లక్నో : ప్రేమ పెళ్లి చేసుకుని, కుటుంబ పరువు మంటకలిపిందని భావించిన ఓ వ్యక్తి సోదరి తల నరికి హతమార్చాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ యూపీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మీరట్‌కు చెందిన గుల్ఫాసాన్ అనే యువతికి తమ కాలనీలో ఉండే అబిద్ అనే వ్యక్తితో సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుల్పాసాన్ కుటుంబ సభ్యులు అబిద్‌కు దూరంగా ఉండాలని పలుమార్లు హెచ్చరించి, ఆమెను ఒక గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న అబిద్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెను తీసుకువెళ్లాడు. స్నేహితుల సాయంతో రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.
ప్రేమ పెళ్లి చేసుకున్న గుల్పాసాన్‌పై ద్వేషం పెంచుకున్న ఆమె సోదరుడు మహ్మద్.. ‘ఎప్పటికైనా నా చెల్లి తల నరికి తీసుకొస్తానంటూ’ ఇరుగుపొరుగు వారికి చెప్పేవాడు. ఈ క్రమంలో సోదిరి ఇంటికి వెళ్లి తండ్రికి అనారోగ్యంగా ఉందని, వెంటనే నిన్ను చూడాలంటున్నారని చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు. ఇదంతా నిజమని నమ్మిన గుల్పాసాన్ పుట్టింటికి వచ్చింది. ఆమె ఇంటికి చేరుకోగానే వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే కత్తితో తల నరికేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
పరువు తీసింది అందుకే..
విచారణలో భాగంగా.. సోదరిని హత్య చేసినందుకు మహ్మద్ కొంచెం కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని, కుటుంబం పరువు తీసే ప్రతీ ఒక్కరికీ ఇదే గతి పడుతుందని తెలియజేయటానికే తాను ఇలా చేశానని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment