్లీ అక్కడినుంచి అలీగఢ్ వరకు తీసుకెళ్లి, అక్కడ పడవేసి చక్కా పోయారు. అయితే లోతు, నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో మృతదేహంపైకి తేలింది. దీంతో గ్రామస్తులు అలీగఢ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో, ఫిబ్రవరి 2న పోలీసులే దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె బట్టలు, ఫోటోలు, ఇతర వస్తువులను భద్రపరిచారు. మరోవైపు తన భార్య శీతల్ కనిపించడకపోవడంతో బంధువులను, స్నేహితులను విచారించాడు భాటి. అయినా ఆచూకీ లభించలేదు. దీంతోపాటు భాటి కుటుంబ సభ్యులు శీతల్ బంధువులను కూడా సంప్రదించారు. అయినా ఫలితంలేక పోవడంతో ఫిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శీతల్ ఆచూకీపై పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను విడివిడిగా విచారించారు. ఒకరికొకరు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అలాగే ‘అమ్మాయి బతికి వుంటే కనిపించేది కదా సార్’ అని నిందితుల్లో ఒకడు పోలీసులకు చెప్పడంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు విషయాన్ని రాబట్టారు. ఆమె బట్టలు, ఫోటోలు, ఇతరు వస్తువులతో పాటు, ఆరుగురు నిందితుల కాల్ వివరాలు, ఇంతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు. చదవండి: జియో కొత్త రీచార్జ్ ప్లాన్ -
చంపి ముక్కలు చేసి, సూట్‌కేసులో కుక్కి
సాక్షి, ముంబై : ముంబైలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన మాట వినలేదనే ఆగ్రహంతో కన్న కూతురుని అతి దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసి సూట్‌కేసులో పెట్టి తరలిస్తుండగా పట్టుబట్టాడో తండ్రి. తన మాట విననందుకే ఆమెను హతమార్చానని పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించాడు. ముంబైలోని తిట్వాలాకు చెందిన అరవింద్ తివారీ(47) ఒంటరిగా ఉంటున్నాడు. హతురాలు సహా ప్రిన్సీ (22) సహా నలుగురు కుమార్తెలు, భార్య స్వగ్రామం జౌన్‌పూర్‌లో ఉంటారు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రిన్సీ నాలుగు నెలల క్రితం కుటుంబానికి సాయపడేందుకు ఒక ప్రయివేటు ఉద్యోగంలో చేరింది. అక్కడే ఒక వ్యక్తిని ఇష్టపడింది. ఇది నచ్చని తండ్రి ఆమెను హెచ్చరించాడు. కుటుంబం పరువు తీస్తున్నావని వాదించాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెను క్రూరంగా హత్య చేశాడు. అక్కడితో ఆగలేదు. మృతదేహాన్ని మూడు భాగాలు చేసాడు. తలతో సహా రెండు భాగాలను సూట్ కేసులో కుక్కి ముంబై సమీపంలోని థానేలో ఆటోలో ఎక్కాడు. అయితే సూట్‌కేసు దుర్వాసన రావడంతో ఆటో డ్రైవర్ తివారీని ప్రశ్నించాడు. దీంతో నిందితుడు సూట్‌కేసును ఆటోలోనే వదిలి పారిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం తానే చేశానని ఒప్పుకున్నాడు. హతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన ఇతర భాగాలకోసం విచారణ చేస్తున్నారు. -
కూతురిని సజీవ దహనం చేసిన తల్లి
చెన్నై: తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందనే కోపంతో కన్నతల్లే కూతురిని కడతేర్చింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... వాజ్మంగళం అనే గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్ దంపతులకు జనని(17) అనే కూతురు ఉంది. కన్నన్ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. ఉమా రోజూవారీ కూలీగా పనిచేస్తూ భర్తకు అండగా ఉంటోంది. ఈ క్రమంలో మైనర్ అయిన జనని.. వారి గ్రామానికే చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె.. వచ్చే నెలలో మేజర్ కానుండటంతో అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రియుడితో కలిసి పారిపోయేందుకు జనని సిద్ధపడింది. అయితే ఈ విషయం జనని తల్లి తెలియడంతో కూతురితో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన ఉమ.. కూతురిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జనని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఇక ఉమ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురి హత్యలో తండ్రి కన్నన్‌కు కూడా భాగం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ఒక్కగానొక్క కూతురికి కరెంట్ షాకిచ్చి..
ఫిరోజాబాద్ (ఉత్తర ప్రదేశ్) : పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌కు చెందిన పూజ (22) యువతి కన్నతండ్రి చేతిలో పరువు హత్యకు గురైంది. పక్కింటి యువకుడిని ప్రేమిస్తుందన్న కారణంతో ఏకైక కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పరువు హత్యలకు సంబంధించి గత 18 నెలల్లో 23వ కేసుగా భావిస్తున్న ఈ ఘటన ఫిరోజాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. జస్రానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) గిరీష్ చంద్ర గౌతమ్ సమాచారం ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పూజా ఐదుగురు తోబుట్టువులలో చిన్నది, ఏకైక కుమార్తె. తమ కులానికే చెందినవాడు, పక్కింటి యువకుడు గజేంద్రను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తోంది. ఈ వ్యవహారాన్ని తండ్రి అంగీకరించలేకపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పూజ, గజేంద్రతో మాట్లాడటం చూసిన తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరింత రెచ్చిపోయి ఆమె పట్టుకుని, మొదట కరెంట్‌షాకిచ్చాడు. అనంతరం కత్తితో గొంతుకోసి హతమార్చాడు. విచారణలో నిందితుడు, పూజ తండ్రి హరివంశ్ కుమార్ నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలు సోదరుడు యోగేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామన్నారు. -
‘తనను చంపినందుకు బాధ లేదు’
ముల్తాన్/పాకిస్తాన్ : పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా స్టార్ కందీల్ బలోచ్ హత్య కేసులో ఆమె సోదరుడికి స్థానిక కోర్టు జీవితఖైదు విధించింది. పరువు హత్యకు పాల్పడిన అతడు జీవితాంతం జైలులో ఉండాలని శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాలు... పాకిస్తాన్‌కు చెందిన బలోచ్ సెల్ఫీ స్టార్‌గా ఫేమస్ అయ్యింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో పూర్తి వ్యక్తిగతమైన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. తద్వారా ‘పాకిస్తాన్ కిమ్ కర్ధాషియన్’గా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన బలోచ్ సోదరుడు మహ్మద్ వసీం 2016 జూలైలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు విలేకరులతో మాట్లాడుతూ... తన సోదరిని చంపినందుకు ఏమాత్రం బాధ పడటం లేదని, తన అసభ్య ప్రవర్తన కారణంగానే ఆమెను అంతమొందించానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... పరువు హత్యగా నమోదైన ఈ కేసులో ముల్తాన్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వసీంకు జీవితఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే తన క్లైంట్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చినప్పటికీ.. హైకోర్టులో అతడికి న్యాయం జరుగుతుందని వసీం తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. ఇక వసీం తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు అమాయకుడని, చనిపోయిన కూతురు కంటే ప్రస్తుతం జీవించి ఉన్న వసీం జీవితం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్లో కిసాస్ అండ్ దియాత్ చట్ట ప్రకారం సమీప బంధువు హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తి బాధితుల బంధువుల నుంచి క్షమాభిక్ష పొంది నేరం నుంచి తప్పించుకునే వీలు ఉండేది. దీంతో అక్కడ పరువు హత్యలు యథేచ్ఛగా సాగేవి. ఈ క్రమంలో బలోచ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పరువు హత్యకు పాల్పడిన వారికి జీవితఖైదు విధించేలా పాక్ పార్లమెంట్ చట్టం రూపొందించింది. అయితే ఒక హత్య పరువుకు సంబంధించిందా కాదా అనే విషయాన్ని నిర్ధారించడం జడ్జి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఇక బలోచ్ కేసు విషయంలో తొలుత తమ కుమారుడిని శిక్షించాలని కోరిన ఆమె తల్లిదండ్రులు.. తర్వాత మనసు మార్చుకుని అతడిని క్షమిస్తున్నామని కోర్టుకు తెలిపారు. -
కేవిన్ జోసెఫ్ కేసులో సంచలన తీర్పు
కొట్టాయం: కేరళలో దుమారం రేపిన దళిత క్రిస్టియన్ కేవిన్ పీ జోసెఫ్ (24) హత్య కేసులో స్థానిక కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది ‘పరువు హత్య’అని తేల్చిచెప్పిన కోర్టు ఈ కేసులో 10మందిని దోషులుగా నిర్ధారించింది. దోషులలో కేవిన్ భార్య సోదరుడు కూడా ఉన్నాడు. వీరికి శనివారం శిక్షలు ఖరారు చేయనున్నారు. 2018 మే 24న కేవిన్ నీను చాకో (20)ను కొట్టాయంలో పెళ్లాడారు. అయితే, కేవిన్ దళితుడు కావడంతో ఈ పెళ్లిని నీను కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. పెళ్లయిన రెండురోజులకే ఓ గ్యాంగ్ కేవిన్‌ను, అతని స్నేహితుడు అనీష్‌ను ఎత్తుకెళ్లారు. నీను కుటుంబం, ముఖ్యంగా నీను సోదరుడు స్యాను చాకో ఈ కిడ్నాప్ వెనుక ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అనీష్‌ను ఆ గ్యాంగ్ విడిచిపెట్టినప్పటికీ.. ఆ మరునాడు కేవిన్ మృతదేహం కొల్లాం జిల్లాలోని థెన్‌మలా వద్ద కాలువలో దొరికింది. కేవిన్ బలవంతంగా నీళ్లలో ముంచి చంపినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కేవిన్ కిడ్నాప్‌పై నీను, కేవిన్ కుటుంబం పదేపదే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విచారణలో వెలుగుచూసింది. స్యాను చాకోతోపాటు మరో పదిమందిని మర్డర్ (302), కిడ్నాపింగ్ (364ఏ), క్రిమినల్ కుట్ర (120 బీ) తదితర సెక్షన్ల కింద న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో నీనూ తండ్రిని, మరో ముగ్గురు నిందితులను ఆధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది. -
పరువు హత్య.. తల్లిదండ్రులకు జీవిత ఖైదు
సాక్షి, గుంటూరు: ఓ పరువు హత్య కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ బుధవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్ 2వలైనులో పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి అనే కుమార్తెలున్నారు. దీప్తి హైదరాబాదులోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేది. అదే కంపెనీలో పశ్చిమ గోదావరి జిల్లా రాజఒమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి కిరణ్‌కుమార్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో దీప్తి(26), కిరణ్‌కుమార్ ప్రేమించుకున్నారు. 2014 మార్చి నెల 21వ తేదీ దీప్తి, కిరణ్ హైదరాబాదులోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు 22వ తేదీ హైదరాబాద్‌కు వెళ్లి గుంటూరులో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తామని నమ్మ బలికి, దీప్తిని ఇంటికి తీసుకెళ్లి మంచానికి కట్టేసి చున్నీ మెడకు బిగించి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో హరిబాబు, సామ్రాజ్యం దంపతులకు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. -
పరువు హత్య బాధితునికి ప్రభుత్వ సాయం
సాక్షి, పలమనేరు: మండలంలోని ఊసరపెంట పరువుహత్య ఘటనకు సంబంధించిన బాధితుడు కేశవ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన రూ.5లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీ రెడ్డెప్ప శనివారం అందజేశారు. కులాంతర వివాహం చేసుకుందని తల్లిదండ్రులు, తోబుట్టువులు కలిసి హేమావతిని హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో వారికి సీఎం సహాయనిధి, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా రూ.13.50 లక్షల సాయంలో భాగంగా రూ.5లక్షల చెక్కును బాధితుడు కేశవకు అందజేశారు. ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిన నగదును తల్లిలేని పిల్లాడు జగన్మోహన్ పేరిట డిపాజిట్ చేసి, అతని బాగోగులకు వినియోగించాలని సూచించారు. త్వరలో మిగిలిన నగదు, బోరు డ్రిల్లింగ్, ఉద్యోగం తదితర సదుపాయాలను అధికారులు చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి రాజ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ కన్వీనర్లు బాలాజీనాయుడు, మండీసుధా, నాయకులు విశ్వనాథ రెడ్డి, చెంగారెడ్డి, రాజారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ నాయకులు శ్యామ్‌సుందర్‌రాజు, ప్రహ్లాద, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు, ఏఎస్‌డబ్యూఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఆక్రోశం..ఆవేశం..ఆవేదన..
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : మండలంలోని ఊసరపెంటలో హేమావతి పరువుహత్య జరిగిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ఆక్రోశంతో ఆందోళనలు చేశారు. ఆగ్రహంతో రగిలిపోయారు. పలమనేరు ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగినా శవాన్ని తీసుకెళ్లడంలో గందరగోళం, ఆపై పోలీసుల చొరవతో శవాన్ని గ్రామానికి తరలింపు, అక్కడ శవం ముందే నిరసనలతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు సబ్‌కలెక్టర్ చొరవతో వివాదం సద్దుమణిగింది. సాయంత్రానికి భర్త పొలాల్లో భార్య హేమావతి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఆస్పత్రి నుంచే టెన్షన్.. టెన్షన్ కులాంతర వివాహం చేసుకుందనే కసితో కన్నకూతురినే చంపిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి దళిత సంఘాల నేతలు శనివారం పలమనేరుకు చేరుకున్నారు. హేమావతి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి అయినా నిందితులను అరెస్టు చేసే వరకు శవాన్ని తీసుకెళ్లమంటూ బాధితులు మొండికేశారు. ఏదో జరుగుతుందని ముందుగానే గ్రహించిన పోలీసులు ఆస్పత్రితోపాటు గ్రామంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్ద భర్త అతడి కుటుంబ సభ్యులను ఒప్పించి, భారీ భద్రత నడుమ ఊసరపెంటకు మృతదేహాన్ని తరలించారు. భర్త కేశవ ఇంటి ముందు ఉంచారు. భర్త బంధువుల ఆందోళన అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న దళిత సంఘాల నాయకులు, హేమావతి భర్త బంధువులు ఆందోళన చేశారు. విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపమాపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలు ప్రస్తుతం పసలేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటూ భీష్మించుకున్నారు. దీంతో పోలీసులు బాధితులతో శనివారం సాయంత్రం వరకు మంతనాలు జరిపినా ఫలించలేదు. దీనిపై అగ్రహించిన వారు శవాన్ని పలమనేరుకు తీసుకెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్త ఆదేశాలతో మదనపల్లె సబ్‌కలెక్టర్ చేకూరి కీర్తి వస్తున్నారని చెప్పడంతో వారు శాంతించారు. పసికందుకు రూ.5 లక్షల పరిహారం బాధితుల డిమాండ్లను ఆలకించిన సబ్‌కలెక్టర్ చేకూరి కీర్తి వారిని శాంతిపజేశారు. తల్లికి దూరమైన పసికందును ఎత్తుకుని కాసేపు బాధపడ్డారు. తల్లికి దూరమైన ఆ బిడ్డకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. భర్త కేశవకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి, నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరపడంతోపాటు మిగిలిన సాయాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతి మృతదేహానికి భర్త కేశవ్ పొలాల్లోనే అంత్యక్రియలు జరిపారు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో కర్ఫ్యూ విధించారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను మొహరించారు. దాదాపు 80 మంది పోలీసులు గ్రామాన్ని వారి అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాషా, సత్యవేడు, మదనపల్లె సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు విధులను నిర్వహించారు. -
తమిళనాడులో మరో ‘పరువు’ ఘోరం!
సాక్షి, చెన్నై: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన దారుణమైన పరువు హత్య ఘటనను మరువకముందే తమిళనాడులో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ యువజంట ప్రేమకు కులం అడ్డుగా నిలిచింది. తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తూ.. ఆ అమ్మాయిని తరచూ కలుస్తుండటంతో అబ్బాయి సోదరుడు ఇక్కడ విలన్ అయ్యాడు. తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తావా? అంటూ ఇద్దరిపై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకున్న ఈ పరువుహత్య సంచలనం రేపుతోంది. కోయంబత్తూరు మెట్టుపాలయం శ్రీరంగరాయన్ ఓట్టై ప్రాంతానికి చెందిన కరుప్పసామి కుమారుడు కనకరాజ్ (22) అదే ప్రాంతంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో దర్శినిప్రియ(17)తో అతనికి పరిచయమై.. ప్రేమగా మారింది. అయితే, ఇరువురి సామాజిక వర్గాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. దీంతో ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే వారిని వెతికి పట్టుకున్న ఇరుకుటుంబాల పెద్దలు.. పంచాయతీ పెట్టి.. వేరు చేశారు. ఇకపై ఒకరినొకరు కలవకూడదని షరతులు పెట్టారు. అయినా, ఆ తర్వాత కూడా కనకరాజ్, దర్శినిప్రియ తరచూ కలుస్తూ వచ్చారు. దర్శినిప్రియది దళిత సామాజిక వర్గం అని తెలుస్తోంది. అమ్మాయి తక్కువ కులానికి చెందినదని, ఆ అమ్మాయిని కలువకూడదని కనకరాజ్‌ను అతని సోదరుడు వినోద్ హెచ్చరించాడు. అయినా వారు రహస్యంగా కలుస్తూ వస్తుండటంతో ఆగ్రహించిన వినోద్.. గత మంగళవారం సోదరుడు కనకరాజ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి అడ్డువచ్చిన దర్శినిప్రియపై కూడా కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో కనకరాజ్ అక్కడికక్కడే మృతిచెందగా దర్శినిప్రియ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది. -
పలమనేరు పరువు హత్యపై స్పందించిన డిప్యూటీ సీఎం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన పరువు హత్య ఘటన బాధాకరమని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమకు కుల,మతం లేదని, ప్రేమ పవిత్రమైనది ఆయన పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకుంటే చంపడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. హేమావతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. పలమనేరులో పరువు హత్య.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. ఆమెను తండ్రి కిరాతకంగా చంపేసిన ఘటన ఈ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఉసిరిపెంట గ్రామంలో జరిగిన సంగతి తెలిసిందే. ఉసరిపెంటకు చెందిన భాస్కర్ నాయుడు కూతురు హేమవతి అదేగ్రామానికి చెందిన దళితుడైన కేశవులును రెండేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు చంపేస్తామని బెదిరించడంతో ఆ దంపతులు బంధువులకు దూరంగా ఉంటూ కాపురం చేస్తున్నారు. వారంరోజుల క్రితం హేమవతి పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారు తిరిగి గ్రామంలోకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ నాయుడు కుటుంబం భరించలేకపోయింది. పుట్టిన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెల్లి వస్తుండగా అప్పటికే మాటువేసిన అమ్మాయి తరపు బంధువులు అడ్డుకున్నారు. ఆ పసికందును కేశవులుకు అప్పగించి.. హేమవతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని లాక్కెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాక తండ్రి భాస్కర్‌నాయుడు హేమవతిని చిత్రహింసలకు గురిచేశారు. సొంత కూతురని మరిచి గొంతుకు ఉరిబిగించి హతమార్చి.. పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. ఏడు రోజుల పసిపాప తల్లిలేని అనాధగా మిలిగింది. (చదవండి: చిత్తూరులో పరువు హత్య కలకలం) -
ప్రేమ జంటను గదిలో బంధించి..
అహ్మద్‌నగర్ : పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహ బంధంతో ఒక్కటైన ఓ జంటకు వారి కుటుంబ సభ్యులు నిప్పుపెట్టిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కాలిన గాయాలతో మహిళ పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, 40 శాతం కాలిన గాయాలతో బాధిత వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు. వేర్వేరు కులాలకు చెందిన మంగేష్ చంద్రకాంత్, రుక్మిణిలు పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు వారికి నిప్పంటించారు. అహ్మద్‌నగర్ జిల్లా నిగోజ్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న మంగేష్, రుక్మిణిని గత ఏడాది నవంబర్‌లో ఆమె తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 28న ఆమె తమ తల్లితండ్రులను కలుసుకునేందుకు నిగోజ్ గ్రామానికి రాగా, మే 1న ఆమెను తీసుకువెళ్లేందుకు మంగేష్ అక్కడికి చేరుకున్నారు. దీంతో యువతి తండ్రి రమా భారతీయ, ఆమె మేనమామ ఘన్‌శ్యామ్ ఇతర కుటుంబ సభ్యులు వారిని ఓ గదిలో బంధించి నిప్పుపెట్టారు. వారి అరుపులు విన్న స్ధానికులు వారిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
నేను చేసిన నేరం ఏంటి!?
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో పరువు హత్య కలకలం రేపింది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కారణంతో బాలాజీ అనే వ్యక్తి తన సోదరి భర్తను హత్య చేశాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... మహారాష్ట్రలోని తాల్కేడ్ గ్రామానికి చెందిన సుమిత్ శివాజీరావు అనే ఇంజనీరింగ్ విద్యార్థి తన కాలేజీమేట్ భాగ్యశ్రీతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో వీరి విషయం యువతి ఇంట్లో వాళ్లకు తెలియడంతో తమ కూతురికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కానీ కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఈ జంట పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుమిత్‌పై పగ పెంచుకున్న భాగ్యశ్రీ సోదరుడు బాలాజీ అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం పరీక్ష రాసి కాలేజీ బయటికి వచ్చిన సుమిత్‌ను నడిరోడ్డుపై నరికి చంపాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి కారులో పరారయ్యాడు. ఘటన జరిగిన సమయంలో భాగ్యశ్రీ సుమిత్ పక్కనే ఉంది. తన భర్తను కాపాడాల్సిందిగా చుట్టుపక్కల ఉన్న వారిని ప్రాధేయపడినా ఒక్కరు కూడా వారికి సాయం చేయలేదు. దీంతో రిక్షా వాలాను బతిమిలాడి భర్తను ఆస్పత్రికి తీసుకువెళ్లింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. నేను చేసిన నేరం ఏంటి..? తన భర్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భాగ్యశ్రీ డిమాండ్ చేసింది. ‘ నేను చేసిన నేరం ఏంటి? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? పోలీసులు నిందితుడిని త్వరగా పట్టుకుని నాకు న్యాయం చేయాలి. లేదంటే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటా’ అని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భాగ్యశ్రీ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉన్న కారణంగానే పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోతున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. -
ప్రాణం తీసిన ప్రేమ
-
ప్రేమించిందని ప్రాణాలు తీసిన తల్లిదండ్రులు
జైపూర్: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిందనే కారణంతో కని పెంచిన తల్లిదండ్రులే తమ కూతురికి నిప్పంటించి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్‌లోని జైపూర్‌కి సమీపంలోని ఫగీ గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన ఓ బాలుడ్ని ప్రేమించింది. ఇది సహించలేకపోయిన బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఆమెకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. అంతేకాకుండా తమ కూతురికి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్లే ఆత్మహత్యకు పాల్పండిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదుపై అనుమానం రావడంతో పోలీసులు ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణల సహాయంతో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు.. చివరకు అది ఆత్మహత్య కాదని నిర్ధారణకు వచ్చారు. తగిన ఆధారాలు సేకరించి బాలిక తల్లిదండ్రులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. ‘మా కూతురు ఓ వ్యక్తిని ప్రేమించడంతో.. గ్రామస్థులు తమ పెంపకం గురించి చాలా రకాలుగా మాట్లాడేవారు. దీంతో మా పరువు నిలుపుకోవడం కోసమే బాలికను హత్య చేశామ’ని బాలిక తల్లిదండ్రులు పోలీసుల విచారణలో తెలిపారు. -
కూతుర్ని,అల్లుడిని నమ్మించి నరికేశాడు
-
ఆవేశంతోనే నా కూతురిపై దాడి చేశా : మనోహరా చారి
సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్నదని సొంతకూతురిపై నగరం నడిబొడ్డున పట్టపగలు హత్యాయత్నం చేసిన మనోహరా చారి ఆవేశంతోనే ఈ పనిచేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మనోహరా చారి సాక్షితో మాట్లాడాడు. ‘నా కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆమె పెళ్లి చేసుకున్నప్పడి నుంచి మధ్యం తాగుతూనే ఉన్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు ఇలా ప్రేమ వివాహం చేసుకోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. నా కూతురికి రెండేళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వచ్చాను. అమీర్‌పేటలోని గోవింద్ నగల షాపులో పని చేస్తున్నాను. నాకు పని కల్పించింది నా బామ్మర్ధి’ అని చెప్పాడు. అతని కూతురే టార్గెట్: డీసీపీ వనోహరా చారి ప్రధాన టార్గెట్ అతని కూతురేనని, ఈ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీసీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వివరించారు. ‘ మధ్యాహ్నం మూడున్నర గంటలసమయంలో కూతురు మాధవితో పాటు సందీప్‌పై మనోహరా చారి కత్తితో దాడి చేశాడు. ప్రేమ పెళ్లిని సహించని అతను కక్ష్యతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మనోహరా చారి కూతురినే టార్గెట్ చేసి చంపాలని ప్లాన్ చేశాడు. సందీప్‌ను చంపాలనే ఉద్దేశం తనకు లేదని మనోహర్ చారి దర్యాప్తులో వెల్లడించాడు. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తండ్రి చేతిలో మాధవి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సందీప్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. మాధవి ప్రేమ వ్యవహారం తనకు తెలియకుండా అతని భార్యా, కొడుకు దాచారని మనోహర చారి విచారణలో చెప్పాడు. ప్రణాళిక ప్రకారమే కూతురుకు కాల్చేసి రమ్మని చెప్పాడు.’ అని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాని డీసీపీ పేర్కొన్నారు. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు ఈ నెల 12న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరవకముందే అదే తరహా ఘటన మరోకటి చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. -
హత్యాయత్నం చేసింది అమ్మాయి తండ్రే
-
హత్యాయత్నం చేసింది అమ్మాయి తండ్రే: సందీప్ బ్రదర్
సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై పట్టపగలే అమ్మాయి తండ్రి హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై సందీప్ సోదరుడు సతీష్ సాక్షితో మాట్లాడుతూ.. ‘అమ్మాయి తండ్రి ఫోన్ చేసి హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడిచేశాడు. కులాంతర వివాహం చేసుకున్నారని పగతోనే ఈ దాడి చేశాడు. మా అన్న పెళ్లి చేసుకొని ఐదు రోజులే అవుతోంది. పెళ్లి అయిన తరువాత వాళ్ల కుటుంబం వచ్చి మా పాపను మంచిగా చూసుకోండి అని చెప్పారు. మళ్లీ ఈరోజు అతను బాగా తాగి వచ్చి దాడి చేశాడు. రిసెఫ్షన్ చేస్తామని నమ్మించాడు. సందీప్ పరిస్థితి పరవాలేదు కానీ.. అమ్మాయి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఐదేళ్ల నుంచి వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. 10వ తరగతి నుంచే లవ్ చేసుకుంటున్నారు. మాది మాల కుటుంబం. అమ్మాయిది విశ్వబ్రాహ్మణ కులం. ఇద్దరు మేజర్లే. డ్రిగ్రీ పూర్తి చేశార’ని తెలిపాడు. ఇక మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన మరవక ముందే నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. -
వాళ్లే వీళ్లు
పేరుమోసిన ఉగ్రవాదులు అస్గర్ అలీ, అబ్దుల్ బారీలు నగరం కేంద్రంగా పలు నేర పూరిత చర్యలకు పాల్పడ్డారు. గతంలో వీరు గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యాను హత్య చేశారు. తాజాగా... రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యలోనూ పాలుపంచుకున్నారు. వీరు సుపారీ తీసుకుని మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకు కీలక సూత్రధారులుగా ఉన్న అస్గర్ అలీ, అబ్దుల్ బారీ సామాన్యులు కారు. అత్యంత దారుణమైన నేరచరిత్ర కలిగిన వీరిపై నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. మీర్జా ఎస్కేప్, భారీ పేలుళ్లకు కుట్ర తదితరాలు ఓ మచ్చుతునకలు మాత్రమే. వీరిద్దరూ గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్యా హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అప్పట్లో ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది సైతం అస్గర్ అని సీబీఐ ఆరోపించింది. ప్రణయ్‌ను హత్య చేయడానికి వీరు సుపారీ తీసుకున్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నల్లగొండ లోని దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్గర్ అలీకి జునైద్, అద్నాన్, చోటూ అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. కాశ్మీర్‌కు చెందిన ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రోద్భలంతో అక్కడకు వెళ్ళిన అస్ఘర్ ప్రాథమిక ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆపై అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిన ఇతగాడు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో తుపాకులు కాల్చడం నుంచి నుంచి ఆర్డీఎక్స్తో తయారు చేసిన బాంబులను పేల్చడం వరకు వివిధ రకాలైన శిక్షణలు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత నల్లగొండలోని ప్యార్ సూఖాబాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బారితో సహా మరికొందరితో ముఠా ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉండగా... బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’ అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను చాదర్‌ఘాట్‌లోని మహబూబ్ కాంప్లెక్స్ సమీపంలో, అదే ఏడాది ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. ఫసీ మాడ్యుల్ చేసిన ఈ దారుణాలకు మీర్జా ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్ బేగ్ సూత్రధారిగా, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇతడి పాత్ర దీనికి ముందూ అనేక కేసుల్లో ఉంది. పాపయ్య గౌడ్, నందరాజ్ గౌడ్లను హత్య చేసిన కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. ఇతడిని తప్పించడానికి పథకం వేసిన అస్గర్, బారీ తదితరులు 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి ఎస్కేప్ చేయించారు. అస్గర్ ఇతడిని తనకున్న పరిచయాల నేపథ్యంలో కాశ్మీర్‌కు పంపి ఉగ్రవాదులతో కలిసి పని చేసేలా చేశాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన కొన్ని రోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు. చాలాకాలం వరకు మీర్జాను ఎస్కేప్ చేసింది ఎవరనేది రహస్యంగానే ఉండిపోయింది. 1997 ఫిబ్రవరిలో అస్గర్, బారీ సహా పది మంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి నుంచి మూడు కేజీల ఆర్డీఎక్స్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్, 40 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి వచ్చినట్లు తేల్చారు. ఈ విచారణ నేపథ్యంలో మీర్జా ఎస్కేప్‌లోనూ అస్గర్ పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. 1999లో ఆజం ఘోరీ అనే ఉగ్రవాది (జగిత్యాలలో 2000 ఏప్రిల్ 6న ఎన్కౌంటర్ అయ్యాడు) ఇండియన్ ముస్లిమ్ మహ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అస్గర్ దీనికి సానుభూతిపరుడిగా మారి తనకంటూ ఓ ప్రత్యేక మాడ్యుల్ (గ్యాంగ్) ఏర్పాటు చేసుకున్నాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్పాండ్యాను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని మధ్యవర్తుల ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. బారీ తదితరులతో కలిసి రంగంలోకి దిగిన ఇతడు ఆ ఏడాది మార్చి 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్లి కాల్చి చంపాడు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్గర్ ఐదు రౌండ్లు పాండ్యాపై కాల్చడంతో ఆయన కన్నుమూశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్గర్, బారీలను పట్టుకున్నాయి. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిని కింది కోర్టు దోషులుగా తేల్చినా... గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వీగిపోవడంతో 2011లో బయటపడ్డారు. ఆ తర్వాత నగరంలో వీరిపై నమోదైన కేసుల్లో కొన్ని వీగిపోవడం, మరికొన్నింటిలో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత మలక్‌పేటలోని సలీమ్నగర్లో ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 2011 తర్వాత వీరి పేర్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రణయ్ హత్యకు సుపారీతో వెలుగులోకి రావడం, ఇద్దరినీ నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేయడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. -
ఇంకేం పరువు?
-
ప్రణయ్ హత్యకేసు దర్యాప్తు కొలిక్కి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు ఈ హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో సబంధం ఉన్న దాదాపు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ప్రధాన నింది తుడిగా భావిస్తున్న మారుతీరావు పోలీసులకు చిక్కడంతో ఈ కేసులో చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోయాయని చెబుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు మృతుడి కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారని సమాచారం. ప్రణయ్ భార్య అమృత, కుటుంబ సభ్యులు పలువురిపై ఆరోపణలు చేశారు. దీంతో అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆదివారం రాత్రి పొద్దుపోయే దాకా పోలీస్ అధికారులు ప్రణయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలిసింది. మారుతీరావుకు సన్నిహితుడిగా భావిస్తున్న సూర్యాపేటకు చెందిన ఓ న్యాయవాది, తాజా మాజీ ఎమ్మెల్యే పేర్లను అమృత పదేపదే ప్రస్తావించిన అంశాన్ని పోలీసులు సీరియస్‌గానే తీసుకున్నారు. మరోవైపు ఆమె తన తండ్రికి నయీం ముఠాతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం సంచలనం రేపింది. వీటన్నిటికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. హత్యకు పాల్పడింది బిహారీ! ప్రణయ్‌ను అంతమొందించేందుకు మారుతీరావు, మాజీ ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బారీ తన సహచరులను కాకుండా హైదరాబాద్‌లో ఉంటున్న ఒక బిహారీ వ్యక్తిని ఈ ఆపరేషన్‌కు వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. నేడు మీడియా ముందుకు నిందితులు ప్రణయ్ హత్య కేసు వివరాలతో మంగళవారం మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎస్పీ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించ నున్నారు. -
ప్రేమిస్తే చంపేస్తారా!.. ప్రతిధ్వనిస్తున్న ఆర్తనాదం!
‘ప్రేమిస్తే చంపేస్తారా!’ అంటూ ఒక యువతి చేసిన ఆర్తనాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... తెలుగువారున్న ప్రతి గడ్డపైనా ప్రతిధ్వనిస్తోంది. కొన్ని ఉదంతాలు మనం రోజూ చూస్తున్న సమాజంపై అపనమ్మకమూ, అవిశ్వాసమూ కలిగిస్తాయి. ఈ సమాజంలో ఇంత క్రౌర్యం, ఇంత రాక్షసం దాగున్నాయా అన్న దిగ్భ్రాంతిలో ముంచెత్తుతాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం పట్టపగలు చోటుచేసుకున్న దురంతం అటువంటిదే. ఒక్కగానొక్క కుమార్తెను ఎంతో అపురూపంగా చూసుకుని, ఆమె ఇష్టాయిష్టాలను అర్ధం చేసుకుని నెరవేర్చవలసిన కన్నతండ్రే కాలయముడిగా మారి ఆమె మనువాడినవాడిని మట్టుబెట్టిన ఉదంతమది. పట్టణంలో బాగా డబ్బు చేసిన రియల్ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు తన కుమార్తె అమృతవర్షిణితో ఆప్యాయత నటిస్తూనే అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకుడితో తుదముట్టించిన తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కంటతడి పెట్టించింది. పుట్టుకనుబట్టి ఎవరిపైనా వివక్ష చూపరాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ మన సమాజంలో అడుగడుగునా అది తారసపడుతూనే ఉంటుంది. కులాంతర వివాహాలు జరిగే సందర్భాల్లో అది మరింత వెర్రితలలు వేస్తోంది. ముఖ్యంగా అట్టడుగు కులాలకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇవి కులం పేరుతో, సంస్కృతి పేరుతో, వాటిని పరిరక్షించే సాకుతో సాగుతున్న హత్యలే అయినా వీటిని పరువు హత్యలనలేం. ఇవి ప్రపంచంలో మన సమాజం పరువు తీస్తున్న హత్యలు. వీటి మూలాలు నర నరానా ఆవరించిన కులోన్మాదంలో, ఆధిపత్య భావజాలంలో ఉన్నాయి. ఏటా వందలమంది బలవు తున్నా వీటిని నియంత్రించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. 2014–16 మధ్య ఈ మాదిరి హత్యలకు దేశంలో 356మంది ప్రాణాలు కోల్పోయారని మొన్న జూలైలో లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం చెప్పారు. ఈ జాబితాలోకి రాకుండా మరెం దరు బలయ్యారో ఊహించుకోవాల్సిందే. ఒకప్పుడు ఎక్కడో బిహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల్లో ఇవి జరిగాయని విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. వేరే కులానికి చెందినవాడిని పెళ్లాడిందన్న కక్షతో సొంత కూతుర్నే చంపుకుంటారా, అల్లుడిని హతమారు స్తారా అని విస్మయపడేవారు. ఇప్పుడు అవి అన్నిచోట్లా సాగుతూనే ఉన్నాయి. కనుకనే ప్రణయ్, అమృతలు వివాహం చేసుకున్నాక తమను ఆశ్రయించినప్పుడు పోలీసులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సింది. నల్లగొండ జిల్లా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఇలా ప్రేమ జంటల్ని ఇబ్బందులపాలు చేసిన ఉదంతాలు, హతమార్చిన ఉదంతాలు ఉన్నాయి. నయీం గ్యాంగ్‌తో మారుతీరావు బెదిరించాడని, ఒక ఎమ్మెల్యే ఫోన్‌చేసి ఆమెను తిరిగి తండ్రి దగ్గరకు పంపిం చకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడని కుటుంబసభ్యులు చెబు తున్నారు. కౌన్సెలింగ్ పేరిట రప్పించి కొంతమంది పోలీసు అధికారులే వేరుపడమని సలహా ఇచ్చే వారని వారి ఆరోపణ. తమకెలాంటి ముప్పు పొంచి ఉందో ప్రణయ్, అమృత జంటకు తెలుసు. దీనిపై తమ మధ్య ఎలాంటి సంభాషణ జరిగేదో అమృత వేర్వేరు చానెళ్లతో మాట్లాడిన సందర్భంలో వివరించింది. ఆఖరికి ఇక్క డినుంచి దూరంగా వెళ్లిపోవాలని కొందరు సలహా ఇచ్చినా అందువల్ల తమ కుటుంబసభ్యులు బలి కావాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రణయ్ దానికి అంగీకరించలేదని కూడా తెలిపింది. బహుశా ఈ విషయాలన్నీ వారు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చే ఉంటారు. వారు చెప్పకపో యినా నిరంతరం శాంతిభద్రతల వ్యవహారాల్లో తలమునకలయ్యేవారిగా ఆ అధికారులకు అర్ధమై ఉండాలి. వారికి వ్యక్తిగత భద్రత కల్పించాలి. కానీ ఆ పని జరగలేదు. పర్యవసానంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ జంట నిర్మించుకున్న అందమైన గూడు కూలిపోయింది. కొన్నేళ్లక్రితం సుప్రీంకోర్టే ఈ మాదిరి హత్యల విషయంలో కఠినంగా వ్యవహరించి, దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని తెలిపింది. కానీ పట్టించు కున్నవారేరి? అమృతవర్షిణి మాటలు ఆమె పరిణతిని పట్టిచూపుతున్నాయి. తోటి మనిషిని కుల చట్రంలో తప్ప చూడలేనివారు మనుషులెలా అవుతారని ప్రశ్నిస్తోంది. కోట్ల రూపాయల ఆస్తుల కన్నా మాన వీయ విలువలు ముఖ్యం కదా అంటున్నది. మెట్టినింటే ఉండి ప్రణయ్ ఆశయమైన కుల నిర్మూలనకు పాటు పడతానని ఆమె చెబుతోంది. రెండేళ్లక్రితం తమిళనాడులో సంచలనం రేపిన శంకర్ హత్యో దంతం ఈ సందర్భంలో ఎవరికైనా గుర్తుకురాకమానదు. తమిళనాడులోని ఉడుమల్పేట్ పట్టణంలో శంకర్‌ను తన తండ్రి కిరాయి ముఠాతో చంపించాక కౌసల్య అనే యువతి ఇదే తరహాలో పోరాడింది. ఆ హత్య కేసులో తండ్రితోసహా ఆరుగురికి మరణశిక్ష పడేలా చూడటమే కాదు... నిర్దోషిగా విడు దలైన తల్లికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, ఆమెకు సైతం శిక్ష పడాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లింది. విచారణ సమయంలో ఒకటి రెండుసార్లు తండ్రికి పెరోల్ అవకాశం లభించినా గట్టిగా వ్యతి రేకించి అది అమలు కాకుండా అడ్డుకుంది. కూలి పనిచేసుకుని పొట్టపోసుకునే శంకర్ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ పెరియార్ రామస్వామి స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం జరిగే ఉద్యమాల్లో పాలు పంచుకుంటోంది. ఇప్పుడు ఈ హత్యోదంతాన్ని లోతుగా దర్యాప్తు చేస్తామని, దోషులను వదిలిపెట్టబోమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మారుతీరావు ఆస్తులు పోగేసుకున్న వైనంపైనా దర్యాప్తు ఉంటుందంటున్నారు. ప్రణయ్ హత్య జరిగేవరకూ అతని అక్రమాలు పోలీసు, రెవెన్యూ యంత్రాం గాల దృష్టికి రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చర్య సంగతలా ఉంచి ఆ అక్రమాల సంగతి తెలిసి ఉంటే ఆయనెంతకు తెగించగలడో పోలీసులకు అర్ధమయ్యేది. ప్రణయ్, అమృత జంట క్షేమంగా ఉండగలిగేది. కనీసం దీన్నయినా గుణపాఠంగా తీసుకుని, అప్రమత్తతతో వ్యవహరించి కులోన్మాదా నికి మరే ప్రేమ జంటా బలి కాకుండా చూడటం ప్రభుత్వం కర్తవ్యం. -
ఫేస్బుక్ వేదికగా అమృత పోరాటం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి న్యాయం కోసం తన పోరాటాన్ని ప్రారంభించింది. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని.. ముఖ్యంగా ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే అమృత ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది. పురువు, కుల పిచ్చితో ప్రణయ్‌ను చంపిన అమృత తండ్రి మారుతీరావును, హత్యకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్, సుఫారీ కిల్లర్స్‌తో పాటు హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రణయ్‌ను చంపి.. పెంచుకున్న పరువేంటి?
పరువును చూసుకుని పిల్లలు ప్రేమించరు. ‘పరువు తీసే’ ప్రేమను పెద్దలు క్షమించరు. ప్రేమకు, పరువుకు మధ్య తీరని ఘర్షణ ఇది! తరతరాల సంఘర్షణ ఇది. పెద్దలూ ఒకప్పటి పిల్లలే కదా. ఈ నిజాన్ని గుర్తుకు తెచ్చుకుంటే.. ప్రేమ నేరం అవదు. పరువు గుర్తుకే రాదు. ‘‘అమృత వర్షిణి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ అమ్మాయి బాధ చూడలేకపోతున్నాం! దేవుడా.. ఇంత దారుణమా? కన్నబిడ్డల సంతోషం, సుఖం కంటే కావల్సిందేముంది? వాళ్లు ఆనందంగా కనపడుతున్నప్పుడు ‘‘కలకాలం ఇలాగే ఉండనీ’’ అని ఆశీర్వదించాలి. అంత పెద్ద మనసు లేకపోతే.. నోటికి అంత మంచి మాట రాకపోతే.. దూరంగా ఉండిపోవాలి. అంతేకాని ఉసురు తీస్తారా?’’ ఇలాగే బాధపడ్తారు.. ఆలోచిస్తారు స్పందించే గుణమున్న మనుషులైతే! (ప్రణయ్ – అమృత (ఫైల్‌ఫొటో) ) పిల్లలు ఎందుకు బలి కావాలి? అమృత వర్షిణి పెద్ద కులం (?) అమ్మాయి. ప్రణయ్.. తక్కువ కులం (?) అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు. ఈ అబ్బాయి వాళ్లదీ సౌకర్యవంతమైన జీవనశైలిలో ఉన్న కుటుంబమే. అబ్బాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కెనడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు కూడా. అయితే ఇవేవీ అమ్మాయి తల్లిదండ్రులకు కనిపించలేదు. ‘తక్కువ కులం’ అన్నదొక్కటే భూతద్దంలో కనిపించింది. అదీ పరువు అనే వృత్తంలో తిరుగుతూ! అదే వాళ్ల మెదడులోనూ గింగిరాలు కొట్టింది. అందుకే అదను కాచి కన్న బిడ్డ ఆనందాన్ని మింగేశారు. బిడ్డ భవిష్యత్తును మరిచి.. విచక్షణను కోల్పోయి అనాగరికంగా ప్రవర్తించారు. పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కన్నా సమాజం పెంచిన కులం, పరువే ముఖ్యమని చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుందాం తప్పు ఎవరిదో? అమృత వర్షిణికి కలిగించిన దుఃఖం, బాధ, వేదనలో మన పాలు ఎంత ఉందో? ప్రణయ్‌ను పోగొట్టుకున్న తల్లి శోకానికీ మనమెంత బాధ్యులమో? కులాన్ని సృష్టించి ఆ నియమంలో బతికితేనే పరువు అనే భ్రమకు రూపమిచ్చే పిచ్చి ప్రయత్నం చేస్తూ అదే నిజమని నమ్మే మనుషులతో సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది చిరంజీవిగా వర్థిల్లడానికి పిల్లల్ని బలిపెడుతూ వస్తున్నాం. ఇంకెన్ని? ఇంకెంత కాలం? మొన్ననే.. ఆగస్ట్ 23న అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయలక్ష్మిని సొంత తల్లిదండ్రులే హత్య చేశారు. అమ్మాయికి 27 ఏళ్లు. తాము ఉండే వాడకట్టులోనే ఉంటున్న సురేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. భద్రాచలంలో కాపురం పెట్టారు. సంతోషంగానే ఉంటున్నారు. ఒక బాబు కూడా పుట్టాడు. మూడేళ్లవాడయ్యాడు. ఆ అమ్మాయి మళ్లీ గర్భందాల్చింది. ఏడు నెలలు. ఈలోపు అత్తగారు పోయారని తెలిసి భర్త, పిల్లాడితో కలిసి నాలుగేళ్ల తర్వాత ఆ ఊళ్లోకి అడుగుపెట్టింది. కూతురు వచ్చిన విషయం తెలుసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు ఆమె రాను మొర్రో అని అంటున్నా వినకుండా. తర్వాత ఆ అమ్మాయి అదే ఇంట్లో శవమై కనిపించింది. కూతురి పెళ్లయి నాలుగేళ్లు గడిచినా వాళ్ల కోపం పోలేదు. ఓ బిడ్డను, ఇంకో బిడ్డను కడుపులో మోస్తున్నా ఆ తల్లి మీద దయ రాలేదు. పరువు కోసం కన్న పేగును కోసేసుకున్నారు. 2017లో.. మార్చి నెలలో తెలంగాణ, పెద్దపల్లికి చెందిన మంథని మధుకర్ అనే దళిత యువకుడిని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి తరపు బంధువులు అతనిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత అదే యేడు యాదాద్రి జిల్లాకు చెందిన నరేష్, స్వప్నలూ చనిపోయారు. స్వప్న పెద్ద కులస్తురాలు. వాళ్లకన్నా తక్కువ కులానికి చెందిన నరేష్‌ను ప్రేమించి, పెళ్లిచేసుకుందనే కోపంతో స్వప్న తండ్రి ఓ పథకం ప్రకారం ముందు నరేష్‌ను హత్య చేయించాడు. తర్వాత స్వప్న పుట్టింట్లోనే.. బాత్రూమ్లో ఉరేసుకుని శవంగా కనిపించింది. అయితే పెళ్లయ్యాక ఈ జంట షోలాపూర్‌లో కాపురముంటుంటే.. స్వప్నను ముందు ఇంటికి తెచ్చి.. తర్వాత నరేష్‌ను హత్య చేయించారు. పెద్దల పట్టింపు, మూర్ఖపు పట్టుదలలు పిల్లలను హత్యచేశాయి. హత్య చేయడం పరువా?! : సుప్రీం కోర్టు ఇవి యేడాది కిందటివి. అంతకుముందూ హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశానికే పరిమితం అనుకున్న పరువు హత్యలు మనకూ వ్యాపించాయి అంటు వ్యాధిలా. 2014 చివర నుంచి 2017 దాకా అంటే ఆ రెండున్నరేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 పరువు హత్యలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కులాంతర వివాహానికి సంబంధించినవే. 2014– 2015 నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం హానర్ కిల్లింగ్స్‌లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతున్న వీటి సంఖ్యను చూసి అదిరిపడ్డ సుప్రీంకోర్టు 2006లో ‘‘ హత్య చేయడంలో పరువు ఎక్కడుంది? హేయంగా, దారుణంగా, ఘోరంగా, అమానుషంగా చేసే ఈ హత్యల వెనక రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వం తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి చర్యలకు ఒడిగట్టేవాళ్లు కఠిన శిక్షకు అర్హులు’’ అంటూ తీర్పునిచ్చింది. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే అంతటి తీర్పునిచ్చినా భయపడట్లేదు. పరువు హత్యలు ఆగలేదు. అంటే అర్థమైంది కదా.. కులం ఎంత బలమైందో. అది పెంచి పోషిస్తున్న పరువు ఎంతటికి తెగిస్తుందో? లేనిది వచ్చిందా? ఉంటే పెరిగిందా? ఒకమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి మనసులు కలవాలి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా కలిసి బతకగలమనే ధైర్యం ఉండాలి. బ్యాలెన్స్ చేసుకోగల సత్తా ఉండాలి. వీటిల్లో కులం ప్రాధాన్యం ఎక్కడ ఉంది? దాని ప్రస్తావన ఎందుకు? కాపురానికి కులం అక్కర్లేనప్పుడు దాన్ని అంటుకుని ఉన్న పరువు గురించి ఎందుకు అంత గింజుకులాట? అమృత విషయంలోనే వాళ్ల నాన్న మారుతీరావును తీసుకుంటే.. ప్రణయ్‌ను చంపకముందు వరకు మారుతీరావు ఎవరో మిర్యాలగూడలో కొంతమందికి తప్ప తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర ప్రాంతాల వారికెవరికీ తెలియదు. అమృత, ప్రణయ్‌లు పెళ్లి చేసుకున్నాక కూడా కొంతమంది ఎవరైనా మాట్లాడుకుని ఉంటారేమో కాని అదేమాటతో మొన్నటి వరకూ ఆ ఎవరూ రామకోటి రాసి ఉండరు. ఎవరూ పట్టించుకోని, ఎవరి ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో లేని, నిలబడని మారుతీరావుకు పరువు ఎక్కడినుంచి వచ్చింది? ప్రాణం తీసేంతగా ఎందుకు పగను పెంచింది? ప్రణయ్‌ను చంపి ఆయన పెంచుకున్న పరువేంటి? అసలు కులమంటే ఏంటి? మానవత్వాన్ని మించిందా? అమృత ప్రశ్న కూడా ఇదే! దేశమంతా అభిమానులున్న రజనీకాంత్, జగపతిబాబు, సల్మాన్‌ఖాన్ లాంటి ఎందరో సెలబ్రిటీలే కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా తమ పిల్లలకు వాళ్లు కోరుకున్న వ్యక్తులతో మూడుముళ్లు వేయిస్తుంటే వాడకట్టులో పట్టుమని పదిమందికి తెలియని మనకెందుకు ఇంత పరువు, ప్రతిష్టల పెనుగులాట? పిల్లలనే చంపుకునేంత మూర్ఖపుబాట? పిల్లలకు పెద్దల నుంచి మేమున్నామనే భరోసా కావాలి. భయపడితే వెన్నుతట్టి గుండెల్లో దాచుకోవాల్సినవాళ్లం.. పిల్లలను భయపెట్టి పొట్టలో పొడుస్తున్నాం. రేప్పొద్దున మన పిల్లలు మనల్ని నమ్మకుండా చేసుకుంటున్నాం. పెద్దలూ ఆలోచించండి. – సరస్వతి రమ ఏ తప్పు చేశారనీ... ఈ పిల్లలు ఏ తప్పు చేశారనీ వాళ్లకు ఈ శిక్ష? ‘‘కులమేంటి? మానవత్వం కంటే ఎక్కువా? కులం కోసం మా నాన్న చేసిన పనేంటి?’’ అని ఆమృత ప్రశ్నిస్తోంది. రానురాను కులం, మతం అంతరించాలి కాని ఇప్పుడవే ప్రధానంగా మారుతున్నాయి. ఈ ధోరణి పోవాలి. – భండారు విజయ, ప్రరవే జాతీయ సమన్వయకర్త -
ప్రణయ్‌కి కన్నీటి వీడ్కోలు
సాక్షి, మిర్యాలగూడ : కుల అహంకారానికి బలైన పెరుమాళ్ల ప్రణయ్‌కి పట్టణ ప్రజలు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్ నుంచి ప్రణయ్ సోదరుడు అజయ్ వచ్చిన వెంటనే అంతిమయాత్ర ప్రారంభించారు. అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రణయ్ భార్య అమృత, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రణయ్ భౌతికకాయనికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. ప్రణయ్ భార్య అమృత, అతని కుటుంబం సభ్యులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అమృత కన్నీరుమున్నీరుగా విలపించింది. మొన్నటి వరకు తనకు అండగా ఉన్న ప్రణయ్ ఇప్పడు విగతజీవిగా ఉండడాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి పెళ్లాడిన వాడు నూరేళ్లు అండగా ఉంటాడనుకున్న వాడి ఆయుష్షును తండ్రే తీయడంతో అమృత శోకసంద్రంలో మునిగిపోయింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ప్రణయ్ సోదరుడు అజయ్.. తన అన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. (చదవండి: జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు) అంతిమ యాత్రకు భారీ బందోబస్తు పరువు హత్యకు గురైన ప్రణయ్ అంతిమయాత్ర పోలీసుల భారీ బందోబస్తు నడుమ నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు జిల్లా కేంద్రం నుంచి భారీగా పోలీసు బలగాలను రప్పించారు. నల్లగొండ, మిర్యాలగూడ డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. చదవండి: ప్రణయ్ హత్యపై స్పందించిన కేటీఆర్ -
ప్రణయ్ హత్యపై స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు, అతని భార్య అమృతకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘ప్రణయ్ దారుణ హత్య తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. సమాజంలో కులతత్వం ఇంత బలంగా నాటుకుపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షపడుతోంది. బాధిత కుటంబానికి న్యాయం లభిస్తోంది. ప్రణయ్ భార్య అమృత గారికి, అతని తల్లితండ్రులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్ అనే వ్యక్తి మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌లతో పాటు సుఫారీ కిల్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Pranay’s gruesome murder in Miryalaguda has come as a rude shock. Dismayed & anguished on how deep rooted casteism still is The perpetrators of this heinous crime will be punished & justice will prevail My condolences & wholehearted sympathies to his wife Amrutha Garu & parents — KTR (@KTRTRS) September 16, 2018 -
ఇలాంటి సైకిక్ తండ్రిని ఎక్కడా చూడలేదు
-
జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు
సాక్షి, మిర్యాలగూడ : ఇలాంటి సైకిక్ తండ్రిని తన జీవితంలో ఎక్కడా చూడలేదని, అతను జైల్లోనే చచ్చిపోవాలని ప్రణయ్ సోదరుడు అజయ్ కన్నీమున్నీరయ్యాడు. బయటకు వస్తే మారుతీరావును జనాలే చంపుతారని హెచ్చరించాడు. తమ కుటుంబం చంపదని, జనాలే చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన అజయ్.. సోదరుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. ఇటీవల రాఖీ పౌర్ణమి రోజు సొంతూరికి వచ్చాడని, ఈ సందర్భంగా అమృత రాఖీ కట్టిందని గుర్తు చేసుకుంటూ ప్రణయ్ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. మరికాసేపట్లో ప్రణయ్ అంత్యక్రియలు ప్రారంభకానున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనడానికి భారీ ఎత్తున్న ప్రజాసంఘాల నేతలు, కులసంఘాలు నేతలు, ప్రణయ్ స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్‌ను పట్టపగలు దారుణంగా కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. ప్రణయ్ హత్యకేసులో మరో కోణం.. ప్రణయ్‌హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మారుతీరావు ప్రణయ్‌ను హత్య చేసేందుకు నల్గొండకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ బారీకి సుఫారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోటి రూపాయలకు కాంట్రాక్ట్ మాట్లాడుకుని అడ్వాన్స్ కింద రూ. 50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే గతంలో మారుతీరావును మహమ్మద్ బారీ కిడ్నాప్ చేసాడని, అప్పటి పరిచయంతోనే ప్రణయ్ హత్యకు సుఫారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహమ్మద్ బారీ పాతబస్తీలో ఉంటున్నాడని, తన అనుచరులతోనే పథకం ప్రకారం ప్రణయ్‌ను హత్య చేయించినట్లు సమాచారం. మహమ్మద్ బారీ అనుచరుడు షఫీయే ప్రణయ్‌ను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సుఫారీ కిల్లర్స్‌కు ఓ కాంగ్రెస్ నేత షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. -
తనను చంపేస్తారని తెలిసికూడా...!
-
ప్రణయ్ లైఫ్ పోయింది కానీ.. : అమృత
సాక్షి, నల్గొండ : పరువు కోసం తన భర్తను హత్య చేయించిన తండ్రి స్టేటస్ పోయిందని, అదే సమయంలో ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు ప్రణయ్ వ్యాల్యూ ఎంతో పెరిగిందని భార్య అమృత వర్షిణి పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘పరువు పిచ్చి, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదు. అలాంటి వాళ్లను క్షమించి వదిలేస్తారని నేను అనుకోవటం లేదు. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేయటానికి.. ముఖ్యంగా ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేయటానికి నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రణయ్ నన్ను స్ట్రాంగ్‌గా ఉండమని చెబుతూ ఉండేవాడు. తనను చంపేస్తారని తెలిసికూడా.. కొద్దిరోజులైనా నీతో కలిసి ఉండొచ్చు కదా! అని అన్నాడు. తనెప్పుడు డేరింగ్‌గానే ఉండేవాడు. ప్రణయ్ లాగే ఉందామనుకుంటున్నాను. అత్తగారింట్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ప్రణయ్ బేబీకి జన్మనిచ్చి తనలో ప్రణయ్‌ని చూసుకుంటాను. మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహం పెట్టాలి. ఎవరెవరివో పెడుతున్నారు. చనిపోతానని తెలిసి కూడా ప్రేమ కోసం తన ప్రాణాలు వదిలాడు. ఒక వేళ ప్రణయ్ గాయాలతో బయటపడి బతికుంటే నా గురించే ఆలోచించేవాడ’’ని తెలిపింది. -
నాన్నే విలన్
-
కూతురికన్నా సోసైటిలో పరువే ఎక్కువా
-
‘ప్రణయ్‌ని చంపించినందుకు బాధలేదు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు అమ్మాయి తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్‌లతోపాటు ఇద్దరు సుఫారీ కిల్లర్లను శనివారం నగరంలోని కొత్తపేటలో అదుపులోకి తీసుకున్నారు. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్ అనే వ్యక్తి మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. (చదవండి: ప్లీజ్.. ప్రణయ్ దగ్గరికి తీసుకువెళ్లండి) ప్రణయ్‌ను చంపించినందుకు తనకేం బాధలేదని అమృత తండ్రి మారుతీరావు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ‘తన కూతురిపై ప్రేమతో ప్రణయ్‌ను హత్యచేయించా. కూతురికన్నా సోసైటిలో తన పరువే ఎక్కువ అనుకున్నా. 9వ తరగతిలోనే ప్రణయ్-అమృతల ప్రేమ వ్యవహారం తెలుసు. అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చా. ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్ వినలేదు. దీంతోనే ప్రణయ్‌ను హత్యచేసేందుకు రూ.10 లక్షల సుఫారీ ఇచ్చాను. తొలుత రూ. 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాను. ప్రణయ్ కోసం సుఫారీ గ్యాంగ్ రెండు నెలలుగా రెక్కీ నిర్వహించింది. తన కూతురికి ఎలాంటి హానీ తలపెట్టొద్దని వారికి సూచించాను. జైలుకు వెళ్లడానికి సిద్దపడే ఈ ప్లాన్ వేసాను.’ అని మారుతీరావు పోలీసు విచారణలో తెలిపాడు. సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ సరిహద్దులో ఉన్న జిల్లాకి చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. గర్భవతి అయిన అమృతకు అబార్షన్ చేయాలని మారుతీరావు డాక్టర్ జ్యోతిని కోరినట్లు తెలుస్తోంది. అబార్షన్ చేస్తే ఎన్నిలక్షలైనా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు కూడా సమాచారం. చదవండి: ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం -
నిందితులను కఠినంగా శిక్షించాలి
-
యువకుడి దారుణ హత్య..?
ప్రశాంతంగా ఉండే డెంకాడ మండలం ఉలిక్కిపడింది. పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేట సమీపంలో ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. మృతుడి తలపై తీవ్రగాయాలు ఉండడంతో ఎవరో హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగకపోవడం.. ఒక్కసారిగా హత్య జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయనగరం / డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ ఊడికిలపేట గ్రామ సమీపంలో విజయనగరం–కుమిలి ఆర్అండ్బీ రహదారికి ఆనుకుని ఉన్న ఒక లే అవుట్‌కు వెళ్లే దారిలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉంది. దీంతో సమీప గ్రామప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ మృతదేహాన్ని నెల్లిమర్ల మండలం సతివాడ పంచాయతీ పరిధిలోని ముల్లుపేట గ్రామానికి చెందిన ఆబోతుల శ్రీరామ్(32)దిగా గుర్తిం చారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సతివాడ పంచాయతీ ముల్లుపేట గ్రామానికి చెందిన ఆబోతుల శ్రీరామ్ ఈనెల 12వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సతివాడ కూడలిలో స్నేహితులతో కలిసి ఉన్నారు. అక్కడకు కొద్ది సేపటికి బయటకు వెళ్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిపోయాడు. సమయం మించినా భర్త ఇంటికి చేరుకోకపోవడంతో శ్రీరామ్ భార్య కాంతమ్మ రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేయగా, పనిపై విజయనగరానికి వచ్చానని శ్రీరామ్ బదులిచ్చాడు. అయితే ఫోన్ చేసి గంట దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో భార్య కాంతమ్మ శ్రీరామ్‌కు మళ్లీ ఫోన్ చేసింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీరామ్ లిఫ్ట్ చేయలేదు. మరుచటి రోజు పోలీసులు ఫోన్ చేసి పెదతాడివాడలోని ఊడికిలపేట సమీపంలో శ్రీరామ్ శవమై పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భా ర్య తోపాటు ఇద్దరు పిల్లలు చందన (5), ప్రమీల (3) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు.. శ్రీరామ్ మృతదేహాన్ని విజయనగరం డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, డెంకాడ ఇన్చార్జ్ ఎస్సై ఉపేంద్ర పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించి వివరాలు ఆరా తీశారు. మృతుడి తలపై తీవ్ర గాయం ఉండడం.. ద్విచక్ర వాహనానికి దూరంగా మృతదేహం పడి ఉండడాన్ని చూస్తుంటే ఎవరో కావాలనే హత్యచేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఆటో డ్రైవర్ మృతుడు శ్రీరామ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ పైడిభీమవరం ప్రాంతంలో ఉన్న కెమికల్ కంపెనీలకు కూలీలను తీసుకువెళ్తుంటాడు. అలాగే ఆయా కంపెనీల్లోని కాంట్రాక్టర్లకు లేబర్ మేస్త్రీగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఎవరితోనైనా విబేధాలు చోటుచేసుకోవడం వల్ల హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
‘నయీం బ్యాచ్‌తో నా భర్తను హత్య చేయించారు’
సాక్షి, మిర్యాలగూడ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు ప్రణయ్ భార్య అమృత మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. తన తండ్రి, బాబాయ్‌లే నయీం బ్యాచ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించారని ఆమె ఆరోపించారు. తన భర్తను పొట్టబెట్టుకున్న పుట్టింటివైపు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రణయ్ హత్య జరగగానే తండ్రికి ఫోన్ చేశానని, తన మాటలు వినపడటం లేదంటూ ఆయన ఫోన్ కట్ చేశారని అమృత తెలిపారు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి.. ప్రణయ్ ఆస్పత్రిలో ఉన్నాడని చెబితే తనని అక్కడికి వెళ్లమని చెప్పాడని పేర్కొన్నారు. తాను, ప్రణయ్, ప్రణయ్ వాళ్ల అమ్మ ఆస్పత్రికి వెళ్లామని.. బయటికి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన భర్తపై దాడి చేసి చంపేశాడని తెలిపారు. ఈ విషయం గురించి డీఎస్పీకి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయ్ డంబెల్‌తో కొట్టేవారు.. ప్రణయ్ తాను చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నామని చెప్పిన అమృత.. భర్త అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ప్రణయ్‌ను ప్రేమిస్తునాన్నని తెలుసుకున్న బాబాయ్ తనను డంబెల్‌తో కొడుతూ.. కిందపడేసి తన్నేవాడని తెలిపారు. ప్రణయ్‌తో మాట్లాడితే తనను చంపేస్తానని తండ్రి బెదిరించేవాడని అమృత గుర్తు చేసుకున్నారు. తన భర్తను చంపేస్తేనైనా పుట్టింటికి వెళ్తానని భావించారని.. కానీ ఎప్పటికీ అలా జరగదని విలపించారు. గర్భవతినని అమ్మకు చెప్పొద్దన్నాడు.. తాను ప్రస్తుతం ఐదు నెలల గర్భవతినని అమృత తెలిపారు. ఈ విషయం గురించి నాన్నకు చెబితే.. అమ్మకు తెలీనివ్వకూడదంటూ తనను బెదిరించారన్నారు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. కానీ రెండు నెలల క్రితమే తన తల్లికి ఈ విషయం చెప్పానని అప్పటి నుంచి అప్పుడప్పుడూ ఆమె ఫోన్లో మాట్లాడుతుండేదని అమృత తెలిపారు. -
ఆ వీడియోకే ఎక్కువ హిట్స్: అమృత తండ్రి బెదిరింపు
సాక్షి, మిర్యాలగూడ : అమృత ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదం పలువుర్ని కలచివేస్తోంది. పథకం ప్రకారం అమృత తండ్రి, ఆమె బాబాయి కలిసి ఆమె భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించడం కలకలం రేపింది. పరువు కోసం పగబట్టిన తండ్రి అనుక్షణం నిఘాపెట్టి, చివరికి అన్నంత పనిచేశాడు. ప్రేమిస్తే తప్పా.. అంటూ ఆసుపత్రిలో గుండెలవిసేలా రోదిస్తున్న అమృత వర్షిణి వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హత్యకేసులో అనేక కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫేస్బుక్లో అమృత పోస్ట్ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత అమృత ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె తండ్రి మారుతీరావు నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయంటూ అమృతను హెచ్చరించాడని ఆమె ఆరోపించారు. మొదట తాము కూడా పెళ్లికి నిరాకరించామని, అయితే ప్రణయ్ లేకపోతే చచ్చిపోతానని అమృత స్పష్టం చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్ కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే అమృత తల్లికాబోతోందని తెలిసి ఆగస్ట్ 17న రిసెప్షన్ నిర్వహించినట్టు తెలిపారు. తాము భయపడినట్టుగానే ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడితో కిరాయి హంతకులతో ఈ పని చేయించారని ఆరోపించారు. అగ్రకుల అహంకారంతో పథకం ప్రకారం నమ్మించి, గొంతుకోసారని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడుతున్నాయి. -
నా కళ్ల ముందే కొట్టి చంపేశారు
-
ప్లీజ్.. ప్రణయ్ దగ్గరికి తీసుకువెళ్లండి
పెళ్లికి కావాల్సింది రెండు మనసుల కలయికే కానీ కులాలతో సంబంధం లేదనుకుంది. అందుకే పెద్దల అంగీకారం లేకుండానే మనసిచ్చిన వ్యక్తిని వివాహమాడింది. కొన్నాళ్లు గడిస్తే తల్లిదండ్రులే తమను చేరదీస్తారని భావించింది. అనుకున్నట్లుగానే తండ్రి ఫోన్ చేయడంతో.. తాము ఇక సంతోషంగా ఉండవచ్చని అనుకుంది. కానీ అదంతా నాటకంలో భాగమని ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే పరువు కోసం పాకులాడే తండ్రి దుర్మార్గానికి భర్త బలైపోవడంతో తట్టుకోలేకపోతోంది. సాక్షి, మిర్యాలగూడ : ‘నా కళ్ల ముందే కొట్టి చంపేశారు అంకుల్.. ప్రణయ్‌ని ఆ పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. జీవితాంతం హ్యాపీగా ఉందామనుకున్నాం. కానీ..... ప్లీజ్ అంకుల్ నేను ప్రణయ్‌ను చూస్తా. నన్ను తన దగ్గరికి తీసుకువెళ్లండి. అంకుల్ ప్లీజ్.. ప్రణయ్‌ని చూడకపోతే ఎట్లా.. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. ప్రణయ్‌ను నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంకుల్’ అంటూ పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి కంటతడి పెట్టిన తీరు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. భర్త ప్రేమకు గుర్తుగా తన బేబీని పెంచుకుంటానంటూ ఐదు నెలల గర్భిణి అమృత విలపించిన తీరు అందరితో కంటతడి పెట్టిస్తోంది. గర్భిణి అయిన కారణంగా ఆమెను రెస్టు తీసుకోవాల్సిందిగా కోరిన వైద్యురాలు, గుత్తా సుఖేందర్ రెడ్డితో అమృత మాట్లాడిన మాటలు ఇవి.(చదవండి: ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం) కాగా అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్‌లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు.(చదవండి: పరువు హత్య; సంచలన విషయాలు) -
ప్రణయ్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
-
పరువు హత్య; సంచలన విషయాలు
సాక్షి, మిర్యాలగూడ: తెలంగాణలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. పెరుమాళ్ల ప్రణయ్‌ను హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్ హైదరాబాద్ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే నల్లగొండ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సివుంది. ప్రణయ్‌ను హత్యకు అరగంట ముందు వీరు మిర్యాలగూడ వదిలివెళ్లిపోయారు. (ప్రాథమిక కథనం: హైదరాబాద్ వైపుగా నిందితుడు!) మరోవైపు ప్రణయ్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రణయ్, అమృత ఏడాది క్రితమే పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అమృతకు మైనార్టీ తీరకపోవడంతో వీరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం అమృతకు మైనార్టీ తీరడంతో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. కొంత కాలం అక్కడే ఉండి తర్వాత మిర్యాలగూడకు వచ్చారు. కాగా పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలసి తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు ప్రణయ్‌ను చంపేస్తానని పెద్ద మనుషులందరీ ముందు మారుతీరావు బెదిరించాడు. ఈ నేపథ్యంలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. కిరాయి హంతకుడితో అతడే ఈ హత్య చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్పత్రిలో అమృత ఐదో నెల గర్భంతో ఉన్న అమృత ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని డాక్టర్ జ్యోతి తెలిపారు. తన ఆస్పత్రి ముందే ప్రణయ్ హత్యకు గురయ్యాడని, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. భర్త చనిపోయిన విషయాన్ని అమృతకు చెప్పానని, ఆమెకు రక్తపోటు ఎక్కువగా ఉందని తెలిపారు. పాలీహౌస్, డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నట్టు ప్రణయ్ తనతో చెప్పాడని, విదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు వెల్లడించాడన్నారు. రేపు అంత్యక్రియలు ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశముంది. అతడి సోదరుడు విదేశాల నుంచి రావాల్సివుంది. మరోవైపు ప్రణయ్ ఇంటికి దళిత సంఘాల నాయకులు, రాజకీయలు నేతలు పోటెత్తారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితరులు శనివారం ప్రణయ్ ఇంటికి వచ్చి అతడి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రణయ్ హత్యకు నిరసరగా మిర్యాలగూడలో దళిత సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. -
ప్రేమ వ్యవహారం : సోదరిని దారుణంగా..
లక్నో : ప్రేమ పెళ్లి చేసుకుని, కుటుంబ పరువు మంటకలిపిందని భావించిన ఓ వ్యక్తి సోదరి తల నరికి హతమార్చాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ యూపీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మీరట్‌కు చెందిన గుల్ఫాసాన్ అనే యువతికి తమ కాలనీలో ఉండే అబిద్ అనే వ్యక్తితో సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుల్పాసాన్ కుటుంబ సభ్యులు అబిద్‌కు దూరంగా ఉండాలని పలుమార్లు హెచ్చరించి, ఆమెను ఒక గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న అబిద్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెను తీసుకువెళ్లాడు. స్నేహితుల సాయంతో రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న గుల్పాసాన్పై ద్వేషం పెంచుకున్న ఆమె సోదరుడు మహ్మద్.. ‘ఎప్పటికైనా నా చెల్లి తల నరికి తీసుకొస్తానంటూ’ ఇరుగుపొరుగు వారికి చెప్పేవాడు. ఈ క్రమంలో సోదిరి ఇంటికి వెళ్లి తండ్రికి అనారోగ్యంగా ఉందని, వెంటనే నిన్ను చూడాలంటున్నారని చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు. ఇదంతా నిజమని నమ్మిన గుల్పాసాన్ పుట్టింటికి వచ్చింది. ఆమె ఇంటికి చేరుకోగానే వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే కత్తితో తల నరికేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు తీసింది అందుకే.. విచారణలో భాగంగా.. సోదరిని హత్య చేసినందుకు మహ్మద్ కొంచెం కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని, కుటుంబం పరువు తీసే ప్రతీ ఒక్కరికీ ఇదే గతి పడుతుందని తెలియజేయటానికే తాను ఇలా చేశానని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కొడుకు హత్య.. మతసామరస్యం చాటాడు
సాక్షి, న్యూఢిల్లీ : కోపాలు, ద్వేషాలు మనుషుల మనస్తత్వాలకు చెందినవని, మంచి చేయమని మాత్రమే మతం చెబుతుందని మరోసారి రుజువైంది. ఢిల్లీకి చెందిన ఓ హిందువు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మత సామరస్యాన్ని చాటిచెప్పారు. ఇందులో పెద్ద విశేషమేముందని మీరు అనుకోవచ్చు.. కానీ తన ఒక్కగానొక్క కొడుకు మరణానికి కారణమైన మతస్తుల పట్ల తనకు ఎటువంటి కోపం లేదని, శాంతిని పెంపొందిచడమే తన లక్ష్యమని నిరూపించేందుకే ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ముస్లిం యువతిని ప్రేమించాడనే కారణంగా అంకిత్ సక్సేనా అనే 23 ఏళ్ల హిందూ యువకుడు నాలుగు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన అంకిత్ హత్య కేసును పరువు హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అంకిత్ సక్సేనా తండ్రి యశ్పాల్ ఇఫ్తార్ విందు ఏర్ఫాటు చేయడం మంచి పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు. శాంతికి, సహనానికి చిహ్నంగా.. కుమారున్ని కోల్పోయిన దుఃఖంలో తనకు స్నేహితుడు మహమ్మద్ ఇజార్ ఆలం మాటలతో ఊరట కల్పించారని యశ్పాల్ వ్యాఖ్యానించారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనే తన ఆలోచనను ఆలంతో పంచుకున్నపుడు ఆయన అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చా రని తెలిపారు. ఆలంతో పాటు ఇరుగుపొరుగు వారు (హిందూ, ముస్లింలు) కూడా ఇఫ్తార్ విందు ఏర్పాట్లలో పాల్గొని శాంతికి, సహనానికి ప్రతీకగా నిలిచారన్నారన్నారు. అంకిత్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్ మందార్, గోరఖ్‌పూర్ డాక్టర్ కఫీల్ ఖాన్ కూడా హాజరయ్యారు. వారిని ఉరితీయాలి.. తన కుమారుడిని దారుణంగా హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు యశ్పాల్ తెలిపారు. అంకిత్‌ను హత్య చేసిన వారిపైన మాత్రమే తన కోపం తప్ప వారి మతానికి చెందిన వారందరినీ ఒకేలా చూడడం, వారిపై కక్ష పెంచుకోవడం మూర్ఖమైన చర్యగా భావిస్తానన్నారు. తన కుమారుడు మరణించినప్పటికీ అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, శాంతిని పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడమే తన ముందున్న లక్ష్యమని యశ్పాల్ చెప్పారు. ఇఫ్తార్ అంటే ఏమిటో తెలీదు.. యశ్పాల్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన పుష్పా ఓత్వాల్ అనే మహిళ అంకిత్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అంకిత్ హత్యకు గురవడం తమను కలచివేసిందన్నారు. తన జీవితంలో ఇంతవరకు ఇఫ్తార్ విందుకు వెళ్లలేదని, కానీ యశ్పాల్ విందుకు రావాలంటూ పిలిచినపుడు ఇఫ్తార్ గురించి తనకు అర్థమయ్యేలా చెప్పారన్నారు. మానవత్వానికి ఇదొక ఉదాహరణ.. ‘మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పే సంఘటన ఇది. మాలో చాలా మంది ఉపవాసం ఉండలేదు. కానీ అందరం కలిసి ఇలా విందులో పాల్గొనడం చక్కని సందేశాన్నిస్తుంది. సౌభ్రాతృత్వ భావనను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని’ హర్ష్ మందార్ వ్యాఖ్యానించారు. -
కేరళలో నవవరుడు దారుణ హత్య
-
కేరళలో పరువు హత్య కలకలం
సాక్షి, తిరువనంతపురం : కేరళలో నవవరుడిని భార్య తరపు బంధువులు కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేశారు. మన్ననం వద్ద కొత్తగా పెళ్లయిన కెవిన్ పీ జోసెఫ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చి తెన్మెల ప్రాంతం వద్ద మృతదేహాన్ని పడవేశారని సోమవారం పోలీసులు వెల్లడించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దారుణ ఘటన చోటుచేసుకుందని జోసెఫ్ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బాధితుడి భార్య తొలుత ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. కెవిన్‌తో పాటు అతని బంధువు అనీష్నూ కిడ్నాప్ చేశారని..తీవ్రంగా హింసించిన అనంతరం అతడిని విడిచిపెట్టారని పోలీసులు చెప్పారు. గాయాలతో ప్రస్తుతం అనీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కెవిన్ ఇటీవల ఎత్తుమన్నూర్లోని రిజిస్ర్టార్ ఆఫీస్‌లో ఓ మహిళను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో సంప్రదింపులు జరిగిన మీదట భర్తతోకలిసివెళ్లేందుకే యువతి మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలోనే నవవరుడి హత్య జరగడంతో పరువు హత్యగా భావిస్తున్నారు. మూడు వారాల్లోగా ఈ హత్యపై నివేదిక సమర్పించాలని కేరళ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. మరోవైపు కెవిన్ జోసెఫ్ హత్యను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)చే దర్యాప్తు జరిపించనున్నట్టు ఆయన ప్రకటించారు. -
కర్నూలు జిల్లాలో పరువు హత్య!
ఆళ్లగడ్డ: ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్న ఓ మైనర్ బాలికను పరువు హత్య పేరుతో ఆమె కుటుంబమే అంతమొందించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీనరసయ్య, లక్ష్మీ దంపతుల కుమార్తె లక్ష్మీదేవి (17), అదే ఊరికి చెందిన చాకలి నాగేంద్ర ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. దీన్ని లక్ష్మీదేవి తల్లిదండ్రులు వ్యతిరేకించటంతో రెండు వారాల క్రితం ఇద్దరూ గ్రామ నుంచి పారిపోయి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు దీనిపై ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఈ జంటను స్టేషన్‌కు తెచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరం కలిసే ఉంటామని, లేదంటే కలిసే మరణిస్తామని చెప్పటంతో రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మైనర్ని పెళ్లాడినందుకు ఆమె భర్త జైలు పాలవుతాడని లక్ష్మీదేవిని హెచ్చరించారు. మేజర్ కాగానే అందరి సమక్షంలో ఘనంగా వివాహం చేస్తామని హామీ ఇవ్వటంతో లక్ష్మీదేవి శనివారం రాత్రి తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లింది. అయితే మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని ఏటి ఒడ్డున శవంగా కనిపించింది. మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమ కుమార్తె ఉరివేసుకున్నట్లు లక్ష్మీదేవి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే అటువంటి ఆనవాళ్లు లేకపోగా నుదిటికి గాయం ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు లక్ష్మీదేవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
ఏ తల్లిదండ్రులు ఇలా చంపరేమో!
కరాచీ : పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందామనుకున్న ఓ యువజంట(అమ్మాయికి 15, అబ్బాయికి 17)ను ఇరు కుటుంబాల సభ్యులు కళ్లముందే అతి దారుణంగా చంపేశారు. కుటుంబం పరువు తీశారని కళ్లెర్రజేస్తూ వారిద్దరిని నులక మంచానికి కట్టిపడేసి కరెంట్ షాక్ పెట్టి చంపారు. ఈ దృశ్యాన్ని ఊరంతా కూడా తిలకిస్తూ ఏ మాత్రం మానవత్వం లేనివారిగా వ్యవహరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వారిని పట్టి బందించి తీసుకొచ్చాక ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపే జిర్గా అనే కులపెద్దల సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. వారిద్దరు కుల పరువు తీశారని వారిని మంచానికి కట్టిపడేసి చంపేయాలని ఆదేశించడంతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ రెండు కుటుంబాల ముందే మంచానికి కట్టిపడేసి కరెంట్ షాక్ పెట్టి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాలకు చెందిన వారిని, కుల పెద్దలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. తొలి రోజు అమ్మాయిని, రెండో రోజు అబ్బాయిని ఇలా చంపి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ జంట తల్లిదండ్రులు ఒక ఒప్పందానికి వచ్చినా జిర్గా సంఘం అంగీకరించకపోవడంతో ఈ పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. జిర్గా సంఘం ప్రభుత్వ చట్టాలకంటే కఠినంగా పనిచేస్తుందని, ఆ ప్రజలు కూడా చట్టాలకంటే జిర్గా పెద్దల మాటలే పట్టించుకుంటారని తెలిపారు. ప్రతి ఏటా పరువు హత్యల్లో 500మంది పాకిస్థాన్ మహిళలు బలవుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. -
యువతి డెత్ మిస్టరీ.. పరువు హత్యా?
ఛండీగఢ్: పంజాబ్ లోని టరన్ తరన్ ప్రాంతంలో 17 ఏళ్ల యువతి మృతి కేసు పోలీసులకు పెద్దతలనొప్పిగా మారింది. 9 రోజులు గడుస్తున్నా ఇంకా ఏం తేల్చలేకపోతున్నారు. మరోపక్క ఇది పరువు హత్య అయి ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం ఆ యువతికి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే. వీరమ్ గ్రామానికి చెందిన ఆ యువతి తన ఇంట్లో 23 ఏళ్ల గుర్‌సాహిబ్‌తో అభ్యంతరకర స్థితిలో తండ్రి కంటపడింది. ఆగ్రహించిన ఆయన అతనిపై దాడి చేయగా పారిపోయాడు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే యువతి కనిపించకుండా పోయింది. దీంతో తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే రెండు రోజులకే ఊరి చివర ఉన్న కొలనులో యువతి శవమై తేలింది. అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ ప్రారంభించిన పోలీసులకు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నట్లు డీఎస్పీ ఎస్ఎస్ మన్న్ తెలిపారు. -
ప్రేమకు ఉరి
♦ తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య ♦ కుమార్తెను ప్రేమించాడని తండ్రి ఘాతుకం మలికిపురం: తన కుమార్తెను ప్రేమించాడన్న కారణంతో యువకుడిని ఓ తండ్రి ఉరి బిగించి హత్య చేశాడు. సముద్ర తీరంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం వల్ల గ్రామంలో తన పరువు పోయిందన్న కసితో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గొల్లపాలేనికి చెందిన కందుల విజయకుమార్ కుమార్తె బిందు మాధవి, అదే మండలంలోని గూడపల్లి పల్లిపాలెం గ్రామానికి చెందిన కానుబోయిన నూకాలరావు కుమారుడు రామాంజనేయులు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం రామాంజనేయులు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. బిందుమాధవి అమలాపురం సమీపంలోని బట్లపాలెంలో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. యువతి తండ్రి విజయకుమార్ ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటూ ఐదు నెలల క్రితం స్వస్థలానికి వచ్చాడు. కుమార్తె ప్రేమ విషయం తెలిసి రామాంజనేయులిని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. తరువాత ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీసాలో లోపం కారణంగా మళ్లీ స్వస్థలానికి తిరిగి వచ్చేశాడు. అప్పటికీ వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. మే 2వ తేదీ రాత్రి రామాంజనేయులిని అతడి స్నేహితులైన గుండుమేను రవికిరణ్, కైల ప్రసాద్‌ల ద్వారా పార్టీ చేసుకుందామని పిలిపించాడు. అనంతరం తన మిత్రుడు మట్టా నాగబాబుతో కలసి, రామాంజనేయులు మెడ చుట్టూ తాడుతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. రామాంజనేయులు తండ్రి నూకాలరావు ఫిర్యాదు మేరకు మలికిపురం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం విజయకుమార్, నాగబాబును అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. గొల్లపాలెంలోని సముద్ర తీరంలో పాతిపెట్టిన రామాంజనేయులు మృతదేహాన్ని దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులు వెలికితీశారు. కాగా ప్రేమించిన పాపానికి ఇంత దారుణానికి ఒడిగడతారా అని రామాంజనేయులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. నిందితులపై హత్య కేసు నమోదు: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో జరిగిన కానుబోయిన రామాంజనేయులు అదృశ్యం సంఘటనను హత్య కేసుగా నమోదు చేసినట్లు రాజోలు సీఐ క్రిస్టోఫర్ మంగళవారం తెలిపారు. తన కుమార్తెను ప్రేమించాడన్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడు కందుల విజయకుమార్ అంగీకరించడంతో ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. విజయకుమార్‌తోపాటు అతడికి సహకరించిన మరో నిందితుడు మట్టా నాగబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. మరిన్ని వివరాలు సేకరించిన అనంతరం నిందితులను కోర్టుకు పంపిస్తామని వెల్లడించారు. -
గోదావరి జిల్లాలో పరువుహత్య
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కోనసీమలోని మలికిపురం మండలం గొల్లపాలెంలో వెలుగుచూసింది. గత నెల రెండోతేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రామాంజనేయులు అనే యువకుడిని విజయ్‌కుమార్ హతమార్చారు. పోలీసుల విచారణతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కరవాడ బీచ్ వద్ద ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. గత ఆరు నెలలుగా విజయ్‌కుమార్ కూతురు, రామాంజనేయులు ప్రేమించుకుంటున్ఆరు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, ఇటీవలే రామాంజనేయులు తిరిగొచ్చాడు. అంతలోనే అతడు హత్యకు గురి కావడంతో గొల్లపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు మొదలై పరస్పరం దాడులకు కూడా దిగారు. -
గతంలోనూ హత్యల చరిత్రేనా?
-
గతంలోనూ హత్యల చరిత్రేనా?
నరేష్ హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అతడిని చంపిన శ్రీనివాసరెడ్డికి 20 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ముందు నుంచే రౌడీషీటర్లతో తిరిగేవాడని అంటున్నారు. గతంలో 1992 సంవత్సరంలో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు సైతం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అప్పట్లో ఈ మూడు హత్యల విషయంలోనూ ఈయనపై అనుమానాలు తలెత్తాయి గానీ, ఆధారాలు ఏమీ లేకపోవడంతో రుజువు కాలేదు. ఇప్పుడు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ అనుమానాస్పద మృతి, నరేష్ హత్య కేసులలో కూడా దాదాపు ఇలాగే జరిగేది. అయితే కోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ వేగవంతం చేయడంతో మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చింది. హత్య జరిగిన తీరు మొత్తం బట్టబయలైంది. స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే ఆమె భర్త నరేష్‌ను దారుణంగా చంపి, టైర్లతో తగలబెట్టిన శ్రీనివాసరెడ్డి.. అతడి అస్థికలను మూసీనదిలో కలిపేశాడు. దాంతో అసలు ఆధారాలన్నవి దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే పోలీసులు చుట్టుపక్కల విచారించడంతో పాటు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా హత్య లాంటి నేరాలు చేస్తే ఎక్కడో ఒకచోట ఆధారాలు వదలకుండా ఉండారు. కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం పక్కాగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా చేసి చివరకు అస్థికలను కూడా మూసీనదిలో కలిపేయడంతో.. స్వయంగా ఆయన చెబితే తప్ప హత్య జరిగిందన్న విషయం కూడా బయటకు వచ్చేది కాదు. -
ప్రేమ పెళ్లి చిచ్చు: అల్లుడు హతం
జైపూర్: తమ కుమార్తె వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని ఆ తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. వేరే కులం వ్యక్తిని అల్లుడిగా అంగీకరించలేక అతడిని చంపేశారు. రాజస్థాన్‌లో ఈ దురాగతం చోటు చేసుకుంది. జైపూర్ నగరానికి చెందిన జీవన్‌రాం చౌధరి, భగ్వానీ ఛౌధరి దంపతుల కుమార్తె మమత వేరే కులానికి చెందిన అమిత్ నాయర్ అనే సివిల్ ఇంజినీర్‌ను ప్రేమించింది. పెద్దలకు ఇష్టం లేకున్నా వారిద్దరూ పెళ్లి చేసుకుని నగరంలోని జగదాంబ విహార్ కాలనీలో కాపురం పెట్టారు. ఇది జరిగి రెండేళ్లవుతోంది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో మమత గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న జీవన్‌రాం చౌధరి, తన భార్య మరో ఇద్దరిని తీసుకుని బుధవారం కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఇంట్లోనే ఉన్న అమిత్‌ను వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చగా అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఆ నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న కర్ణివిహార్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మమత ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. -
బోయ్‌ఫ్రెండ్లు ఉన్నారని.. కూతుళ్లను కాలువలో తోసేశారు
తమ కూతుళ్లకు బోయ్‌ఫ్రెండ్లు ఉన్నారన్న కోపంతో పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఓ ఆటో డ్రైవర్, అతడి భార్య కలిసి కూతుళ్లకు డ్రగ్స్ ఇచ్చి, ఆ తర్వాత వాళ్లను కాలువలోకి తోసేశారు. ఇద్దరు కూతుళ్లలో 15 ఏళ్ల వయసున్న జ్యోతి మరణించగా, ఆమె సోదరి ప్రీతి మాత్రం ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. ఆటోడ్రైవర్ ఉదయ్ చంద్, అతడి భార్య లక్ష్మిలపై హత్య, హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిలిద్దరూ పదో తరగతి చదువుతున్నారని, వాళ్లు మొన్న ఒకరోజు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారని, దాంతో వాళ్లకు బోయ్‌ఫ్రెండ్లు ఉన్నారని తల్లిదండ్రులు అనుమానించినట్లు ఎస్ఐ దేవీందర్ శర్మ తెలిపారు. వాళ్లను ఏమీ అడగకుండానే వాళ్ల ఆహారంలో డ్రగ్స్ కలిపారని, అమ్మాయిలిద్దరూ స్పృహ కోల్పోయాక వాళ్లను కాలువలో విసిరేశారని చెప్పారు. జ్యోతిని కాలువలోకి విసిరేసే ముందు దుపట్టాతో ఆమె పీక పిసికేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఒకరోజు తర్వాత ఇద్దరూ నీళ్లలో తేలుతూ కనిపించగా, లూథియానాలోని బరేవాల్ బ్రిడ్జి వద్ద అటువైపు వెళ్లేవాళ్లు చూసి వారిని బయటకు తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే జ్యోతి మరణించింది. ప్రీతి పోలీసులకు ముందు అబద్ధాలు చెప్పింది. ఇద్దరం అనాథలమని, గుడివద్ద భిక్షాటన చేస్తామని, గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఆహారం తిని స్పృహ కోల్పోయామని తెలిపింది. అమ్మాయిలు భిక్షగత్తెల్లా అనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా అడిగితే అసలు విషయం మొత్తం వివరించింది. -
నాన్నే చంపించాడు!
నిజామాబాద్: మక్లూరు మండలం అమ్రజ్ పూర్ లో పరువు హత్య ఆలస్యంగా బయటపడింది. గత నెల 27న జక్రాన్ పల్లి మండలం పడకల్ వద్ద రోజా అనే యువతి హత్యకు గురైంది. ఆమెను కన్నతండ్రి రాజన్న హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వేరే కులం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుందనే కోపంతో అతడీ కిరాతకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. నిందితుడు రాజన్నతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఘటనా స్థలంలో దొరికిన మృతురాలి పాదరక్ష ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
రిసెప్షన్ ఇస్తానని పిలిచి.. కూతుర్ని కాల్చేసింది
ఆమె పేరు జీనత్ రఫీక్. అప్పటికి ఒక్క వారం క్రితమే పెళ్లయింది. వాళ్లిద్దరికీ మంచి రిసెప్షన్ ఏర్పాటుచేస్తానని చెప్పి ఆమె తల్లి ఇంటికి పిలిచింది. వాస్తవానికి తన క్లాస్మేట్ హసన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జీనత్‌కు అమ్మ పిలవడం పెద్ద షాక్. ఎందుకంటే, వాళ్ల ప్రేమను ఆమె ఎప్పుడూ అంగీకరించలేదు. కుటుంబంలోని మిగిలిన సభ్యులదీ అదే మాట. ఎన్నిసార్లు తాము పెళ్లి చేసుకుంటామని చెప్పినా వాళ్లెవరూ ఒప్పుకోలేదు. దాంతో ఆ జంట ప్రేమను కాదనుకోలేక వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎటూ పెళ్లయిపోయింది కాబట్టి, లేచిపోయిన జంట అని పేరు రాకుండా ఉండటానికి రిసెప్షన్ ఇస్తానని తల్లి పెర్వీన్ బీబీ పిలిచేసరికి కూతురు కాస్త తటపటాయించింది. అలాగే భయంతోనే సరేనని ఒప్పుకొంది. తీరా లాహోర్‌లోని తమ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పండుగ వాతావరణం ఏమీ కనిపించలేదు. అంతేకాదు.. కన్నతల్లి, తోడబుట్టిన సోదరుడు కలిసి ఆమెను విపరీతంగా కొట్టి, పీక పిసికేశారు. తర్వాత మంచానికి కట్టేసి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. కుటుంబానికి చెడ్డపేరు తెచ్చినందుకు, అసభ్యంగా ప్రవర్తించినందుకు తన కూతుర్ని చంపేశానని పెర్వీన్ బీబీ ఆ తర్వాత చెప్పినట్లు ఆమె సోదరి తెలిపింది. జీనత్ తల్లితో పాటు సోదరుడు అనీస్ రఫీక్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాను చేసిన నేరాన్ని ఆమె వెంటనే అంగీకరించింది. అలా చేసినందుకు ఏమాత్రం బాధ పడట్లేదని కూడా తెలిపింది. ఈ కేసులో పెర్వీన్ బీబీకి మరణశిక్ష విధించగా, అనీస్ రఫీక్‌కు జీవితఖైదు శిక్ష పడింది. పాకిస్థాన్‌లో ఇలాంటి పరువు హత్యలు తరచు జరుగుతుంటాయి. ప్రతియేటా దాదాపు వెయ్యిమంది అమ్మాయిలు తమ బంధువుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2015 సంవత్సరంలో దాదాపు 1100 మంది మరణించగా, మరో 900 మంది లైంగిక హింసకు గురయ్యారు,800 మంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. -
మహిళకు మరణశిక్ష
ఇస్లామాబాద్: పరువు కోసం కన్నకూతుర్ని సజీవ దహనం చేసిన పాకిస్థాన్ మహిళకు కోర్టు మరణశిక్ష విధించింది. ‘పరువుహత్య’ కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన కొద్ది నెలల తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించడం గమనార్హం. తమ అభీష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుందనే కోపంతో తన కుమార్తె జీనత్ రఫీక్(18)ను ఆమె తల్లి పర్వీన్ బీబీ నిప్పటించి సజీవ దహనం చేసింది. 2016, జూన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పాకిస్థాన్ లో సంచలనం రేపింది. హసన్ ఖాన్ అనే వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. తన కుటుంబానికి తలవంపులు తెచ్చిందనే కూతుర్ని హతమార్చినట్టు కోర్టులో పర్వీన్ ఒప్పుకుంది. కొడుకు అనీస్ సహాయంతో కూతుర్ని కడతేర్చిందని పోలీసులు అనుమానించారు. ఈ కేసులో వాదనలు విన్న ఏటీసీ కోర్టు న్యాయమూర్తి ఆజామ్ చౌధురి సోమవారం తీర్పు వెలువరించారు. పర్వీన్ కు మరణశిక్ష, అనీస్ కు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. -
నిద్రపోతున్న కూతురిని నరికి చంపేశాడు!
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గాఢంగా నిద్రపోతున్న తన కన్న కూతురిని ఓ తండ్రి నరికి చంపేశాడు. తెల్లవారుజాము సమయంలో ఆశారామ్ అనే వ్యక్తి తన కూతురు సోనియా (19)ను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గౌరవ్ అనే వ్యక్తిని సోనియా ప్రేమించిందని, అది వద్దని ఆశారామ్ తరచు చెప్పేవాడని సీనియర్ ఎస్పీ దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. వృత్తిరీత్యా టైలర్ అయిన ఆశారామ్.. తన భార్య రేఖ తెల్లవారుజామునే పాల కోసం సమీపంలోని డెయిరీ వద్దకు వెళ్లినప్పుడు సమయం చూసుకుని మరీ కూతుర్ని హతమార్చాడు. ఆమె మెడమీద పదునైన ఆయుధంతో కోసినట్లు గాయాలున్నాయి. ఆ సమయంలో సోనియా తన చెల్లెళ్లతో కలిసి నిద్రపోతోంది. కుమార్తెను చంపేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని వీధిలో పెట్టి, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆశారామ్‌ను జైలుకు పంపినట్లు సీనియర్ ఎస్పీ చెప్పారు. -
పంజాబ్‌లో పరువు హత్యలు
తరణ్‌తారణ్: పంజాబ్‌లో ఓ తండ్రి 15 ఏళ్ల తన కూతురు, ఆమె ప్రియుడిని ఆదివారం పరువు హత్య చేశాడు. తరణ్తారణ్కు 35 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో నివసించే దొగార్ సింగ్ కుమార్తె సుఖ్వీందర్ కౌర్.. రణదీప్ సింగ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. విషయం తెలుసుకున్న దొగార్ పదునైన ఆయుధం ఉపయోగించి తన ఇంట్లోనే ఇద్దరినీ చంపేశాడు. అయితే, సుఖ్వీందర్, రణదీప్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. -
'నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు'
హాత్రాస్: ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన 26 ఏళ్ల యువతి తాను చనిపోవడానికి ముందు రికార్డు చేసిన వీడియో బయటపడడంతో కలకలం రేగింది. హాత్రాస్ జిల్లాలో యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ఆమె భావించిందని అంతా అనుకున్నారు. అయితే చనిపోవడానికి ముందు రైలు వాష్‌రూమ్ లో సెల్‌ఫోన్ లో ఆమె రికార్డు చేసిన వీడియో ఇంటర్నేట్ లో ప్రత్యక్షమైంది. 'నేను మేజర్ని. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ మా నాన్న, సోదరుడు, బంధువులు ఒప్పుకోవడం లేదు. నన్ను చంపేందుకు బలవంతంగా మా ఊరికి తీసుకెళుతున్నారు. నాకేదైనా జరిగినా.. నేను చనిపోయినా మా నాన్న, సోదరుడు, బంధువులదే బాధ్యత'ని వీడియోలో ఆమె పేర్కొంది. ఈ వీడియో ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసినట్టు హాత్రాస్ ఎస్పీ అజయపాల్ శర్మ తెలిపారు. తమ కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి, గుట్టుగా అంత్యక్రియలు చేశారు. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు ముంబైలో నివసిస్తున్నారు. ఆమెను చంపేందుకే వారి స్వగ్రామానికి వచ్చినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
సామియా తండ్రి, మాజీ భర్త అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటీషు మహిళ సామియా షాహిద్ పరువు హత్య కేసులో ఆమె తండ్రి మహ్మద్ షాహిద్, మాజీ భర్త మహ్మద్ షఖీల్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ ఆదివారం అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు బృందం ప్రధానాధికారి వెల్లడించారు. సామియాను నిందితులు హత్య చేసినట్టు బలమైన సాక్ష్యాధారాలు సంపాదించినట్టు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచేలోగా మరిన్ని సాక్ష్యాలు సంపాదిస్తామని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. సామియా అనారోగ్యంతో మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. ఆమె రెండో భర్త ముక్తార్ కాజిమ్ ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూసింది. సామియాను గొంతు పిసికి చంపినట్టు ఆమె మాజీ భర్త మహ్మద్ షకీల్ పోలీసుల ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నాడు. షియా తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకుందనే కోపంతోనే ఆమెను చంపినట్టు తెలిపాడు. -
తల్లిదండ్రులు చంపేస్తారేమోనన్న భయంతో!
గౌతం, ప్రీతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన ఈ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించి.. పోలీసు స్టేషన్లో ఒక్కటయింది. ఆ సమయంలో గౌతంకు ఇంకా మైనారిటీ తీరలేదు. కులాలు వేరయినా వీరి పెళ్లిని ప్రీతి కుటుంబం చివరికీ సమ్మతించింది. కానీ గౌతం తల్లిదండ్రులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వేరే కులం పిల్లను ఎలా చేసుకుంటావని బెదిరించారు. ప్రీతి నుంచి తనను తండ్రి వేరు చేస్తాడేమోనని గౌతం భయపడ్డాడు. తండ్రిని ఎదిరిస్తే తమ ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన చెందాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ చర్యను వ్యతిరేకించాల్సిందిపోయి ప్రీతి కూడా భర్తతో కలిసి తాను బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించింది. కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆ జంట ఈ నెల 12న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం ఈ యువజంట ఐసీయూలో చికిత్స పొందుతోంది. అయితే, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలాచ్చిలో నివాసముంటున్న గౌతం, ప్రీతి అనే నూతన జంట తల్లిదండ్రుల నుంచి పరువుహత్య ముప్పునకు భయపడి.. తామే స్వయంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కోయంబత్తూరులోనే ప్రేమించి పెళ్లిచేసుకున్న శంకర్ అనే యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు పట్టపగలే నరికి చంపిన సంగతి తెలిసిందే. -
పరువు కోసం.. నా భార్యను చంపేశారు!
కుటుంబ పరువు కోసం తన భార్యను అత్తమామలే చంపేశారంటూ పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ముఖ్తర్ కజీమ్ అనే ఆ వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలోని జీలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య సామియా షహీద్ (28) బ్రిటిష్ - పాకిస్థానీ జాతీయురాలని, తాము రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటున్నామని చెప్పాడు. సామియా బ్రాడ్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యుటీషియన్ కోర్సు చేసింది. అయితే.. పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నామన్న కోపంతో వాళ్లు తన భార్యను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె సహజంగానే మరణించిందని, అందువల్ల విచారణ అక్కర్లేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. సామియా మరణించిన వెంటనే అటాప్సీ చేయించామని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ అఖీల్ అబ్బాస్ తెలిపారు. అయితే ఆమెకు బ్రిటిష్ మూలాలు కూడా ఉండటంతో.. బ్రిటిష్ విదేశాంగ శాఖ కూడా దీనిపై కలగజేసుకుంటోంది. పాకిస్థాన్‌లో బంధువులకు తీవ్ర అనారోగ్యంగా ఉందని తెలియడంతో కజీమ్, సామియా జూలై 14న ఇస్లామాబాద్ వెళ్లారు. సామియా గత గురువారమే తిరిగి దుబాయ్ రావాల్సి ఉంది. కానీ ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె బంధువు ఒకరు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పరువు కోసమే ఆమెను చంపించడానికి వాళ్లు అనారోగ్యం నాటకం ఆడారని కజీమ ఆరోపిస్తున్నాడు. -
ఆడాళ్లు పరువు హత్యలు మొదలుపెడితే...
ముంబై: వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ హత్యపై పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ స్పందించాడు. కందిల్ హత్యకు గురికావడం బాధ కలిగిచిందని వ్యాఖ్యానించాడు. పడుతులు పరువు హత్యలు చేయడం మొదలు పెడితే మగాళ్లలో చాలా మందికి మూడినట్టేనని అన్నాడు. 'తమ గౌరవాన్ని నిలుపుకునేందుకు మనల్ని మహిళలు మర్డర్లు చేయడం మొదలుపెడితే, మనలో చాలా మంది చావడం ఖాయమ'ని ట్వీట్ చేశాడు. అయితే పాకిస్థాన్ లో పరిస్థితులు అంత దారుణంగా లేవని చెప్పాడు. 'సినిమాల్లో రొమాంటిక్ పాత్రల్లో నటిస్తాను. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న వాటి గురించి స్పందిస్తాను. నేను ఆశావాదిని. పాకిస్థాన్ లో అంతా చెడే జరగడం లేదు. పాక్ సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతోంది. అక్కడ అద్భుత ప్రతిభ కలిగిన కళాకారులున్నారు. పాక్ యువత కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉంటున్నారు. ఇది శుభపరిణామ'ని అలీ జాఫర్ పేర్కొన్నాడు. If women started killing us to protect their honour, a lot of us would be dead! — Ali Zafar (@AliZafarsays) 16 July 2016 -
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
-
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
మృతురాలి ప్రియుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు సాక్షి, విజయవాడ : విజయవాడలో జరిగిన పరు వు హత్య కేసులో మృతురాలు నజ్మా ప్రియుడు దీపక్‌ను, హత్య చేసిన తల్లి బీబీజానీని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేశారు. తన కుమార్తెను లైంగికంగా ఇబ్బందిపెట్టాడని, ఇద్దరూ తీయిం చుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికాకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని నజ్మా తండ్రి మైసూర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. దీపక్ కాల్‌డేటాను పరిశీలించి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన నజ్మా తల్లి బీబీజానీని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ సహేరా బేగం నిర్వహించిన విచారణలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. నజ్మా కుటుంబం మూడునెలలుగా వాంబే కాలనీలో ఉంటోంది. ఎంబీయే చదివి భార్య నుంచి విడాకులు తీసుకున్న దీపక్ అదే కాలనీలో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దీపక్ రెండు నెలలుగా నజ్మాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ వ్యవహారంపై మందలించినా నజ్మా వినకపోవడంతో తల్లి బీబీజాని ఆమెను చంపేసింది. మైనర్ కావటంతోనే పోక్సో చట్టం 17ఏళ్ల బాలిక నజ్మాను ప్రేమపేరుతో వేధించాడని, పరోక్షంగా ఆమె మరణానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్ట్ -2012 (పోక్సో చట్టం), కిడ్నాప్ తదితర కేసులను పోలీసులు దీపక్‌పై నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం ప్రకారం.. బాలిక ఇష్టపూర్వకంగా ప్రియుడితో బయటకు వెళ్లినా అతడిదే నేరం అవుతుంది. బాలికల్ని ప్రేమించటం నేరం. -
కడుపులో పగ దాచుకొని 8 ఏళ్లు వేచిచూశారు!
కోయంబత్తూరు: సంతోష్, సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయింది. సంతోష్ సుమతిని తొలిసారి కోయంబత్తూరులో కలిశాడు. అప్పుడు ఆమె పీజీ చదువుతోంది. కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరైనా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చదువుకున్న వారు కావడంతో ఎలాంటి మనస్పర్థలు లేకుండా వారి వైవాహిక జీవితం ముందుకుసాగింది. ఈ క్రమంలో సంతోష్ కు ఇటీవల బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం లభించింది. దీంతో అతను తన సొంతూరు నమ్మక్కల్ నుంచి హోసూర్ కు మకాం మార్చాడు. త్వరలోనే భార్య సుమతిని కూడా హోసూర్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అయితే ఇంతలోనే ఇటు నమక్కల్‌లోని తన ఇంట్లో ఘోరం జరిగింది. సుమతి గొంతుకోసి దోపిడీ దొంగలు ఇంటిలో నుంచి బంగారం, నగలు ఎత్తుకుపోయారని సంతోష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కొడుకు కులాంతర వివాహాన్ని అంగీకరించి.. సుమతిని కొడలిగా ఒప్పుకున్నట్టు అతని తల్లిదండ్రులు పైకి నటించినప్పటికీ, వారు కడుపులో పగ దాచుకొని ఎనిమిదేళ్లు వేచి చూశారని, అదను రాగానే కొడలిపై దాడిచేసి ఆమె గొంతు కోసి చంపారు. దీనిని దోపిడీ దొంగలు కిరాతకంగా చిత్రించేందుకు ఆమె ఫోన్ ను, నగలను తామే తీసి దాచిపెట్టి.. పోలీసులకు కథలు అల్లి చెప్పారు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలు సుమతి అత్తమామలు పళనివేల్, మధేశ్వరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పరువు హత్య కేసు నమోదుచేసి.. సేలం జైలుకు తరలించారు. -
పరువు కోసం.. కాల్చి, గొడ్డలితో నరికేశారు!
తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కూడా ‘పరువు’ పేరుతో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. కుటుంబ పెద్ద నోట్లో తుపాకి పెట్టి మూడు రౌండ్ల బుల్లెట్లు కాల్చగా, అతడి భార్య, నాలుగేళ్ల కొడుకు తలలను గొడ్డలితో నరికేశారు. ఘటనా స్థలానికి సమీపంలో ఒక మోటార్ సైకిల్, కాస్మొటిక్స్ ఉన్న పర్సు లభించాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది పరువు హత్యే అయి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. మరణించిన వాళ్లు ఆ పిల్లాడికి తల్లిదండ్రులేనా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వాళ్ల రక్త నమూనాలను డీఎన్ఏ పరీక్షకు పంపుతున్నట్లు చెప్పారు. -
పాక్ లో మళ్లీ పరువుహత్యల కలకలం!
లాహోర్: గర్భిణిని ఆమె తల్లి పరువు హత్య చేసి వారం రోజులు గడవకముందే మరో ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుని కుటుంబం పరువు తీసిందని ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి.. గర్భంతో ఉన్న సోదరితో పాటు ఆమె భర్తను దారుణంగా కాల్చి హత్యచేశాడు. గతేడాది పరువు హత్యల నెపంతో పాక్ లో 1,100 మంది మహిళలు తమ తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల చేతిలో హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ముహమ్మద్ షకీల్(30), అక్సా(26)ను నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లికి అక్సా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటినుంచి వీరి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరు పాక్ లోని పంజాబ్ లోని థిక్రివాలాలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అక్సా నిండు గర్భిణి. అయితే సౌదీ అరేబియాలో ఉంటున్న అక్సా సోదరుడు వారం రోజుల కిందట ఇంటికి వచ్చాడు. గత నాలుగు రోజుల కిందట అక్సా తల్లి, ఆమె సోదరుడు, సోదరుడి తరఫు బంధువులు ఈ దంపతులను కిడ్నాప్ చేశారు. వారిని చితకబాదడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపి హత్యచేశారు. ఆ తర్వాత తమకేం తెలియదన్నట్లుగా శవాలను గుజ్రా-జంగ్ బ్రాంచ్ కాలువలో పడేసి వెళ్లిపోయారు. గురువారం రాత్రి పోలీసులు శవాలను గుర్తించారు. షకీల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్సా సోదరుడు, తల్లిపై కేసు నమోదు చేశారు. విచారణ జరపగా పుట్టింటివారే నిండు గర్భిణి అయిన అక్సాతో పాటు ఆమె భర్తను కాల్చి చంపినట్లు వెల్లడైంది. ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. మరో వారం రోజుల్లో అక్సా డెలివరికి ఉందని రిపోర్టుల ద్వారా తెలిసింది. -
పరువు పోతుందని...
మైసూరు (కర్ణాటక): మైసూరు జిల్లా, కే.ఆర్.నగర్ తాలూకా, నాడప్పన హళ్లిలో జరిగిన పరువు హత్య ఏడాది తర్వాత వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నాడప్పనహళ్లికి చెందిన పుట్టరాజు శెట్టి, లీలమ్మల కుమార్తె సునీత(19) అదే గ్రామానికి చెందిన బంధువుల అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆ యువతిని గర్భవతిని చేశాడు. విషయం బయట పడితే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు సునీతను పొలానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా పడేసి వెళ్లారు. తమ కుమార్తె కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్థులను నమ్మించారు. అయితే సునీతను తల్లిదండ్రులే హత్య చేశారని గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా ఎస్పీకి లేఖ రాయగా, ఆయన విచారణకు ఆదేశించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సునీత తల్లిదండ్రులను విచారించగా.. తమ కుమార్తె పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో పరువు పోతుందని భావించి తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో ఆదివారం వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కర్ణాటకాలో 10 పరువు హత్యలు జరిగాయి. -
యువకుడితో సన్నిహితంగా ఉంటుందని..
ఉత్తరప్రదేశ్: కూతురు ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటుందని తెలిసి తల్లి, ఇద్దరు బంధువులు కలిసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుర్తియా గ్రామానికి చెందిన యువకుడితో పద్దెనిమిదేళ్ల దళిత అమ్మాయి సన్నిహితంగా ఉంటుందని తెలిసి ఆమె తల్లి, ఇద్దరు బంధువులు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం అమ్మాయి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అదే గ్రామంలో ఓ గుడిసెలో గుంత తీసి పూడ్చిపెట్టారని ఎస్పీ మనోజ్ ఘా తెలిపారు. కాగా అమ్మాయి మృతదేహాన్ని కొందరు గ్రామస్తులు గుర్తించి తమకు సమాచారం అందించారన్నారు. హత్యకు పాల్పడిన మృతురాలి తల్లి, ఇద్దరు బంధువులపై ఆదివారం కేసు నమోదు చేసిన ట్లు ఆయన తెలిపారు. -
తమ్ముడు లేచిపోయాడని.. అక్కను చంపేశారు!
తమిళనాడులో మరో పరువు హత్య జరిగింది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు.. అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించినందుకు అతడి అక్కను నరికి చంపారు. విశ్వనాథన్ (25) అనే యువకుడు అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి, ఆమెతో పారిపోయాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వాళ్లంతా విశ్వనాథన్ ఇంటికి వచ్చి చూసినా, అతడు అక్కడ లేడు. అతడి అక్క కల్పన వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను వాళ్లు నరికి చంపారు. ఆమెకు పెళ్లయ్యి, ఓ కూతురు కూడా ఉంది. ఇంతకుముందు మార్చి 13వ తేదీన కూడా తమిళనాడులో ఓ పరువు హత్య జరిగింది. -
శంకర్ భార్య కౌసల్య ఆత్మహత్యాయత్నం!
చెన్నై: పరువు హత్య వ్యవహారంలో హత్యకు గురైన దళితుడు శంకర్ భార్య ఎస్ కౌసల్య (20) తాజాగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమె గురువారం రసాయన పౌండర్‌ను తిని ప్రాణాలు తీసుకోవడానికి యత్నించింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన పరువు హత్య వ్యవహారంలో దళిత యువకుడైన శంకర్‌ను కౌసల్య కుటుంబసభ్యులు పట్టపగలే నరికిచంపిన సంగతి తెలిసిందే. కౌసల్యను చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణగండం తప్పిందని సమాచారం. ఒకే కాలేజీ విద్యార్థులైన శంకర్, కౌసల్య ప్రేమలో పడి 2015లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిను ఇరువైపులా కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకొని కౌసల్య శంకర్ ఇంటికి వచ్చేసింది. అగ్రకులానికి చెందిన ఆమె కుటుంబసభ్యులు పలుమార్లు ఈ దంపతులను హెచ్చరించారు. కొన్నిసార్లు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట తిరుపూర్ జిల్లా ఉడుమల్ పేట బస్టాంట్ వద్ద పట్టపగలే అతికిరాతకంగా శంకర్‌ను కౌసల్య కుటుంబసభ్యులు నరికి చంపారు. కౌసల్యపైనా వారు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలతో బయటపడిన ఆమె కోలుకొన్న తర్వాత కొమరలింగంలోని శంకర్ ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. 'మూడేళ్ల కిందట నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నా కొడుకును పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు నా కోడలు కూడా ఆత్మహత్యకు యత్నించడం నా కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభను మరింత పెంచుతోంది' అని కౌసల్య మామ వేలుస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు!
తమ ఇంటి అమ్మాయిని లేవదీసుకుపోయాడని.. ఓ టీచర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలిహాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ (32) అనే ఈ టీచర్ తన తల్లిదండ్రులతో కలిసి గడాహో గ్రామంలో ఉండేవాడు. ఓ అమ్మాయితో బాగా చనువుగా ఉంటూ.. ఆమెతో కలిసి సోమవారం ఎటో వెళ్లిపోయాడు. అతడి ఆచూకీని ఎలాగోలా కనిపెట్టిన అమ్మాయి తండ్రి రాజారామ్, సోదరులు అనిల్, మునిష్ కలిసి పట్టుకుని.. కొట్టి కొట్టి చంపేశారు. ఆ ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లు ముగ్గురు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
కుమార్తెను కొట్టి చంపిన తండ్రి
ప్రకాశం జిల్లాలో పరువు హత్య ఓ యువకుడిని ప్రేమించడమే ఆమె చేసిన నేరం చీరాల రూరల్: ఓ తండ్రి.. 18 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తెను బంధువుల సాయంతో హతమార్చాడు. ఆమె చేసిన నేరం.. ఓ యువకుడిని ప్రేమించడమే. పరువు పోయిందని భావించి కన్నపేగును ఆ తండ్రి నిలువునా చీల్చాడు. ఈ పాపంలో బాలిక మేనత్త, ఆమె భర్త, వారి ఇద్దరు కుమారులు భాగస్వాములయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన కటకం దుర్గాభవానీ(18) గత నెల 27న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దుర్గాభవానీ సోదరుడు గోపి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఆమె తన తండ్రి, బంధువుల చేతిలో హత్యకు గురైనట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేశారు. దుర్గాభవానీ చీరాలలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈమెకు నెల్లూరు జిల్లాకు చెందిన పోలయ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో నెల క్రితం అతడి వెంట వెళ్లిపోయింది. దుర్గాభవానీ మైనర్ కావడంతో పోలయ్య ఆమెను నెల్లూరు పోలీసుల సాయంతో వెంకటగిరిలోని రెస్క్యూ హోమ్‌లో చేర్పించాడు. విషయం తెలిసిన తండ్రి రెస్క్యూ హోమ్‌కు వెళ్లి ఇంటర్ పరీక్షలు రాయిస్తానని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. బంధువుల సాయంతో ఇనుప రాడ్డుతో కొట్టి చంపి, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. -
దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!
మాండ్యా: కర్ణాటకలో తాజాగా పరువు హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేశారు. బాధితురాలిని మోనికగా గుర్తించారు. కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి ఆమె పంటపొలాల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ వ్యవహారం పోలీసులకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆదివారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. మోనిక కొన్నిరోజుల కిందట తనను ప్రేమించిన దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమెను భయపెట్టి ఆత్మహత్య లేఖ రాయించారని, ఆ తర్వాత బలవంతంగా ఆమెకు ఉరివేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రిని, అంకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో తమిళనాడులో పట్టపగలే శంకర్ అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణంగా చంపేసిన చంపేసిన సంగతి తెలిసిందే. దళిత యువకుడైన శంకర్ అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు అతికిరాతకంగా ఈ పరువు హత్యకు పాల్పడ్డారు. -
'తల్లిదండ్రులు హత్య చేయొచ్చు'!
చెన్నై: 'మీరు హత్య చేశారా అది కూడా ప్రత్యేకంగా పరువు హత్యా ఏం పర్వాలేదు నాదగ్గరకు రండి! మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను' అంటూ తమిళనాడులో ఓ న్యాయవాది ఏకంగా బహిరంగంగా ప్రకటించారు. అది కూడా సామాజిక మాద్యమం ద్వారా. ఉదయాన్నే లేవగానే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. పరువు హత్య చేయడం తప్పేం కాదని పేర్కొంటూ టీ ఎస్ఏ అరుణ్ కుమార్ అనే తమిళనాడు న్యాయవాది పేర్కొంటూ కలకలం రేపాడు. 'పరువు హత్యకు పాల్పడ్డారా.. ఏ బాధపడవొద్దు. నాదగ్గరికి రండి. నేను మీ కేసు టేకప్ చేసుకుంటాను. పరువు హత్య తప్పేం కాదు. పరువుతీసినందుకు అది వేసే ఒక శిక్ష మాత్రమే. పరువును దృష్టిలో పెట్టుకొని చంపేసే హక్కు తల్లిదండ్రులకు ఉంది' అంటూ అతడు ఫేస్ బుక్ లో పెట్టాడు. దీనిని చూసిన గీతా నారాయణన్ అనే ఓ సామాజిక వేత్త వెంటనే దాన్ని చెన్నై పోలీస్ కమిషనర్ కు ట్యాగ్ చేశారు. దీంతో అతడి ఖాతాను మూసి వేసి పోలీసులు నోటీసులు పంపించారు. -
మరో ప్రేమి‘కుల’ చిచ్చు
ప్రియుడి దారుణ హత్య * నడిరోడ్డుపై జనం మధ్యలో ఘాతుకం * ఉడుమలైలో కలకలం * ప్రియురాలికి కత్తి పోట్లు * కోర్టులో లొంగి పోయిన తండ్రి * పరువు హత్యతో ఉద్రిక్తత సాక్షి, చెన్నై: మరోమారు ప్రేమి‘కుల’ చిచ్చు రగిలింది. కుమార్తె కులాంతర ప్రేమ వ్యవహారం ఓ తండ్రిలో ఆక్రోశాన్ని రగిల్చింది. ప్రియుడి రూపంలో తన బిడ్డ దూరం కావడంతో ఆ తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. కిరాయి ముఠా ద్వారా నడిరోడ్డుపై వందలాది మంది జనం చూస్తుండగా తన కుమార్తెకు భర్తగా మారిన ఆ ప్రియుడ్ని అతి కిరాతకంగా నరికి చంపించాడు. ఉడుమలైలో జరిగిన ఈ ఘాతుకం దృశ్యాలు వాట్సాప్, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తుండడంతో కలకలం బయల్దేరింది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా కులాంతర వివాహాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్‌లతో పాటుగా మరెందరో ప్రేమికులు కుల చిచ్చుకు బలి అయ్యారు. అగ్ర వర్ణ యువతుల్ని ప్రేమించడం వీరు చేసిన తప్పు. ప్రేమించడమే కాదు, ఆ యువతుల్ని భార్యలుగా చేసుకున్న పాపానికి చివరకు ఇలవరసన్, గోకుల్ రాజ్ లాంటి వాళ్లు విగత జీవులు కాక తప్పడం లేదు. ఈ పరువు హత్యల పరంపర రాష్ట్రంలో కొనసాగుతున్నా, అడ్డుకట్ట వేసే వారెవ్వరు. తాజాగా తిరుపూర్ జిల్లా ఉడుమలైలో వందలాది మంది చూస్తుండగా, అతి కిరాతకంగా ఘాతుకం జరగడం మరో మారు ప్రేమికుల చిచ్చును రగిల్చింది. కిరాతకం: దిండుగల్‌కు చెందిన చిన్నస్వామి కుమార్తె కౌసల్య తిరుపూర్ మడత్తుకులం కుమర తంగచావడిలోని ఓ సంస్థలో పనిచేస్తోంది. అక్కడే ఓ హాస్టల్లో ఉంటూ పనిచేస్తున్న ఆమె అదే ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి శంకర్ ప్రేమలో పడింది. ఈ ఇద్దరు చెట్టాపట్టల్ వేసుకుని తిరుగుతుండడం చిన్నస్వామి దృష్టికి చేరింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో కౌసల్యను ఖండించి ఇంటికి పరిమితం చేశాడు. అయితే ఎనిమిది నెలల క్రితం ఇంటి నుంచి ఉడాయించిన కౌసల్య ఓ ఆలయంలో శంకర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రియుడు భర్త కావడంతో ఇద్దరూ కలసి కుమర తంగ చావడిలో కాపురం పెట్టారు. సజావుగా వీరి కాపురం సాగుతూ వచ్చినా, కుమార్తె కులాంతర వివాహం చిన్నస్వామిలో ఆక్రోశాన్ని రగిల్చింది. తన బిడ్డను దూరం చేసిన శంకర్‌ను కడతేర్చేందుకు పథకం రచించుకున్నాడు. కౌసల్య, శంకర్లను ఎప్పటి నుంచి కిరాయి ముఠా వెంబడిస్తూ వచ్చిందో ఏమోగానీ, ఆదివారం తమ పథకాన్ని ఆచరణలో పెట్టారు. నడిరోడ్డుపై ఘాతుకం: నడిరోడ్డుపై శంకర్‌ను హత్య చేసిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కడం కలకలం రేపింది. ఓ జౌళి దుకాణం నుంచి బయటకు వచ్చి, బస్టాండ్ వైపుగా నడిచి వెళ్తున్న కౌసల్య, శంకర్లను వెంబడిస్తూ ఇద్దరు వ్యక్తులు వెళ్లడం, రోడ్డు దాటుతున్న సమయంలో ఓ మోటార్ బైక్ రావడం, అందులో నుంచి కత్తులతో దిగిన యువకులు నడిరోడ్డుపై వందలాది మంది జనం చూస్తుండగానే తమ పథకాన్ని అమలు చేశారు. అతి కిరాతకంగా శంకర్‌ను నరకడం, అడ్డొచ్చిన కౌసల్య మీద సైతం దాడి చేయడం క్షణాల్లో జరిగాయి. అడ్డుకునేందుకు పలువురు యత్నించినా, ఆ ముగ్గురు యువకులు తిరగబడడం, అందరూ చూస్తుండగా సినీ ఫక్కీలో మోటారు సైకిల్ ఎక్కి ఉడాయించారు. అక్కడున్న జనం మాత్రం బిత్తర చూపులు చూడక తప్పలేదు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న శంకర్‌ను, తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్న కౌసల్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో శంకర్ మరణించగా, కోయంబత్తూరు ఆసుపత్రిలో కౌసల్య చికిత్స పొందుతున్నది. అప్రమత్తం: ఉడుమలై బస్టాండ్ సమీపంలోని రద్దీతో కూడిన నడిరోడ్డు మీద ఈ ఘాతుకం జరడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. మోటారు సైకిల్‌పై ఉడాయించిన ఆ ముగ్గురు యువకుల కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇంతకీ ఈ హత్యకు గల కారణాలేమిటోనని తలలుపట్టుకున్నారు. అయితే సోమవారం ఉదయం నెలకోట్టై మేజిస్ట్రేట్ రిజ్వానా ఎదుట కౌసల్య తండ్రి చిన్నస్వామి లొంగి పోవడంతో ఇది ప్రేమికుల చిచ్చు రగిల్చిన హత్యగా తేలింది. తన తండ్రి పథకం ప్రకారం ఈ హత్య చేయించాడని కౌసల్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు. రెండు రోజుల క్రితం తన తండ్రి వచ్చి సంప్రదింపులు జరిపినట్టు, కుటుంబం, బంధువుల ఎదుట తలెత్తుకోలేని పరిస్థితి ఉన్నట్టు, శంకర్‌ను వదిలి పెట్టి రావాలని సూచించినట్టు పేర్కొన్నారు. తాను రాబోనని ఖరాఖండీగా తేల్చడం జరిగిందన్నారు. తొమ్మిదో తేదీన తన భర్త శంకర్ పుట్టిన రోజు అని, అందుకే తనకు వచ్చిన జీతంతో దుస్తులు కొని ఇద్దరూ ఇంటికి బయల్దేరిన సమయంలో కిరాతకంగా కడతేర్చారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వాడ్ని కడతేర్చి వాళ్లను అతి కిరాతకంగా శిక్షించే వరకు మృతదేహాన్ని తీసుకోబోమంటూ శంకర్ కుటుంబీకులు స్పష్టం చేసి ఉన్నారు. ఈ ఘాతుకంతో ఉడుమలై, తిరుపూర్, దిండుగల్, పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనింది. ఈ చిచ్చు మరింత రగలకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు: కౌసల్య, శంకర్ల మీద గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా జరుపుతున్న దాడులు సమీపంలోని ఓ షాపింగ్ మాల్లోని సీసీ కెమెరాకు చిక్కాయి. ఇవి సోమవారం వాట్సాప్, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షం అయ్యాయి. వారిని ఇద్దరు వెంబడించడం, మోటార్ బైక్‌లో వచ్చి యువకుడు అందించిన ఆయుధాలతో దాడులు చేయడం వంటి దృశ్యాలు అందులో ప్రత్యక్షం అయ్యాయి. అలాగే, ఓ కారు ఆగడం, ఆ పక్కనే మరో ముగ్గురు సైతం వచ్చి దాడి చేయడం వెరసి ఈ హత్య పథకం అమల్లో ఆరుగురు ఉండొచ్చన్న అనుమానాలు బయల్దేరాయి. అయితే, ముగ్గురు యువకులు మాత్రం మోటార్ సైకిల్ మీద ఉడాయించడం, వారు వెళ్లగానే ఆ కారు ముందుకు కదలడం గమనార్హం. -
వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని..
దంగార్పూర్: రాజస్థాన్ లోని దంగార్పూర్ లో పరువు హత్య సంచలనం సృష్టించింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో సొంత కుటుంబ సభ్యులే ఓ మహిళను దారుణంగా చంపారు. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేశారు. మృతురాలు తన కుటుంబ సభ్యులను కాదని ప్రేమించిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం సొంతూరు విడిచి వెళ్లిపోయింది. ప్రియుడిని పెళ్లి చేసుకుని 8 ఏళ్ల తర్వాత ఇటీవల దంగార్పూర్ కు వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఈ నెల 4న కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో మృతురాలి తండ్రితో పాటు 35 మంది కేసులు నమోదు చేశామని, ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు సాగ్వారా డీఎస్పీ బ్రిజ్ రాజ్ సింగ్ చరణ్ తెలిపారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు సాగిస్తున్నామని పేర్కొన్నారు. -
పరువు కోసం కూతుర్ని కడతేర్చాడు
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో అమానుషం చోటు చేసుకుంది. కన్నకూతుర్ని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. శ్రీగంగా నగర్ జిల్లాలోని లాఖా హాకం గ్రామానికి చెందిన రైతు నారాయణ జాట్(45) కూతురు (21)ని కిరాతకంగా హత్య చేశాడు. డిగ్రీ చదువుతున్న యువతి, తన సహవిద్యార్థి, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయితే ఇద్దరి వేర్వేరు కులాలు కాడంతో కూతురి పెళ్లిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ కుర్రాడితో తెగతెంపులు చేసుకోవాలని నారాయణ్ రామ్ చాలాసార్లు కూతుర్ని హెచ్చరించాడు. బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. భార్య, కొడుకు చూస్తుండగానే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. పరువు కోసమే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. -
ప్రేమజంటను చంపిన తల్లిదండ్రులు అరెస్ట్
ధోలాపూర్: పరువు హత్యలకు పాల్పడ్డ కేసులో దంపతులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరువు హత్యల ఘటన రాజస్థాన్‌లోని ధోలాపూర్‌లో సంచలనం సృష్టించిన విషయం అందరికీ విదితమే. పోలీసుల కథనం ప్రకారం... నరేశ్ ఠాకూర్(21), భారతి కుశ్వాహ(19)లు గత ఎనిమిది నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని భారతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తమ కులాలు వేరని కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు నిరాశే ఎదురైంది. తల్లిదండ్రులు వారిస్తున్నప్పటికీ, భారతి తన ప్రియుడిని తరచూ కలుస్తుండేది. కూతురి ప్రవర్తనతో ఆవేశానికి లోనైన ఆమె తల్లిదండ్రులు గిరిరాజ్, జల్దేవిలు తమ అల్లుడు శైలేంద్రతో కలిసి ప్రేమజంటను హత్య చేసేందుకు కుట్రపన్నారు. అమ్మాయి బావ ఆ జంటకు పెళ్లి చేస్తామని చెప్పి వారిద్దరని ఓ ప్రాంతానికి పిలిపించాడు. అప్పటికే ఆ ప్రాంతంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ధోలాపూర్ సమీపంలోని నాగ్ల గ్రామంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తమ పథకం ప్రకారం వారిని గొంతు నులిమి హత్యచేశాడు. ఈ పరువు హత్యకు పాల్పడినందుకు అమ్మాయి తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు ధోలాపూర్ ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు. మరో నిందితుడు శైలేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. -
'సొంత చెల్లెళ్లను కాల్చి చంపాడు'
లాహోర్: పాకిస్థాన్‌లో సొంత సోదరీమణులను కాల్చి చంపాడు ఓ సోదరుడు. వారి ప్రవర్తన మంచిది కాదనే దురాలోచనతోనే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పంజాబ్ ప్రావిన్స్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమర్ హయత్ అనే వ్యక్తి తన చెల్లెళ్లు రజియా, నోరీన్ (20) స్థానికంగా ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నారనే కోపంతో ఇంటికి వచ్చి తొలుత నిలదీశాడు. ఈ క్రమంలో వారిమధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో కోపానికి లోనైన ఉమర్ తుపాకీతో వారిద్దరిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తమ చెల్లెళ్ల ప్రవర్తనతో పరువు పోతుందని భావించిన ఉమర్ నిత్యం వారితో గొడవ పడేవాడని, రోజూ కొడుతుండేవాడని చుట్టుపక్కలవారు పోలీసులకు తెలిపారు. గత ఏడాదిలో ఈ ప్రాంతంలో 870మంది మహిళలు పరువు హత్యలకు గురయ్యారు. -
చెల్లి తల నరికి.. ఊరేగించారు
లక్నో: పరువు హత్యతో ఉత్తర ప్రదేశ్‌లోని షాహజాన్ పూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తమ కుటుంబం పరువుకు భంగం కలిగించిందనే కోపంతో తోడబుట్టిన చెల్లిని.... ఇద్దరు సోదరులు క్రూరంగా నరికి చంపేశారు. అంతేకాకుండా నరికిన తలతో వారిద్దరూ వీధుల్లో అరుచుకుంటూ బీభత్సం సృష్టించారు. బహమనీ పంచాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ...ఫూల్ జెహాన్(17) బాలిక, మహమ్మద్ అచ్చన్‌ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తెలిసి వరుసకు సోదరులు అయిన గుల్ హసన్, నాన్హే మియాన్ ఆగ్రహానికి లోనయ్యారు. అందరూ చూస్తుండగానే గ్రామ నడివీధిలో ఫూల్ జెహాన్ తలను అతి దారుణంగా నరికేశారు. తరువాత మొండాన్ని అక్కడే వదిలేసి, తెగిపడిన తల భాగాన్ని పట్టుకొని వీధుల్లో అరుచుకుంటూ తిరిగారు. తమ కుటుంబాల్లో ఇంకెవ్వరూ ఇటువంటి పరువు తక్కువ పని చేయరాదంటూ హెచ్చరించారు. తమ చర్య అమ్మాయిలందరికీ గుణపాఠం కావాలంటూ వారిద్దరూ ఉన్మాదంతో ఊగిపోయారు. తాము సరైన శిక్ష విధించామంటూ ఆవేశంతో రెచ్చిపోతూ ఊరంతా కలియదిరిగారు. క్రైమ్ సినిమాలను తలపించే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు.అయితే ఇంత దారుణం జరుగుతున్నా స్థానిక పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా ప్రేమికుడు అచ్చన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎనిమిది మంది సోదరులు ఉన్న కుటుంబంలో ఫూల్ జెహాన్ ఒక్కతే ఆడపిల్ల. ఆరుగురు ఢిల్లీలో నివసిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటన తరువాత బాలిక తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. అయితే నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు. గ్రామంలోఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక బలగాలను తరలించినట్లు చెప్పారు. -
పరువు కోసం..చంపేశారు
మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ గ్రామంలో ఓ యువజంటను కొంతమంది వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇది పరువు హత్య కేసు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది వచ్చే వరకు మృతికి కారణం ఏంటో చెప్పలేమని అదనపు ఎస్పీ సునీల్ తివారీ చెప్పారు. హనుపురా గ్రామంలో ఈ యువజంట మృతదేహాలు కనిపించాయని ఆయన అన్నారు. వీళ్లిద్దరి సంబంధం గురించి గ్రామంలో విపరీతంగా చర్చ జరిగిందని, బహుశా దానివల్లే పరువు హత్య జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బడీ రాజా, భాన్ సింగ్‌లుగా ఈ జంటను గుర్తించారు. బడీ రాజా అనే ఆ మహిళకు గురువారం పెళ్లి కావాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. -
పరువు కన్నా ప్రాణం మిన్న!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) దేశం ఎంతగా పురోగామించినా కొన్ని అనాగరిక పోకడలు ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. పరువు పేరుతో జరుగుతున్న అమానవీయ ఘటనలు నవనాగరిక సమాజం విచక్షణను ప్రశ్నిస్తున్నాయి. కుల, మత, వర్గ, ప్రాంత వైషమ్యాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరువు కోసం సొంతవారిని సైతం కడతేర్చేందుకు వెనుదీయని వారు ఉన్నారని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకున్ని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలోని రాయచూరుకు సమీపంలో యరమరాస్ లో చోటుచేసుకుంది. ఆనంద్ సాగర్(30) వేరే సామాజిక వర్గానికి చెందిన బసవరాజేశ్వరిని 13 నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 17న ఒంటరిగా కనిపించిన ఆనంద్ సాగర్ పై రాజేశ్వరి తండ్రి విరూపాక్షగౌడ్ సహా 8 మంది రాళ్లతో దాడి చేసి కొట్టి చంపేశారు. పరువు పేరుతో 30 ఏళ్ల వ్యక్తిని, మైనర్ బాలికను సజీవ దహనం చేసిన దారుణ ఘటన బీహార్ లోని గయా జిల్లా ఆమెథ గ్రామంలో ఈనెల 14న జరిగింది. వివాహితుడైన కాసియాదిహ్ గ్రామానికి చెందిన జైరామ్ మాంఝీ, పార్వతీయ కుమారి(14) అనే బాలికతో కలిసి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత దొరికిన వీరిని అయినవారే సజీవ దహనం చేశారు. తెలుగు నేలపైనా పరువు హత్యల పరంపర కొనసాగుతోంది. తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించిందన్న కారణంతో తల్లిదండ్రులే ఆమెను హతమార్చిన కిరాతక ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో ఈ ఏడాది ఆరంభంలో జరిగింది. పరువు పోతుందన్న భయంతో కన్నకూతురిని కర్కశంగా చంపారు. ఇలాంటి దారుణ ఘటనలెన్నో గతంలో జరిగాయి. దేశంలో ఏదో మూల రోజూ పరువు హత్యలు జరుగుతున్నాయి. పరువు పేరుతో మనుషుల ప్రాణాలు తీయడం అమానుషం. తమ ఇష్టానికి అభీష్టంగా వ్యవహరించారనో, తమకు తలవంపులు తెచ్చారనో నిండు ప్రాణాలు నిలువునా తీయడం దారుణం. పరువు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ విషయం గుర్తుంచుకుంటే పరువు హత్యలు ఉండవు. -
'పరువు' పేరుతో.. ప్రేమికుల హత్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో పరువు హత్యకు ఓ జంట బలైంది. పరువు పేరుతో ప్రేమికులను కాల్చిచంపారు. లాహోర్ సబర్బన్ లోని చొహాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని పాటొకీ ప్రాంతానికి చెందిన తాహిర్, చొహాంగ్ ప్రాంతానికి చెందిన బాలిక ప్రేమించుకున్నారు. ప్రియురాలిని కలిసేందుకు తాహిర్ బాలిక ఇంటికి వచ్చాడు. వీరిద్దరూ కలిసివుండగా బాలిక తండ్రి, ఇతర బంధువులు గమినించారు. ప్రేమికులిద్దరినీ అక్కడికడ్కడే కాల్చి చంపారని జియో న్యూస్ వెల్లడించింది. బాలిక తండ్రి, మరో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకుందనే అక్కసుతో ఇదే కుటుంబానికి చెందిన మహిళను గర్బిణీ అని కూడా చూడకుండా హైకోర్టు ముందు ఇటుకలు, కర్రలతో కొట్టి చంపారు. -
కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు
వీరప్పలి: తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించిన కారణంగా తల్లి దండ్రులు ఆ యువతిని హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో కలకల సృష్టించింది. కూతురు ప్రేమ వ్యవహారం తల్లి దండ్రులకు తాజాగా తెలియడంతో వారు భరించలేకపోయారు. తమ పరువు పోతుందని భావించిన ఆ తల్లి దండ్రులు సొంత కూతుర్ని అమానుషంగా హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!
దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక వెంకటేశ్వర కాలేజిలో చదువుతున్న తమ 21 ఏళ్ల కూతురిని కన్న తల్లిదండ్రులే పీక పిసికి చంపేశారు. ఇందుకు వాళ్ల బంధువు కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ కప్పెట్టేశారు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిలను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల కూతురు భావన (21) ఈనెల 12వ తేదీన ఆర్యసమాజంలో అభిషేక్ సేఠ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. ఆమెను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించి మరీ భావనను చంపేశారని పోలీసులు తెలిపారు. వారిపై పక్కా సాక్ష్యాలు ఉండటంతో తల్లిదండ్రులను అరెస్టు చేశామన్నారు. -
ప్రియుడికి ఉరి... ప్రియురాలికి విషం
మొరదాబాద్: అభ్యంతరకర రీతిలో పట్టుబడిన ప్రేమికులపై పెద్దలు ప్రతాపం చూపారు. ప్రియుడిని ఉరేసి చంపారు. ప్రియురాలి నోట్లో విషం పోశారు. సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ జిల్లా భర్తాల్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. రాకేష్ సింగ్(17), సుష్మ(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా సుష్మ తండ్రి మఖాన్ సింగ్, ఆయన నలుగురు కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమైద్ లకు తమింట్లో కంటపడ్డారు. తమ పిల్ల పరాయివ్యక్తితో కనబడడంతో మఖాన్ సింగ్, ఆయన కుమారులు కోపంతో రగిలిపోయారు. రాకేష్ సింగ్ ను ఉరేసి చంపారు. సుష్మతో బలవంతంగా విషం తాగించారు. తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి రాకేష్ మృతి చెందాడు. చావుబతుకుల్లో ఉన్న సుష్మను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తన కుమారుడిని ఇనుప రాడ్ తో కొట్టి తర్వాత ఉరేసి చంపారని రాకేష్ తండ్రి ఆరోపించారు. సుష్మ కుటుంబ సభ్యులు పరువుహత్య పాల్పడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సుష్మ చావుబతుకుల్లో ఉండడంతో ఆమె వాంగ్మూలం తీసుకోవడం పోలీసులకు సాధ్యపడలేదు. రాకేష్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మొరదాబాద్ రూరల్ ఎస్పీ తెలిపారు. -
హైకోర్టు ఎదుటే పరువు హత్య
లాహోర్: తమ అభీష్టానికి విరుద్దంగా వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందనే అక్కుసుతో పాకిస్థాన్ లో 25 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులే పాశవికంగా హత్య చేశారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా కర్కశంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. లాహోర్ హైకోర్టు ఎదుటే ఈ దారుణోదంతం చోటు చేసుకోవడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫైసలాబాద్ కు చెందిన ఫర్జానా పర్వీన్ కొన్ని నెలల క్రితం జరన్వాలాకు చెందిన మహ్మద్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ఫర్జానా కుటుంబ సభ్యులు ఇక్బాల్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ కేసు విషయమై కోర్టు వచ్చిన ఫర్జానాను ఇక్బాల్ నుంచి తీసుకుపోయేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి ఆమెను లాక్కేందుకు యత్నించారు. తమ ప్రయత్నం విఫలమవడంతో ఫర్జానా తండ్రి, సోదరుడితో 20 మంది కుటుంబ సభ్యులు వారిపై కర్రలు, ఇటుకలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఫర్జానా మృతి చెందగా, ఇక్బాల్ తప్పించుకున్నాడు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ఫర్జానా తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 900 మంది మహిళలు పాకిస్థాన్ లో పరువు హత్యలకు బలైయ్యారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. -
ప్రేమించిన పాపానికి పరువు హత్య!
ఒడిశా: ఒక యువ ప్రేమ జంటను అతి దారుణంగా హత్య చేసి మరో పరువు హత్యకు తెరలేపిన ఘటన ఒడిశాలోని బరంపూర్ సమీపంలోని హలిదియాపదారాలో కలకలం సృష్టించింది. 20 సంవత్సరాల యువతి, 22 సంవత్సారాల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో నచ్చకపోవడంతో ప్రేమికులిద్దరినీ మారణాయుధాలతో దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆ యువకుడ్ని మరిచిపోమ్మని యువతికి ఆమె సోదరులు నచ్చ చెప్పారు. ఈ క్రమంలోనే వారు వేరే సంబంధానికి కూడా మగ్గు చూపి గత రాత్రి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఆ యువతి ప్రేమించిన వాడితోనే కలిసి బ్రతుకుతానని తేల్చి చెప్పి అతనితో వెళ్లి పోయింది. ఆమె సోదరులు కొంతమంది బంధువులతో కలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్లారు. తమతో ఇంటికి రావాలని ఆ యువతిని మరోసారి అడిగారు. తాను తిరిగి ఇక ఇంటికి రానని చెప్పడంతో వారికి మరింత కోపం తెప్పించింది. దీంతో వారు తమతో తెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేసి ఆ జంటను హత మార్చారు. రక్త మడుగులు పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
యువతి పరువు హత్య, ఉరేసుకున్న ప్రేమికుడు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో పరువుహత్య సంచలనం సృష్టించింది. తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమిస్తోందన్న కోపంతో అన్నలు చెల్లెలి గొంతు పిసికి చంపేశారు. ఈ వార్త తెలిసిన తరువాత ఆ అమ్మాయి ప్రేమికుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ముజఫర్ నగర్ జిల్లాలోని బుఢానా నగరంలోని ఒక యువతి ముబారక్ హుసేన్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే ఆ యువతి అన్నలు అహసాన్, అశూలు ఆమెతో మంగళవారం పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. అదే ఆవేశంలో ఇద్దరూ ఆమె గొంతును నులిమి చంపేశారు. ఆ తరువాత ఆమెను సీలింగ్ ఫ్యాన్ కి వేలాడ దీసి ఉరేసుకున్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఇది తెలిసిన ప్రేమికుడు హుసేన్ అదే ఊళ్లో ఉరేసుకుని చనిపోయాడు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అమ్మాయి గొంతు పిసికి చంపేశారన్న సంగతి బయటపడటంతో అన్నలిద్దరూ పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్లీజ్... ప్రాణాలు తీయొద్దు!
'ఆవేశంలోనే నా కూతుర్ని చంపుకున్నా'... కులాంతర వివాహం చేసుకున్న కన్నకూతుర్ని కడతేర్చిన తండ్రి నోటి నుంచి వచ్చిన మాటలివి. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అతడీ దుశ్చర్య పాల్పడ్డాడు. సమాజం ఎంత ముందుకు పోతున్నా కొన్ని జాడ్యాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి ఇలాంటి పరువు తక్కువ హత్యలే రుజువు. పరువు పేరుతో జరుగుతున్న ఈ దారుణాలు నానాటికీ పెరుగుతుండడమే అత్యంత ఆందోళన కలిగించే అంశం. గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు దీప్తిని ఆమె తండ్రే హత్య చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించాడు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పెళ్లి చేసుకోవడమే తాము చేసిన నేరమా అంటూ దీప్తి భర్త కిరణ్‌కుమార్ ప్రశ్నిస్తున్నాడు. కులాంతర వివాహం చేసుకోవడం పాపమా అంటూ నిలదీస్తున్నాడు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో కుల దురహంకారం ఒకటి. వేరే సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రేమించారనో, పెళ్లిచేసుకున్నారనో పెద్దలు పిల్లలు ఉసురు తీస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా రోజూ జరుగుతున్నాయి. పరువు పోయిందనే అక్కసుతో అకారణంగా ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు కుల దురహంకారులు. ఆధునికత వైపు వడివడిగా అడుగులు వేస్తున్న నవ నాగరికులు మానవత్వం మర్చిపోతున్నారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. విచక్షణ విడిచిపెడుతున్నారు. సాంకేతికపరంగా ఎంత ఎదిగినా మానవ సంబంధాల విషయంలో కుంచించుకుపోతున్నారు. కుల, మత, ప్రాంత వైషమ్యాలతో విద్వేషాలు పెంచుకుంటున్నారు. ప్రాణాలు దీయడానికి వెనుకాడడం లేదు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఈవిధంగా వ్యవహరిస్తుండడం విస్మయపరుస్తోంది. పిల్లల ప్రేమను ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు కానీ, వారి ప్రాణాలు తీయకండి. వారిని ఆదరించకపోయినా వారి బతుకు వారిని బతకనీయండి. -
ప్రేమ వ్యవహారం:ఇద్దరు యువకుల పరువు హత్య
బారాబాంకి: పరువు హత్య జాడలు ఇంకా సమసిపోలేదు. దేశంలో ఏదో మూలా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఓ యువతిని ప్రేమించి పాపానికి ఇద్దరు యువకులు హత్య చేయబడ్డ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గణప్ప గ్రామంలో శుక్రవారం ఉదయం సంభవించింది. అనిల్, అవినాష్ ఇద్దరు స్నేహితులు. అనిల్ అనే యువకుడు సోహై గ్రామానికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆకస్మాత్తుగా వీరివురూ చెట్టుకు వేలాడుతూ శవాలై కనిపించారు. ప్రేమించినందుకు అనిల్ ను, అతనితో స్నేహితుడు అవినాష్ ను హత్య చేసారని అనిల్ తండ్రి రాం శంకర్ ఆరోపిస్తున్నారు. రాం శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పరువు కోసం చెల్లిని హతమార్చిన సోదరులు
తిరునెల్వేలి: పరువు కోసం రక్తం పంచుకుపుట్టిన సోదరినే హత్య చేశారు సోదరులు. దళిత యువకుణ్ని ప్రేమించినందుకు 17 ఏళ్ల యువతిని ఆమె సోదరులే కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా సీవలపేరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు గోమతి అనే యువతి... మురుగన్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయంపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దాంతో గోమతి కొన్ని రోజుల క్రితం .. మురుగన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబంతోనే కలిసి ఉంటోంది. అయితే గోమతి ప్రవర్తనపై ఆగ్రహం చెందిన సోదరులు మురుగన్, సుదలైముత్తు ఆమెను ఇంటికి తీసుకువచ్చి దారుణంగా చంపేశారు. యాసిడ్‌ను బలవంతంగా ఆమె నోట్లో పోసి, అనంతరం ఇంట్లోనే ఉరేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో సోదరిని హత్య చేసినట్టు వారు అంగీకరించారని పోలీసులు చెప్పారు.