
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువుపై కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని చందనబోయిన దిలీప్(19)గా గుర్తించారు. ఈ ఘటనను పరువు హత్యగా అనుమానిస్తున్నారు.
తాళ్లగడ్డకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ ప్రేమ వ్యవహారం యువతి సోదరుడికి నచ్చలేదు. దీంతో అతనిపై పగ పెంచుకున్నాడు. ఈక్రమంలోనే మాట్లాడుకుందాం రమ్మని సద్దల చెరువు వద్దకు దిలీప్‌ను పిలిచాడు.
చెరువు వద్దకు వెళ్లిన దిలీప్‌పై యువతి సోదురుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. బీరు సీసాలతో పదే పదే పొడిచాడు. దీంతో దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
చదవండి: దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్
Comments
Please login to add a commentAdd a comment